ఆదిపురుష్ భామ కృతిసనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. రక్షాబంధన్ ప్రకటనలో ధరించిన డ్రెస్‌తో పాటు కుక్కకి రాఖీ కట్టడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఎందుకిలా అప్రతిష్ట పాలు చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో కృతిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ తనకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తోంది. తన ప్రకటనపై వివాదం తలెత్తినప్పటికీ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు వివాదం నడుస్తుంటే.. తన ప్రియుడితో కబిర్ బహియాతో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తన పనిలో తాను పుల్ బిజీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని ఇలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలంటున్నారు.


