breaking news
pan masala ad
-
పన్నెండు వేల కోట్లకు అధిపతివి.. పాన్ మసాలా అమ్ముకునే ఖర్మేంటి?
గత కొంత కాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. చేతిలో చానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక, ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు. అలాంటిదే ఒక తాజా వీడియో ని యూ ట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేశాడు. తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాథీ వాతపెట్టాడు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాప్యులారిటీని పైసల కోసం ఎడాపెడా వాడుకుంటున్న నేపధ్యంలో ఈ వీడియో అనేకమందిని ఆకర్షించింది.హాలీవుడ్ స్టార్స్‌ని దాటేసిన షారూఖ్షారూఖ్ ఖాన్ కు నా ప్రశ్న‘ పేరుతో భారతీయ యూట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేసిన ఇటీవలి వీడియో లో చెప్పిన ప్రకారం... బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్‌ని అందుకున్నారు, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ నటుడి నికర విలువను 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. ఈ నేపధ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ, సంపదల విషయంలో టామ్ క్రూజ్ ది రాక్ (డ్వేన్ జాన్సన్) వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది. ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాలా.. దాదాపు రూ. 12,400 కోట్లు. మీరు విన్నది నిజమే ‘షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే రూ. 12,400 కోట్లకు పెరిగింది‘ అని రాతీ చెప్పారు. ‘అది ఎంత డబ్బో మీకు తెలుసా? అబ్బో మనం ఊహించడం కూడా కష్టం,‘ అని అతను నొక్కి చెప్పాడు.కూర్చుని తిన్నా తరగనంత...పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత , ప్రతిరోజూ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి, అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, అతను తన మొత్తం నికర విలువలో దాదాపు రూ. 400–500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాథీ వీడియోలో విశ్లేషించాడు. ఈ నేపధ్యంలో ‘షారూఖ్ ఖాన్‌కి నా ప్రశ్న, మీకు ఈ డబ్బు సరిపోలేదా? అది సరిపోతే, మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైనదాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు?‘అంటూ రాథీ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు.గత 2014లో పాన్ మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్మెంట్ రుసుము గురించి కూడా రాథీ చర్చించాడు ‘‘మీకు నిజంగా ఈ అదనపు రూ. 100–200 కోట్లు అవసరమా?‘ అని నిలదీశాడు‘ దాని గురించి మరొక విధంగా ఆలోచించండి: దేశంలోని అగ్ర నటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే, అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది?‘ అంటూ ఆలోచించమని కోరాడు. అంతేకాదు ఆ వీడియోను సదరు సూపర్‌స్టార్‌కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు.గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్ కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రతీ సెలబ్రిటీని, సినీ అభిమానిని ఆలోచింపజేసేలా థృవ్ రాథీ వీడియో ఉందనేది నిస్సందేహం.My question to Shah Rukh Khan.@iamsrk pic.twitter.com/MZjCbsIkjx— Dhruv Rathee (@dhruv_rathee) October 15, 2025 -
హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్
సినిమా హీరోహీరోయిన్లు పలువురు ఓవైపు నటిస్తూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు అదే యాడ్స్ వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడుతుంటారు. మొన్నీమధ్యే క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తమన్నా, కాజల్ అగర్వాల్ కి పోలీసులు నోటీసులిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఇలానే నోటీసులు అందుకున్నారట.ఏం జరిగింది?బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్.. ఓ పాన్ మసాలా యాడ్ లో నటించారు. చాన్నాళ్ల నుంచి టీవీల్లో దాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారని, ఇది ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని జైపూర్ కి చెందిన లాయర్ యోగేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)ఈ యాడ్ లో 'పలుకు పలుకులో కేసరి' అనే ట్యాగ్ లైన్ ఉపయోగించారని, కానీ సంస్థ చెప్పినట్లు ఈ ఉత్పత్తిలో అసలు కేసరి (కుంకుమ పువ్వు) కలిపి లేదని న్యాయవాది ఆరోపించారు. దీంతో మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ముగ్గురు హీరోలతో పాటు గుట్కా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.ఒకవేళ కోర్టుకు ఎవరూ హాజరు కాకపోయినా విచారణ జరుగుతుందని, నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కోర్ట్ ఆదేశించింది.€మరి ఏం జరుగుతుందో చూడాలి? తెలుగులోనూ మహేశ్ బాబు ఇలా ఓ పాన్ మసాలా యాడ్ లో నటించాడు.(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్) -
పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగిన అమితాబ్
ముంబై: పాన్‌మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. బ్రాండ్ ప్రమోషన్‌కు కంపెనీ ఇచి్చన పైకాన్ని వెనక్కు ఇచి్చనట్లు తెలిపారు. పాన్‌మసాలా ప్రకటనలో నటించడానికి ఒప్పుకోవడంతో అమితాబ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభిమానులు తమ స్టార్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బచ్చన్ వెనక్కు తగ్గారు. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో ఆఫీస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ పేరిట ఒక పోస్టు కనిపించింది. గతవారం బచ్చన్ ఈ ప్రకటన నుంచి తప్పుకున్నారని, ప్రచారానికి ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోకపోవడం వల్ల అంగీకరించినట్లు పోస్టులో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్లకు ప్రకటనకర్తగా వ్యవహరించవద్దని ఇటీవల ఎన్ఓటీఈ అనే పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌కు విజ్ఞప్తి చేసింది. -
మోసానికి గురైన జేమ్స్ బాండ్ నటుడు
న్యూఢిల్లీ : పాన్ బహార్ ప్రకటనలో మెరిసిన, హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు పీర్స్ బ్రోస్నన్ ఆ కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. పాన్ మసాలా బ్రాండు తనను మోసం చేసిందని ఆరోపించాడు. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టి పాన్ మసాల బ్రాండు ఈ మోసానికి పాల్పడిందన్నాడు. ఢిల్లీ స్టేట్ టుబాకో కంట్రోల్ సెల్‌కు రాసిన లేఖలో.. ‘కంపెనీ నన్ను మోసం చేసింది. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని వెల్లడించలేదు. అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను బహిర్గతం చేయలేదు’ అని పేర్కొన్నట్టు అదనపు డైరెక్టర్(హెల్త్) ఎస్కే అరోరా చెప్పారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం బ్రోస్నన్కు షోకాజు నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈ లీగల్ నోటీసుకు స్పందించిన బ్రోస్నన్, కంపెనీతో తనకున్న ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని, డిపార్ట్మెంట్కు అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రోస్నన్ తెలిపారు. భవిష్యత్తులో హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రోస్నన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు అరోరా పేర్కొన్నారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాకు అధికారులు ఆదేశించారు. సామాజిక బాధ్యతను సెలబ్రిటీలు తప్పక తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత వారిని సెలబ్రిటీలను దేవుడిలా భావించి, గుడ్డిగా అనుకరించకూడదని సూచించారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద టుబాకో ఉత్పత్తుల అన్ని ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. -
వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
న్యూఢిల్లీ : వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లతో అలరించిన వరల్డ్ సూపర్ స్టార్, హాలీవుడ్ యాక్టర్ పియర్స్ బ్రాస్నస్, పాన్ బహార్ పాన్ మసాలా యాడ్‌పై తన ఫోటో ఉండటంపై షాక్‌కు గురయ్యారు. మోసపూరితంగా, అనధికారికంగా తన ఇమేజ్ను పాన్ బహార్ వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తాను అసలు అంగీకరించనని బ్రాస్నన్ ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్స్ తయారుచేసే పాన్ బహారాతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మెరిసే పళ్లు, తాజా శ్వాస వంటి ట్యాగ్‌లైన్‌ను ప్రమోట్ చేయడానికే కాంట్రాక్టులో అంగీకరించినట్టు పేర్కొన్నారు. కానీ తన కాంట్రాక్టుకు విరుద్ధంగా అనధికారికంగా తన ఫోటోను అన్నీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య మెరుగుదలకై తోడ్పడేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు స్ఫష్టంచేశారు. ఈ సందర్భంగా తన మొదటి భార్య, కూతురు, పలువురు స్నేహితులు క్యాన్సర్‌తో చనిపోయిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌ను సపోర్టు చేయడానికే తాను కట్టుబడిఉన్నట్టు వెల్లడించారు. తనకు తెలియకుండానే జరిగిపోయిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్‌ను తాను ఎండోర్స్ చేసుకున్నట్టు మీడియా అవుట్‌లెట్స్‌ను కూడా నమ్మిస్తూ పాన్ బహారా మోసం చేస్తుందన్నారు. ఒకప్పుడు వరల్డ్ సూపర్ స్టార్.. భారతీయ వీధి చివరి దుకాణాల్లో వేలాడే పాన్ మసాలా ప్యాకెట్లో దర్శనమివ్వడంపై పలువురు జోక్స్ వేసిన సంగతి తెలిసిందే. చేతిలో పాన్ మసాలా డబ్బాతో ఆయన ఈ ఫోటోలో కనిపిస్తారు..


