స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలంటే వీరికి విపరీతమైన అభిమానం. కొత్త సినిమా ఏదైనా సరే వీరిద్దరు రీల్ చేయాల్సిందే. వెంటనే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఈ జంట పుష్ప మూవీలోని సీన్ రీ క్రియేట్ చేశారు. ఆటోలో కూర్చుని రష్మికను ముద్దు అడిగే సీన్‌లో వీరిద్దరు అదరగొట్టేశారు.
బిఫోర్ మ్యారేజ్.. ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ పుష్ప, పుష్ప-2 చిత్రాల్లోని సీన్స్ జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ జంట గతంలో పలు టాలీవుడ్ సినిమాల పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. తెలుగు భాషపై వీరికున్న అభిమానం వెలకట్టలేనిది. ఏ కొత్త సినిమా వచ్చినా తమలోని టాలెంట్‌ను బయటపెడుతుంటారు. త్వరలోనే ఈ జంట ఇండియాకు రానుంది. హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తామని ప్రకటించారు.


