
నయనతార కథానాయకిగా, కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్'.. జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

నయనతార, కవిన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో హాయ్‌పై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు తాజాగా విడుదల చేశారు. పోస్టర్ కొత్తగా ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, వినోదం కలగలిపిన సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి 20 రోజులపాటు షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతాన్ని, రాజేష్ శుక్లా చాయాగ్రహణం అందిస్తున్నారు.