ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే చెన్నై లవ్ స్టోరీ, శ్రీనివాస మంగాపురం, మిస్టర్ మిడిల్ క్లాస్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు జన నాయకుడు, ప్యార్ ప్రేమ కళ్యాణం లాంటి డబ్బింగులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. అయితే వీటికి తోడుగా ఓ తెలుగు చిత్రం కూడా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
రుత్విక్ అనే కుర్రాడు హీరోగా పరిచయమైన సినిమా 'రాజా ది రాజా'. విశాఖ ధీమాన్ హీరోయిన్. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కంటెంట్ పెద్దగా మెప్పించకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. పునర్జన్మల బ్యాక్ డ్రాప్ స్టోరీతో రొమాంటిక్ కామెడీ డ్రామాగా దీన్ని తీశారు.
'రాజా ది రాజా' విషయానికొస్తే.. సీనియర్ డాక్టర్ అయిన సత్యం (నరేష్) కొడుకు రాజా (రుత్విక్). తన కొడుకుని పెద్ద డాక్టర్ చేయాలని సత్యం అనుకుంటాడు. కొడుక్కి మాత్రం గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది డ్రీమ్. అలా తండ్రికి తెలియకుండానే ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. రాజా డిజైన్స్‌కి తగ్గ అమ్మాయిని అతడే వెతకాలని కంపెనీ బాస్ చెబుతాడు. ఈ క్రమంలోనే రాజాకు ఆద్య (విశాఖ ధీమాన్)కనిపిస్తుంది.
ఈమెనే తన డిజైన్స్‌కి పర్ఫెక్ట్ అని రాజా భావించి ఆమెతో స్నేహం చేస్తాడు. పోటీకి రెడీ అవుతున్న టైంలో ఇదంతా రాజా తండ్రికి తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆద్య ఎవరు? పునర్జన్మ కథేంటి? రాజాతో ఈమె గత జన్మలో పరిచయం ఉందా? ఆద్యకు మణిగడ్‌కి చెందిన రాజ్యానికి సంబంధమేంటి?అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: థియేటర్ రిలీజ్‌కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా)


