
జూన్ 7 నుంచి యూరప్ అంచె పోటీలు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్‌లోని అమ్‌స్టెల్‌వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్‌తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది.
ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్‌లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు.
హాకీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్‌లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు.
భారత పురుషుల హాకీ జట్టు
గోల్‌కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్‌రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, యశ్‌దీప్ సివాచ్,
మిడ్‌ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్,
ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్.