breaking news
Babita Singh Reporting Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి యష్ 'టాక్సిక్', నయనతార 'హాయ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'కికు చిరంజీవి' అనే తెలుగు మూవీ థియేటర్లలోకి రానుంది. వీటిలో యష్ చిత్రానికి మంచి హైప్ ఉంది. అందుకు తగ్గట్లే రెగ్యులర్‌గా శుక్రవారం నాడు కాకుండా బుధవారమే(ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనితో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ లాంటి తెలుగు సిరీసులు.. బంధర్ అనే హిందీ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 24 నుంచి 30 వరకు)హాట్స్టార్ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 25అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29నెట్ఫ్లిక్స్ద లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ డాక్యుమెంటరీ) - ఆగస్టు 26లిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28అమెజాన్ ప్రైమ్ద లాస్ట్ సన్‌రైజ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 26బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5బంధర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహాఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లేహంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
నేరుగా ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్‌లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్‌ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.


