 
													ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు.
ఈ సిరీస్‌కు మాధవనే బలం
తాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్‌కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్‌ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.
నా ఫస్ట్ సిరీస్ ఇదే
మాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్‌స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్‌లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్‌లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు.
చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
