 
													టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తను ప్రేమించిన సినీ నటి శిరీష (సిరి) (Sireesha)తో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఘనంగా వారి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
