ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Prithviraj Sukumaran I Nobody Movie 2026 OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

OTT: పృథ్వీరాజ్ ‍థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Aug 16 2026 2:47 PM | Updated on Aug 16 2026 4:31 PM

I Nobody Movie 2026 Ott Streaming Details Latest

ఓటీటీలోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ జానర్‌లో డిఫరెంట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే సలార్, వారణాసి చిత్రాల ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఓ సినిమా.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువత్తు ప్రధాన పాత్రలు చేసిన 'ఐ నోబడీ' సినిమాకు నిస్సామ్ బషీర్ దర్శకుడు. షార్ప్ సోషల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ గత నెల 10న థియేటర్లలో రిలీజైనప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీలో కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ చూసే అవకాశముంది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దొంగతనం, డబ్బులు మాయం చేయడం లాంటి హీస్ట్ థ్రిల్లర్స్ ఇష్టముంటే దీన్ని మిస్ కావొద్దు.

'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్‌లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అదే టైంకి బ్యాంక్‌లో ఉన్న రాజీవన్‌ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు. దారిలో ఇతడ్ని వదిలేయాలని అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్‌లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాయమవుతుంది. ఆ డబ్బు ఏమైంది? ఎవరు తీశారు? రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులకు డబ్బు దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ)

s

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement