breaking news
Nimisha Sajayan
-
బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్‌లాస్ జర్నీ
కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన వారిని చూసి..వాళ్లలా తగ్గిపోదాం అనుకుంటాం. కానీ ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా నిలకడ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం. ఇక్కడ అలాంటి సమస్యలే ఎదుర్కొని, ఎంతో నిజాయితీగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పి..ఆలోచింప చేసింది మళయాళం నటి నిమిషా సజయన్. తను ఒక పాత్ర కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గాడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఆ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయంటూ తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మరి అవేంటో చూద్దామా..!.నటి నిమిషా సజయన్ సోషల్ మీడియా వేదికగా 'బబితా సింగ్ రిపోర్టింగ్' అఏ మూవీ కోసం ఏకంగా 14 కిలోలు బరు పెరిగానని తెలిపారు. అయితే ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి సవివరంగా వెల్లడించారు. అంతేగాదు బరువు తగ్గక ముందు, ఆ తర్వాత పోటోలను పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తాను బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీలో బబితా పాత్ర కోస ఏకంగా 58 నుంచి 72 కిలోలు పెరిగినట్లు తెలిపారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తొలి పది రోజులు సైన నిద్ర లేక తీవ్రమైన మానసిక సమస్యలు, అలసట, అసహనం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఒకానొక సమయంలో ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశానని కూడా అన్నారు. బరువు తగ్గడం కోసం చేస్తున్న వర్కౌట్లు, డైటింగ్ విషయంలో కళ్లల్లో నీళ్లు తిరిగేవని చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ట్రైనర్ సాయంతో జయించి ముందుకు సాగానని, అందుకు అతనికి చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్పారామె. నిజంగానే వెయిట్‌లాస్ జర్నీలో ఒక్కోసారి పూర్తి స్థాయిలో అనుకున్నట్లుగా చేయలేకపోయినా.. తర్వాత నుంచి కొనసాగి ముందుకుపోవాలని అంటున్నారామె. ఒక్కోసారి స్కిప్ అయితే లైట్ తీసుకుంటూ పోవాలే గానీ, ఆపేద్దాం అనుకున్నారో అధిక బరువుని తగ్గించుకోవడంలో ఢమాల్ అని పడిపోయినట్లే లెక్క అని అంటోంది. అపరాధ భావనకు తావు లేకుండా మధ్య మధ్యలో తప్పడం అనేది సహజం అని సానుకూలంగా తీసుకుంటూ సాగితే ఆటోమేటిగ్గా బరువు తగ్గడమే కాకుండా మీరు ఏర్పరుచుకున్న వెయిట్ లాస్ నియమాలు దైనందిన జీవితంలో తెలియకుండా భాగమవుతాయని అంటోంది. అలాగే మంచి నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనలు సలహాలతో బరువు తగ్గే యత్నం చేస్తే..ఎలాంటి మానసిక, అనారోగ్య సమస్యలనైనా తట్టుకుని బరువు తగ్గగలమని నమ్మకంగా చెబుతోందామె. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) (చదవండి: ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?) -
నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్‌లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్‌ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. -
వెబ్‌సిరీస్‌లో మాధవన్.. కథ ఏంటో చెప్పిన డైరెక్టర్
ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సిరీస్‌కు మాధవనే బలంతాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్‌కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్‌ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.నా ఫస్ట్ సిరీస్ ఇదేమాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్‌లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం.. -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..బ్లాక్బెల్ట్నిమిషా తండ్రి సజయన్, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.మేకప్ నచ్చదునటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్‌కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికప్పుడు వంట నేర్చుకుని..కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది. GST చెల్లించలేదని ఆరోపణలుఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.రంగు అడ్డు కాదుకొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్


