breaking news
immortal
-
ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు
దసరా హడావుడి అంతా అయిపోయింది. మళ్లీ ఎవరిపనుల్లో వాళ్లు పడిపోయారు. మరోవారం కూడా వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' రానుంది. దీంతో పాటే సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా చేసిన కిల్లర్, చంద్రయాన్ అనే చిన్న చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి 'బత్తా' అస్సలు మిస్ అవ్వొద్దు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనితో పాటు అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి డబ్బింగ్ మూవీస్‌తో పాటు కీర్తి సురేశ్ 'అక్క', రుద్రవనం పీఎస్ అనే తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 01 వరకు)సోనీ లివ్ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30హాట్స్టార్లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30నెట్ఫ్లిక్స్మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 26ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - అక్టోబర్ 27దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) - అక్టోబర్ 28బత్తా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 29బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 29యూ, మీ, అజ్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబర్ 29అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) - అక్టోబర్ 30అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబర్ 30కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 30డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 30మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) - అక్టోబర్ 30అబ్సెస్ (అరబ్ సిరీస్) - అక్టోబర్ 30ఎస్సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) - అక్టోబర్ 30అమెజాన్ ప్రైమ్డ్రైవ్: ద ప్రెటెండర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 28అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30జీ5హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) - అక్టోబర్ 28రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30ఆపిల్ టీవీ ప్లస్నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ) -
ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా
ట్రెండింగ్ హీరోయిన్ కాయదు లోహర్.. దక్షిణాదిలో కన్నడ తప్పితే మిగిలిన భాషల్లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన ఓ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: హీరోయిన్ అవ్వాలని నేను అనుకోలేదు: నాగదుర్గ)సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అప్పుడప్పుడు హీరోగానూ సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిందే 'ఇమ్మోర్టల్'. జూలైలో థియేటర్లలోకి వస్తుందన్నారు గానీ వాయిదాలు పడి సెప్టెంబరు 19న తెలుగులో రిలీజైంది. కాయదు లోహర్ ఇందులో దెయ్యం పాత్ర చేసింది. ఈపాటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేయాలి కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు వచ్చే శుక్రవారం(అక్టోబర్ 30) నుంచి సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'ఇమ్మోర్టల్' విషయానికొస్తే.. మహి (జీవీ ప్రకాశ్‌కుమార్) హైదరాబాద్‌లోని తన మామయ్య ప్రింటింగ్ ప్రెస్‌లో డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. అద్దె ఇంటి యజమాని పెట్టే పోరు భరించలేక వేరే ఇంటి కోసం వెతుకుతుంటాడు. తన జీతానికి తగిన ఇల్లు కోసం వెతుకున్న టైంలో సింధు (కయాదు లోహర్) అనే అమ్మాయి ఫోన్ చేసి షేరింగ్ ఫ్లాట్ గురించి చెప్పడంతో ఆమె ఫ్లాట్‌కు వెళ్తాడు. తొలి చూపులోనే సింధుని చూసి ప్రేమలో పడతాడు. సింధు కూడా కలివిడిగా ఉంటూ మహితో ఇట్టే కలిసిపోతుంది. అతను ఏం అడిగితే అది క్షణాల్లో కొని పెడుతుంటుంది.అయితే అదే ఫ్లాట్‌లో ఉంటున్న సింధు తాతయ్య ఆకాశ్ (టీమ్ కార్తిక్) ద్వారా ఆమె గురించి ఓ రహస్యం మహికి తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత భయంతో వణికిపోతాడు. ఆ ఫ్లాట్ నుంచి, అపార్ట్మెంట్ నుంచి పారిపోదామనుకుంటాడు. ఎంత ట్రై చేసినా తిరిగి అక్కడికే వస్తుంటాడు. ఇంతకీ సింధు గురించి మహికి తెలిసిన నిజమేంటి? వెయ్యేళ్ల కిందట ఆటవిక జాతిలో పుట్టిన మృగానికీ సింధుకూ ఉన్న సంబంధమేంటి? మహి ఆ అపార్ట్మెంట్ నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))Oru pudhu ulagam... Oru IMMORTAL kadhal! ❤️ #Immortal streaming from 30th Oct On Sony LIV #GvPrakash #KayaduLohar #SonyLiv #SonyLIVTamil @gvprakash https://t.co/ZGRhaB4Uhv— Sony LIV Tamil (@SonylivTam) October 23, 2026 -
4000 ఏళ్లు జీవించే పాత్ర నేపథ్యంలో
జీవి ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ సినిమా 'ఇమ్మోర్టల్'. అరుణ్ కుమార్ ధనశేఖరన్ నిర్మించగా మారియప్పన్ చిన్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సామ్ సీఎస్ సంగీతమందించాడు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దీన్ని తీశారు. ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. ఇందులోనే పలు ఆసక్తికర విషయాల్ని టీమ్ పంచుకుంది.(ఇదీ చదవండి: పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు)ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇండియన్ సినిమాకు కొత్తదైన వ్యాంపర్ జానర్లో రూపొందించారు. ఏడాది పాటు శ్రమించి సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్), మాన్స్టర్ సన్నివేశాలను తెరకెక్కించాం. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. 4 వేల ఏళ్ల పాటు జీవించే ఒక పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. ఏ హాలీవుడ్ చిత్రానికి కాపీ కాదు అని హీరో జీవీ ప్రకాష్ కుమార్ చెప్పుకొచ్చాడు.జీవీ ప్రకాశ్ విషయానికొస్తే.. రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి'కి సంగీతమందించింది ఇతడే. ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు కాయదు లోహర్ తమిళంలో ఒప్పుకొన్న తొలి సినిమా 'ఇమ్మోర్టల్'. కానీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఇప్పుడు రిలీజ్ కానుంది. ట్రైలర్ బట్టి చూస్తే అద్దె గది కోసం వెతికే హీరో.. అనుకోకుండా హీరోయిన్‌తో పాటు రూమ్ షేర్ చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆమెతో రొమాన్స్ వరకు వెళ్తాడు. తర్వాత ఆమె గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? హీరో అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్) -
చచ్చినా చావను..!
చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా? చాలామందికి అనిపించి ఉంటుందిలెండి. మందుమాకులతో చచ్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నించిన వాళ్లూ కొంతమంది ఉన్నారు. అయితే అత్యాధునిక ఏఐ టెక్నాలజీ సాయంతో తాను 2039 నాటికల్లా చావును జయిస్తానంటున్నాడు బ్రయన్ జాన్సన్. ఎవరీ బ్రయన్? ఏమిటీ దీని వెనుక బ్రెయిన్?బ్రయన్ జాన్సన్ (Bryan Johnson) ఒక బయో హ్యాకర్. అంటే రకరకాల రసాయనాలు, పోషకాలతో శరీరం వయసు పెరక్కుండా చూసుకుంటూంటాడు. ఆ మధ్య న్యూఢిల్లీకి వచ్చి... వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక వెళ్లిపోయాడు కూడా. తాజాగా 48 ఏళ్ల బ్రయన్ ఇంకో సంచలన ప్రకటన చేశాడు. కృత్రిమ మేధ సాయంతో 2039 నాటికి చావును జయిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఎలా? అని అడిగితే ఆయనిస్తున్న సమాధానం ఏమిటంటే...కొన్ని పద్దతులను కచ్చితంగా ఉపయోగించడం మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని బ్రయన్ నమ్మకం. ఇందుకు రోజూ వంద వరకూ ట్యాబ్లెట్లు. బోలెడన్ని పౌడర్లు, ద్రవాలు మింగుతూంటాడు.వీటిల్లో మల్టీ విటమిన్స్, నాచు నుంచి తీసిన ఒమెగా-3, కొలేజన్ మిశ్రమాలు, పాలిఫినాల్‌లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్, దీర్ఘాయుష్షు ఇస్తాయని అతడు నమ్మే 13 రసాయన మూలకాలు ఉంటాయి. ఇవి కాకుండా.. మెదడు, గుండె, చర్మం, కీళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలూ రోజూ తీసుకుంటూంటాడు. ఇందుకోసం ఈ మిలియనీర్ పెట్టే ఖర్చు ఏడాదికి 20 లక్షల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే 166 కోట్లు!. వీటన్నింటి కారణంగానే ఏమో... 48 ఏళ్ల బ్రయన్ జాన్సన్ చూసేందుకు మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. అయితే అతగాడు ఇప్పుడు అంత సంతృప్తిగా ఏమీ లేడు. వందేళ్లు కాదు.. ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు.సులువుగా సరికొత్త మందులు...ఐదేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న ఏఐ టెక్నాలజీ చావును జయించేందుకు కూడా కీలకమని బ్రయన్ విశ్వాసం. ఏఐ ద్వారా బయోటెక్, అవయవాల క్లోనింగ్, కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్షు కూడా సాధ్యమే అంటాడు బ్రయన్. ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్షును జయించాయని, జెల్లీఫిష్, హైడ్రా, కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు. ఇప్పుడు తాను తీసుకుంటున్నట్లే క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం, వైద్యుల పర్యవేక్షణలతో దీర్ఘాయుష్షు సాధ్యమంటాడు. కృత్రిమ మేధ ద్వారా అవయవాల క్లోనింగ్ సులువైతే ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త మందులను చాలా వేగంగా అభివృద్ధి చేయవచ్చునని, ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ... శాస్త్రవేత్తలు కొందరు మాత్రం బ్రయన్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ.. మొత్తానికి నిలిపేయడం అంటే చావును జయించడం ఊహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. చావు లేకుండా చేయవచ్చు అన్న భావనకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అమరత్వం (Immortal) సిద్ధించినా.. అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైతేనేం.. బ్రయన్ జాన్సన్‌కు జై! అమరత్వం జిందాబాద్! -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పసునూరి దయాకర్, గ్లింప్స్‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
మార్క్స్ ఎందుకు అజేయుడు?!
1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరెన్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్– ఎక్స్, ఆల్బర్ట్ కామూల జీవితాలను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ‘బీబీసీ’ ప్రపంచ ప్రముఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం. ‘‘తత్వవేత్తలు ఇంత వరకూ పలురకాలుగా ఈ ప్రపంచానికి భాష్యం చెబుతూ వచ్చారు. కానీ ఇకనుంచి జరగవలసిన అసలు కార్యం– ప్రపంచాన్ని మార్చడం. ఈ పెను మార్పుకు వ్యక్తి సంసిద్ధత, చిత్తశుద్ధి అవసరం. అప్పుడే సామాజిక పరిస్థితుల్ని అవి గతం నుంచి సంక్ర మించినా, వర్తమాన సమస్యలయినా వాటిని మార్చ డానికి ఈ మానసిక సంసిద్ధత, చైతన్యం అవసరం’’. – శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ Sఏంగెల్స్ ‘‘బూర్జువా (ధనిక) వర్గాన్ని, మేధావి వర్గాన్ని కాదని మొద్దులు, మొరటులూ అయిన శ్రామికవర్గాన్ని ప్రేమించే సిద్ధాంతాన్ని నేనెలా అనుసరిస్తాను? రొయ్యికి బదులు రొంపి (బురద)ను ఎంచుకునే ఆ సిద్ధాంతాన్ని నేనెలా ఆదరిస్తాను? బూర్జువా వర్గం లేదా వారిని అనుసరించే మేధావులలో లోటు పాట్లున్నా వారే ప్రామాణిక జీవనానికి ప్రతినిధులు, వారే మానవాళి సాధించిన విజయ బీజాలను ముందుకు తీసుకువెళ్లగలవారూ’’. – హీల్బ్రోనర్తో ప్రసిద్ధ ఆర్థికవేత్త మేయార్డ్ కీన్స్ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త, ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త, తన ‘పెట్టుబడి’ (కాపిటల్) గ్రంథం ద్వారా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గత 150 సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా చేస్తూ వచ్చిన కార్ల్‌మార్క్స్ జనించి 200 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా ప్రపంచ వ్యాపితంగానే ఈ ఏడాది పొడవునా ద్విశతజయంతి ఉత్సవాలు జరుగుతు న్నాయి. ఈ సందర్భంగా మార్క్స్ మానవాళికి సంబంధించిన సర్వశాఖలను– సాహిత్య, సాంస్కృ తిక, తాత్విక, ఆర్థిక, పర్యావరణ, దాంపత్య, శాస్త్ర, కళాదిరంగాలను పరామర్శించిన తీరుతెన్నులు, ఆ పరిశీలనలో ఆయన మానవజాతి పురోగతి కోసం ప్రతిపాదించిన పెక్కు ప్రయోజనకర సూత్రీకరణ లను, అవి ఎలా ప్రపంచ ప్రజల భావధారను ప్రభా వితం చేస్తూ వచ్చాయో తల స్పర్శగా పరిశీలించా ల్సిన సమయం ఇది. శాస్త్రీయ సోషలిజానికి శత్రు వర్గాల నుంచి వచ్చిన ప్రతిఘటనను, దానిని తిప్పి కొట్టి, ప్రపంచంలో పలుచోట్ల కార్మికవర్గ ప్రభు త్వాలు లేదా సోషలిస్టు ప్రభుత్వాలు తొలి సోషలిస్టు రాజ్యం నుంచి నేటి ఆసియా, లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలకు పరివ్యాప్తమై వచ్చిందో స్థూలంగా ప్రస్తావించుకోక తప్పదు. ఈ ప్రయా ణంలో కొన్ని సోషలిస్టు ప్రభుత్వాలు ప్రపంచ సామ్రాజ్యవాద కుట్రలకు బలికాగా (తొలి సోవి యట్ సోషలిస్టు రిపబ్లిక్ సహా) మరికొన్ని ఆ కుట్ర లను ఎదుర్కొంటూనే బలంగా నిలదొక్కుకున్న దేశాలూ ఉన్నాయి. క్యూబా సోషలిస్టు రాజ్యనేత స్వర్గీయ ఫిడెల్ క్యాస్ట్రో తన చివరి రోజుల్లో చెప్పిన అంశం– నేటి, రేపటి ప్రగతిశీల రాజకీయ శక్తులకు, శ్రామికవర్గ పార్టీలకు, నాయకులకూ ఒక గుణపాఠం కావాలి: ‘‘సోషలిజం అంటే ప్రజలందరినీ సంపన్నులను, లక్షాధికారులను, కోటీశ్వరులుగా మార్చడం కాదు. ముందు అలాంటి ఆలోచనా ధోరణినీ, ఆశనూ కార్య కర్తలు, నాయకులు పటాపంచలు చేయాలి. సోష లిజం అంటే ప్రజలకు కనీస అవసరాలను, సౌక ర్యాలను, సామాజిక భద్రతను, సమతా న్యాయాన్ని, చట్టంముందు అందరూ సమానులేనన్న భావనను, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రజలమధ్య సఖ్యతా సంబంధాల్ని, శాంతిని కాపాడటమేనని అందరూ గుర్తించాలని’’ అన్నాడు. శాస్త్రీయ సోషలిజానికి తొలి విజయం 1818లో పుట్టిన మార్క్స్ తొలి 49 ఏళ్ల నాటికి ఆయన పెట్టుబడి (కాపిటల్) గ్రంథం తొలి సంపుటం (1867) వెలువడింది. ఆ తర్వాత 50 ఏళ్లకు మార్క్స్ సిద్ధాంతం ప్రభావ ఫలితంగా అక్టోబర్ 25లో రష్యన్ విప్లవం (అదే నవంబర్ విప్లవం) విరుచుకుపడింది. అంటే మార్క్స్ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతానికి 50 ఏళ్లకుగానీ తొలి విజయం ఆవిష్కరించుకోలేదు. అది మొదలు శాస్త్రీయ సోషలిజం అనేక అడ్డంకుల మధ్యనే, అప్పటికి విస్తరించి ఉన్న ప్రపంచ సామ్రా జ్యవాద శక్తులు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొల్పిన సంరక్షణ అగడ్తలను క్రమంగా అధిగ మిస్తూ ముందుకు సాగింది. సామ్రాజ్యవాద–పెట్టు బడి వ్యవస్థలు సోషలిజం క్రియాశీల ప్రజా ప్రయో జనాలపై సాగించిన అబద్ధపు ప్రచారాలు, సోవి యట్, చైనా, వియత్నాం సోషలిస్టు వ్యవస్థలన్నింటి వినాశానికి కారణం. మార్క్స్‌కు ముందు పెట్టుబడిదారీ తరహా ‘అభి వృద్ధి’ నమూనా వ్యవస్థ తొలుత ఇంగ్లండ్‌లో తలెత్తిన పీడనా పద్ధతులకు పునాది పడింది. కాగా మార్క్స్ ‘కాపిటల్’ గ్రంథం వెలువడిన నాలుగేళ్లకే (1871) పారిస్ (ఫ్రెంచి) కార్మికవర్గం ప్రపంచంలో తొలి శ్రామికవర్గ విప్లవానికి విత్తనాలు నాటారని మర చిపోరాదు. అయితే ఆ తొలి శ్రామికవర్గ విప్లవాన్ని, పారిస్ కమ్యూన్నూ దారుణంగా పాలకవర్గాలు అణ చివేశాయి. అయితే ఇందువల్ల వచ్చిన భావి పరి ణామం విప్లవ రాజకీయ ధర్మాలు, శ్రామిక– కార్మిక వర్గాలలో నిక్షిప్తమైయున్న శక్తియుక్తులు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఒకవైపున యూరప్‌లోని ఒక భాగం (ఇంగ్లండ్)లో తొలి శ్రామికవర్గ తిరుగుబాట్లను తొలి పెట్టుబడి వర్గాలు అణచివేస్తున్న సమయంలోనే మరోవైపున ఒక అర్ధ శతాబ్దంలోనే– మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వంలో రష్యన్ నగర పారిశ్రామిక కార్మిక వర్గం ప్రభుత్వాధికారాన్ని స్వాధీనం చేసుకుని తొలి అక్టోబర్ మహా విప్లవాన్ని జయప్రదం చేశారు. ఈ పరిణామం సంభవించిన కాలాన్ని, సమ యాన్ని అధ్యయనం చేసిన మార్క్స్ జీవితకాల సహ చరుడు ఏంగెల్స్ వ్యాఖ్యానిస్తూ ‘‘అనేకచోట్ల దోపి డీకి గురవుతున్న సమకాలీన శ్రామికవర్గాలున్న పెట్టు బడి సమాజాల్లో శ్రామికవర్గంలో విప్లవ చైతన్యం కొడిగట్టుకుపోతున్న దశలో ఇతర చోట్ల దాదాపు అవే దోపిడీ వ్యవస్థలున్నచోట శ్రామిక విప్లవాలు ఎలా జయప్రదమవుతున్నాయని ప్రశ్నించాడు, కారణాలు ఆలోచించమని కోరాడు. ఆ ప్రశ్నకు ఆయనే కరా ఖండీగా తిరుగులేని సమాధానమిచ్చాడు: ‘‘ప్రపంచ వ్యాపితంగా వలస దేశాలను ఇంగ్లండ్ దోచుకుతిం టున్నందున, ఆ సామ్రాజ్య దోపిడీపై ఆధారపడిన ఇంగ్లండ్ కార్మికవర్గం కూడా నానాట సంపన్న వర్గంగా మారుతోంది’’ అన్నాడు ఏంగెల్స్. వలస దేశాలపై దోపిడీయే సామ్రాజ్యవాదం సమానత్వం, సహోదరత్వం, పరస్పరం దోపిడీ అవ కాశంలేని వ్యవస్థా నిర్మాణం ద్వారానే సమాజాల శాంతి సౌమనస్యాలకు శాశ్వత భద్రత ఉంటుందని మార్క్స్ ప్రవచించాడని మరచిపోరాదు. కనుకనే అనంతర కాలంలో సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ నిర్మాత లెనిన్ 1917 రష్యన్ మహా విప్లవం నాటికే వలస దేశాల సంపదను కొల్లగొట్టడం ద్వారా సామ్రా జ్యవాద దేశాలు అపారమైన రాక్షస లాభాలకు పడగ లెత్తిన వైనాన్ని అక్షర సత్యంగా నిరూపించాడు. ప్రపంచ సామ్రాజ్యవాద ప్రభుత్వాల దురాక్ర మణ విధానాలు, యుద్ధ విధానాల ఫలితంగా అమె రికా సైనిక–పారిశ్రామిక యుద్ధతంత్ర వ్యవస్థపై ఆధారపడిన అమెరికా–బ్రిటన్ల ఆర్థిక వ్యవస్థలు ఎన్ని సంక్షోభ దశల్ని గత 190 సంవత్సరాలలో ఆవిష్కరించాయో చూడండి: ప్రపంచ ఆర్థిక వేత్తలలో అగ్రగణ్యుడైన సమీర్ అమీన్ అంచనా ప్రకారం అగ్ర దేశాల సామ్రాజ్య విస్తరణ సాగిన గత 200 ఏళ్లలో నాలుగు దశలలో జరిగిన సంక్షోభాలను ఇలా చూపారు: నాలుగు దశలలో ఒక్కొక్క దశకూ మధ్య ఎన్నేసి సంవత్సరాల వ్యవధి ఉందో చూడండి: 1815–1840 (25 సం‘‘లు), 1850–1870 (20 సం‘‘లు), 1890–1914 (24 సం‘‘లు), 1948– 1967 (19 సం‘‘లు). ఈ దశలు సగటున 19–20 సంవత్సరాల దాకా విస్తరించాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ఎలా కారణ మవుతుందో ఈ సంక్షోభ దశలు నిరూపించాయి: మార్క్స్ అంటే ఎందుకింత క్రేజ్! 1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరె న్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్–ఎక్స్, ఆల్బర్ట్ కామూల జీవితా లను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ‘బీబీసీ’ ప్రపంచ ప్రము ఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం. మార్క్స్ అంటే ఎందుకింత ‘క్రేజ్’ అంటే, అమెరికా లోని ‘న్యూలైఫ్’ ఉద్యమ ప్రసిద్ధుల్లో ఒకరైన ఎలీ జారెట్వీ్క చెప్పిన మాటల్ని విందాం: ‘‘ప్రపంచంలో వామపక్షవాదుల చరిత్రకు కార్ల్ మార్క్స్ ఎంతో దోహదం చేశారు, అది చెరపరానిది. ప్రపంచ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్ర అని చాటినవాడు మార్క్స్. అంటే దానర్థం– దోపిడీ వ్యవ స్థలనుంచి విమోచన అనేది నిరంతరం సాగే పోరా టమన్న భావదీప్తిని ఆయన మనకు కలిగించాడు. ఈ భావనకు లోతైన సుదీర్ఘ చరిత్ర ఉంది, భవిష్యత్తును దర్శించే జ్ఞానదీప్తి ఉన్న భావన. పెట్టుబడిదారీ వ్యవ స్థను విస్పష్టంగా దర్శించగల దుర్భిణిని చేతికందిం చిన ఏకైక సిద్ధాంతకర్త మార్క్స్. ఈ పెట్టుబడి వ్యవస్థ పెట్టుబడికి–శ్రమశక్తికి మధ్య గండి కొట్టి కులుకు తున్న వ్యవస్థ, మానవుల మధ్య అంతరాలను పెంచే సిన సాంఘిక వ్యవస్థ. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళి మహా ప్రస్థానంలో ఆఖరి మజిలీ అను కోరాదు. నిరంతర సంక్షోభాలకు నిలయం పెట్టుబడి దారీ వ్యవస్థ’’ అన్నాడు మార్క్స్. నిరంతర సామా జిక విప్లవంతోనే దాని కథకు ముగింపు అన్నాడు మార్క్స్ (2012). నేడు భారత ప్రజలు చేరుకున్న, అనుభవిస్తున్న దశ సరిగ్గా ఇదే సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
చనిపోయినా సరిహద్దు భద్రత..!
న్యూ ఢిల్లీః మరణించినా ఆ సిపాయి కర్తవ్యం కొనసాగుతూనే ఉంది. భారత సైనిక దళంలో చేరి, హిమాలయపర్వతాల్లోని ఎత్తైన ప్రాంతమైన.. భారత్-చైనా సరిహద్దు నాతుల్లాలో బాధ్యతలను నిర్వహిస్తూ... దురదృష్ట వశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితేనేం ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సరిహద్దు కాపలా బాధ్యతలను చేపడుతున్నట్లు స్థానికులే కాదు... తోటి సైనికులూ నమ్ముతారు. విచిత్రంగా ఉంది కదూ... విదేశీ ఆక్రమణ దారులనుంచి మాతృభూమిని కాపాడటంలో భారత సైనికుల త్యాగం మరువలేనిది. అయితే 1968 లో మృతి చెందిన బాబా హర్బజన్ సింగ్.. ఇప్పటికీ సరిహద్దుల్లో తన బాధ్యతలు ఆత్మ రూపంలో నిర్వహిస్తున్నట్లుగా అంతా విశ్వసిస్తారు. సిక్కింలో భారీ వరదల కారణంగా సైనికులను ఇరత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్న హర్బజన్..వరద బీభత్సానికి దురదృష్ట వశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. మాతృభూమి రక్షణలో భాగంగా విధినిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన ప్రవాహంతో మూడు రోజులుదాకా అతడి శరీరం దొరకలేదు. ఇంతలో క్యాంపులోని ఓ సిపాయికి కలలో కనిపించిన హర్బజన్.. తన శరీరం ఉన్న ప్రాంతాన్ని సూచించాడని, అక్కడే తనకు సమాధి కడితే సరిహద్దులో బాధ్యతలను కొనసాగిస్తానని చెప్పినట్లు కథనం. అయితే సైనికుడి కలలో చెప్పినట్లుగానే చోక్యాచో ప్రాంతంలో హర్బజన్ శరీరం దొరకడంతో స్థానికులే కాక సైనికులూ విషయాన్ని నమ్మారు. అదే ప్రాంతంలో పూర్తి మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, సమాధిని కూడా కట్టారు. అతడు చనిపోయినా అక్కడే అతడి ఆత్మ సరిహద్దు భద్రతను కాపాడుతుందంటూ జనం నేటికీ నమ్ముతున్నారు. పంజాబ్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్ కు చెందిన హర్బజన్.. దేశంపై సిపాయిలకుండే ప్రేమను నిరూపించాడు. భారత సరిహద్దు ప్రాంతాల భద్రతను కాపాడే నిజమైన సైనికుడుగా మిగిలిపోయాడు. హర్బజన్ విషయంలో ఆర్మీ కూడా మనోభావాలను, నమ్మకాలను గౌరవించినట్లుగా కనిపిస్తుంది. హర్బజన్ ను హానరరీ కెప్టెన్ గా గుర్తించి, నేటికీ జీతాన్ని ప్రతినెలా హర్బజన్ కుటుంబానికి అందజేస్తుంది. అంతేకాదు అమర సైనికుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 ను సెలవుదినంగా పాటిస్తుంది. కొన్నేళ్ళ క్రితం వరకూ.. (హర్బజన్ అధికారిక విరమణ తేదీ వరకూ) ఆయన వాడిన వస్తువులను ప్యాక్ చేసి, సిపాయిలు.. హర్బజన్ స్వగ్రామానికి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం నియమంగా పాటించారు. ఇటీవల భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నాతుల్లాను సాధారణ పౌరుల సందర్శనా స్థలంగా కూడా మార్చారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలూ నిర్వహించే శాంతి సమావేశాల్లో చైనా సైనిక అధికారులు హర్బజన్ సింగ్ కోసం ఓ కుర్చీవేసి గౌరవ సూచకంగా దాన్ని ఖాళీగా ఉంచడం కూడా కనిపిస్తుంది. కొందరు స్థానికులు హర్బజన్ సమాధిని దేవాలయంగా భావిస్తారు. తమ ప్రాంతాన్ని దేశాన్ని కాపాడమంటూ ప్రార్థిస్తుంటారు.


