థియేటర్ రిలీజ్‌కి ఒ‍క్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా | Mutiny Movie OTT Release By Mistake | Sakshi
Sakshi News home page

Mutiny OTT: పొరపాటున ఓటీటీలో రిలీజ్ చేసేశారు.. అంతలోనే

Aug 21 2026 5:10 AM | Updated on Aug 21 2026 5:18 AM

Mutiny Movie OTT Release By Mistake

ఓటీటీలో ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ సంఘటన జరిగింది. ఈ రోజు(ఆగస్టు 21) థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఓ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో పొరపాటున స్ట్రీమింగ్‌లో పెట్టేశారు. దీంతో ఆశ్చర్యపోవడం మూవీ లవర్స్ వంతయింది. ఇంతకీ దీని సంగతేంటి?

హాలీవుడ్ స్టార్ జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన నిర్మించిన లేటెస్ట్ మూవీ 'మ్యూటిని'. లెక్క ప్రకారం ఆగస్టు 21న అంటే ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఇది జరగడానికి కొన్ని గంటల ముందు పొరపాటున అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ మూవీని తమ దానిలో అప్‌లోడ్ చేసింది. ఈ తప్పుని సరిదిద్దుకునేలోపే చాలామంది పూర్తిగా చూసేశారు. అయితే ఈ స్ట్రీమింగ్ కొన్ని గంటలపాటు అమెరికాలో మాత్రం జరిగింది. మిగిలిన చోట్ల జరగలేదు.

'మ్యూటిని' ఓ అడ్వెంచర్ సినిమా. తన కళ్లముందే యజమానిని చంపేయడంతో ఓ మాజీ ఆర్మీ అధికారి.. హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే సముద్రంలో వెళ్తున్న సదరు హంతకుల కార్గో షిప్‌లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? సదరు క్రిమినల్స్ నుంచి తప్పించుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఇకపోతే ఓటీటీలో ఇలా పొరపాటున సినిమాని అప్‌లోడ్ చేసేయడం ఇదేం కొత్త కాదు. గతంలో అంటే 2019లో ఆర్కే నగర్ అనే తమిళ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ కూడా బై మిస్టేక్ స్ట్రీమింగ్ చేసేసింది. తర్వాత తప్పు తెలుసుకుని దాన్ని తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement