పాన్‌ మసాలా వివాదం.. అక్షయ్‌కు ఊహించని ప్రశ్న | Akshay Kumar Reaction to journalist over Pan Masala Ad Question | Sakshi
Sakshi News home page

పాన్‌ మసాలా వివాదం.. అక్షయ్‌కు ఊహించని ప్రశ్న

Aug 22 2026 8:38 AM | Updated on Aug 22 2026 8:52 AM

Akshay Kumar Reaction to journalist over Pan Masala Ad Question

పాన్‌ మసాలా ప్రకటనలపై వివాదం కొనసాగుతున్న వేళ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన రియాక్షన్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌ను జర్నలిస్ట్‌.. ‘అందరూ కుంకుమపువ్వు అమ్ముతున్నారు.. మీరు ఏసర్‌ అమ్ముతున్నారా?’ అంటూ సరదాగా ప్రశ్నించినట్లు వీడియో వైరల్‌ అవుతోంది.  అక్షయ్‌ ప్రశ్నకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా నవ్వుతునే ఉండిపోయినట్లు కనిపిస్తోంది. 

పాన్‌ మసాలా ప్రకటనను ప్రస్తావిస్తూ..
ఆగస్టు 20న ఓ సంస్థ అక్షయ్‌ కుమార్‌ను భారత్‌లో తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులు ఆయనతో ముచ్చటించారు. ఇదే సమయంలో ఓ మహిళా జర్నలిస్ట్‌.. షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన పాన్‌ మసాలా ప్రకటనను ప్రస్తావించింది. ఈ సందర్భంగా ‘సబ్‌ కేసర్‌ బేచ్‌ రహే హై, ఆప్‌ ఏసర్‌ బేచ్‌ రహే హై?’(‘అందరూ కుంకుమపువ్వు అమ్ముతున్నారు.. మీరు ఏసర్‌ అమ్ముతున్నారా?’) అంటూ ప్రశ్నించినట్లు  వీడియోలో తెలుస్తోంది. 

ప్రకటనలపై వివాదం
షారుఖ్‌, అజయ్‌, టైగర్‌ నటించిన ప్రకటనపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. పాన్‌ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముగ్గురు నటులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

గతంలో అక్షయ్‌ కుమార్‌ కూడా పాన్‌ మసాలా బ్రాండ్‌ ప్రకటన విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ప్రకటనకు దూరమయ్యారు. దీంతో తాజాగా జర్నలిస్ట్‌ వేసిన ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి మాత్రం అక్షయ్‌ ఎలాంటి వివరణ ఇవ్వకుండా నవ్వడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో థ్రిల్లర్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement