యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట శుభాకార్యం జరగనుంది. ఆయన కూతురు అంజనా వివాహ ముహుర్తం ఖరారైంది. అర్జున్ చిన్న కుమార్తె ఈనెల 18న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె ప్రియుడిని పెళ్లాడనుంది. అంజనా ప్రియుడు ఎవరనే విషయం ఇంకా బయటికి రాలేదు.
కన్నడ నటితో అర్జున్ వివాహం..
కాగా.. అర్జున్ సర్జా 1988లో కన్నడ నటి నివేదితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, అంజనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పెద్ద కూతురు ఐశ్వర్య విశాల్ సరసన హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన తండ్రి అర్జున్ దర్శకత్వంలో, నిర్మాణంలో 'సొల్లివిడవా' అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె తన తండ్రి వ్యాపారం, నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటున్నారు. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకున్న కింగ్ అర్జున్ సర్జా కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు.
బిజినెస్‌లో అంజనా..
అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్యకు సినిమాల్లో రాణిస్తుండగా.. చిన్న కూతురు అంజనకు మాత్రం సినిమాలపై ఆసక్తి లేదు. వ్యాపారవేత్త కావాలనేది ఆమె కోరిక. అందుకే 2023లో హ్యాండ్ బ్యాగుల తయారీ సంస్థను ప్రారంభించారు. ఇక్కడ తయారయ్యే హ్యాండ్ బ్యాగులన్నీ పండ్ల తొక్కలు, కూరగాయల తొక్కలు, నార వంటి వాటితో తయారు చేసిన మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బిజినెస్‌లో రాణిస్తూనే పెళ్లి పీటలెక్కనున్నారు.
Action King Arjun's Daughter #Anjana marriage on Oct 18 💍 https://t.co/dfCgZSvKRf
— Christopher Kanagaraj (@Chrissuccess) October 7, 2026


