అనుపమ పరమేశ్వరన్ . ఈ పేరు కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళియాలం నుంచి మొదలు తెలుగు ఇండెస్ట్రీలోనూ ఓ ప్రత్యేక ఫాన్‌బేస్‌ను సంపాదించుకుంది ఈ బామ. అయితే ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన బ్రేకప్ కోసం, ఆపదలో ఉన్న ఉన్నప్పుడు ఆదుకునే యాక్టర్స్ కోసం తెలిపింది. ఇప్పుడు ఈ మాటలు వైరలవుతున్నాయి.
‘ కొద్ది రోజుల నుంచి చాలా మంది నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా నేను పూర్తిగా ఆధారపడగలిగే వ్యక్తి దుల్కర్‌నే. బాధగా ఉన్నప్పుడు విషయం తెలుసుకున్న దుల్కర్ సల్మాన్ తరచూ మెసేజ్‌లు పంపేవారు. కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసేదాన్ని. నా పరిస్థితి బాగోలేదని ఆయన ఎలా గుర్తించేవాడో ఇప్పటి ఆశ్చర్యంగా ఉంటుంది. హీరో రామ్ పోతినేనితో కూడా మంచి బాండింగ్ ఉంది’ అని వెల్లడించింది.
ఇదే ఇంటర్వ్యులో తన రిలేషన్‌షిప్, బ్రేకప్ కోసం కూడా అనుపమ మాట్లాడింది. తన మాజీ ప్రియుడి వల్ల ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్’ ఎదుర్కున్నట్లు తెలిపింది. కాగా, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్ గతంలో ‘జొమొంటే సువిశేషంగళ్’ ( తెలుగులో అందమైన జీవితం) సినిమాలో నటించారు. 2017లో విడుదలైన ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ లక్కీ భాస్కర్, మహానటి, సీతారామమ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: రెండేళ్లు నరకం అనుభవించా.. బ్రేకప్‌పై అనుపమ సంచలన వ్యాఖ్యలు


