breaking news
English movie
-
మళ్లీ 'సూపర్ మ్యాన్' వచ్చేస్తున్నాడు
ఒకప్పటి జనరేషన్ కి సూపర్ హీరోల గురించి బాగా తెలుసు. ఎందుకంటే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్.. ఇలా చాలా చిత్రాల్ని చూసి ఎంజాయ్ చేశారు. రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గర మూవీస్ రాలేదని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)తాజాగా మరోసారి 'సూపర్ మ్యాన్'ని తీసుకొచ్చేందుకు వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. జూలై 11న మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా స్నీక్ పీక్ పేరుతో ఐదు నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. మంచు ఎక్కువగా ఉన్న చోట సూపర్ మ్యాన్ సృహ లేకుండా పడిపోవడం, అతడి పెంపుడు కుక్క వచ్చి అతడిని మళ్లీ బతికించడం చూపించారు. విజువల్స్ అయితే బాగున్నాయి. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
జనవరి 1న థియేటర్లలో 'క్రావెన్: ది హంటర్' రిలీజ్
హాలీవుడ్ నుంచి వస్తున్న మరో యాక్షన్ డ్రామా 'క్రావెన్: ది హంటర్'. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాకు ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)'కోపం, ఆవేశంతో సెర్గీ.. ఇద్దరు పిల్లలని టీనేజ్‌లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను సులభంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడు. అందుకు కూడా ఓ జస్టిఫికేషన్ ఉంది. చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు' అని దర్శకుడు చెప్పాడు.ఈ సినిమాలో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ) -
ఎందుకంత తొందర!
‘మీరెప్పుడు తీపి కబురు చెబుతారు?’ – ఇటీవల తరచూ అనుష్కా శర్మకి ఈ ప్రశ్న ఎదురవుతోంది. తీపి కబురు అంటే పెళ్లి గురించి అనుకునేరు, కాదండీ బాబు! సినిమాల గురించే. హిందీ హీరోయిన్లందరూ ఒక్కొక్కరుగా హాలీవుడ్‌కి వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కా శర్మ ఇంగ్లీష్ సినిమా చేసేదెప్పుడు? అనడిగితే – ‘‘నాకంత తొందర లేదు. హాలీవుడ్లో నటించాలనే దిశగా ఆలోచించడం లేదు. ఇంగ్లీష్, కొరియన్, జపనీస్ లేదా మన ప్రాంతీయ సినిమాలు... ఎవరైనా ఎక్కడైనా నటించవచ్చు. అయితే... నేను ఓ సినిమాకి సంతకం చేసే ముందు నటిగా నా ప్రతిభను ఆ సినిమా ఎంత వరకూ వెలికి తీస్తుంది? నా పాత్ర ఆసక్తిగా ఉందా? లేదా? అనే అంశాలు ఆలోచిస్తా. మంచి కథ, పాత్ర లభిస్తే హాలీవుడ్‌కి వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు. -
ఎందుకంటే... కాపీయంట!
పరీక్షల్లో కాపీ కొట్టి రాసిన పిల్లాడు పాసయితే ఎలా పాసయ్యాడన్న విషయం అతడితో పాటు అతడు కాపీ కొట్టడం చూసినవాళ్లంతా మర్చిపోతారు. కానీ ఫెయిలయ్యాడే అనుకోండి... కాపీ కొట్టి రాస్తే అలానే ఉంటుంది, మనకంటూ బుర్ర ఉండాలి అంటారు. సినిమాల విషయంలోనూ అలానే జరుగుతుంది చాలాసార్లు. సినిమా బాగుందనుకోండి... దర్శకుడు కాపీ కొట్టి తీశాడని తెలిసినా లైట్ తీసుకుంటారు. అదే ఫెయిలయ్యిం దనుకోండి... కాపీ కొట్టి తీస్తే అలానే ఉంటుంది అంటారు. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పాయింటు కొత్తదే. హలీవుడ్లో సక్సెస్ అయ్యిందే. అయితే ఆ సినిమా పరాజయం పాలయ్యింది. కాపీ కొట్టి తీశాడన్న అపఖ్యాతిని, ఇంతకంటే మంచి సబ్జెక్ట్ దొరకలేదా అన్న విమర్శల్ని మిగిల్చింది.ఓ అబ్బాయి ఒకమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమి స్తుంది. కానీ చెప్పడానికి సంకోచిస్తుంది. చెబుదామని అనుకునేలోపు వాళ్లిద్దరూ ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్ అవుతుంది. అతడు చనిపోతాడు. అది తట్టుకోలేని ఆమె కూడా మరణిస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ పుడతారు. ఆమె ప్యారిస్‌లో, అతడు ఇండియాలో. ఆమె మెడిసిన్ చదువుతుంటుంది. అతడు చదువుకుని కూడా పనీ పాటా లేకుండా తిరుగు తుంటాడు. దాంతో తండ్రి, పని కోసం ప్యారిస్ పంపేస్తాడు. అక్కడ అతడు, ఆమె కలుసుకుంటారు. ఎప్పుడూ సెక్యూరిటీ నడుమ జీవితాన్ని గడపలేని ఆమె, అతడితో ఉండే దొరికే స్వేచ్ఛ కోసం ఆశపడుతుంది. ఇద్దరూ ఇండియా వెళ్లి పోదామనుకుంటారు. కానీ ఆమె ఎయిర్ పోర్టుకి రాదు. దాంతో అతడొక్కడే ఇండియా వచ్చేస్తాడు. అక్కడ ఎయిర్ పోర్టులో ఆమె కనిపిస్తుంది. ఫలానా హాస్పిటల్లో ఫలానా డాక్టర్ని కలువు అని చెప్పి మాయమైపోతుంది. తీరా అతడు వెళ్లాక ఆమె ఐసీయూలో కన్పిస్తుంది. ఏంటా అని ఆరా తీస్తే, ఓ యాక్సిడెంట్లో ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని, తనకు కనిపించింది ఆమె ఆత్మ అని తెలుస్తుంది. ఆరు జన్మల్లో వారి ప్రేమ విఫలమవ డంతో, ఈ చివరి జన్మలోనైనా దాన్ని సఫలం చేసుకోవాలని ఆమె ఆత్మ తపి స్తోందని తెలుస్తుంది. ఆమెను కాపాడు కోవడానికి హీరో పడే తపన మిగతా కథ. ఇదీ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా కథ. హాలీవుడ్లో సక్సెస్ అయిన ‘జస్ట్ లైక్ హెవెన్’ చిత్రంలోని ప్రధాన పాయింట్‌ను పట్టుకుని ఈ సినిమా తీయడం జరిగింది. ఆ చిత్రంలో హీరో ఓ అపార్ట్మెంట్లోకి అద్దెకు వెళ్తాడు. అంతకు ముందా ఫ్లాట్‌లో ఉన్న హీరోయిన్ ఆత్మ అతడికి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా వదిలించు కోవాలనుకునే క్రమంలో ఆ ఆత్మతో అతడికి అనుబంధం ఏర్పడుతుంది. తర్వాత అతడికి తెలుస్తుంది ఆ అమ్మాయి చావలేదని, కోమాలో ఉందని. అప్పటికే ప్రేమలో పడిన హీరో, ఆమెను కాపాడు కోవడానికి తపన పడతాడు. నేపథ్యాలు వేరైనా కథ ఒకటే అన్నది అర్థమైపోతుంది. క్లయిమాక్స్ అయితే అచ్చు గుద్దినట్టుంటుంది. హీరోయిన్ చని పోతే హీరో ఆమె నోటిలో గాలి ఊదు తాడు. ఆమె బతుకుతుంది. కానీ ఆత్మగా గడిపినదంతా మర్చిపోతుంది. హీరోని గుర్తు పట్టదు. కానీ చివర్లో హీరోని తాకినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఇలాంటి పోలిక గల సన్నివేశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అలా అని సినిమా మొత్తం కార్బన్ కాపీ అనేయడానికి లేదు. ఎందుకంటే, కథనంలో చాలా మార్పు ఉంటుంది. పోలిక లేని సన్నివేశాలూ బోలెడు కనిపిస్తాయి. ఆంగ్లంలో నేరుగా జరిగే కథ, తెలుగులో జన్మలతో ముడిపడి ఉంటుంది. అక్కడ హీరోయిన్ డేట్‌కు వెళ్తూ యాక్సిడెంట్‌కు గురైతే, ఇక్కడ ఇండి యన్ అంబాసిడర్ అయిన తన తండ్రిపట్ల జరుగుతోన్న కుట్ర కారణంగా ప్రాణా పాయ స్థితికి చేరుకుంటుంది. ఆంగ్ల చిత్రంలో హీరోయిన్‌కి తాను బతికే ఉన్నా నని తెలీదు. కానీ తెలుగు హీరోయిన్‌కి అన్నీ తెలుసు. ఇలా చాలా వైవిధ్యత ఉంటుంది. ఆంగ్ల సినిమాని మన నేటి విటీకి తగ్గట్టుగా మార్చడానికి తగిన కృషే చేశాడు దర్శకుడు. బోలెడంత డ్రామా, రివెంజ్ ఎలిమెంట్ యాడ్ చేశారు. కానీ ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయ్యింది. మన ప్రేక్షకులకు అసలు ఈ పాయింటే రుచించలేదు. ఇంకా బతికే ఉన్న మనిషి ఆత్మ బయటకు రావడమన్న ఆలోచన మనవాళ్లను కన్విన్స్ చేయలేకపోయింది. కాబట్టి ఈ కాపీ ఫెయిల్యూర్నే మిగిల్చింది!