breaking news
Folk Dances
-
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై కేసు
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి ఈశ్వర్‌సాయి పాపులర్ అయ్యారు. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పరారీలో 'బాసింగ బలాలే' డ్యాన్సర్ ఈశ్వర్ సాయి
'బాసింగ బలాలే' అనే ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతడి కోసం పోలీసు గాలిస్తున్నారు. తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ కేసు పెట్టడమే దీనంతటికి కారణం. పెళ్లి పేరుతో తనని శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని మాధురి కొన్నిరోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈశ్వర్ సాయి కోసం వెతుకుతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)స్వతహగా డ్యాన్సర్ అయిన ఈశ్వర్ సాయి, మాధురి కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఓ రోజు రాత్రి, వేములవాడలోని రెడ్డి భవన్లో మాధురితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఈశ్వర్ సాయిని ఇతడి భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. తర్వాత ఈశ్వర్ సాయి, మాధురి ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో తన వెర్షన్స్‌ని చెప్పుకొచ్చారు.అయితే ఈ తతంగం జరిగిన తర్వాత ఈశ్వర్ సాయి భార్య శరణ్య మాట్లాడుతూ.. తన భర్త తప్పేం లేదని మొత్తం మాధురినే దీనికి కారణమన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈశ్వర్ సాయి తప్పు చేస్తే తనని కొట్టి పరువు తీశారని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫోన్లో ఉన్న వీడియోలతో ఏఐ వీడియోలు సృష్టించి పరువు తీశారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఏఐ వీడియోలు సృష్టించారని ఫిర్యాదు చేసింది. మాధురి ఫిర్యాదుతో 69 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అతడి కోసం వెతుకుతున్నారు.(ఇదీ చదవండి: రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో.. ట్రైలర్ రిలీజ్) -
Naga Durga: బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. కానీ నాకు గొడవ పడటం అస్సలు రాదు..
-
సింహగిరి.. భక్తఝరి
సాక్షి,సింహాచలం(విశాఖపట్నం) : విరులు పులకించాయి. ఝరులు స్వాగతించాయి. గిరులు ఉప్పొంగిపోయాయి. అడుగులో అడుగేస్తూ అప్పన్నను తలుస్తూ ముందుకు సాగింది భక్తజనం. అన్ని దారులూ సింహగిరివైపే.. అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి తలపుతో గిరియాత్ర సాగిపోయింది.సింహ గిరీశా పాహిమాం..రక్షమాం..అంటూ భక్తజనం వేడుకుంది. స్వామే నడిపిస్తున్నారనే భావనతో అలవోకగా ప్రదక్షిణలో నిమగ్నమైంది. భక్తిభావం ఉప్పొంగింది. ఎటు చూసినా ఉత్సాహం.. ప్రదక్షిణోత్సాహం.. ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణలో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసేందుకు ఉదయం 8 గంటల నుంచే సింహాచలానికి భక్తులు చేరుకున్నారు. రాత్రి 10 వరకు ప్రదక్షిణ చేసేందుకు భక్తులు సింహాచలం తరలివస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు ప్రదక్షిణకు తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, యువత గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘల్లుమన్న జానపదం రథోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ‘ఓం నమో వెంకటేశాయ భజన మండలి’ మహిళల డప్పు వాయిద్య కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకం.విజయనగరం జిల్లా పూసపాటిరేగకి చెందిన తప్పెటగుళ్లు, పులివేషాలు, విశాఖకి చెందిన కోలాటం తదితర ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదక్షిణలో పదనిసలు భక్తుల సందడి ఉదయం 8 గంటల నుంచే మొదలైంది. 10 గంటలకు భక్తుల తాకిడి పెరిగింది. రథోత్సవం జరిగే సమయానికి 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది 26 క్యూలను ఏర్పాటు చేశారు. నగరం నుంచి పాత గోశాల వైపు వచ్చే బస్సుల్ని ఉదయం నుంచే గోశాల జంక్షన్ వద్ద నిలిపివేశారు. కొన్ని వాహనాలను శ్రీనివాసనగర్ నుంచే అనుమతించలేదు. దీంతో చాలామంది భక్తులు శ్రీనివాసనగర్ నుంచి కాలినడకన తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. హనుమంతవాక నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో అడవివరం జంక్షన్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి తొలిపావంచాకి వచ్చే భక్తులను గాంధీనగర్, పుష్కరిణి, రాజవీధి మీదుగా మళ్లించడంతో భక్తులంతా ఆ మార్గంలోనే నడిచి వెళ్లారు. కొంతమంది భక్తులు సింహగిరి ఘాట్‌రోడ్‌లోకి వెళ్లి కొత్త ఘాట్‌రోడ్డు మీదుగా అడవివరం జంక్షన్ చేరుకుని ప్రదక్షిణ చేశారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ ప్రదక్షిణ చేసారు. రథోత్సవం ప్రారంభమయ్యే సమయానికి వరుణుడు చిరుజల్లులు కురిపించాడు. సాయంత్రం అడవివరంలో చినుకులు పలకరించాయి. భక్తులు తడుస్తూనే గిరి ప్రదక్షిణ చేశారు. -
పల్లెపదం ఘల్లుమన్నది..


