ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన మలయాళ సినిమా బెత్లెహమ్ కుటుంబం యూనిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఓటీటీలోనూ బెత్లెహమ్ కుటుంబ యూనిట్ దూసుకెళ్తోంది. తొలి వీకెండ్‌లోనే అద్భుతమైన రెస్సాన్స్ అందుకుంది. దీంతో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో అక్టోబరు 2 నుంచి 4 వరకు అత్యధిక మంది వీక్షించిన నాన్ హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఏకంగా 5.4 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలిపింది.
కాగా..ఈ చిత్రాన్ని గిరీశ్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో మమితాబైజు, నివిన్ పౌలి జంటగా నటించారు. ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతాన్, శ్యామ్ పుష్కరన్ ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబరు 4న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం జియోహాట్ స్టార్ వేదికగా మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
Ormax StreamView: Malayalam film Bethlehem Kudumba Unit (JioHotstar) has set a new benchmark, emerging as the most-watched non-Hindi film in India during its opening weekend on streaming. It is also the most-liked theatrical film in India in 2026 across languages, with an Ormax Power Rating (OPR) of 92 Note: Views represent unique audiences in India who watched the film for more than 30 mins. across all language versions during its opening weekend on streaming (Oct 2-4)
— Ormax Media (@OrmaxMedia) October 7, 2026


