HI
-
ప్రొ హాకీ లీగ్‌కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్‌లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్‌తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్‌లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్. -
హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. -
ఊరంతా కరోనా.. అతడికి తప్ప
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి గురించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇదేలా సాధ్యమయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో పాటు ఊరంతా కరోనా సోకినప్పటికి అతడు మాత్రం కోవిడ్ బారిన పడలేదు. దాంతో జనాలతో పాటు వైద్యాధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వివరాలు.. భూషణ్ ఠాకూర్(52) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తోరంగ్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి ఊరిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. దాని తర్వాత భూషణ్, అతడి కుటుంబ సభ్యులు, గ్రామంలోని ప్రజలంతా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కోవిడ్ బారిన పడ్డారు. భూషణ్ కుటుంబంలో అతడితో కలిపి మొత్తం ఆరుగురు ఉంటే.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. భూషణ్‌కి పరీక్షలు నిర్వహిస్తే.. నెగిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం ఊరంతా కరోనా బాధితులే.. భూషణ్ తప్ప. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నా టెస్ట్ రిపోర్డు నెగిటివ్ అని తేలింది. నేను పూర్తి సురక్షితంగా.. క్షేమంగా ఉన్నాను. నాకు వ్యాధినిరోధక శక్తి మెండుగా ఉంది. స్వీయ నియంత్రణ, రక్షణ చర్యల వల్ల నేను కోవిడ్ బారిన పడలేదు. వేడుక జరిగన రోజున జనాలంతా గుంపులుగుంపులుగా అందులో పాల్గొన్నారు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి చేయలేదు. నేను ఈ నియమాలన్నింటిని పాటించాను. నా కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిన తర్వాత వేరుగా ఉండటం ప్రారంభించాను. నా ఆహారాన్ని నేనే వండుకున్నాను. అందుకే మహమ్మారి బారిన పడలేదు’ అన్నారు. ఇక భూషణ్ నివాసం ఉండే తోరంగ్ గ్రామ జనాభా అక్షరాల 43 మంది మాత్రమే. ఈ సందర్భంగా లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్ పంకజ్ రాయ్ మాట్లాడుతూ “జిల్లాలో పెరుగుతున్న కేసుల గురించి మేము ఆందోళన చెందుతున్నాము. లాహౌల్ -స్పితి, కులు జిల్లాల్లో దేవతా సంస్కృతి చాలా బలంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మహమ్మారి సమయంలో మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్ల తలెత్తే సమస్యల గురించి అధికారులు ఊహించలేకపోయారు. దాంతో కేసులు పెరిగాయి. తోరంగ్ గ్రామంలో అందరికి కరోనా పాజిటివ్ వచ్చింది’’ అన్నారు. (చదవండి: ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!) సాధారణంగా, లాహౌల్-స్పితిలోని చాలా కుటుంబాలు శీతాకాలంలో కులుకు తరలిపోతాయి. ఎందుకంటే అక్కడ భారీ హిమపాతం సంభవిస్తుంది. ఈ ఏడాది కూడా అలానే వెళ్లారు. రెండు సార్లు తిరిగి సొంత ఊళ్లకు వచ్చారు. ఒకటి దేవతా కార్యక్రమం.. రెండు అక్టోబర్ 3న రోహ్తాంగ్ పాస్ ప్రారంభం సందర్భంగా గ్రామానికి తిరిగి వచ్చారు. -
మాజీ ఆటగాడికి అండగా హాకీ ఇండియా
న్యూఢిల్లీ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భారత మాజీ హాకీ ఆటగాడు మొహ్మద్ షాహిద్‌కు అండగా ఉండేందుకు హాకీ ఇండియా(ఎచ్ఐ) ముందుకొచ్చింది. ఒకవేళ అతనికి కాలేయ మార్పిడి అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది. గత నెలలో షాహిద్ కు కామెర్లు సోకడంతో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన కోలుకున్న తరువాత ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో స్థానికి ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ షాహిద్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని వారణాసి నుంచి ఢిల్లీలోని మెడంటా ఆస్పత్రికి తరలించారు. దానిలో భాగంగానే గత మూడు రోజుల నుంచి ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే ఆ ఆటగాడికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హాకీ ఇండియా తెలిపింది. అతని వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరిస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బత్ర స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే షాహిద్ కుటుంబంతో నిత్యం టచ్ లో అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతనికి కాలేయ మార్పిడి అవసరమైన పక్షంలో ఆ ఖర్చులను కూడా భరిస్తామని నరీందర్ బత్ర తెలిపారు.1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన హాకీ జట్టులో షాహిద్ సభ్యుడు .1981లో షాహిద్‌ను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. కాగా, ఆ తరువాత 1982లో ఆసియా గేమ్స్‌లో రజతం, 1986లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ ఆటగాడిగా ఉండటం విశేషం.