నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్ | Babita Singh Reporting Movie OTT Trailer And Details | Sakshi
Sakshi News home page

OTT: మలయాళ నటి చేసిన మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Aug 22 2026 7:05 AM | Updated on Aug 22 2026 7:05 AM

Babita Singh Reporting Movie OTT Trailer And Details

థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?

'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్‌గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్‌ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement