breaking news
Pushpa (28)
-
‘బుచ్చయ్య.. వయసుకు తగ్గ మాటలు మాట్లాడయ్యా’
సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మాజీ మంత్రి సాకే శైలజానాధ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వయసుకు తగ్గట్లు మాట్లాడాలని హితువు పలికారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.బుచ్చయ్య చౌదరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.జగన్ తల నరికితే తప్పేంటి అంటారా..?. బుచ్చయ్య చౌదరి వయస్సు తగ్గట్లుగా నడుచుకోవాలి. 77 ఏళ్లు వచ్చినా ఇంకా ఏదో ఆశించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయం పడుతున్నారు. జగన్ పేరు వింటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్లకార్డులో పుష్ప సినిమా డైలాగులు రాసినా కేసు పెట్టారు. టీడీపీ కుట్రలకు వారి పార్టీ కార్యకర్త రవితేజ బలయ్యాడు.రవితేజ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యుడు. వాళ్ళ కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉన్నారు.రవితేజకు ఆ ప్లకార్డు ఇచ్చి పంపింది టీడీపీనే.దానికి టీడీపీ మంత్రి రామానాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.ఈ కుట్ర మొత్తం టీడీపీ ఆఫీస్‌లోనే జరిగింది. సినిమాలో డైలాగ్‌లను పట్టించుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. జగన్ పేరు వింటేనే టీడీపీకి భయం వేస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్‌కు రక్షణ లేదు. ప్రతిపక్షాన్ని.. జగన్‌ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడారు. మీ భాషను మీ వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. నారా లోకేష్ కడ్రాయర్లతో పరిగెత్తిస్తామన్నారు. డిప్యూటీ సీఎం ఊగిపోతూ అనేక మాటలు మాట్లాడారు. మీరు పరమార్శలకు వెళ్తే మేం వద్దన్నమా..?జగన్ పట్ల కుట్రలు జరుగుతున్నాయేమో అన్న అనుమానాలున్నాయి. అందులో భాగంగానే జగన్ భద్రతను కూడా తగ్గించారు. జగన్ లేకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లు కూడా ఉండరని భావిస్తున్నారా..?.కుప్పంలో అప్పు కట్టలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేస్తే.. ఐదు లక్షలు ఇచ్చి పాపం కడిగేసుకుంటారా?. ప్రకాశం జిల్లాలో మీ నేత వీరయ్య చౌదరిని హత్య చేసింది మీ వాళ్లు కాదా?.రాజకీయాల్లో హింసాత్మక ప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఓడినా.. మీరు ఎంత హేళన చేస్తున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒక్క జగన్ మాత్రమే. భూస్థాపితం చేస్తా అని చంద్రబాబు మాట్లాడితే తప్పులేదా..?’అని ప్రశ్నించారు. -
హైదరాబాద్‌లోనే టాప్ థియేటర్.. కానీ, 'పుష్ప2'ను ప్రదర్శించలేదు
హైదరాబాద్‌లో ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ పుష్ప విడుదల కావడంలేదని థియేటర్ యాజమాన్యం పేర్కొంది. కొత్త సినిమా విడుదలైతే చాలు ఇక్కడకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు హైదరాబాద్ నగరవాసులు భారీ ఎత్తున్న వస్తుంటారు. రివ్యూవర్స్ కూడా ఈ థియేటర్ వద్ద తమ కెమెరాలు పట్టుకుని సందడిగా కనిపిస్తుంటారు. అయితే, పాన్ ఇండియా రేంజ్‌ను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్స్‌లలో పుష్ప2 విడుదలైంది. కానీ, ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో మాత్రం రిలీజ్ కాలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా సోషల్ మిడియాలో ఒక ప్రకటన కూడా వెలువడింది.(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)ప్రసాద్ ఐమాక్స్‌లో పుష్ప సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఈ సినిమాను తమ థియేటర్స్‌లో ప్రదర్శించడం లేదని ప్రసాద్ ఐమాక్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ' దాదాపు 20ఏళ్లకు పైగా సినిమా అభిమానులకు మేము అత్యుత్తమమైన అనుభూతిని కల్పించేలా థియేటర్స్‌ను రన్ చేస్తున్నాం. అయితే, పలు అనివార్య కారణాల వల్ల పుష్ప2 చిత్రాన్ని మీ అందరికీ ఇష్టమైన ప్రసాద్ ఐమాక్స్‌లో రన్ చేయలేకపోతున్నాం. ఈ విషయం చెప్పి మీకు ఇబ్బంది కలిగించినందుకు మాకు కూడా బాధగానే ఉంది. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నా ప్రసాద్ టీమ్.. అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.అయితే, చిత్ర నిర్మాతలు, థియేటర్ యాజమాన్యం మధ్య అగ్రిమెంట్ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇద్దరి మధ్య సరైన ఒప్పందం సెట్ కాకపోవడం పుష్ప2 సినిమా ప్రసాద్ ఐమ్యాక్స్‌లో విడుదల కాలేదని సమాచారం. We deeply regret this inconvenience and sincerely thank you for your understanding and continued support.#Pushpa2TheRule #PrasadMultiplex pic.twitter.com/vaUHN2rpFg— Prasads Multiplex (@PrasadsCinemas) December 5, 2024 -
ఉసురు తీస్తున్న అప్పులు
సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారంరాత్రి వరకు వేర్వేరు జిల్లాల్లో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో వరంగల్ నలుగురు, నిజామాబాద్‌లో ముగ్గురున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డెపల్లికి చెందిన పుష్ప(28) ఎకరం భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేయగా, వర్షాలు లేక ఎండిపోయింది. ఆమెకు సిండికేట్ బ్యాంకులో రూ.50 వేలు, మహిళా గ్రూపులో రూ. 20 వేలు, గ్రామ సంఘంలో రూ. 20 వేలు, ప్రైవేట్‌గా రూ. లక్ష వరకు బాకీలు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గంలేక శుక్రవారం తెల్లవారు జామున ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇదే జిల్లా బీర్కూర్ మండలం నెమ్లిలో బొబ్బిలి అంజయ్య(55) సాగు చేసిన ఐదెకరాల వరి ఎండిపోయింది. నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. రూ. 5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. మనస్తాపంతో అంజయ్య గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ అప్పులు తీర్చే మార్గం కనిపించక శుక్రవారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన గద్దెల రాములు (55) తన ఆరు ఎకరాల్లో వరి, రెండెకరాలోల వేరుశనగ దిగుబడి తగ్గిపోవడంతో రూ. 2 లక్షల మేరకు అప్పులు అయ్యాయి. అప్పుల కారణంగా మనోవేదనకు గురైన రాములు శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా చిట్యాల మండలం జూకల్లుకు చెందిన కౌటం రాజయ్య(40) పత్తి, మిర్చి సాగు కోసం రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. పం టలు సరిగా పండకపోవడంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా ములుగు మండలం మల్లంపల్లికి చెందిన చిట్టిరెడ్డి జక్కిరెడ్డి(43) ఏడెకరాల్లో పత్తి, పసుపు, మిర్చి వేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో రూ. 6.70 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాదీ ఆశించిన మేరకు పంట పండకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉరి వేసుకున్నాడు. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన అంబాల నర్సయ్య(40) తనకున్న ఎకరంలో పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాకపోగా, గిట్టుబాటు ధర కూడా లభించలేదు. దీంతో నెల రోజుల క్రితం చెన్నై వెళ్లాడు. వారం క్రితమే తిరిగి వచ్చేశాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రానికి చెందిన పొట్ల కోటేశ్వరరావు (58) తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. లక్షల్లో అప్పు చేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంటి ఆవరణలో విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన రైతు బండారి (మడిగేటి) మొగిలి(48) శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వరిపొలంలోనే మృతి చెందాడు.