'నేను వర్జిన్ కాదు..' కొత్త బంగారు లోకం కాంబో రిపీట్..! | Varun Sandesh Na Wife Missing Movie ott release Date announced | Sakshi
Sakshi News home page

Na Wife Missing Movie: నేరుగా ఓటీటీకే టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్

Oct 7 2026 6:31 PM | Updated on Oct 7 2026 7:24 PM

Varun Sandesh Na Wife Missing Movie ott release Date announced

కొత్త బంగారు లోకం కాంబో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇంటర్‌లో చదివే టైమ్‌లో పుట్టే లవ్ స్టోరీగా ఈ మూవీ సినీ ప్రియులను అలరించింది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్. శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ జోడీ మరోసారి అభిమానులను అలరించేందుకు వస్తోంది. వీరిద్దరు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ నా వైఫ్ మిస్సింగ్.

ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఆహా వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. క్రైమ్ మిస్టరీ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ నెల 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ నిమిషం నిడివితో టీజర్ రిలీజ్ చేశారు. సంప్రదాయబద్ధంగా వీరిద్దరి వివాహం జరగడం, ఆ తర్వాత ఒకరితో ఒకరు ఆనందంగా గడిపే సన్నివేశాలతో టీజర్‌ ఆకట్టుకుంటోంది. నేను వర్జిన్ కాదు అని చెప్పే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తిని మరించ పెంచుతోంది. అయితే అనుకోకుండా భార్య కనిపించకుండా పోవడం, భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం చూస్తే క్రైమ్ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు టీజర్‌లో ‍అర్థమవుతోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement