మార్క్స్‌ ఎందుకు అజేయుడు?! | Sakshi
Sakshi News home page

మార్క్స్‌ ఎందుకు అజేయుడు?!

Published Tue, May 8 2018 2:14 AM

Karl Marx Is Immortal - Sakshi

1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరెన్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్‌ లూథర్‌ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్‌ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్‌– ఎక్స్, ఆల్బర్ట్‌ కామూల జీవితాలను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్‌. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ‘బీబీసీ’ ప్రపంచ ప్రముఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం.

‘‘తత్వవేత్తలు ఇంత వరకూ పలురకాలుగా ఈ ప్రపంచానికి భాష్యం చెబుతూ వచ్చారు. కానీ ఇకనుంచి జరగవలసిన అసలు కార్యం– ప్రపంచాన్ని మార్చడం. ఈ పెను మార్పుకు వ్యక్తి సంసిద్ధత, చిత్తశుద్ధి అవసరం. అప్పుడే సామాజిక పరిస్థితుల్ని అవి గతం నుంచి సంక్ర మించినా, వర్తమాన సమస్యలయినా వాటిని మార్చ డానికి ఈ మానసిక సంసిద్ధత, చైతన్యం అవసరం’’.
– శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలు కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్‌ Sఏంగెల్స్‌
‘‘బూర్జువా (ధనిక) వర్గాన్ని, మేధావి వర్గాన్ని కాదని మొద్దులు, మొరటులూ అయిన శ్రామికవర్గాన్ని ప్రేమించే సిద్ధాంతాన్ని నేనెలా అనుసరిస్తాను? రొయ్యికి బదులు రొంపి (బురద)ను ఎంచుకునే ఆ సిద్ధాంతాన్ని నేనెలా ఆదరిస్తాను? బూర్జువా వర్గం లేదా వారిని అనుసరించే మేధావులలో లోటు పాట్లున్నా వారే ప్రామాణిక జీవనానికి ప్రతినిధులు, వారే మానవాళి సాధించిన విజయ బీజాలను ముందుకు తీసుకువెళ్లగలవారూ’’.
– హీల్‌బ్రోనర్‌తో ప్రసిద్ధ ఆర్థికవేత్త మేయార్డ్‌ కీన్స్‌

శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త, ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త, తన ‘పెట్టుబడి’ (కాపిటల్‌) గ్రంథం ద్వారా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గత 150 సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా చేస్తూ వచ్చిన కార్ల్‌మార్క్స్‌ జనించి 200 ఏళ్లు పూర్తయింది. ఆ సందర్భంగా ప్రపంచ వ్యాపితంగానే ఈ ఏడాది పొడవునా ద్విశతజయంతి ఉత్సవాలు జరుగుతు న్నాయి. ఈ సందర్భంగా మార్క్స్‌ మానవాళికి సంబంధించిన సర్వశాఖలను– సాహిత్య, సాంస్కృ తిక, తాత్విక, ఆర్థిక, పర్యావరణ, దాంపత్య, శాస్త్ర, కళాదిరంగాలను పరామర్శించిన తీరుతెన్నులు, ఆ పరిశీలనలో ఆయన మానవజాతి పురోగతి కోసం ప్రతిపాదించిన పెక్కు ప్రయోజనకర సూత్రీకరణ లను, అవి ఎలా ప్రపంచ ప్రజల భావధారను ప్రభా వితం చేస్తూ వచ్చాయో తల స్పర్శగా పరిశీలించా ల్సిన సమయం ఇది. శాస్త్రీయ సోషలిజానికి శత్రు వర్గాల నుంచి వచ్చిన ప్రతిఘటనను, దానిని తిప్పి కొట్టి, ప్రపంచంలో పలుచోట్ల కార్మికవర్గ ప్రభు త్వాలు లేదా సోషలిస్టు ప్రభుత్వాలు తొలి సోషలిస్టు రాజ్యం నుంచి నేటి ఆసియా, లాటిన్‌ అమెరికా ఖండాలలోని దేశాలకు పరివ్యాప్తమై వచ్చిందో స్థూలంగా ప్రస్తావించుకోక తప్పదు.

ఈ ప్రయా ణంలో కొన్ని సోషలిస్టు ప్రభుత్వాలు ప్రపంచ సామ్రాజ్యవాద కుట్రలకు బలికాగా (తొలి సోవి యట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ సహా) మరికొన్ని ఆ కుట్ర లను ఎదుర్కొంటూనే బలంగా నిలదొక్కుకున్న దేశాలూ ఉన్నాయి. క్యూబా సోషలిస్టు రాజ్యనేత స్వర్గీయ ఫిడెల్‌ క్యాస్ట్రో తన చివరి రోజుల్లో చెప్పిన అంశం– నేటి, రేపటి ప్రగతిశీల రాజకీయ శక్తులకు, శ్రామికవర్గ పార్టీలకు, నాయకులకూ ఒక గుణపాఠం కావాలి: ‘‘సోషలిజం అంటే ప్రజలందరినీ సంపన్నులను, లక్షాధికారులను, కోటీశ్వరులుగా మార్చడం కాదు. ముందు అలాంటి ఆలోచనా ధోరణినీ, ఆశనూ కార్య కర్తలు, నాయకులు పటాపంచలు చేయాలి. సోష లిజం అంటే ప్రజలకు కనీస అవసరాలను, సౌక ర్యాలను, సామాజిక భద్రతను, సమతా న్యాయాన్ని, చట్టంముందు అందరూ సమానులేనన్న భావనను, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రజలమధ్య సఖ్యతా సంబంధాల్ని, శాంతిని కాపాడటమేనని అందరూ గుర్తించాలని’’ అన్నాడు.

శాస్త్రీయ సోషలిజానికి తొలి విజయం
1818లో పుట్టిన మార్క్స్‌ తొలి 49 ఏళ్ల నాటికి ఆయన పెట్టుబడి (కాపిటల్‌) గ్రంథం తొలి సంపుటం (1867) వెలువడింది. ఆ తర్వాత 50 ఏళ్లకు మార్క్స్‌ సిద్ధాంతం ప్రభావ ఫలితంగా అక్టోబర్‌ 25లో రష్యన్‌ విప్లవం (అదే నవంబర్‌ విప్లవం) విరుచుకుపడింది. అంటే మార్క్స్‌ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతానికి 50 ఏళ్లకుగానీ తొలి విజయం ఆవిష్కరించుకోలేదు. అది మొదలు శాస్త్రీయ సోషలిజం అనేక అడ్డంకుల మధ్యనే, అప్పటికి విస్తరించి ఉన్న ప్రపంచ సామ్రా జ్యవాద శక్తులు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొల్పిన సంరక్షణ అగడ్తలను క్రమంగా అధిగ మిస్తూ ముందుకు సాగింది. సామ్రాజ్యవాద–పెట్టు బడి వ్యవస్థలు సోషలిజం క్రియాశీల ప్రజా ప్రయో జనాలపై సాగించిన అబద్ధపు ప్రచారాలు, సోవి యట్, చైనా, వియత్నాం సోషలిస్టు వ్యవస్థలన్నింటి వినాశానికి కారణం. 

మార్క్స్‌కు ముందు పెట్టుబడిదారీ తరహా ‘అభి వృద్ధి’ నమూనా వ్యవస్థ తొలుత ఇంగ్లండ్‌లో తలెత్తిన పీడనా పద్ధతులకు పునాది పడింది. కాగా మార్క్స్‌ ‘కాపిటల్‌’ గ్రంథం వెలువడిన నాలుగేళ్లకే (1871) పారిస్‌ (ఫ్రెంచి) కార్మికవర్గం ప్రపంచంలో తొలి శ్రామికవర్గ విప్లవానికి విత్తనాలు నాటారని మర చిపోరాదు. అయితే ఆ తొలి శ్రామికవర్గ విప్లవాన్ని, పారిస్‌ కమ్యూన్‌నూ దారుణంగా పాలకవర్గాలు అణ చివేశాయి. అయితే ఇందువల్ల వచ్చిన భావి పరి ణామం విప్లవ రాజకీయ ధర్మాలు, శ్రామిక– కార్మిక వర్గాలలో నిక్షిప్తమైయున్న శక్తియుక్తులు ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఒకవైపున యూరప్‌లోని ఒక భాగం (ఇంగ్లండ్‌)లో తొలి శ్రామికవర్గ తిరుగుబాట్లను తొలి పెట్టుబడి వర్గాలు అణచివేస్తున్న సమయంలోనే మరోవైపున ఒక అర్ధ శతాబ్దంలోనే– మార్క్సిస్ట్‌ పార్టీ నాయకత్వంలో రష్యన్‌ నగర పారిశ్రామిక కార్మిక వర్గం ప్రభుత్వాధికారాన్ని స్వాధీనం చేసుకుని తొలి అక్టోబర్‌ మహా విప్లవాన్ని జయప్రదం చేశారు. 

ఈ పరిణామం సంభవించిన కాలాన్ని, సమ యాన్ని అధ్యయనం చేసిన మార్క్స్‌ జీవితకాల సహ చరుడు ఏంగెల్స్‌ వ్యాఖ్యానిస్తూ ‘‘అనేకచోట్ల దోపి డీకి గురవుతున్న సమకాలీన శ్రామికవర్గాలున్న పెట్టు బడి సమాజాల్లో శ్రామికవర్గంలో విప్లవ చైతన్యం కొడిగట్టుకుపోతున్న దశలో ఇతర చోట్ల దాదాపు అవే దోపిడీ వ్యవస్థలున్నచోట శ్రామిక విప్లవాలు ఎలా జయప్రదమవుతున్నాయని ప్రశ్నించాడు, కారణాలు ఆలోచించమని కోరాడు. ఆ ప్రశ్నకు ఆయనే కరా ఖండీగా తిరుగులేని సమాధానమిచ్చాడు: ‘‘ప్రపంచ వ్యాపితంగా వలస దేశాలను ఇంగ్లండ్‌ దోచుకుతిం టున్నందున, ఆ సామ్రాజ్య దోపిడీపై ఆధారపడిన ఇంగ్లండ్‌ కార్మికవర్గం కూడా నానాట సంపన్న వర్గంగా మారుతోంది’’ అన్నాడు ఏంగెల్స్‌. 

వలస దేశాలపై దోపిడీయే సామ్రాజ్యవాదం
సమానత్వం, సహోదరత్వం, పరస్పరం దోపిడీ అవ కాశంలేని వ్యవస్థా నిర్మాణం ద్వారానే సమాజాల శాంతి సౌమనస్యాలకు శాశ్వత భద్రత ఉంటుందని మార్క్స్‌ ప్రవచించాడని మరచిపోరాదు. కనుకనే అనంతర కాలంలో సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ నిర్మాత లెనిన్‌ 1917 రష్యన్‌ మహా విప్లవం నాటికే వలస దేశాల సంపదను కొల్లగొట్టడం ద్వారా సామ్రా జ్యవాద దేశాలు అపారమైన రాక్షస లాభాలకు పడగ లెత్తిన వైనాన్ని అక్షర సత్యంగా నిరూపించాడు.

ప్రపంచ సామ్రాజ్యవాద ప్రభుత్వాల దురాక్ర మణ విధానాలు, యుద్ధ విధానాల ఫలితంగా అమె రికా సైనిక–పారిశ్రామిక యుద్ధతంత్ర వ్యవస్థపై ఆధారపడిన అమెరికా–బ్రిటన్‌ల ఆర్థిక వ్యవస్థలు ఎన్ని సంక్షోభ దశల్ని గత 190 సంవత్సరాలలో ఆవిష్కరించాయో చూడండి: ప్రపంచ ఆర్థిక వేత్తలలో అగ్రగణ్యుడైన సమీర్‌ అమీన్‌ అంచనా ప్రకారం అగ్ర దేశాల సామ్రాజ్య విస్తరణ సాగిన గత 200 ఏళ్లలో నాలుగు దశలలో జరిగిన సంక్షోభాలను ఇలా చూపారు: నాలుగు దశలలో ఒక్కొక్క దశకూ మధ్య ఎన్నేసి సంవత్సరాల వ్యవధి ఉందో చూడండి: 1815–1840 (25 సం‘‘లు), 1850–1870 (20 సం‘‘లు), 1890–1914 (24 సం‘‘లు), 1948– 1967 (19 సం‘‘లు). ఈ దశలు సగటున 19–20 సంవత్సరాల దాకా విస్తరించాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ఎలా కారణ మవుతుందో ఈ సంక్షోభ దశలు నిరూపించాయి:

మార్క్స్‌ అంటే ఎందుకింత క్రేజ్‌!
1960లలో ప్రపంచ రాజకీయ రంగంలో పేరె న్నికగన్న ఆదర్శమూర్తులలో మార్టిన్‌ లూథర్‌ కింగ్, చేగువేరా, క్యాస్ట్రో, హెర్బర్ట్‌ మార్క్యూజ్, అంజెలా డేవిస్, మాల్కోమ్‌–ఎక్స్, ఆల్బర్ట్‌ కామూల జీవితా లను, వారి విధానాలను ప్రభావితం చేసిన వ్యక్తి మార్క్స్‌. కనుకనే విశ్వ విఖ్యాతి పొందిన బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ‘బీబీసీ’ ప్రపంచ ప్రము ఖులలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో తెల్పమని 20 మంది ప్రపంచ ప్రసిద్ధుల జాబితాను పరీక్షకు విడుదల చేసింది. అయిదారుసార్లకు పైగానే జరిగిన ఆ పోటీలో అన్నిసార్లూ కార్ల్‌మార్క్స్‌నే ప్రపంచ ప్రేక్షకులు ఎంచుకోవటం ఒక విశేషం. మార్క్స్‌ అంటే ఎందుకింత ‘క్రేజ్‌’ అంటే, అమెరికా లోని ‘న్యూలైఫ్‌’ ఉద్యమ ప్రసిద్ధుల్లో ఒకరైన ఎలీ జారెట్వీ్క చెప్పిన మాటల్ని విందాం:

‘‘ప్రపంచంలో వామపక్షవాదుల చరిత్రకు కార్ల్‌ మార్క్స్‌ ఎంతో దోహదం చేశారు, అది చెరపరానిది. ప్రపంచ చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్ర అని చాటినవాడు మార్క్స్‌. అంటే దానర్థం– దోపిడీ వ్యవ స్థలనుంచి విమోచన అనేది నిరంతరం సాగే పోరా టమన్న భావదీప్తిని ఆయన మనకు కలిగించాడు. ఈ భావనకు లోతైన సుదీర్ఘ చరిత్ర ఉంది, భవిష్యత్తును దర్శించే జ్ఞానదీప్తి ఉన్న భావన. పెట్టుబడిదారీ వ్యవ స్థను విస్పష్టంగా దర్శించగల దుర్భిణిని చేతికందిం చిన ఏకైక సిద్ధాంతకర్త మార్క్స్‌. ఈ పెట్టుబడి వ్యవస్థ పెట్టుబడికి–శ్రమశక్తికి మధ్య గండి కొట్టి కులుకు తున్న వ్యవస్థ, మానవుల మధ్య అంతరాలను పెంచే సిన సాంఘిక వ్యవస్థ. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళి మహా ప్రస్థానంలో ఆఖరి మజిలీ అను కోరాదు. నిరంతర సంక్షోభాలకు నిలయం పెట్టుబడి దారీ వ్యవస్థ’’ అన్నాడు మార్క్స్‌. నిరంతర సామా జిక విప్లవంతోనే దాని కథకు ముగింపు అన్నాడు మార్క్స్‌ (2012). నేడు భారత ప్రజలు చేరుకున్న, అనుభవిస్తున్న దశ సరిగ్గా ఇదే సుమా!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

Advertisement
 
Advertisement
 
Advertisement