breaking news
raksha bandhan
-
సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు
-
‘మనం ఎంచుకున్న బంధం ఇది.. నువ్వు మంచోడివి’
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం భారత పేస్ విభాగంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు ఈ హైదరాబాదీ. ఆటో డ్రైవర్ అయిన తండ్రి, కుటుంబం ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు.కిరాయి ఇంట్లో నివసించే స్థితి నుంచి జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను సొంతం చేసుకున్న సిరాజ్.. హోటల్ రంగంలోనూ అడుగుపెట్టాడు. కాగా సిరాజ్‌కు ఒకే తోబుట్టువు అయిన అన్నయ్య మహ్మద్ ఇస్మాయిల్ ఉన్నాడు.అయితే, క్రికెటర్‌గా గుర్తింపు పొందిన తర్వాత సిరాజ్‌కు ఓ చెల్లి కూడా దొరికింది. ఆమె పేరు జనై భోస్లే. జనై మరోవరో కాదు దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు అన్న విషయం తెలిసిందే. ఆమె కూడా సింగరే. అయితే, కొన్నాళ్ల క్రితం సిరాజ్- జనై పరస్పరం నవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి బయటకు రావడంతో వదంతులు పుట్టుకొచ్చాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనేది వాటి సారాంశం.అయితే, జనైతో పాటు సిరాజ్ కూడా అర్థంపర్థంలేని రూమర్లను కొట్టిపారేశారు. తమ మధ్య సోదర- సోదరీ బంధం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జనై భోస్లే మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. సిరాజ్‌కు రాఖీ కట్టిన పాత ఫొటోను తాజాగా పంచుకుంటూ..‘‘మన ఇద్దరం ఎంచుకున్న బంధం ఇది. మనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నయ్యా. నాకు ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను రక్షించే వ్యక్తి. నా ప్రాణ స్నేహితుడు’’ అని జనై భోస్లే పేర్కొంది.అదే విధంగా ఇన్‌స్టా స్టోరీలోనూ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఫొటో కింద రాసిన వాక్యాలను చదవడం అస్సలు మర్చిపోవద్దు. అన్నిటికంటే అవే అత్యంత ముఖ్యమైనవి’’ అంటూ తమ గురించి చెడుగా వదంతులు వ్యాప్తి చేసిన వారికి మరోసారి జనై గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా ఆశా భోస్లే మరణించిన సమయంలో సిరాజ్ ముంబైకి వెళ్లి.. అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బాధాకర సమయంలో జనైకి మద్దతుగా నిలిచాడు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle)ఇదిలా ఉంటే.. సిరాజ్ ఇటీవలే శ్రీలంక పర్యటనను ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చాడు. గాలె వేదికగా లంకతో తొలి టెస్టులో మొత్తంగా రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. కొలంబోలో జరిగిన రెండో టెస్టులోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. చదవండి: రాఖీ పండుగ: విరాట్ కోహ్లి అక్క పోస్ట్ వైరల్ -
కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం
వారం రోజులుగా మాటల తూటాలతో హోరెత్తిన యోగా గురువు రామ్‌దేవ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య వివాదానికి రక్షాబంధన్ సందర్భంగా తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న ఈ ఇద్దరూ.. పండగ వేళ విభేదాలను పక్కనపెట్టారు. రామ్‌దేవ్ స్వీట్లు, బహుమతిని .. కంగనా ‘అన్నయ్య’గా అనుకుంటూ తనకు పంపిన స్వీట్లను స్వీకరించారు.ద్వేషానికి చోటుండకూడదంటూ..‘దేశంలో కారణం ఏదైనా ద్వేషం ఉండకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. అందకే మా మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కనపెట్టా. ఏ గోడవైనా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుంది’ అని రామ్‌దేవ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కంగనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు. అంతేకాకుండా ఓ బహుమతి, స్వీట్లను పంపించినట్లు తెలిపారు.(ఇదీ చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..?)అన్నయ్యగా అంగీకరించిన కంగనారామ్దేవ్ పంపిన స్వీట్లు,బహుమతిని స్వీకరించి దీనిపై కంగనా సానుకూలంగా స్పందించారు. ‘పండగలు తప్పులను మర్చిపోవడానికి నా ‘అన్నయ్య’ రామ్‌దేవ్ పంపిన స్వీట్లను స్వీకరిస్తున్నాను. అన్నయ్యగా ఆయన చూపించిన ప్రేమను, పంపిన బహుమతిని తీసుకుంటున్నాను’ అని కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.రాజకీయ పార్టీలకూ సూచనరాజకీయ పార్టీలకు రామ్‌దేవ్ ఓ సలహా ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం రాఖీలు కట్టుకోవాలన్నారు. అలా చేస్తే సమాజానికి మంచి సందేశం వెళ్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదనే భావన ప్రజల్లో బలపడుతుందని పేర్కొన్నారు.అసలు గొడవ ఏంటి? జెన్జీల నిరసనకారులను కంగనా ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడంపై రామ్‌దేవ్ స్పందించడంతో వివాదం మొదలైంది. ఓ టీవీ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. కంగనా అర్హతలు, వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరికి మాటల యుద్ధం మొదలైంది. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయొద్దని , రామ్‌దేవ్ హద్దులు దాటుతున్నారని తీవ్రంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే? -
రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో ప్రముఖులు (ఫొటోలు)
-
రాఖీ పండుగ: విరాట్ కోహ్లి అక్క పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటున్న ఈ స్టార్ బ్యాటర్.. ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. భార్య అనుష్క శర్మతో కలిసి విమానాశ్రయం నుంచి కోహ్లి బయటకు వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి సోదరి భావనా కోహ్లి ధింగ్రా తాజాగా పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతదూరంగా ఉన్నప్పటికీ చాలా మంది అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పూర్ణిమ రోజైనా ఒక్క చోట చేరి ఈ పండుగ జరుపుకొంటారన్న సంగతి తెలిసిందే.కోహ్లికి రాఖీ కట్టిన భావనాఇక భావనా సైతం తన అన్న- తమ్ముడితో కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్న వికాస్ కోహ్లితో దిగిన సెల్ఫీని.. తమ్ముడు విరాట్ కోహ్లికి తాజాగా రాఖీ కట్టిన ఫొటోను భావనా ఈ సందర్భంగా ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ‘‘ఈ జీవితం మనల్ని ఎంత దూరం, ఎంత ఎత్తుకు తీసుకువెళ్లినా సరే.. నా ప్రార్థనల్లో మీరు ఎల్లప్పుడూ ఉంటారు’’ అని సోదరులపై ప్రేమను చాటుకున్నారు.ఈ నేపథ్యంలో సోదరితో రాఖీ కట్టించుకునేందుకే కోహ్లి లండన్ నుంచి ఢిల్లీకి వచ్చాడేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీకి చెందిన ప్రేమ్ కోహ్లి, సరోజ్ కోహ్లికి ముగ్గురు పిల్లలు సంతానం. తొలుత వికాస్ జన్మించగా.. తర్వాత భావనా, విరాట్ జన్మించారు.ఆమె ఎవరంటే?విరాట్ అక్క భావనా ఎంటర్ప్రెన్యూర్. వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను పెళ్లాడిన ఆమెకు మెహక్, ఆయుశ్ సంతానం. విరాట్ కోహ్లికి చెందిన ఫ్యాషన్ లేబుల్ వన్8సెలక్ట్‌తో కలిసి భావనా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా విరాట్ వీలైనప్పుడల్లా తన సోదరి ఇంటికి వెళ్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భావనా షేర్ చేయగా.. ‘భారత దిగ్గజ బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ తన అక్కకు ఎప్పటికీ చిన్ని తమ్ముడినేనని విరాట్ నిరూపించాడు’ అంటూ అభిమానులు కోహ్లిపై ప్రశంసలు కురిపించడం పరిపాటి. తన అన్న వికాస్తోనూ కోహ్లికి మంచి అనుబంధం ఉంది. కాగా వన్డేల్లో అత్యధికంగా 54 శతకాలు బాదిన కోహ్లి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డే, ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ ఉన్నారు. వీరంతా ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నారు.చదవండి: భారత జట్టులోకి వారసులు వచ్చారు! View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రక్షాబంధన్ వేడుకలు.. ఫోటోలు
-
‘ఈ బంధం అబద్ధమా..’.. ఇకపై క్లింటన్‌కు ‘రాఖీ’ లేదు!
జైపూర్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు రాఖీ కట్టి వార్తల్లో నిలిచిన రాజస్థాన్‌కు చెందిన మోహిని దేవి గత మార్చి నెలలో కన్నుమూశారు. దీంతో గత 26 ఏళ్లుగా భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ఓ అరుదైన, ఆత్మీయ అనుబంధం ముగిసింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల నాయ్లా గ్రామాన్ని సందర్శించారు.ఆ సమయంలో పంచాయతీ రాజ్ మహిళా సాధికారతను పరిశీలించేందుకు వచ్చిన క్లింటన్‌కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఆ సందర్భంగా గ్రామానికి చెందిన మోహిని దేవి క్లింటన్‌కు హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్ది రాఖీ కట్టారు. ఆ సమయంలో క్లింటన్ ఆమెతో కలిసి స్థానిక రాజస్థానీ గీతాలకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పర్వదినాన మోహిని దేవి క్లింటన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రాఖీలు పంపడం ఆనవాయితీగా కొనసాగించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ద్వారా ఈ రాఖీలు వైట్‌హౌస్‌కు చేరేవి. దీనికి ప్రతిగా బిల్ క్లింటన్ కూడా ఆమెకు ప్రత్యేక లేఖలు, కానుకలు పంపేవారు. మోహిని దేవి భద్రపరుచుకున్న ఆ లేఖలు, కానుకలు, జ్ఞాపకాలు వీరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. మోహిని దేవి మృతితో నాయ్లా గ్రామంతో పాటు ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇది కూడా చదవండి: అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్‌లైన్’ ప్రకటించిన పోలీసులు -
చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్
దేశమంత రాఖీ పండుగ వేడుకలతో సందడిగా ఉంది. ఈ పండుగను ప్రమఖులు సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు. అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకును అత్యంత ఘనంగా జరుపుకుంది. ఎప్పటిలో తమ ఇంటిలో కాకుండా న్యూయార్క్‌లో జరుపుకున్నారు. అనంత్ రాధికలు తమ కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ బంగళాకు వెళ్లారు. అంతేగాదు చెఫ్ వికాశ్ ఖన్నా అంబానీ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. పైగా వారి కోసం ఆ ప్రాంతాన్ని అందమైన పూలతో అలంకరించారు. గాజు బంగళా రెస్టారెంట్ పైకప్పుని చక్కగా శుభ్రం చేసి అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టు అయిన "వంతార" (Vantara) పేరు వచ్చేలా పూల రేకులను అమర్చి మరి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాధిక చెఫ్ వికాస్‌కి జిలేబీ ఆకారపు రాఖీని కట్టారు. ఒక్కసారిగా ఆ చర్యకు చెఫ్ వికాస్ ఖన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఎన్నటికి మర్చిపోలేని అపురూపమైన క్షణంగా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. రాధిక అనే పేరుకు అర్థం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆమె నాకు జిలేబీ ఆకరాపు రాఖీని కట్టినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఒక్క క్షణం పాటు నాలోని ఒక భాగం స్వస్థత పొదిన అనుభూతి కలిగిందన్నారు. అలాగే వంతారలో అనంత్ అంబానీ చేస్తున్న అసాధారణమైన కృషిని మెచ్చుకుంటూ..ఆయనకు జంతువుల పట్ల ఉన్న ఆపారమైన ప్రేమ, వాత్సల్యానికి తాను సదా దాసోహం అన్నారు. అనంత్‌ని అత్యంత దయగల వ్యక్తిగా పేర్కొన్నారు. అలాంటి వాళ్లకు తన బంగళా రెస్టారెంట్లో తాను ఆతిథ్యం ఇవ్వడం తనకెంతో గొప్ప విషయమని రాసుకొచ్చారు వికాస్ ఖన్నా పోస్ట్‌లో. అంతేగాదు పోస్ట్‌లో ప్రతిరోజూ ఎంతో మంది అతిథులు ఈ రాఖీ పండుగ నేపథ్యంలో తనకు రాఖీలు కడుతుంటారని, గానీ మనం ఎంతో అభిమానించే, ప్రేమించే వ్యక్తులు మనల్ని ఆశ్చర్యపర్చేలా ఇలా చేస్తారని ఊహించం. ప్రస్తుతం రాధిక చేసిన పని అలానే ఉందని, దీన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. కొన్ని క్షణాలు ముందుగా ప్లాన్ చేసుకోలేం, కానీ అవి ఆకస్మికంగా జరిగినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం అన్నారు. రాధిక తనకెంతో గొప్ప అర్థాన్ని ఇచ్చేలా ఈ రాఖీని కట్టినందుకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు వికాస్ ఖన్నా. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) (చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..) -
అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్‌లైన్’ ప్రకటించిన పోలీసులు
న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ ఢిల్లీ, నోయిడాల నుంచి స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే స్తంభించిపోయింది. గురువారం (ఆగస్టు 27) సాయంత్రం నుంచి ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు దాదాపు 5 నుంచి 6 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఘజియాబాద్ మీదుగా వెళ్లే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు నోయిడా-గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రహదారుల్లోనూ తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.నోయిడా సెక్టార్ 62 నుంచి దాస్నా వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పండుగ షాపింగ్ కోసం మార్కెట్లకు భారీగా జనం తరలిరావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా 10-15 నిమిషాల్లో ప్రయాణించే 4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ట్రాఫిక్ నియంత్రణకు ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను (9643322904) ఏర్పాటు చేశారు. లాల్ కువాన్ వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. చిజ్జార్సీ సమీపంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. Ghaziabad: Raksha Bandhan की पूर्व संध्या पर Delhi-Meerut Expressway पर लगा भीषण जाम। 🚨🚗 pic.twitter.com/KFDEZhI4c0— Greater Noida West (@GreaterNoidaW) August 27, 2026ఘజియాబాద్ నుంచి మీరట్ వెళ్లేవారు దాస్నాకు ముందున్న కనెక్టర్ల ద్వారా ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ, ఘజియాబాద్ వాసులు మురాద్‌నగర్, మోదీనగర్ మీదుగా పాత జాతీయ రహదారిలో వెళ్లవచ్చు. మీరట్ ప్రయాణికుల కోసం ఎన్సీఆర్టీసీ నమో భారత్ రైళ్ల సర్వీసులను పెంచి ప్రతి 8 నిమిషాలకొకటి చొప్పున 47 అదనపు ట్రిప్పులను నడుపుతోంది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపడే గుడ్ న్యూస్.. ఇక నో ఫెయిల్! -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్‌లో ఆ ట్విస్ట్ తప్పదా? -
అక్కాచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారాయన.మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయతకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2026అంతకు ముందు.. నిన్నటి రాఖీ సందేశంలో ‘ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి చిన్నారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధనం.. ఆత్మీయత, అనురాగాల పండుగ. అక్కాచెల్లెమ్మలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రతి అక్క, చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలి’ అని వైఎస్ జగన్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కుటుంబాల్లో సంతోషం, ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొనాలని ఆయన కోరుకున్నారు.క్లిక్ చేయండి: రక్షాబంధన్: జగనన్నకు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ నేతలు -
రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..
అన్నా చెల్లెళ్ల పండుగగా చెప్పే ఈ రక్షాబంధన్ పండుగ వెనుక ఎన్నోపౌరాణిక గాథలు, ఆసక్తికర చరిత్ర దాగుంది. ఇది కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. సర్వమత ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం కూడా. ఈ పండుగ కోసమే దేవతను సైతం సృష్టించాడు ఆ బొజ్జ గణపయ్య. అంతేకాదండోయ్ ఈ రాఖీని కేవలం అన్నా చెల్లి, అక్కా తమ్ముడు మాత్రమే కాదు తమ రక్షణ ఇచ్చే వ్యక్తి ఎవ్వరికైనా కట్టొచ్చట. అలాగే భార్య తన భర్తకి కూడా కట్టొచ్చట రాఖీ. ఇదేంటని అని ఆశ్చర్యపోకండి. దాని వెనుకున్న ఆసక్తికర కథలు గురించి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సవివరంగా తెలుసుకుందామా.!.రాఖీ ఎలా ఉండేదో తెలుసా..!వాస్తవానికి రాఖీలో ఒక తాయెత్తు ఉండేది, ప్రస్తుతం ఆధునిక డిజైన్ల హంగులతో వివిధ రకాలుగా మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అప్పట్లో ఒక సాధారణ దారంకి పసుపు రాసి ముడులు వేసి, దేవుని ముందు ఉంచి.. మంత్రాలతో శక్తిమంతం చేసేవారు. ఆ తర్వాత సోదరీమణులు తమ అపారమైన ప్రేమకు ప్రతిగా సోదరులకు కట్టేవారు. అందుకే దీనిని 'రక్షాబంధన్' అని పిలుస్తున్నారట. చూడటానికి సాధారణ దారమే అయినా..బంధం గొప్పతనం తెలిపేదని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నేపథ్యంలో సోదరుడి కోసం మిఠాయిలు చేసి మరి నోటిని తీపి చేసి..దీర్ఘాయువుతో చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించేవారట సోదరీమణులు. అందుకు ప్రతిగా సోదరులు వారికి బహుమతులు ఇచ్చి మరి రక్షగా ఉంటానని వాగ్దానం చేసేవారట. ఐక్యతకు చిహ్నంగా..అస్సాం, సిల్హెట్ ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించే ముస్లిం జనాభాను, హిందూ మెజారిటీ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాల నుంచి వేరు చేయాలని బ్రిటీష్ వాళ్లు కుట్ర పన్నారు. ఈ ఘటన 1905లో చోటు చేసుకుంది. ఆ విభజన కాస్తా సరిగ్గా రక్షాబంధన్ రోజు కావడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను ఉపయోగించుకుని అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకోసం ఠాగూర్ వారి కుట్రను భగ్నం చేసేలా ఐక్యతకు ప్రతీగా ఒకరికొకరు రాఖీ కట్టకోవాలంటూ వేలాది ప్రజలను గంగానది ఒడ్డుకు ఆహ్వానించారు. ఆ రోజు ఆయన సాధారణ దారాన్ని రెండు వర్గాల మధ్య ఐక్యతకు, సంఘీభావానికి చిహ్నంగా చాలా చాకచక్యంగా ఉపయోగించారు.భార్య.. భర్తకు రాఖీ కట్టే ఆచారం అప్పటి నుంచే..ఒకానొకప్పుడు దేవతులు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. అది చూసి భయంతో బృహస్పతి వద్దకు రాగా, ఆయన తక్షణమే భార్య సచి దేవితో చేతికి ఓ రక్ష లేదా గొలుసులాంటి దాన్ని పౌర్ణమి నాటి రాత్రి కట్టించుకోమని సూచించారు. కట్టుకునే మందుకు శ్రావణ పౌర్ణమి రోజున దేవుడు ముందు ఉంచి మంత్రాలతో శక్తిమంతం చేయాలని కూడా చెప్పారట. దాంతో ఇంద్రుడు గురువు చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణ వచనం. అలా ఆ నాటి నుంచే పురుషులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు భార్యలు వాళ్ల మణికట్టుకు ఈ రక్షను కట్టడం ఆచారంగా మారిందట. ఆ రోజునే సంతోషిమాత..గణేశుడు, అతని సోదరి మానస ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను జరుపుకునేవారట. గణేశుడుకి సిద్ధి (అద్భుతమైన) బుద్ధి (విజయం) అనే భార్యలున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆ ఇద్దరు భార్యల ద్వారా శుభ (పవిత్రమైన), లాభ (లాభం) అనే ఇద్దరు కుమారులు కలిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే గణేశుడు తన సోదరిని ఎల్లప్పుడూ గొప్ప ఆతిథ్యంతో స్వాగతించేవాడు. అలాగే మానస తన ప్రియమైన సోదరుడి వినాయకుడు కోసం ఎల్లప్పుడూ పుష్కలంగా మిఠాయిలు, బహుమతులు తీసుకువచ్చేది. పైగా రాఖీ కట్టే వేడుక అత్యంత వైభవంగా జరిగేది. దాంతో శుభ, లాభ్లు చాలా బాధపడేవారట. వారికి సోదరి లేకపోవడం వల్ల, ఈ వేడుకను జరుపుకోలేకపోతున్నాం అని ఆవేదన చెందేవారట. ఒక రోజు, ఆ బాలురు వినాయకుడి వద్దకు వెళ్లి, తమకు ఒక సోదరిని ప్రసాదించమని కోరారట. సరిగ్గా ఆ సమయానికి నారద మహర్షి కూడా గణేశుడిని దర్శించుకోవడానికి రావడంతో, ఆయన కూడా కుమారుల కోరికను మన్నించమని ఒప్పించారట. చివరికి, అందరి పట్టుదల మేరకు, గణేశుడు తన భార్యల శరీరాల నుంచి వెలువడిన రెండు జ్వాలల ద్వారా ఒక కుమార్తెను సృష్టించాడట. అలా సంతోషిమాత ఆవిర్భావం జరిగిందట. వినాయకుడి కుమార్తె అయిన సంతోషిమాత అందరి కోర్కెలను తీర్చే కల్పవల్లి, సంతృప్తికి అధిష్టాన దేవతగా ప్రకటించాడట. అలా ఈ పండుగ కోసం ఒక దేవత ఆవిర్భావించడమే గాక పండుకు ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని కూడా చాటుతోంది. అంతేగాదు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన ఐక్యతకు, సత్సంబంధాలకు ప్రతీకగా మారి సర్వమత సౌబ్రాతత్వాన్ని చాటే విశిష్టమైన పండుగగా అలరారోతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పండుగలో భాగమయ్యేలా సోదరుడు లేదా మీకు రక్షగా ఉండే వ్యక్తులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోండి మరి..!. View this post on Instagram A post shared by Kidsstoppress | Parenting (@kidsstoppress) (చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
దారం కాదు… దూరాలను దగ్గర చేసే ఒక్క రోజు!
ఆమె పెళ్లయి మరో ఇంటికి వెళ్లింది. అతను ఉద్యోగం కోసం మరో నగరంలో ఉన్నాడు. ఇద్దరూ రోజూ మాట్లాడకపోవచ్చు. వాట్సాప్ దగ్గరే చాట్ ఆగిపోవచ్చు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం ఫోన్ మోగుతుంది… “అన్నయ్యా, ఎప్పుడు వస్తావ్?” అని. అదే రక్షా బంధన్. ఇది కేవలం రాఖీ కట్టే పండుగ కాదు; దూరమైన బంధాలను మళ్లీ కలిపే భావోద్వేగ వేడుక.ఒకప్పుడు చాక్లెట్లు, కవర్లు, కొత్త బట్టలే రాఖీ ప్రత్యేకం. కానీ 2026లో ట్రెండ్ పూర్తిగా మారింది. ఇప్పుడు సోదర–సోదరీమణులు వస్తువుల కంటే కలిసి గడిపే సమయాన్ని బహుమతిగా ఎంచుకుంటున్నారు. ఒక కాఫీ, ఒక చిన్న ట్రిప్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే డిన్నర్… ఇవే ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తున్న రాఖీ గిఫ్ట్స్.చిన్నప్పుడు శత్రువులు.. టీవీ రిమోట్ కోసం కొట్టుకున్న రోజులు, చిప్స్ దాచిపెట్టి మళ్లీ ఇద్దరూ కలిసి తిన్న క్షణాలు, అమ్మకు తెలియకుండా రాత్రిళ్లు కథలు చెప్పుకున్న జ్ఞాపకాలు… ఇవన్నీ రాఖీ రోజున మళ్లీ మనసులో మెదులుతాయి. చాలా కుటుంబాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య సంవత్సరాలుగా మాటలు లేకపోవచ్చు. అహం, అపార్థాలు, చిన్న గొడవలు బంధాన్ని దూరం చేస్తాయి. ఈ రాఖీ రోజున “క్షమించు” అనే ఒక్క మాటతో కొత్త ప్రారంభం చేయాలని సంబంధ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బంధాలు గెలవాలి… వాదనలు కాదు.రక్త సంబంధానికే కాదుచరిత్రలో రక్షా బంధన్ కేవలం అన్నాచెల్లెళ్లకే పరిమితం కాలేదు. గురువులకు, సైనికులకు, కుటుంబ స్నేహితులకు కూడా రాఖీ కట్టి గౌరవం తెలిపే సంప్రదాయం ఉంది. రక్షణ అంటే కేవలం ఏదో బాడీగార్డ్‌గా ఉండాల్సిన పని కాదు.. అవసరమైనప్పుడు తోడుగా నిలబడే వాగ్దానం.ఈ ఏడాది సందేశం ఒక్కటేరాఖీ దారం చేతికి కట్టేది ఐదు నిమిషాలే. కానీ ఆ దారంలో దాగి ఉండేది ఏళ్ల అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలు, జీవితాంతం నిలిచే నమ్మకం. అందుకే ఈ పండుగలో అత్యంత విలువైన బహుమతి ఖరీదైన గిఫ్ట్ కాదు… “నేను ఉన్నాను” అని చెప్పే మనిషి. రాఖీ 2026 చెబుతున్న సందేశం ఇదే.. దూరం ఎంత ఉన్నా, నిజమైన బంధానికి ఒక దారం చాలు. -
లైఫ్ లాంగ్ రక్ష
యూ ట్యూబర్‌గా... నటిగా... బిగ్ బాస్ ద్వారా తెలుగువారికి చేరువ అయ్యింది హారిక. దేత్తడి హారికగా పేరు తెచ్చుకుంది. తాము చేసుకునే రాఖీ పండగ గురించి చెప్పింది ఇలా..‘మా అన్నయ్య వంశీ కార్తీక్ అంటే.. నాకు ఫాదర్ లెక్క. అన్నగా ధైర్యాన్ని, నాన్నగా ప్రేమను పంచుతాడు. రక్షాబంధన్ అనేది ఏడాదికి ఒక్కసారి సంప్రదాయంగా వేడుకగా జరుపుకుంటాం. కానీ, ఆ రక్ష మళ్ళీ వచ్చే ఏడాది రక్షాబంధన్ వచ్చేవరకు ఉంటుంది. నమ్మకమే కాదు, వాస్తవం. చిన్నప్పటినుంచి నేను అల్లరి పనుల్లో ఫస్ట్. దాంతో సమస్యలు కూడా వస్తుంటాయి. అన్నయ్య మాత్రం చాలా కూల్‌గా వాటిని పరిష్కరిస్తాడు. ఫోన్లో మూవీస్ రీల్స్ ఎక్కువసేపు చూస్తుంటాను అని.. కళ్ళకింద డార్క్‌సర్కిల్స్ వస్తాయని, కిందటి ఏడాది లాప్ టాప్ కొనిచ్చాడు. ఆ లాప్ టాప్ ఇప్పుడు వాడుతున్నాను. నాకు ఎక్కువ ఉపయోగపడే వస్తువులు ఏమయినా ఉన్నాయంటే అవి అన్నయ్య ఇచ్చినవే అయి ఉంటాయి. ఏదయినా ఇష్యూ వస్తే ‘అన్నయ్య ఉన్నాడుగా... చూసుకుంటాడు’ అనే ధైర్యం. స్నేహితులు ఎంతమంది ఉన్నా.. చేసిన పనులు, వచ్చిన ప్రశంసలు.. ఆ రోజు చివరలో అన్నయ్యతో షేర్ చేసుకోవాల్సిందే. నా గురించి నాకన్నా మా అన్నయ్య ఎక్కువ ఆలోచిస్తాడు. మాలాంటి అన్నయ్య ఉన్న ప్రతి చెల్లీ ఫుల్ హ్యాపీ. -
రక్షానుబంధం
ఆధ్యాత్మికంగానూ, సంప్రదాయకంగానూ చూస్తే శ్రావణ పౌమికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అయితే అందరూ అవేమీ అంతగా పట్టించుకోరు. అందరికీ గుర్తొచ్చేది రాఖీ పౌమి అనే. దీనినే రక్షా బంధన్ లేదా శ్రావణ పూర్ణిమ అని పిలుస్తారు. ఇది కేవలం సోదరుల చేతికి సోదరి ఒక దారం కట్టే వేడుక మాత్రమే కాదు; తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు, రక్షణకు, పరస్పర బాధ్యతకు తీపి గుర్తు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ రాఖీ కడితే, సోదరులు తమ సోదరీ మణులకు అన్నింటా అండగా ఉంటామని బాస చేస్తారు. ఆఫీసులలోనూ, పని చేసే సంస్థలలోనూ... ఇళ్లలో పని చేసే వారు ఇంటి యజమానులను కూడా ‘మేం రాఖీ కట్టేందుకు మా పుట్టింటికి వెళ్లాలి, సెలవు కావాలి’ అని అడిగితే కాదనలేని కాజు. అలాగే ‘మా అక్క లేదా మా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాలి నేను ఊరు వెళుతున్నా సారూ’ అంటే సరేనని తలూపి తీరవలసిన ఒక మంచి రీజను. ఇంతమందిని ఇన్ని విధాలుగా కట్టి పడేస్తున్న ఈ రాఖీ పండగ ఎలా మొదలయ్యిందో తెలుసుకుందాం, పౌరాణికంగా చూస్తే...ఇది కేవలం సోదర వాత్సల్యానికే కాదు... భార్యాభర్తలు, భగవంతుడు–భక్తుడు, విశ్వశాంతి కోసం ఒకరికొకరు రక్షణ కల్పించుకునే పవిత్ర బంధానికి ప్రతీక అని కొన్ని కథల ద్వారా తెలుస్తోంది. ఆ పురాణ గాథలు ఇవే ద్రౌపది – శ్రీ కృష్ణుడి గాథ: ఒకానొక సందర్భంలో కృష్ణుడి కుడిచేతి వేలికి గాయమై రక్తం కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి వంటి వారు రక్తాన్ని ఆపడానికి వస్త్రాల కోసం వెతుకుతుంటారు. కానీ అక్కడ ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా, తను కట్టుకున్న పట్టుచీర కొంగును చింపి, కృష్ణుడి వేలికి కట్టు కడుతుంది. దానికి కృష్ణుడు ఎంతో చలించిపోయి, ‘సమయం వచ్చినప్పుడు ఈ బంధానికి రుణం తీర్చుకుంటాను, నిన్ను ఎల్లవేళలా రక్షిస్తాను సోదరీ’ అని మాట ఇస్తాడు. ఆ తర్వాత కురుసభలో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ఒడిగట్టినప్పుడు, కృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. ద్రౌపది కట్టిన ఆ చీర ముక్కే మొదటి ‘రక్షాబంధనం’ గా నిలిచింది. లక్ష్మీదేవి – బలిచక్రవర్తి గాథ: రాక్షస రాజైన బలిచక్రవర్తి భక్తికి, దానగుణానికి మెచ్చిన విష్ణుమూర్తి, అతనికి ఒక వరం ఇస్తాడు. దానిప్రకారం విష్ణుమూర్తి వైకుంఠాన్ని విడిచి, బలిచక్రవర్తి కోటకే కాపలా దారుడిగా ఉండిపోతాడు. భర్త రప్పించుకోవడం కోసం నారద మహర్షి సూచన మేరకు లక్ష్మీదేవి ఒక పేదమహిళ రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్తుంది. శ్రావణ పౌమి రోజున బలిచక్రవర్తి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కడుతుంది. బలిచక్రవర్తి సంతోషించి ‘నీకు ఏం కావాలో కోరుకో’ అనగానే, లక్ష్మీదేవి తన నిజరూపాన్ని చూపి, తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపించమని కోరుతుంది. సోదరి లాంటి లక్ష్మీదేవి కోరికను బలిచక్రవర్తి కాదనలేక, విష్ణుమూర్తిని పంపిస్తాడు.ఇంద్రాణి – ఇంద్రుడి గాథఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. రాక్షసరాజు ‘బలి’ చేతిలో ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంద్రుడి ప్రాణరక్షణ కోసం భయపడిన ఆయన భార్య శచీదేవి శ్రావణ పౌమి నాడు పరమశివుడిని ప్రార్థించి ఒక పవిత్రమైన రక్షా సూత్రానికి పూజ చేస్తుంది. ఆ మంత్రించిన సూత్రాన్ని ఇంద్రుడి కుడిచేతికి కడుతుంది. ఆ రక్షాసూత్రం ఇచ్చిన శక్తితో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి, దేవలోకాన్ని కాపాడుకుంటాడు. అది కూడా రక్షాబంధనమే!యమధర్మరాజు – యమునా దేవి గాథసూర్య భగవానుని సంతానమైన యముడు, యమున అన్నాచెల్లెళ్లు. యముడు తన విధుల్లో నిరంతరం అవిశ్రాంతంగా ఉండటం వల్ల చాలాకాలం పాటు సోదరి యమునను కలవలేకపోతాడు. ఒక శ్రావణ పౌమి రోజున యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి ఆహ్వానించి, నుదుట తిలకం దిద్ది, చేతికి రక్షణ సూత్రం కడుతుంది. ఎంతో రుచికరమైన వంటలు వడ్డించి ఆదరిస్తుంది. సోదరి ప్రేమకు ముగ్ధుడైన యముడు... ‘ఏ సోదరి అయితే శ్రావణ పౌమి నాడు తన సోదరుడికి రాఖీ కట్టి, తిలకం దిద్దుతుందో, ఆ సోదరుడికి అపమృత్యు భయం (అకాల మరణం) లేకుండా దీర్ఘాయుష్షు లభిస్తుంది‘ అని వరం ఇస్తాడు. సాంప్రదాయికంగా ఇలా... సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే తలస్నానం చేసి, దేవుని గదిలో దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి లేదా వెండి పళ్లెంలో రాఖీలు (రక్షా సూత్రాలు) కుంకుమ, పసుపు (తిలకం కోసం) అక్షింతలు, నేతి దీపం లేదా కర్పూరం (హారతి ఇవ్వడానికి) తీపి పదార్థాలు (మిఠాయిలు) అమర్చుకోవాలి. సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం చేసి ఒక పీటపై కూర్చోవాలి. సోదరి తూర్పుముఖంగా నిలబడాలి. సోదరి తన కుడిచేతి ఉంగరపు వేలితో సోదరుడి నుదుట కుంకుమ తిలకం దిద్దాలి. ఆ తిలకంపై కొన్ని అక్షింతలు ఉంచాలి. తర్వాత సోదరుని కుడిచేతి మణికట్టుకు మూడు ముడులు వేస్తూ రాఖీని కట్టాలి. రాఖీ కట్టే సమయంలో ‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల‘ అనే పవిత్రమైన రక్షా మంత్రాన్ని పఠించడం ఎంతో శుభప్రదం:రాఖీ కట్టిన తర్వాత, సోదరి నేతిదీపంతో సోదరుడికి దిష్టి తీస్తూ హారతి ఇవ్వాలి. అనంతరం సోదరుడి నోరు తీపి చేయాలి. సోదరుడు కూడా సోదరికి తీపి తినిపించాలి. సోదరి పెద్దదైతే సోదరుడు ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ సోదరి చిన్నదైతే సోదరుడి పాదాలకు నమస్కరించి దీవెనలు ΄÷ందాలి. సోదరుడు తన ప్రేమకు గుర్తుగా, తోచిన బహుమతిని లేదా దక్షిణను సోదరికి అందించి, జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇవ్వాలి. – డి.వి.ఆర్. -
మనకు మనం.. అన్న దన్ను అదనం..
ఒకప్పుడు రక్షణ అంటే బలమైన హస్తం. మణికట్టుపై ముడిపడే దారం. ఆపదలో ఆదుకునే అన్నయ్య భరోసా. కానీ, కాలం మారింది. ఇప్పుడు జెన్ జి. వారి దృష్టిలో రక్షణ అంటే కేవలం మగాడు వచ్చి కాపాడటం కాదు... ఒక మహిళకు మరో మహిళ తోడుగా నిలబడటం, తనను తానే రక్షించుకుంటానని వాగ్దానం చేసుకోవడం. అందుకే మార్కెట్లో ‘సిస్టర్హుడ్ రాఖీ’లు... ‘సెల్ఫ్రాఖీ’లు రాఖీ పౌమి వేళ సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ 2.0 స్వరూపం..రాఖీ పౌమి వచ్చిందంటే చాలు... అన్నాచెల్లెళ్ల బంధం అనివార్యంగా ఇళ్లను ఉద్వేగభరితం చేస్తుంది. ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’ వంటి పాటలు రేడియోలో మోగుతాయి. అన్నను గుర్తు చేసుకోని చెల్లెలు, చెల్లెలి శిరస్సు తాకి ఆశీర్వదించి, ఆమె చేతి మీదుగా రక్షాబంధనం కట్టుకోని అన్న ఉండడు. రాఖీ వచ్చిందంటే ఇంటికి కళ. రక్తానుబంధపు తీపి మిఠాయి సమయం.అయితే ఈసారి రాఖీ పండగలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు లేని అమ్మాయిలే కాదు... ఉన్న అమ్మాయిలు కూడా తమ అక్కాచెల్లెళ్లకు, ప్రాణస్నేహితురాళ్లకు రాఖీలు కడుతున్నారు. పురాణాల్లో చెప్పిన ద్రౌపది, శ్రీకృష్ణుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... ఈ కాలానికి తగినట్టుగా తమకు తాము సొంత రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తున్నారు అమ్మాయిలు. ఇది పండగ జరుపుకునే పద్ధతి మారడం కాదు... స్త్రీల ఆత్మవిశ్వాసానికి, ఐక్యతకు నిదర్శనం.‘రక్ష’ అంటే శారీరక బలం కాదుసంప్రదాయం ప్రకారం రాఖీ కట్టించుకున్న సోదరుడు సోదరిని కాపాడతానని మాట ఇస్తాడు. కానీ ఇవాళ్టి రోజుల్లో ఒక అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు లేదా జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు తక్షణ రక్షణగా నిలుస్తున్నది ఎవరు? తోటి మహిళే! హాస్టల్ గదిలో అనారోగ్యంతో బాధపడుతుంటే బ్రెడ్ తెచ్చి ఇచ్చే రూమ్మేట్, ఆఫీసు పాలిటిక్స్ నుండి కాపాడే మహిళా కొలీగ్, అర్ధరాత్రి ప్రయాణంలో తోడుగా నిలిచే అపరిచిత స్త్రీ... వీరంతా ఒకరికొకరు రక్షకులే. శారీరక బలంతో కాపాడటం మాత్రమే రక్షణ కాదు; ఒక అమ్మాయి కుంగిపోతున్నప్పుడు వెన్నుతట్టి ‘నేనున్నా’ అనే మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కూడా రక్షణే. ఆ నమ్మకానికే ఈ తరం అమ్మాయిలు రాఖీ కడుతున్నారు. రక్షణ అనేది జెండర్‌తో కాదు, గుండె ధైర్యంతో ముడిపడి ఉందని చాటుతున్నారు.మారిన కుటుంబ వ్యవస్థఒకప్పటి ఇళ్లకూ ఇప్పటి ఇళ్లకూ సాపత్యం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయి మైక్రో ఫ్యామిలీలు వచ్చాయి. ఒకప్పుడు అన్నయ్యలకు మణికట్టు నిండా రాఖీలే. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఇంటిలో అబ్బాయి చేతికి రాఖీ కట్టే ఆడపిల్ల ఉండటం లేదు. అలాగే సింగిల్ డాటర్ లేదా టూ డాటర్స్ కుటుంబాలు పెరిగాయి. వీళ్లు రాఖీ కట్టడానికి చేయి దొరకడం లేదు. అందుకే అన్నదమ్ములు లేరనే వెలితి తెలియకుండా గత కొన్నేళ్లుగా చెల్లెలికి అక్కే ‘నేనే నీ రక్ష’ అంటూ రాఖీలు కట్టుకోవడం ఆనవాయితీగా మారుతోంది. అన్నాచెల్లెళ్ల బంధమే కాదు, అక్కాచెల్లెళ్ల బంధం కూడా రాఖీయే అని చెప్పే తల్లులు పెరుగుతున్నారు. ఈ మార్పును బ్రాండ్స్ కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో అక్కాచెల్లెళ్ల కోసం ప్రత్యేకంగా జీట్ట్ఛట ్ఞu్చఛీ ఖ్చజుజిజీ, ఆజీజ జీట/ఆ్చby జీటఖ్చజుజిజీటపేరుతో మార్కెట్లో రాఖీలు తెస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల స్థానంలో ‘విమెన్ ఎంపవర్మెంట్ సింబల్’్స ఉన్న రాఖీలు ఇవాళ అమ్ముడవుతున్నాయి.ట్రెండింగ్‌లో సెల్ఫ్–లవ్ఈసారి డిజిటల్ స్పేస్‌లో # జీట్ట్ఛటటఊౌట జీట్ట్ఛటటహ్యాష్ట్యాగ్ మార్మోగిపోతోంది. కేవలం తోబుట్టువులకే పరిమితం కాకుండా, తమకు స్ఫూర్తినిచ్చిన ఇతర మహిళలకు, మహిళా బాస్‌లకు అమ్మాయిలు కృతజ్ఞతగా రాఖీలు పంపుతున్నారు. అంతేకాదు, మరో అద్భుతమైన ట్రెండ్ ఏంటంటే... ’సెల్ఫ్ లవ్ రాఖీ’. తమ మణికట్టుకే తాము రాఖీ కట్టుకుంటూ ‘నా జీవితానికి, నా రక్షణకు, నా ఆర్థిక స్వాతంత్య్రానికి, నా ఎదుగుదలకు నేనే బాధ్యత వహిస్తాను’ అని అమ్మాయిలు సెల్ఫ్–డిక్లరేషన్ ఇస్తున్నారు. ‘అమ్మాయిలు ఎవరికో రాఖీ కట్టి, నన్ను కాపాడమని వేడుకునే రోజులు పోయాయి. మనల్ని మనం కాపాడుకునే ధైర్యం మన చేతుల్లోనే ఉంది’ అని అంటున్నారు వాళ్లు.అసలు ‘రాఖీ’ ఎప్పుడూ ‘దారం’ కాదు. అది ఒక మాట. ‘భయపడకు, నేనున్నాను‘ అనే మాట. ఇన్నాళ్లూ ఆ మాటను అబ్బాయిలు మాత్రమే చె΄్పాలి అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా చెబుతున్నారు. అమ్మాయిలు అమ్మాయిలకు రాఖీ కట్టుకోవడం అంటే పురుష సమాజానికి వ్యతిరేకంగా మారడం కాదు... తమలోని అంతర్గత శక్తిని గుర్తించడం. ఆడపిల్ల ఒంటరి కాదు, ఒక అమ్మాయికి మరో అమ్మాయి తోడుంటే ఆ శక్తే వేరు అని చాటిచెప్పడం. అందుకే ఈ రాఖీ పౌమి కేవలం తోబుట్టువుల పండగ మాత్రమే కాదు... స్త్రీ శక్తి ఐక్యతా దినోత్సవం! -
రాఖీ పండుగను ఇలా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు
‘‘ఆలస్యం అమృతం విషం’’ అని అంటారు. ఆలస్యం చేస్తే అమృతమైనా విషంలా మారుతుందని, అందుకే మంచి ఫలితం రావాలంటే ఆ పనినైనా సరే ఆలస్యం చేయకూడదని అంటుంటారు. దీన్ని రాజకీయ నేతలు బాగా ఒంట బట్టించుకున్నారు. పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ప్రజలకు దగ్గర కావడానికి పండుగలను బాగా వాడేసుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీలు తమ ఐక్యత, సంస్థాగత బలం, ప్రజల్లో ఉన్న పట్టును ప్రదర్శించుకోవాలని చూస్తున్నాయి.రక్షాబంధన్‌ను కేవలం పండుగగా కాకుండా రాజకీయంగా కూడా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో బీజేపీ ‘రాఖ్రీ మహా సమ్మేళన్’ నిర్వహించి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. రక్షాబంధన్ సందర్భంగా జరిగే కార్యక్రమాలు పార్టీలు తమపై ఉన్న ప్రతికూల భావనలను తగ్గించుకుని, ప్రజల్లో తమ ఇమేజ్ను మెరుగుపరుచుకునే వేదికలుగా మారుతున్నాయి. అదే సమయంలో ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమంపైనా రాజకీయ పార్టీల దృష్టి ఉంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని జరిగే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పంజాబ్ రాజకీయ పార్టీలు ముందుగా తమ కార్యకర్తలను ఏకం చేసి, తమ ఇమేజ్ను సరిచేసుకుని, 2027 ఎన్నికలకు ఇంటి నుంచే సిద్ధమవుతున్నాయి.రాఖర్ పున్నియాకు రాజకీయ ప్రాధాన్యంరక్షాబంధన్ సందర్భంగా పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు తమ రాజకీయ బలాన్ని, కార్యకర్తల ఐక్యతను చాటుకునేందుకు ఈ పండుగను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం ఈ సందర్భంగా భారీ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, వారిస్ పంజాబ్ దే వంటి పార్టీలు ఒకే ప్రాంతంలో తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ పంజాబ్‌లో తన సంస్థాగత విస్తరణను చూపించాలనుకుంటుండగా, ఆప్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. అకాలీ దళ్ తన కార్యకర్తల బలాన్ని తిరిగి ప్రదర్శించాలని భావిస్తుండగా, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానాన్ని బలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.అయితే ఈ దశలో పార్టీలు నేరుగా ఓటర్లను ఆకట్టుకోవడం కంటే ముందుగా తమ కార్యకర్తలను చైతన్యపరచడం, క్రమశిక్షణలోకి తీసుకురావడం, విభేదాలను పరిష్కరించడం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నాయి. బూత్ స్థాయి సమావేశాలు, ర్యాలీలు, సంస్థాగత భేటీలు పెరుగుతున్నాయి. బీజేపీ పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పలు జిల్లాల్లో పర్యటించి బూత్ స్థాయి నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు. గతంలో శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుపై ఆధారపడిన బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో తన సొంత సంస్థాగత బలం పెంచుకోవడం కీలకంగా మారింది. అయితే బీజేపీ-అకాలీదళ్ మధ్య భవిష్యత్ పొత్తుపై ఊహాగానాలు కొనసాగుతుండటం పార్టీకి అంతర్గత పరీక్షగా మారింది.కాంగ్రెస్‌కు సంస్థాగత బలం ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు ప్రధాన సమస్యగా ఉన్నాయి. భూపేష్ బఘేల్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పలువురు కీలక నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. కాంగ్రెస్ ముందుగా తనలో తాను ఐక్యతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషణ పేర్కొంటోంది.ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు ఉంది. 2022లో 117 స్థానాల్లో 92 గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు మార్పు కోసం హామీలు ఇచ్చే పార్టీగా కాకుండా, తన పాలనను సమర్థించుకోవాల్సిన అధికార పార్టీగా ఎన్నికలను ఎదుర్కోనుంది. ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు శిరోమణి అకాలీదళ్ గత ఎన్నికల పరాజయాల తర్వాత తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సాధించేందుకు ‘పంజాబ్ బచావో’ ర్యాలీలను నిర్వహిస్తోంది.ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రయ్యాలో జరగనున్న రఖర్ పున్నియా కార్యక్రమం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ తన విస్తరణను చూపించేందుకు, ఆప్ తన ప్రభుత్వాన్ని ప్రదర్శించేందుకు, అకాలీదళ్ తన కార్యకర్తల బలాన్ని చాటేందుకు, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే భారీ ర్యాలీలు ఓట్లుగా మారవు. చివరకు కార్యకర్తల చురుకుదనం, స్థానిక సంస్థాగత బలం, ప్రజలతో నిరంతర సంబంధమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. -
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా... (ఫొటోలు)
-
అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!
ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్‌లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్‌సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది.దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్‌లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇవీ చదవండి: తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?
భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్ గఢ్ మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.నారీపూర్ణిమ:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.హయగ్రీవ జయంతి:ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.ఉపాకర్మఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. – డి.వరలక్ష్మిఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? -
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
-
మీ తోబుట్టువుకు ఉపయోగపడే క్రేజీ గిఫ్ట్స్ ఇవే!
అనురాగానికి ఆప్యాయత తోడై అన్నాతమ్ముళ్లు-అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని పండగలా జరుపుకునే వేడుక రాఖీ పౌర్ణమి. కాలం మారింది. దాంతోపాటు బంధాల వ్యక్తీకరణ తీరూ మారింది. ఒకప్పుడు రాఖీ కట్టి తీపి తినిపిస్తే సరిపోయేది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్‌లు, గ్రీటింగ్ కార్డ్‌ల కాలం వచ్చింది. కానీ నేటి డిజిటల్ యుగంలో తోబుట్టువుకు ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువుగా మిగిలిపోకూడదు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా, వారి జీవితంలో భాగమయ్యేలా ఉండాలన్నది నేటి యూత్ ఆలోచన. ఈ పండుగ మరింత గుర్తుండిపోయేలా ఉండేలా కొన్ని వినూత్న, ఉపయోగకరమైన గిఫ్టింగ్ ఐడియాలు చూద్దాం.ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులుతీపి పదార్థాలు ఇచ్చే సంతోషం తాత్కాలికమే, కానీ ఆర్థిక భద్రత ఇచ్చే ధీమా శాశ్వతం.చెల్లెలి లేదా తమ్ముడి పేరిట ప్రతి నెలా చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.సాంప్రదాయ బంగారానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి.మీ సోదరి, సోదరుడి పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడం ద్వారా వారికి ఆరోగ్య భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు.స్మార్ట్ అండ్ గాడ్జెట్ వేవ్సాంకేతికతతో ముడిపడిన జీవితంలో రోజువారీ పనులను సులభతరం చేసే స్మార్ట్ బహుమతులకు ప్రాధాన్యం పెరుగుతోంది.ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్‌వాచ్‌లు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.పుస్తకపఠనంపై ఆసక్తి ఉన్నవారికి ఈ-బుక్ సబ్స్క్రిప్షన్లు అందించడం అద్భుతమైన ఎంపిక.ఆఫీస్ పనులు, ప్రయాణాలు లేదా ఆన్లైన్ క్లాసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌ఫోన్స్ / ఇయర్‌బడ్స్ ఎంతో సహాయపడతాయి.అనుభూతులను పంచే గిఫ్ట్స్నిరంతరం పనులతో అలసిపోయే అక్క లేదా చెల్లెలికి ఒక చిన్న సోలో ట్రిప్ లేదా వెకేషన్ ప్యాకేజీ గిఫ్ట్‌గా ఇవ్వడం.వారికి ఇష్టమైన ఫోటోగ్రఫీ, కోడింగ్, ఫారిన్ లాంగ్వేజ్ లేదా మ్యూజిక్ కోర్సులకు సంబంధించి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఇవ్వొచ్చు.అనుబంధానికి వెలకట్టలేం. కానీ, ఇచ్చే బహుమతిలో వారి పట్ల మనకున్న శ్రద్ధ, వారి భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత ప్రతిబింబించాలి. ఈ రాఖీ పౌర్ణమికి కేవలం ఒక బహుమతినే కాదు.. వారి ఎదుగుదలకు తోడ్పడే నమ్మకాన్ని కానుకగా ఇద్దాం.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
కృతి సనన్ యాడ్ వివాదం.. ప్రకటన సంస్థ కీలక నిర్ణయం
ఆదిపురుష్ భామ కృతి సనన్ చేసిన యాడ్ వివాదానికి కారణమైంది. ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై కూడా దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాఖీని ఓ కుక్కకు కట్టడంతో ఇది కాస్తా ముదిరింది. హిందూ సంప్రదాయాలను కృతి అవమానించారంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలంటే అంటే అంత చులకన అంటూ బాలీవుడ్ బ్యూటీని నిలదీశారు.ఆ తర్వాత తనపై వస్తున్న వివాదంపై కూడా కృతి సనన్ స్పందించింది. మన సంప్రదాయాలను గౌరవించే విధానం మన దుస్తులపై ఆధారపడి ఉందని తెలిపింది. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో ఉండదని.. అది ఆమె మనసుకు సంబంధించిన విషయమని పోస్ట్ చేసింది. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకెప్పుడు ఆపుతారని ప్రశ్నించింది. కుక్క కూడా మా ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే రాఖీ కూడా కట్టానని కృతి వెల్లడించింది.తాజాగా ఈ వివాదం పెద్దఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ కల్చర్, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు పూర్తి గౌరవముందని తెలిపింది. కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు యాడ్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం!
రక్షాబంధన్ పర్వదినానికి, శ్రీకృష్ణుని జన్మభూమి అయిన మథుర-బృందావనాలకు యుగాల నాటి విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం కాకుండా, సాక్షాత్తు భగవంతుడినే తమ తోబుట్టువుగా భావించి పూజించే అపురూప సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి దేశవిదేశాల నుంచి వచ్చే రాఖీలు, మథుర విశ్రామ్ ఘాట్‌లో యమునా నదీ స్నానాలు ఈ పవిత్ర బంధాన్ని చాటిచెబుతాయి.బాంకే బిహారీకి వెల్లువెత్తే రాఖీలు, భక్తుల లేఖలుబృందావనంలోని ప్రముఖ ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి రక్షాబంధన్ వేళ దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు, యువతులు పోస్టు ద్వారా రాఖీలు పంపుతుంటారు. సొంత అన్నదమ్ములు లేనివారే కాకుండా, శ్రీకృష్ణుడిని తమ ఆపద్బాంధవుడైన సోదరుడిగా భావించే భక్తులు ఈ సంప్రదాయాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. రాఖీలతో పాటు తమ కష్టసుఖాలు, కుటుంబ క్షేమం, మనోభీష్టాలను తెలుపుతూ రాసిన భావోద్వేగపూరిత లేఖలను కూడా పంపుతుంటారు.స్వామివారికి సమర్పణ.. భక్తులకు ప్రత్యేక ప్రసాదంభక్తుల నుంచి అందిన రాఖీలను ఆలయ అధికారులు జాగ్రత్తగా భద్రపరుస్తారు. పండుగ రోజున ఆలయ సేవకులు భక్తులు పంపిన లేఖలను చదివి వినిపిస్తూ, ఆ రాఖీలను బాంకే బిహారీ స్వామివారి మణికట్టుకు అలంకరిస్తారు. అనంతరం స్వామివారి ఆశీస్సులుగా ప్రత్యేక ప్రసాదాన్ని (రిటర్న్ గిఫ్ట్) భక్తులకు అందజేస్తారు. మథుర-బృందావనం, ద్వారకాధీశ్ ఆలయాల్లో పండుగ నాడు తొలి రాఖీని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు.శ్రీకృష్ణుడు - ద్రౌపది పౌరాణిక బంధంరక్షాబంధన్ చరిత్రలో శ్రీకృష్ణుడు-ద్రౌపదిల రక్షాసూత్ర కథ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మహాభారత కాలంలో శిశుపాలుడిని వధించే క్రమంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారినప్పుడు, ద్రౌపది తన చీర కొంగును చింపి వేలికి కట్టు కట్టింది. దాన్ని రక్షాసూత్రంగా స్వీకరించిన కృష్ణుడు, ఆమెను జీవితాంతం రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఈ పౌరాణిక ఘట్టం శ్రీకృష్ణుడి లీలాభూమి అయిన మథురలో రక్షాబంధన్ నాడు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.విశ్రామ్ ఘాట్: ప్రపంచంలోనే ఏకైక అన్నాచెల్లెళ్ల ఆలయంమథురలోని చారిత్రాత్మక విశ్రామ్ ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘శ్రీ యమునా ధర్మరాజ్ ఆలయం’ ఉంది. సూర్య భగవానుడి సంతానమైన యమధర్మరాజు, యమునా దేవిల అనురాగానికి ఈ క్షేత్రం ప్రతీక. పురాణాల ప్రకారం యమునా దేవి తన సోదరుడైన యమధర్మరాజుకు ఘనస్వాగతం పలికి రక్షాసూత్రం కట్టింది. ఈ క్షేత్ర దర్శనం సోదర-సోదరీ బంధాన్ని శాశ్వతం చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.యమునా నదిలో పవిత్ర స్నానం.. యమపాశ విముక్తిరక్షాబంధన్, భగినీ హస్తభోజనం (భాయ్ దూజ్) పర్వదినాలలో అన్నాచెల్లెళ్లు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని విశ్రామ్ ఘాట్ వద్ద యమునా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా స్నానం చేసి ధర్మరాజు-యమున ఆలయాన్ని దర్శించుకుంటే యమలోక బాధలు తొలగిపోతాయని యమధర్మరాజు స్వయంగా వరం ఇచ్చాడని పౌరాణిక కథనం. దీంతో వేలాది మంది భక్తులు సోదరుల దీర్ఘాయుష్షు కోసం ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.నిరాశ్రయ తల్లుల చేతుల మీదుగా ప్రధానికి రాఖీలుమథుర-బృందావనాలలో నివసించే నిరాశ్రయ వృద్ధ తల్లులు రక్షాబంధన్‌కు సరికొత్త సామాజిక అర్థాన్ని చేకూరుస్తున్నారు. ఒకప్పుడు సమాజం వల్ల నిర్లక్ష్యానికి గురైన ఈ మాతృమూర్తులు, సులభ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల సహకారంతో స్వయంగా రాఖీలను రూపొందిస్తున్నారు. రక్షాబంధన్ నాడు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాఖీలను కట్టి ఆశీర్వదిస్తారు. ఈ ఆచారం మథుర నుంచి జాతీయ స్థాయి వరకు సోదర ప్రేమను చాటుతోంది.ఇది కూడా చదవండి: రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం! -
ఇంకెప్పుడు మారుతారు?.. వివాదంపై కృతి సనన్ రియాక్షన్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన రక్షాబంధన్ యాడ్‌తో విమర్శల పాలైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ.. సంప్రదాయ దుస్తులు కాకుండా వెస్టర్న్ డ్రెస్‌లో కనిపించింది. ఇదే వివాదానికి కారణమైంది. హిందూ పండుగను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ భామ స్పందించారు. పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకానీ ఒక మహిళ ధరించే దుస్తులపై ప్రభావం ఉండదని రాసుకొచ్చింది. ఈ వేడుకల్లో తన పెంపుడు జంతువును చేర్చాలనే ఆలోచన సరైందేనని.. కుక్కలు కూడా కుటుంబంలో భాగమేనని వెల్లడించింది. ఈ వివాదంపై ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.కృతి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మన పండుగల సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. అది సంప్రదాయాల పట్ల మీకు ఉండే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా " అని పోస్ట్ చేసింది.అంతేకాకుండా మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని కృతి సనన్ ప్రశ్నించింది. ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతిని కృతి తప్పుపట్టింది. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి రొమాంటిక్ కామెడీ-డ్రామా కాక్టెయిల్ -2లో కనిపించింది. గతేడాది 'తేరే ఇష్క్ మే'లో ధనుష్ సరసన కూడా హీరోయిన్గా మెప్పించింది. -
రాఖీ సమీపిస్తున్న వేళ.. భారీగా కల్తీ రసగుల్లాలు స్వాధీనం!
గజియాబాద్ (యూపీ): రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ ఆహార కల్తీపై గజియాబాద్ ఆహార భద్రతా విభాగం అధికారులు ఉక్కుపాదం మోపారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహారీపురాలో ఉన్న ఒక గోదాముపై మెరుపు దాడులు నిర్వహించి, సుమారు 1,000 కిలోల కల్తీ రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మిఠాయిలను తయారుచేసి నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.కల్తీ పన్నీర్, పంచదారతో పాటు ‘సెఫోలైట్’ వంటి రసాయనాలను ఉపయోగించి ఈ రసగుల్లాలను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి నాలుగు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. స్వాధీనం చేసుకున్న 1,000 కిలోల రసగుల్లాల నిల్వలను ధ్వంసం చేసే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు, సదరు గోదాము నిర్వాహకుడి లైసెన్స్‌ను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. VIDEO | Uttar Pradesh: Ahead of Raksha Bandhan, the Food Safety Department in Ghaziabad launched a major crackdown on food adulterators. A departmental team raided a warehouse in Biharipura, under the Vijay Nagar police station limits, and seized nearly 10 quintals of prepared… pic.twitter.com/gFonWboCMy— Press Trust of India (@PTI_News) August 24, 2026రక్షాబంధన్ వేళ మిఠాయిలకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, కల్తీని అరికట్టేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే అంతకుముందు ఆగస్టు 14న గాజియాబాద్‌లోని పలు డెయిరీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దాడులు నిర్వహించింది. ఆ సమయంలో 868 కిలోల పన్నీర్, 170 కిలోల కోవాను అక్కడికక్కడే అధికారులు ధ్వంసం చేశారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఎఫ్‌డీఏల సమన్వయంతో కఠిన నిఘా, చర్యలు కొనసాగుతున్నాయని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలియజేసింది.ఇది కూడా చదవండి: ‘కేరళ రీల్’.. పదేళ్ల తర్వాత కన్నవారి చెంతకు దివ్యాంగుడు! -
ఒకవైపు వివాదం.. బాయ్‌ఫ్రెండ్‌తో ఆదిపురుష్ భామ చిల్..!
ఆదిపురుష్ భామ కృతిసనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. రక్షాబంధన్ ప్రకటనలో ధరించిన డ్రెస్‌తో పాటు కుక్కకి రాఖీ కట్టడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఎందుకిలా అప్రతిష్ట పాలు చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో కృతిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ తనకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తోంది. తన ప్రకటనపై వివాదం తలెత్తినప్పటికీ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు వివాదం నడుస్తుంటే.. తన ప్రియుడితో కబిర్ బహియాతో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తన పనిలో తాను పుల్ బిజీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని ఇలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
‘కుక్కకు రాఖీనా?’.. కృతిపై ఫ్యాన్స్ ఆగ్రహం
రక్షాబంధన్ ప్రకటనలో బాలీవుడ్ నటి కృతి సనన్ లుక్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పండుగ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేయగా, శునకానికి రాఖీ కట్టే సన్నివేశంపైనా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గివా’ రూపొందించిన సరికొత్త ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులు, ప్రదర్శించిన సన్నివేశాల కాన్సెప్ట్‌పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ పండుగను ఆధునిక కోణంలో చూపించే ప్రయత్నమే ఇదని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్-వైట్ రంగు బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సంప్రదాయ పండుగ వేళ ఇలాంటి ఆధునిక వస్త్రధారణ ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, పెంపుడు శునకాన్ని కుటుంబ సభ్యుడిగా చూపిస్తూ, మొరుగుతున్న శునకానికి కృతి రాఖీ కట్టే సన్నివేశం కూడా విమర్శలకు దారితీసింది. పండుగ నేపథ్యాన్ని ఆవిష్కరించేందుకు ఇతర మార్గాలున్నాయని పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తూ, హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు దీనిని కేవలం ఒక క్రియేటివ్ క్యాంపెయిన్ మాత్రమేనని అనగా, వివాదం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇప్పటివరకు అటు కృతి సనన్ గానీ, ఇటు ప్రకటన సంస్థ గానీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కృతి సనన్ ఇటీవల ‘కాక్టెయిల్ 2’ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించగా, గతంలో ధనుష్‌తో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించారు.ఇది కూడా చదవండి: గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి -
ఈ రాఖీ పండుగకు ఇలాంటి తీపి రెసిపీలను చేసేయండిలా..!
బెంగాలీ చమ్ చమ్కావలసినవి..ఛెనా తయారీకి– చిక్కటి పాలు: 1 లీటరు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: టీస్పూన్, పాకం కోసం– పంచదార: ఒకటిన్నర కప్పులు, నీళ్ళు: 4 కప్పులు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: కొన్ని రేకలు, స్టఫింగ్ కోసం: కోవా (3–4 టేబుల్ స్పూన్లు), డ్రైఫ్రూట్స్: పిస్తా, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ఫుడ్ కలర్: 2 చుక్కలు.తయారీ..ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, 2 నిమిషాలు చల్లారాక అందులో నీటిలో కలిపిన నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ పాలు విరిగేలా తిప్పాలి. పాలు, నీరు వేరయ్యాక, ఒక పలచని కాటన్ క్లాత్‌లో వడకట్టి, వెంటనే చల్లని నీటితో కడిగి నీరంతా పోయేలా 30 నిమిషాల పాటు వేలాడదీయాలి. ఇప్పుడు ఈ ఛెనాని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి అరచేతితో మెత్తగా ఒత్తాలి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని సమానమైన భాగాలుగా చేసుకుని పగుళ్లు లేకుండా కోలగా ఒత్తుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర, 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత పాకం బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసి పెట్టుకున్న ఛెనా రోల్స్‌ను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేయాలి. ఇవి 15–20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌పై ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం నుంచి చమ్ చమ్‌లను బయటకు తీసి మధ్యలో చిన్నగా గాటు పెట్టాలి. అందులో కొద్దిగా కోవా నింపాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడిలో వీటిని దొర్లించి, పైన పిస్తా, బాదం ముక్కలతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన బెంగాలీ చమ్ చమ్ సిద్ధం!బనారసీ పాన్ ఫడ్జ్కావలసినవి..ఫడ్జ్ బేస్ కోసం– వైట్ చాక్లెట్: 400 గ్రాములు, స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ ఫుడ్ కలర్: 2 చుక్కలు, తాజా తమలపాకులు: 8, పాన్ మసాలా (ఫ్లేవర్ కోసం), గుల్కంద్: 3 టేబుల్ స్పూన్లు, స్వీట్ సోంప్: 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ: 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి: 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, పాన్ ఎసెన్స్: కొన్ని చుక్కలు, గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రేకులు, సిల్వర్ ఫాయిల్.తయారీ..ముందుగా ఒక పాత్రలో పార్చ్మెంట్ పేపర్‌ను తీసుకుని దానికి కొద్దిగా వెన్నపూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్పేస్ట్ కోసం బ్లెండర్లో తమలపాకులతో పాటు కండెన్స్డ్ మిల్క్ పోసి, మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, దానిపై వేడి తగిలేలా మరొక గిన్నెను ఉంచండి. అందులో తురిమిన వైట్ చాక్లెట్, వెన్న, తయారుచేసి పెట్టుకున్న తమలపాకు–కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమంలోనే ఒక చుక్క గ్రీన్ కలర్, పాన్ ఎసెన్స్ కలపవచ్చు. తరువాత స్టవ్ ఆపి, ఆ మిశ్రమంలో గుల్కంద్, స్వీట్ సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఇపుడు సిద్ధంగా ఉన్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని పోసి, గరిటెతో సమంగా ఒత్తుకొని.. పైన తరిగిన పిస్తా, గులాబీ రేకులు, టూటీ ఫ్రూటీ, సిల్వర్ ఫాయిల్‌తో అందంగా అలంకరించండి. ఈ ట్రేని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. ఫడ్జ్ బాగా గట్టిపడిన తర్వాత, పేపర్ సాయంతో బయటకు తీసి, వేడి నీటిలో ముంచి తుడిచిన పదునైన చాక్‌తో చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే బనారసీ పాన్ ఫడ్జ్ సిద్ధం. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.ఫిర్నీకావలసినవి..బాస్మతీ బియ్యం: 3 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: 1 లీటరు, పంచదార: 1/2 కప్పు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: 10–12 రేకలు (పాలలో నానబెట్టినవి), రోజ్ వాటర్: టీస్పూన్, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలుతయారీ..30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని పూర్తిగా వడకట్టి, నీళ్లు కలపకుండా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో లీటరు పాలు పోసి మీడియం ఫ్లేమ్‌పై మరిగించి.. పాలు ఒక పొంగు వచ్చాక.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను అందులో వేయాలి. సన్నని మంటపై మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. బియ్యం రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికి, పాలు చిక్కగా అయ్యాక అందులో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, అందులో రోజ్‌వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఫిర్నీని మట్టి గ్లాసులలో లేదా గాజు బౌల్స్‌లో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. దీనిని కనీసం 2–3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి, బాగా కూల్ అయిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
రాఖీ పండుగ.. మార్కెట్ అమ్మకాలు ఎన్నివేల కోట్లంటే?
మన దేశమంతటా వేడుకగా జరుపుకొనే పండుగల్లో రాఖీ పండుగ విశిష్టమైనది. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా ‘రక్షాబంధనం’ తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. సోదరుల నుంచి కానుకలు అందుకుంటారు.రాఖీ పండుగ మొదలవడానికి దాదాపు నెల్లాళ్ల నుంచి మార్కెట్లో రాఖీ కళ కనిపిస్తుంది. రాఖీ పండుగ కోసం సీజనల్‌గా ఊరూరా రాఖీ దుకాణాలు వెలుస్తాయి. స్వీట్ షాపుల్లో అమ్మకాల జోరు విపరీతంగా పెరుగుతుంది. రాఖీ సీజన్లో దేశవ్యాప్తంగా జరిగే రాఖీల అమ్మకాల విలువ దాదాపు రూ.17,000 కోట్లకు పైగా ఉంటుందని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) చెబుతోంది.గత ఏడాది రాఖీ మార్కెట్లో 42 శాతం వృద్ధి నమోదైంది. ఈసారి కూడా రాఖీల అమ్మకాల విలువ మరో 40 శాతానికి పైగా పెరగవచ్చని సీఏఐటీ అంచనా. రాఖీ జోరు గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మన దేశంలో రాఖీల తయారీ సంఘటిత రంగంలో కంటే అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతుంది. సంఘటిత రంగానికి సంబంధించిన లెక్కలు మాత్రమే పారిశ్రామిక సమాఖ్యలకు, ఇతర సంస్థలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూపిన అంకెల కంటే వాస్తవానికి రాఖీల తయారీ, విక్రయాలు మరింత ఎక్కువగానే జరుగుతుంటాయి. -
ఆగస్టులో సూర్య, చంద్ర గ్రహణాలు.. భారత్‌పై ప్రభావం?
న్యూఢిల్లీ: 2026 ఆగస్టు నెలలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రెండు కూడా సంభవించనున్నాయి. ఆగస్టు 12న అమావాస్య రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 4:25 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ గ్రహణం యూరప్, స్పెయిన్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, రష్యా దేశాలలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక రెండోది చంద్ర గ్రహణం.. ఇది ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ రోజున వస్తుంది. ఇది ఉదయం 8:04 గంటలకు ప్రారంభమై ఉదయం 11:22 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్ర గ్రహణం ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియాలలో కనిపించనుంది.ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవు. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం, ఏ ప్రాంతంలోనైనా గ్రహణాలు కనిపిస్తేనే వాటికి మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. భారత్‌లో ఈ రెండు గ్రహణాలు కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం వర్తించదు. దీనివల్ల పండుగ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికైనా ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆలయాల తలుపులు కూడా యథావిధిగా తెరిచే ఉంటాయి. రక్షాబంధన్ పండుగతో పాటు ఇతర పండుగలపై గ్రహణాల వల్ల ఎలాంటి అశుభ ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. హిందూ నమ్మకాల ప్రకారం గ్రహణానికి ముందు వచ్చే అశుభ కాలాన్ని సూతకకాలం అంటారు. చంద్ర గ్రహణానికి 9 గంటలు, సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అయితే భారత్‌లో ఈ గ్రహణాలు దృశ్యమానం కానందున సూతకకాల నియమాలు ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం! -
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్‌లో అమానుష ఘటన) -
రక్షాబంధన్‌లో చిక్కుకున్న ట్రాఫిక్
లక్డీకాపూల్: గ్రేటర్ నగరంలో శనివారం ట్రాఫిక్ రక్షా బంధన్‌లో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి సతమతమైంది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో నగరవాసులతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. రాఖీ పౌర్ణమి రద్దీ కారణంగా ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడగా.. వ్యక్తిగత వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర శివార్లలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారింది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఫలితంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుగా నిలిచి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోయారు. ఊహించని ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు మరీ ముఖ్యంగా రాఖీ కట్టేందుకు బయలుదేరిన మహిళలు అవస్థలకు గురయ్యారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం రూట్ ఇరువైపులా, మియాపూర్ నుంచి లక్డీకాపూల్ రహదారి ఇరువైపుల, కొంపల్లి వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. నగరంలో ఎక్కడ చూసినా బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. ఊహించని పరిణామంతో నగర పోలీసులు సైతం ట్రాఫిక్‌ను చక్కదిద్దే క్రమంలో సతమతమయ్యారు. -
రక్షా బంధన్‌ను ఆర్టీసీ భారీగా సొమ్ము చేసుకుంది
సాక్షి, సిటీబ్యూరో: రక్షా బంధన్‌ను ఆర్టీసీ భారీగా సొమ్ము చేసుకుంది. రాఖీ సందర్భంగా సొంత ఊళ్లకు తరలివెళ్లిన ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడింది. కొంతకాలంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలపైనే బస్సులను నడుపుతున్న ఆర్టీసీ అధికారులు శనివారం రాఖీ సందర్భంగా ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఈ నెల 11వ తేదీ వరకు 50 శాతం అదనపు చార్జీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల పేరిట.. కొంతకాలంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులను సైతం సాధారణ చార్జీలపైనే నడుపుతున్నారు. కానీ శనివారం ఉన్నపళంగా రాఖీ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు 2003 నాటి జీవో 16ను ఆర్టీసీ అధికారులు తెరపైకి తేవడం గమనార్హం. ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవో ప్రకారం ప్రత్యేక బస్సుల డీజిల్, నిర్వహణ ఖర్చుల కోసం టికెట్ ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ చార్జీలను పెంచారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. పైగా రాఖీ సందర్భంగా మహిళలే పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అయినప్పటికీ పురుష ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచినట్లు అధికారులు తెలిపారు. అడ్డగోలు వసూళ్లు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సిటీ బస్సులను కూడా అదనపు చార్జీలతో జిల్లాలకు నడిపారు. మరోవైపు మ్యాక్సీ క్యాబ్‌లు, ప్రైవేట్ కార్లు, ట్యాక్సీలు, టాటాఏస్‌లు, తదితర వాహనాల్లో సైతం ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లోనే చార్జీలు పెంచడంతో ప్రైవేట్ వాహనదారులు మరింత రెచి్చపోయి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు ఆర్టీసీ లగ్జరీ చార్జీ శనివారం రూ.300 నుంచి రూ.450కి పెరిగింది. ప్రైవేట్ వాహనాల్లో ఏకంగా రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేశారు. అన్ని రూట్లలోనూ ఇదే తరహాలో ప్రయాణికులపై దారిదోపిడీ కొనసాగింది. భారీగా కిక్కిరిసి... నగరంలోని జూబ్లీ, మహాత్మా గాం«దీ, దిల్సుఖ్నగర్ బస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడాయి. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, బీఎన్‌రెడ్డినగర్ తదితర ప్రధాన కూడళ్లు సైతం ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులతో నిండిపోయాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. శనివారం మరో 30 వేల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అంచనా. ఆర్టీసీ బస్సుల్లో కాకుండా సొంత వాహనాల్లో, ప్రైవేట్ వాహనాల్లో, రైళ్లలోనూ నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. స్తంభించిన ట్రాఫిక్.. వరుస సెలవుల దృష్ట్యా కూడా ప్రయాణికుల పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ప్రయాణికులు, వాహనాల రద్దీతో రహదారులపైన ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వనస్థలిపురం, హయత్‌నగర్ రూట్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వరంగల్ వైపు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు వెళ్లడానికే కనీసం 3 గంటల సమయం పట్టినట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ మార్గాల్లో శనివారం ఒక్కరోజే సుమారు 10 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లినట్లు అంచనా. సిటీలో బస్సుల్లేవ్.. సిటీ బస్సులను చాలా వరకు జిల్లాలకు తరలించడంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లోనే పడిగాపులు కాశారు. రాఖీ సందర్భంగా నగరంలో ఉన్న తోబుట్టువులు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో క్యాబ్‌లు, ఆటోలు, తదితర వాహనాలను ఆశ్రయించారు. మెట్రో రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రాయదుర్గం, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఉప్పల్ ,నాగోల్ రూట్లో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోలు కిక్కిరిశాయి. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా నమోదైంది. మరోవైపు అనేక చోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
టాలీవుడ్ 'రాఖీ' స్పెషల్.. లేటెస్ట్ ఫొటోలు
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ సోదరులకు రక్ష కట్టారు. టాలీవుడ్‌లోనూ నిహారిక, పూజాహెగ్డే, వైవా హర్ష, విశ్వక్ సేన్, శేఖర్ మాస్టర్, ప్రగ్యా జైస్వాల్, కాజల్ అగర్వాల్, సుధీర్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు రాఖీ పండగని వేడుకగా చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇవిగో View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) View this post on Instagram A post shared by Nuupur Sannon (@nupursanon) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Ibrahim Ali Khan (@iak) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
బంధం..బంధనం ఏదైనా..ఒకరికొకరం.. అంతేగా!
బంధం ఏదైనా... బంధనం ఏదైనా..ఒకరికొకరం నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు, నేను.. మాకు, మీరు, మీకు మేము, ఒకరికొకరం మనమే మనము!చదవడానికే ఇంత బావుంటే, క్రియారూపంలో ఇంకెంత బావుంటుంది?ఈ రోజు రాఖీ పండుగ కాబట్టే కాదు, మొన్న అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, దంపతుల దినోత్సవం, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే.. వగైరా వగైరాలు జరుపుకుంటూనే ఉంటాం కదా!ఇవన్నీ ఎందుకు? ఒక రోజుకే సంబంధించిన అంశాలు కావు ఇవి. ఒక రోజంటూ నిర్ధారించుకుని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆత్మీయతలను కలబోసుకోవడానికి, రాబోయే రోజులను ఆ అనుబంధాలను భద్రపరచుకోవడానికి, వాటి గాఢతను ప్రోది చేసుకోవడానికి వాడుకుంటాము. రాఖీ పండుగ గురించి మైథాలజీ చెప్పే కథ ఏదైనా కావచ్చు, ఈ కాలంలో ప్రతి మనిషి ఒకరికి ఒకరు అనుకోవాలి. అనుబంధాలు పలుచన అయిపోతున్నాయి అని అనుకోవడం కాదు, మనం ఆ అనుబంధాలను కొనసాగించడం, నిలుపుకోవడం తెలుసుకోవాలి. ఒకప్పుడు అక్కాచెల్లెళ్ల బాధ్యత అన్నదమ్ములది అనే వారు. ఆడపిల్లను రక్షించడం, బాధ్యతగా చూసుకోవడం, కష్ట సమయాల్లో ఆదుకోవడం అన్నీ అన్నదమ్ముల బాధ్యత. ఈ పరిస్థితి అప్పటి కాలానిది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో పరిస్థితులు వేరు. నిజానికి మైథాలజీలోని కథను చూసినా, ద్రౌపది ముందు కృష్ణుడి చేతి వెలి గాయానికి తన చీర చించి కట్టు కట్టింది. ఆ ప్రేమ, ఆ అక్కరకు బద్ధుడైన కృష్ణుడు ఆమెకు రక్షగా ఉంటాను అంటాడు. ఇదీ చదవండి: పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?అసలు ఈ కాలంలో ఒకరికి ఒకరు కట్టుకోవాలి రాఖీ. కష్టంలో, సుఖంలో తోబుట్టువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అక్కలు, చెల్లెళ్లు అన్నదమ్ముల బాధ్యత మాత్రమే కాదు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ బాధ్యత కూడా. అందుకే ఒకరికి ఒకరు. భారతదేశంలో ముడి అనేది ఒక కనెక్షన్ కి చిహ్నం. ఆ ముడిలో ఒక అనుబంధానికి ఇష్టబంధనం కాబడతామేమో. మా పెళ్లి సమయంలో మా ఆయన మాత్రమే తాళి ఎందుకు కట్టాలి? నేను కూడా ఆయనకు ఒక తాళి కడతాను అని పేచీ పెట్టాను నేను. నా నేస్తాలు నన్ను బ్రతిమాలి ఆపారు. అప్పుడేమిటి? ఇప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడతానని నన్ను రెబెల్ అంటారు. కానీ నేను అనే దాంట్లో తప్పేముంది?రాఖీ కావచ్చు, ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కావచ్చు, పెళ్లిలో వేసే తాళి కావచ్చు, అన్నీ అనుబంధానికి చిహ్నాలు, ప్రతీకలుగా భావిస్తాము కాబట్టే కదా! ఈ ముడులు లేకపోయినా మానసిక బంధాల విలువ గొప్పది. ఒకరికి ఒకరం చేసుకునే చిన్న చిన్న పనులు గొప్పవి. ఒకరికే బాధ్యత ఆపాదించడం ఈ కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా సరికాదు. నాకు ఇష్టమయినవి, నా అవసరాలు నా చెల్లికి, తమ్ముడికి తెలియాలి. వాళ్ళకు ఇష్టమయినవి, వాళ్ళ అవసరాలు నాకు తెలియాలి. అలాగే భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులూ.. అందరం.. ఒకరికి ఒకరం అన్నట్టే ఉండాలి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పనిప్రపంచంతో పరుగుపందెం వేసే ఈ కాలంలో మనతో పాటు మనవాళ్ళూ ఉండాలి. మనం వాళ్ళతో ఉండాలి. చిన్న చిన్న సంతోషాలను, సందర్భాలను పంచుకోవాలి. ఎవరినీ ఎవరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా సహాయం, సౌభ్రాతృత్వం చేతులు మారి, జీవితాలను చేరాలి. అన్నీ కథలే...ఏ హృదయాన్ని కదిలించినా వ్యధలే...అన్ని సమపాళ్ళలో జీవన రసాలు ఇపుడసలు లేవుఉగాది పచ్చడి రుచులు నిజజీవితాల్లో లేవుఅడగకూడదిక ఎవర్నీ....నువ్వెలా ఉన్నావని!కదిలించకూడదిక ఎవర్నీ....ఏమిటి విశేషాలని!దీన గాథలను చేతుల్లో మొయ్యని ఆత్మలు లేవురెప్పల లోపల ఇసుకను భరించని కళ్ళు లేవు అన్నీ చప్పటి వెలితికి చిహ్నాలే...అన్నీ ఉప్పటి నీటికి బానిసలే...స్పర్శించాలిక అందర్నీ...కాస్త ధైర్యాన్నివ్వడానికి!హత్తుకోవాలిక ఆ చూపుల్ని...వెలుగు ఎంతో దూరం లేదని చెప్పడానికి!మనం ఒకరికి ఒకరం అని నిబద్ధతగా నిలబడడానికి!! - విజయభాను కోటే, ప్రభుత్వ ఉపాధ్యాయిని వైజాగ్ -
చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆత్మీయ అనురాగ బంధానికి ఆనవాళ్లు: రాఖీ సెలబ్రేషన్స్ ఫోటోలు
-
రాఖీ నుంచి దీపావళి వరకు.. పండగలే సినిమా టైటిల్స్ అయితే..!
అన్నయ్య.. అన్నావంటే ఎదురవనా.. ఇది పాట మాత్రమే కాదు నిజం కూడా! అమ్మానాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా ఆడవాళ్లు.. అన్నకు చెప్పుకుంటారు. ఏ కష్టం వచ్చినా అన్న సలహా తీసుకోవాల్సిందే! ఇబ్బందుల్లో ఉంటే అన్నకు ఫోన్ రావాల్సిందే! అతడు క్షణంలో చెల్లెలి ముందు ప్రత్యక్షం కావాల్సిందే! ఈ అనుబంధాన్ని దేనితోనూ వెలకట్టలేము. ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమను లోతుగా చూపిస్తూ కంటతడి పెట్టించే సినిమాలు వెండితెరపై ఎన్నో వచ్చాయి. అక్కడిదాకా ఎందుకు రక్షా బంధన్ పండగపై రాఖీ అనే సినిమా కూడా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. రాఖీయే కాదు, ఇలా ఎన్నో పండగలు సినిమా టైటిల్స్‌గా ఆవిష్కృతమై తెరపై అద్భుతాలు సృష్టించాయి. అవేంటో చూసేద్దాం..సంక్రాంతివెంకటేశ్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. 2005లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.మహాశివరాత్రిరాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహాశివరాత్రి. రేణుకశర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.దసరానాని హీరోగా వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2023లో విడుదలైంది.హోలీఉదయ్కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. 2002లో వచ్చిన ఈ మూవీ జనాల్ని బాగానే ఆకట్టుకుంది.ఉగాదిఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన మూవీ ఉగాది. లైలా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది.నందమూరి కల్యాణ్‌రామ్ విజయదశమి, సునీల్ కృష్ణాష్టమి, కృష్ణ భోగిమంటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురుపౌర్ణమి.. ఇంకా దీపావళిపై రెండు సినిమాలు.. ఇలా బోలెడన్ని వచ్చాయి.చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు -
Happy Rakhi 2025 : సినీతారల రాఖీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఆవుపేడ, ఎర్రమన్ను, చెట్ల గింజలతో వినూత్న రాఖీలు
కాచిగూడ : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమ బంధానికి చిహ్నం రక్షాబంధనం.. దీనినే రాఖీ అని కూడా అంటారు. శ్రావణ పౌర్ణమిన జరుపుకునే ఈ పండుగ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ‘రాఖీ’ కట్టి, పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు.. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటానని చెప్పడమే ఈ పండుగ విశేషం. అయితే గతంలో ఈ పండుగ పూర్తిగా పర్యావరణ హితంగా జరిగేది. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలు, ఇతర చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులతో రాఖీలను తయారు చేసేవారు. రాను రాను ఇది ఆధునిక పోకడల కారణంగా ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారుచేసేవాటిని వినియోగిస్తున్నారు. దీనికి భిన్నంగా పర్యావరణ హితమైన గోమయం, ఎర్రమన్ను, నేత దారం, చెట్ల గింజలతో రాఖీలను అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ గోశాల ఫెడరేషన్ సభ్యులు. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పనిరక్షణ బంధం..పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. పేడలో కూరగాయలు, పూల మొక్కలు, చెట్ల గింజలను చేర్చి తయారు చేస్తాం. పండుగ అనంతరం ఈ రాఖీలను ఇంటి పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇతర ఖాళీ స్థలాల్లో విసిరేస్తే, అవి మొలకెత్తి మానవాళికి ఉపయోగపడతాయి. వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. – మహేష్ కుమార్ అగర్వాల్, తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
పెళ్లి మీద నమ్మకం లేదు.. ఉందిగా మా చెల్లెమ్మ అంటున్న యంగ్ హీరో
సోదరికి ఎప్పటికీ రక్షణగా ఉండాలని సోదరుడు అనుకుంటాడు. సోదరుడు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది సోదరి. హవీష్, నిఖిల అలాంటి అన్నాచెల్లెళ్లే. అయితే... సోదరికి ఎప్పటికీ రక్షణగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పాటు ‘నిన్ను నువ్వు కాపాడుకునేంత ధైర్యం నీలో ఉండాలి... ఎవరి మీదా ఆధారపడకూడదు’ అని కూడా చెబుతుంటారు హవీష్. అలాగే... అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే... వాళ్లను ఏమాత్రం క్షమించరు నిఖిల. ‘నువ్విలా, జీనియస్, రామ్‌లీల’ తదితర చిత్రాల్లో నటించిన హవీష్ ప్రస్తుతం ‘నేను రెడీ’లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు నిఖిలను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. నేడు ‘రాఖీ పండగ’ సందర్భంగా ఈ అన్నాచెల్లెళ్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు. హవీష్: రాఖీ పండగకి ఎక్కడున్నా సరే నిఖిల నన్ను కలిసి, రాఖీ కడుతుంది. నా చేతికి తను రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు క్షేమంగా ఉండాలి. ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటాను’ అని అనుకుంటాను. అయితే రక్షణగా ఉండటం అంటే తనని నా మీద ఆధారపడేలా చేయడం కాదు. లైఫ్‌లో ఏ విషయాన్నయినా హ్యాండిల్ చేసే నేర్పు, ధైర్యం తనకి ఉండాలి. అదే చెల్లితో చెబుతాను.నిఖిల: ‘నీ లైఫ్ లాంగ్ నువ్వు క్షేమంగా ఉండాలి. ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను’ అనుకుంటూ అన్నయ్య చేతికి రాఖీ కడుతుంటాను. ‘డిపెండ్ కావొద్దు’ అని అంటుంటాడు. కానీ ఏ క్షణంలో అయినా నీకు నేను తోడుగా ఉంటాననే భరోసాను అన్నయ్య ఇస్తాడు. (ఒకే ఒక్క టిప్‌తో స్లిమ్‌గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం)హవీష్: నా చెల్లెలు అనే కాదు... ఏ అమ్మాయికి అయినా నేను ఒకటే చెబుతాను. మీరు అనుకున్నది సాధించడానికి రాజీపడొద్దు. ‘అమ్మాయి కదా ఏం చేస్తుందిలే... అమ్మాయిలు ఇలాంటి ఉద్యోగానికి పనికి రారు’ అని సొసైటీలో ఓ అభిప్రాయం ఉంది. అయితే అమ్మాయిలు ఎంత పెద్ద బాధ్యత అయినా సమర్థవంతంగా స్వీకరించగలరు. నిఖిల: అన్నయ్య చెప్పిన ఈ మాటతో నేను ఏకీ భవిస్తున్నాను. ‘నేను సంపాదించుకుంటేనే’ అనే పరిస్థితి నాకు లేదు. అయినప్పటికీ నా అవసరాల కోసం నేను సం΄ాదించుకుంటే ఆ తృప్తి, ధైర్యం వేరు. ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు హవీష్: యాక్చువల్లీ చెల్లి బిజినెస్ ఫీల్డ్‌లో ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తుంటుంది. సినిమా ప్రొడక్షన్ డిఫరెంట్ అయినప్పటికీ నేను హీరోగా నటిస్తున్న ‘నేను రెడీ’ సినిమాని ప్రొడ్యూస్ చేయమన్నాను. రెండే రోజుల్లో గ్రిప్ తెచ్చేసుకుని పర్ఫెక్ట్గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది.నిఖిల: ప్రొడ్యూసర్‌గా ‘నేను రెడీ’ నా ఫస్ట్ మూవీ. ప్రొడక్షన్ చూసుకోమని అన్నయ్యే ఎంకరేజ్ చేశాడు. హీరోగా నటిస్తూ ప్రొడక్షన్ కూడా చూసుకుంటే యాక్టింగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టలేనని తనకి అనిపించింది. దాంతో నన్ను అడిగాడు... వెంటనే ఓకే అన్నాను.హవీష్: నా చిన్నప్పుడు నన్నెవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే... నాక్కూడా చెప్పకుండా వెళ్లి వార్నింగ్ ఇచ్చి, ఆ తర్వాత నాకు చెప్పేది. కానీ మా ఇద్దరికీ ఒకే ఒక్క విషయంలో పడేది కాదు. ఎప్పుడూ తను స్కూల్‌కి లేటే. తనవల్ల నేనూ గేటు బయట నిలబడాల్సి వచ్చేది. కోపం పట్టలేక కొట్టేవాణ్ణి (నవ్వుతూ).నిఖిల: చిన్నప్పుడు ఆ ఒక్క విషయంలో తప్ప మాకు వేరే గొడవలేం ఉండేవి కావు. ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ విషయంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి (నవ్వుతూ). డైరెక్టర్ త్రినాథరావుగారికి నేను కొంచెం ఉత్సాహంగా ఏదైనా చెప్పబోతే అన్నయ్యకి నచ్చదు. డైరెక్టర్ ఏది చెబితే అది చేయాలన్నది తన మైండ్‌సైట్.హవీష్: నా చెల్లెలు నా సినిమాని నిర్మించడం ఈ రాఖీకి తను నాకు ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్.నిఖిల: ‘నేను రెడీ’ని ‘ది బెస్ట్’ సినిమాగా చేసి, అన్నయ్యకి గిఫ్ట్ ఇస్తాను.నా పెళ్లిప్లాన్ అంతా తనదే : నాది లవ్ మ్యారేజ్. నా భర్త తెలుగు అయినప్పటికీ తమిళనాడులో పుట్టి, అక్కడే పెరిగారు. మా పేరెంట్స్ ఓకే అన్నారు కానీ, తెలుగు తెలియని వ్యక్తితో ఎలా మాట్లాడాలి? అంటూ అన్నయ్య పెద్దగా ఇష్టపడలేదు. అయితే నా ఇష్టాన్ని కాదనలేదు. పెళ్లికి ఏ థీమ్ అయితే బాగుంటుంది? ఎలాంటి వేదిక ఏర్పాటు చేయించాలి? ఫుడ్ మెనూ ఎలా ఉంటే బాగుంటుంది... ఇలా ప్రతిదీ దగ్గరుండి బాగా ప్లాన్ చేసి, ఓ తండ్రిలా నిలబడి చేశాడు. నా చిన్నప్పట్నుంచి మా అన్నయ్య నాకు ‘ఫాదర్ ఫిగర్’లా ఉన్నాడు.- నిఖిలనాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు : నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. మ్యారేజ్ అంటే పెద్దగా నమ్మకం లేదు. మరి... భవిష్యత్‌లో నిన్నెవరు చూసుకుంటారు? అని ఎవరైనా అడిగితే ‘మా చెల్లి’ అని చెబుతాను. ఇప్పుడు నా పేరెంట్స్‌తో ఉంటున్నాను. ఫ్యూచర్లో నా చెల్లెలే నాకు మదర్ - హవీష్అవును... చూసుకుంటాను. అయితే పెళ్లి చేసుకోమని తనని ఒత్తిడి చేయను. నా చిన్నప్పట్నుంచి నన్ను తండ్రిలా చూసుకుంటున్నాడు. భవిష్యత్‌లో నేను తనని తల్లిలా చూసుకుంటాను -నిఖిల-డీజీ భవాని -
ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము రాఖీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నేడు(శనివారం) దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కడుతూ, తీపి తినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. सभी देशवासियों को रक्षाबंधन की अनेकानेक शुभकामनाएं।Best wishes on the special occasion of Raksha Bandhan.— Narendra Modi (@narendramodi) August 9, 2025రాష్ట్రపతి ముర్ము తన ‘ఎక్స్’ట్వీట్లో.. రక్షా బంధన్ శుభ సందర్భంగా, భారతదేశంతోపాటు విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ‘రక్షా బంధన్ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు’ అని రాశారు. President Murmu extends greetings on Raksha Bandhan, hails it as a symbol of sibling bond and heritageRead @ANI story | https://t.co/Oeb9qKhST8#President #DroupadiMurmu #RakshaBandhan pic.twitter.com/JKdmMt5uAq— ANI Digital (@ani_digital) August 9, 2025 -
Raksha Bandhan: చనిపోయిన చెల్లి స్వయంగా తన చేతితో రాఖీ కడితే..
ఈరోజు రక్షా బంధన్.. అక్కాచెల్లెళ్లు తమ అనుబంధానికి గుర్తుగా అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. కొందరైతే ఈరోజున తమను వీడివెళ్లిన అన్నదమ్ములను అక్కాచెల్లెళ్లను గుర్తు చేసుకుంటారు. వారు తమతోపాటు ఉండి, తమకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటారు. అయితే ఇటువంటి కల ‘శివమ్’ విషయంలో సాకారమయ్యింది. అతని గురించి తెలిసినవారంతా శివమ్‌ను మించిన అదృష్టవంతుడు లేడంటూ కొనియాడుతున్నారు.గుజరాత్‌లోని వడోదరకు చెందిన 19 ఏళ్ల శివమ్ సోదరి రియా బాబీ మిస్త్రీ(9) 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అయితే ఆమె చేతిని అవయవమార్పిడి చికిత్స ద్వారా ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్(14)కు అతికించారు. ఈ చిన్నారి విద్యుత్ షాక్ కారణంగా తన కుడిచేతిని కోల్పోయినది. అయితే శుక్రవారం శివమ్, అనమ్తా అహ్మద్ కుటుంబాలు భావోద్వేగంతో కూడిన రాఖీ సంబరాలు చేసుకున్నాయి. చనిపోయిన చిట్టి చెల్లి వడోదరకు వచ్చి శివమ్‌కు రాఖీ కట్టింది.2022లో విద్యుత్ షాక్ కారణంగా తన కుడి చేయిని కోల్పోయిన ముంబైకి చెందిన అనమ్తా అహ్మద్ అవయవ మార్పిడి ద్వారా తిరిగి చేతిని పొందగలిగింది. అమెకు వడోదరకు చెందిన తొమ్మిదేళ్ల రియా బాబీ మిస్త్రీ చేతిని అతికించారు. రియా మెదడులో అకస్మాత్తుగా రక్తస్రావం కావడంతో వైద్యులు ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. రాఖీ కట్టేందుకు తమ ఇంటికి వచ్చిన అనమ్తా అహ్మద్‌ను చూసిన శివమ్ పొంగిపోయాడు. మృతిచెందిన తన సోదరే తిరిగి తన దగ్గరకు వచ్చి రాఖీ కట్టిందని శివమ్ సంబరపడుతూ తెలిపాడు. -
రక్షాబంధన్ 2025: సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్‌లు
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు మొదలయ్యాయి. సోదరులు.. సోదరీమణులు రక్షా బంధన్ జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, సైబర్ నేరస్థులు కూడా కొత్త మోసాలకు తెరలేపారు. సాంప్రదాయ విక్రేతలకు బదులుగా ఆన్లైన్లో రాఖీలు, బహుమతులు, స్వీట్లు ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, సైబర్ నేరస్థులు దీనిని అదనుగా తీసుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ క్లౌడ్‌సెక్ (CloudSEK) చెబుతోంది.ఫిషింగ్ సందేశాలు: స్కామర్లు ఇన్బాక్స్లు, వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ల ద్వారా.. రాఖీ గిఫ్ట్ డెలివరీలు లేదా ఎక్స్‌క్లూజివ్ సేల్ కూపన్ల పేరుతో మెసేజస్ పంపవచ్చు. ఇలాంటి సందేశాలను క్లిక్ చేసినప్పుడు వచ్చే లింక్స్ ఫిల్ చేయడం, లేదా ఇతర చెల్లింపు వివరాలను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది.ఫేక్ ఈ-కామర్స్ వెబ్సైట్లు: సైబర్ నేరస్థులు చట్టబద్ధమైన ప్లాట్‌ఫారమ్‌లను అనుకరించే మోసపూరిత వెబ్సైట్లను సృష్టిస్తారు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.సోషల్ మీడియా స్కామ్: స్కామర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ రాఖీ యాడ్స్ కూడా ప్రచారం చేయవచ్చు. ప్లాట్‌ఫామ్ చట్టబద్ధమైనదని భావించి, వినియోగదారుడు ఆర్థిక వివరాలను పంచుకుంటే మీ చెబుకు చిల్లు గ్యారెంటీ.యూపీఐ & గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లు: రాఖీ గిఫ్ట్ క్లెయిమ్‌ల మాదిరిగానే నకిలీ యూపీఐ అభ్యర్థనలు లేదా క్యూఆర్ కోడ్లు మీ మొబైల్ ఫోనుకు వస్తే.. వాటిపట్ల కొంత జాగ్రత్త వహించాలి.స్కామ్‌ల నుంచి బయటపడే మార్గాలు➤రాఖీలు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ వంటివి ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటే.. వినియోగదారుడు తప్పకుండా అధికారిక వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయాలి. నకిలీ వెబ్సైట్లు ఆఫర్స్ ఎరవేసి మిమ్మల్ని ఆకర్శించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి.➤ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు ఫిషింగ్ సైట్లు లేదా మాల్వేర్ డౌన్లోడ్లు జరిగే అవకాశం ఉంది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు.➤ఫేక్ సైట్లను గుర్తించాలి. నకిలీ సైట్లు దాదాపు అధికారిక సైట్ల మాదిరిగా కనిపించేలా స్కామర్లు పన్నాగాలు పన్నుతారు. అయితే కొన్ని చిన్న మార్పులు గమనించాలి. వెబ్సైట్ URLలలో తేడాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.రాఖీ పండుగ సంతోషంగా జరుపుకునే సమయం. అయితే స్కామర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఆదమరిస్తే మోసపోవడం మీ వంతు అవుతుంది. కాబట్టి స్కామర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా రక్షించాలి. -
ఆర్మీ అన్నలకు ‘రాఖీ’ సెల్యూట్!
కళ్ల ఎదుటే ఉన్న అన్నకు చెల్లెలెలాగూ రాఖీ కడుతుంది. ‘అండగా ఉండన్నా’ అంటూ అన్నదమ్ముల్ని అడుగుతుంది. కానీ... కొందరు అన్నలు అక్కడెక్కడో సుదూర మంచు పర్వత సానువుల్లోనో, ఎగిరిపడే రేణువుల ఎర్రటెడారి ఇసుకల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటారు. అప్రమత్తంగా ఉంటూ అనునిత్యం మన సరిహద్దులకు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్లకు ఏ చెల్లెమ్మలూ కనబడరు. ఏ అక్కలకూ వాళ్లందుబాటులో ఉండరు. అయితే... సొంత అన్నదమ్ములైనా అవసరమైనప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారో రారోగానీ ఆ సోదరులు మాత్రం ఎవరు రాఖీ కట్టినా కట్టకున్నా... శత్రువుల నుంచి నిర్భీతిగా నిత్యరక్షణకవచంలా నిరంతరమూ మనకడ్డుగా నిలబడిపోతుంటారు. వాళ్లే మన సరిహద్దులను అనుక్షణం రక్షిస్తుండే మన ఆర్మీ జవాన్లు! ఆ ఆర్మీ అన్నలకు చెల్లెళ్ల ప్రేమానురాగాలు తప్పక దక్కాలనే సంకల్పంతో కొందరు చెల్లెళ్లు గత 28 ఏళ్లుగా ప్రయాసపడుతునే ఉన్నారు. వాళ్లు పడే ఈ ప్రయాస ప్రాధాన్యమేమింటే... వాళ్లకు అత్యంత ఆనందాన్నిచ్చే ఓ అందమైన శ్రమ. ఆ చెల్లెళ్లు మరెవరో కాదు... మహారాష్ట్ర జలగావ్‌లోని ‘ఇందిరాగాంధీ సెకండరీ స్కూల్’కు చెందిన విద్యార్థినులు.ఒకటీ రెండేళ్లుగా కాదు... అసిధారావ్రతంలా అచ్చంగా గత ఇరవయ్యెనిమిదేళ్లుగా సైనిక సోదరులకిలా రాఖీలు పంపుతున్నారు. వాటిని ఆ విద్యార్థినులు ఇంకెవరినుంచో తీసుకోరు. మరెక్కణ్నుంచో కొనరు. స్వయంగా తమ చేతులతో ప్రేమగా తయారు చేస్తారు. ఇందుకు కావాల్సిన ముడిసరుకులనూ తమ పాకెట్ మనీతోనే కొంటారు. ఇలా ప్రతి ఏడాదీ వాళ్లు కనీసం 28,000 లకు తగ్గకుండా రాఖీలు తయారు చేసి పంపుతూ రక్షాబంధన్ పండుగ వేడుకలకు నిజమైన సంప్రదాయాన్నీ, స్ఫూర్తినీ అద్దుతున్నారు.వంద నుంచి వేలాది రూపాయల వరకు... ఓ చెల్లి తన అన్నకు రాఖీ కట్టాక ఉద్వేగాలను అదుపులో ఉంచుతూ ఆ అన్న తనకున్నంతలో తన చెల్లెలికిచ్చే బహుమతులు వంద రూపాయల నుంచి వేలలో ఉంటాయి. ఉదాహరణకు వంద రూపాయలలోపు వచ్చే రిబ్బన్ర్యాప్లో కట్టిన చాక్లెట్ బాక్స్నో, రెండొందల్లో వచ్చే ఆమె పేరులోని మొదటక్షరమో, ఆమె రాశీచక్రపు గుర్తుతో దొరికే కీచైనో, వెయ్యి రూపాయల విలువైన వన్ గ్రామ్ గోల్డ్ గొలుసో, రెండువేల విలువైన డ్రస్సూ– దుపట్టానో, పదివేల విలువ చేసే పెండెంటో లేదా లక్షల విలువ చేసే నిజం బంగారమో ఏదో ఒకటి రిటన్ గిఫ్టుగా ఇచ్చేందుకు ఇప్పుడు మార్కెట్లో రెడీలీ అవైలబుల్ గిఫ్ట్‌లు ఎన్నో ఉన్నాయి.మరి ఆ ఆర్మీ అన్నయ్యలేమిస్తారో... ఎర్రటెండల్లో వాచీతో పాటు రాఖీని చూసినపుడు తగిలే చల్లగాలి తెమ్మెరలాంటి హర్షోల్లాసపు ఆహ్లాదభావన ఆ చెల్లెలు అందించే గిఫ్ట్ అయితే... గస్తీ పనిలో భాగంగా పర్వతసానువులపైన పైపైకిపాకేవేళల... మణికట్టుపై కట్టి ఉన్న ఆ రాఖీని చూసినప్పుడు... ఆ తెలిమంచు తెరలపై తన చెల్లెలి ముఖం కనిపిస్తే కంటికి అడ్డుపడే ఆ కన్నీటితెరతోపాటు సంతోషాలు ఉబికి వస్తుండటమే ఆ అన్నయ్యిచ్చే అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్. దేశరక్షణతో పాటు మనకు అది అదనం. – యాసీన్ -
‘పీఎం–ఉజ్వల’కు రూ.12వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షాబంధన్ వేడుకల వేళ దేశ మహిళలకు కేంద్రం శుభవార్త తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు చేయూత నిచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ.12,060 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్న 10.33 కోట్ల గృహ వినియోగదారులకు మేలు చేకూర్చనుంది. ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 9 రీఫిల్‌ల వరకు 14.2 కిలోల సిలిండర్‌కు రూ.300 వరకు రాయితీ ఇస్తుంది. ఉజ్వల వినియోగదారుల సగటు తలసరి వినియోగం 2019–20లో కేవలం 3 రీఫిల్స్, 2022–23లో 3.68 రీఫిల్స్‌గా ఉండగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి 4.47కి చేరింది. 2016లో ప్రారంభమైన ఈ పథకం కింద 2024–25 వరకు రూ.52 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందన్నారు. ఎల్పీజీ ధరల స్థిరీకరణకుగాను చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.30వేల కోట్ల ప్రధాన సబ్సిడీ ప్యాకేజీని కూడా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. మన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం వరకు దిగుమతులే తీరుస్తున్నాయన్నారు. దీంతోపాటు, 175 ఇంజనీరింగ్ సంస్థలు, 100 పాలిటెక్నిక్‌లతో కూడిన 275 సాంకేతిక సంస్థల్లో ’మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్’(ఎంఈఆర్ఐటీఈ) పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనపై సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం, పాలనను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. 2025–26 నుంచి 2029–30 వరకు మొత్తం రూ.4,200 కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనుండగా, ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం రూ.2100 కోట్లని కేంద్ర మంత్రి తెలిపారు. వీటితో పాటే అస్సాం, త్రిపురల్లో అమల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల పథకం (ఎస్డీపీ) కింద రూ.4,250 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ వివరించారు.వీటితోపాటు కేంద్ర కేబినెట్ తమిళనాడులోని మరక్కణమ్– పుదుచ్చేరిని కలిపే నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2,157 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
ఈసారి మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్
రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. -
పర్వాల పూర్ణిమ..రాఖీ పౌర్ణమి పరమార్థం ఇదే!
దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్షగా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. రక్షాబంధన పండుగ పరమార్థం ఏమిటి?తన సోదరుని జీవితం తీపివలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే–ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ పరమార్థం. ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది. ఈ రోజునే హయగ్రీవ జయంతి ‘‘జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’’ అంటూ సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్ర వచనం -
రక్షా బంధన్.. పోషణ బంధం
ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అంటూ పోషణ బంధం రాఖీ.. వ్యసనాలకు లోనుకాకు, మత్తువదులూ అంటూ సోదరబంధం రాఖీలతో కొత్త రాఖీలకు శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ. పోషకాహారం, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో సరికొత్త మార్గంలో రాఖీ వేడుకలకు సన్నద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ (poshan abhiyaan) పథకంలో భాగంగా చిన్నారులకు పోషణ బంధం రాఖీల పంపిణీ.. ప్రభుత్వ కళాశాలల్లోని యువతకు మిషన్ పరివర్తన నషాముక్త్భారత్ అభియాన్ పథకంలో భాగంగా సోదరబంధం రాఖీలు పంపిణీ చేసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించనుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ వీటికి సోదరబంధం, పోషణ బంధం రాఖీలుగా నామకరణం చేసి ఈ ఏడాది ప్రతీ అంగన్వాడీ బడిలోనూ, కళాశాలల్లోనూ రాఖీ వేడుకలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే! -
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్‌లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
క్రికెటర్ల హ్యాపీ రక్షాబంధన్.. ఫొటోలు
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి రక్షా బంధనం
-
అక్కలో అమ్మను చూసుకుంటా: బాలీవుడ్ నటి
అక్క నాకు మరో అమ్మలాంటిది అంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి నేహా గుప్తాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇషా మాట్లాడుతూ.. అక్క ఎప్పుడూ సమయపాలన పాటించదు. కానీ తను చాలా మంచి వ్యక్తి. తనలో నేను మరో అమ్మను చూసుకుంటాను. అలా నాకు ఇద్దరు తల్లులు.బ్లాక్మెయిల్ చేసేదాన్నిమేము ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. ఎప్పుడూ పోట్లాడుకోం. నేను కాస్త రౌడీయిజం చేసినా తను మాత్రం ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు తను ప్రోగ్రెస్ కార్డులు దాచిపెట్టుకుంటే నేను వాటిని తీసి అమ్మానాన్నకు చూపించేదాన్ని. లేదంటే ఎక్కడున్నాయో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేదాన్ని అని పేర్కొంది.సహించలేనునేహా మాట్లాడుతూ.. నాకు మా చెల్లి అంటే ఎంత ఇష్టమంటే.. తను నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అస్సలు సహించలేను. తన ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నా సరే నా కాల్ లిఫ్ట్ చేయాలంతే! తన గురించి ప్రతీది నాకు తెలియాలనుకుంటాను. ప్రతి ఏడాది ఒకరికి ఒకరం రాఖీ కట్టుకుంటాం. పెద్దదాన్ని కాబట్టి గిఫ్టులు మాత్రం నేనే ఇస్తుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
ప్రేమకు ప్రతిరూపం రక్షాబంధన్.. విశిష్టత ఇదే
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
Madhya Pradesh: ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. -
రాఖీ వేళ.. కవితపై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, సాక్షి: రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఎక్స్ ఖాతాలో ఉంచారు. ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి. అయినప్పటికీ.. ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ ట్వీట్ చేశారాయన. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్నారు. You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc— KTR (@KTRBRS) August 19, 2024 -
మహాకాళేశ్వరునికి రక్షాబంధనం... అలరిస్తున్న వీడియో
దేశవ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నేటి(సోమవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను ఈరోజు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆలయ పురోహితులు పండిట్ ఆశిష్ పూజారి, పండిట్ వికాస్ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. #WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के 5वें सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/SSjHKAk6eR— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!
దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్‌కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. -
రక్షాబంధన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. President Droupadi Murmu extends Raksha Bandhan greetingsRead @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024 -
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!
అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్లు ఎంతో ప్రేమగా సెలబ్రేట్ చేసుకునే పండుగ రాఖీ. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఈ పండగ నాడు సోదరీ సోదరమణులు తమ తోడబుట్టిన వాళ్లని కలుసుకుని రాఖీ కట్టుకుని రోజంతా హాయిగా ఉంటారు. ఇలాంటి టైంలో అక్కడికో ఇక్కడికో వెళ్లే బదులు ఇంట్లోనే కూర్చుని ఓ మంచి సినిమా చూసుకోవచ్చు. అలా అన్నచెల్లి అనే బంధాన్ని గుర్తుచేసేలా తెలుగులో బోలెడన్ని సినిమాలు వాటిలో 15 సినిమాలు మాత్రం స్పెషల్.(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..)ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా తెలుగులోనే రాఖీ, హిట్లర్, గోరింటాకు.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా యూట్యూబ్‌లోనే అందుబాటులో ఉండటం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.చిరంజీవి 'హిట్లర్'అర్జున్ 'పుట్టింటికి రా చెల్లి'బాలకృష్ణ 'ముద్దుల మావయ్య'మహేశ్ బాబు 'అర్జున్'జూ.ఎన్టీఆర్ 'రాఖీ'పవన్ కల్యాణ్ 'అన్నవరం'రాజశేఖర్ 'గోరింటాకు'ఎన్టీఆర్ 'రక్త సంబంధం'శోభన్ బాబు 'జీవన రాగం''చెల్లెలి కాపురం'వెంకటేశ్ 'గణేష్'అక్కినేని నాగేశ్వరరావు 'బంగారు గాజులు'జగపతిబాబు 'శివరామరాజు'కృష్ణ 'సంప్రదాయం'కృష్ణం రాజు 'పల్నాటి పౌరుషం'(ఇదీ చదవండి: ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి) -
ఈసారి రాఖీ వ్యాపారం రూ. 12,000 కోట్లు!
ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ సుమారు రూ. 12,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. చైనాలో తయారైన రాఖీలతో పోలిస్తే దేశీయ రాఖీలకు డిమాండ్ గణనీయంగా పెరగడం వ్యాపార వృద్ధికి ముఖ్యమైన కారణం.రాఖీలకు పెరిగిన డిమాండ్‌తో గతేడాది జరిగిన రూ.10,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఈసారి పండుగ వ్యాపారం రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అంటే గతేడాది కంటే 20 శాతం పెరుగుతుందన్న మాట. రాఖీల వ్యాపారం 2022లో రూ.7,000 కోట్లు కాగా, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ.3,000 కోట్లు.ఇప్పుడు దేశంలోని నగరాల్లో వివిధ కళారూపాలను సూచించే స్థానికంగా తయారు చేసిన రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాగ్‌పూర్‌లో తయారైన ఖాదీ రాఖీలు , జైపూర్‌కు చెందిన సంగనేరి ఆర్ట్ రాఖీ, పుణె నుంచి విత్తన రాఖీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా నుంచి ఉన్ని రాఖీ, గిరిజన వస్తువులతో చేసిన వెదురు రాఖీ, అస్సాంలో తయారు చేసిన టీ ఆకు రాఖీలు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సీఏఐటీ అంచనా వేసింది. -
రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..
'అమ్మలో ఉండే సగం అక్షరం నేనే.. నాన్నలో ఉండే సగం లక్షణం నేనే.. అమ్మతోడు.. నాన్న తోడు.. అన్ని నీకు అన్నే చూడు..' పాటలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ ఎంతోమంది అన్నలు చెల్లెళ్లకు తోడుగా, రక్షగా నిలబడతారు. జీవితాంతం అండగా ఉంటామని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.అల్లంత దూరంలో ఉన్నా సరే అన్న/ తమ్ముడికి రాఖీ కట్టాలని పరుగెత్తుకుంటూ పుట్టింటి దగ్గర వాలిపోతారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమను చాటిచెప్పే పాటలు ఎన్నో ఉన్నాయి. రేపు (ఆగస్టు 19న) రాఖీ పండగ దినాన ఇలాంటి సాంగ్స్ ఎన్నో స్టేటస్‌లో మార్మోగనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..అన్నయ్య అన్నావంటే.. ఎదురవనా... (అన్నవరం సినిమా) అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం.. (గోరింటాకు) మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి.. మన్మధుని రాఘవుని కలబోతే బావ.. (లక్ష్మీనరసింహ సినిమా)చామంతి..పూబంతి.. చిన్నారి నా సిరిమల్లి.. (పుట్టింటికి రా చెల్లి సినిమా) సిరిసిరి మువ్వలూ.. ఆ విరిసిన పువ్వులూ.. చిరుచిరు ఆశలూ.. (గణేశ్ సినిమా)అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప.. బజ్జోరా బుజ్జాయి కథలెన్నో.. (చిట్టిచెల్లెలు మూవీ)నా చెల్లి చంద్రమ్మ.. (ఊరుమనదిరా మూవీ) అన్నయ్య నువ్వు పిలిస్తే.. చెల్లిగా జన్మనెత్తాను.. (బ్రో మూవీ) చందురిని మించు అందమొలికించు ముద్దు పాపాయి.. (రక్తసంబంధం మూవీ) -
ఆ గ్రామంలో రెండు రోజుల పాటు రక్షాబంధన్
దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్‌ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్‌ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు. -
బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని
బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాను.రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటాఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.అమ్మ గైడెన్స్‌తో పండగ చేసుకుంటాంఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతాఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.నన్ను సర్ప్రైజ్ చేస్తే ఇష్టంఅన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసంబ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్‌ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది. – డి.జి. భవాని -
Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే..
అనుబంధాలను పంచుకునే పండుగ రక్షా బంధన్. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారు. ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 19న వచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఛోటా భీమ్, హల్క్, డోరేమాన్, సూపర్మాన్, షించెన్, మోటు-పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలను తీసుకువస్తుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీకి అమితమైన డిమాండ్ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో రూ.10 నుంచి రూ.50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిగా విక్రయమవుతున్నాయన్నారు. -
ఆవు పేడతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా మెహతా రూపొందిస్తున్న రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆవు పేడలో వివిధ రకాల పప్పుదినులు కలిపి ఆమె అందమైన రాఖీలను తయారు చేస్తోంది. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ రాఖీలను రూపొందిస్తున్న పూజా వీటిని విక్రయిస్తూ, స్వయం ఉపాధి కూడా పొందుతోంది. తన మాదిరిగానే ఎవరైనా సరే ఇటువంటి రాఖీలను తయారు చేసి ఉపాధి పొందవచ్చని ఆమె చెబుతోంది. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని పూజ తెలిపింది.బస్‌గావ్ గ్రామ నివాసి పూజా మీడియాతో మాట్లాడుతూ తాను తయారు చేస్తున్న రాఖీలు దేశంలోని ప్రతి ప్రాంతానికి పంపిస్తానని తెలిపారు. ఢిల్లీ, గుజరాత్, ముంబైల నుంచి తనకు చాలా ఆర్డర్టు వస్తున్నాయని పూజా పేర్కొన్నారు. తాను ఈ రాఖీలను రూ. 40కు విక్రయిస్తున్నానని తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ రాఖీలను విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఈ ప్రత్యేకమైన రాఖీలను రూపొందించేందుకు ఆవు పేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినులు ఉపయోగిస్తానని తెలిపారు. దీంతో పాటు ఆవాలు, నువ్వులు, బంతిపూలు మొదలైనవాటిని కూడా వినియోగిస్తానని తెలిపారు. -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణంలో..
గోపాలపట్నం : రక్షాబంధన్ మా బంధాన్ని తెంచే స్తుందని ఊహించ లేదు. రాఖీ కట్టేందు కు రాకపోయి ఉంటే నా అన్న బతికేవాడు అని ఆ చెల్లెలు ఆవేదన అందర్నీ కలచివేసింది. గురువారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎన్ఏడీ ఫ్లై వోవర్‌పై ట్రాలర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన కొంచాడ గోవిందరావు (27) (అలియాస్ గోపి) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అగనంపూడిలో నివాసముంటున్న చెల్లి పద్మ ఇంటికి సాయంత్రం ద్విచక్రవాహనంపై గోవిందరావు వెళ్లాడు. రాఖీ కట్టి, చెల్లిని ఆశీర్వదించి తిరుగుపయనమయ్యాడు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి స్టీల్‌ప్లాంట్ నుంచి ఇరన్ లోడుతో వెళుతున్న ట్రాలర్ లారీ మురళీ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వెనుక చక్రాల కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితమే విశాఖకు.. : నిమ్మాడ నుంచి రెండు నెలల క్రితమే మురళీ విశాఖ వచ్చాడు. నగరంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా చేరాడు. మురళీనగర్‌లో తన స్నేహితుడు ఇంట్లో ఉంటున్నాడు. మృతునికి తల్లి, తండ్రి, సోదరి ఉన్నారు. తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు సీఐ బీఎండీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
విషాదాల్లోనూ వీడని రాఖీ బంధం
తిమ్మాపూర్, ముస్తాబాద్(సిరిసిల్ల), నర్సాపూర్ రూరల్: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్ (43)ను రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు. చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ.. ‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
రాఖీ కట్టేందుకే విక్రమ్‌ని పంపించాం! ఏం గిప్ట్ ఇస్తున్నావ్ మామా!
చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు. అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా! ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం. సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు. ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు. (చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!) -
రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు
క్రైమ్: ‘‘ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఒక సోదరుడు తన సోదరిని తన చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేసే పర్వదినం ఇది. అలాంటి పండుగనాడు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం. కానీ, ఈ కేసులో నిందితుడు దుర్మార్గుడు. అందుకే ఇలాంటి శిక్ష విధిస్తున్నా’’ అంటూ జస్టిస్ ఎస్ సాహూ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన కేసులో.. అంతే సంచలన తీర్పు వెల్లడించింది. తన చెల్లిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందేనని తెలిపింది. ట్రయల్ కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూనే.. మరో రెండేళ్ల పాటు శిక్షను పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి సాహూ. మల్కన్‌గిరికి చెందిన నిందితుడు.. 2018-19 మధ్య తల్లిని చంపేస్తానని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. తల్లికి విషయం తెలిసి స్థానిక అధికారుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కొడుకుపైనే న్యాయపోరాటానికి దిగింది. స్థానిక నేతల అండతో కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు నిందితుడు. అయితే.. చివరకు న్యాయమే నెగ్గింది. ఈ కేసుకు సంబంధించి మల్కన్‌గిరి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లగా.. ఇలాంటి మృగానికి శిక్ష సరైందేనని జడ్జి చెబుతూ అదనంగా మరో రెండేళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. -
సెలబ్రిటీల ఇంట రాఖీ పండగ సెలబ్రేషన్స్
అన్న అంటే కొండంత అండ.. తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమను పంచేది, అన్ని బాధ్యతలు చూసుకునేది అన్న మాత్రమే.. ఆ మాటకొస్తే కష్టసుఖాలను ముందుగా పంచుకునేది, తొలి మిత్రువు కూడా సోదరుడే అవుతాడు. మరి అన్నకు చెల్లి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?.. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుక్షణం అన్నా అంటూ వచ్చే చెల్లి ప్రేమకు అన్న బదులుగా ఏమివ్వగలడు? అందుకే ఈ రాఖీ పండగ.. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేదే రక్షా బంధన్. సెలబ్రిటీలు సైతం రాఖీ పండగ రోజు తమ సోదరులకు రాఖీ కట్టి పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరెవరు రాఖీ పండగ జరుపుకున్నారో కింద చూసేయండి.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
Raksha Bandhan 2023: సోదరుడికి ప్రేమతో...
అన్న గుండె ఆగిపోయిన క్షణాన చెల్లెలి గుండె ఆగిపోతుంది... అందుకే వెండితెరపై అన్నాచెల్లెలి అనుబంధం అనగానే వీరి ‘రక్త సంబంధం’ గుర్తుకు వస్తుంది. ఇంకా తెలుగు తెరపై అన్నా చెల్లెళ్ల అనుబంధంతో చాలా సినిమాలు వచ్చాయి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ రాఖీ పండగ సందర్భంగా ఓ పది సినిమాల గురించి చెప్పుకుందాం.. రక్త సంబంధం (1962) ఎన్టీఆర్–సావిత్రి.. తెలుగు చిత్ర పరిశ్రమలో జంటగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ‘హిట్ పెయిర్’. అలాంటి హిట్ జోడీని అన్నా–చెల్లెలిగా చూపించే సాహసం చేసి, ‘రక్త సంబంధం’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వి. మధుసూదనరావు. ఈ అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, సావిత్రి, దేవిక, సూర్యకాంతం ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రక్త సంబంధం’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాస మలర్’ సినిమాకి రీమేక్‌గా ‘రక్త సంబంధం’ రూ΄పొందింది. హీరో–హీరోయిన్లుగా అలరించిన ఎన్టీఆర్–సావిత్రిలు ‘రక్త సంబంధం’లో అన్నా, చెల్లెలు పాత్రల్లో జీవించారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజు (ఎన్టీఆర్), రాధ (సావిత్రి) ఒకేసారి ్రపాణాలు వదలడం ప్రేక్షకుల చేత కన్నీళ్లు తెప్పిస్తుంది. మరణం కూడా విడదీయలేనంత అనుబంధం రాజు–రాధలది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధం అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది ‘రక్త సంబంధం’ చిత్రమే. బంగారు గాజులు (1968) రాము (నాగేశ్వరరావు), రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు. చెల్లెలి చేతికి బంగారు గాజులు తొడగాలని రాము ఆశ పడతాడు. ఇందుకోసం డబ్బు కూడబెడుతుంటాడు. ఓ రైస్ మిల్లులో రాము డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అయితే ఆ రైస్ మిల్లు యజమాని రావూజీ కన్ను రాధపై పడుతుంది. రాధను బలవంతం చేయబోతాడు రావూజీ. ఆ సమయంలో రాధ తప్పించుకుంటుంది. ఇదే సమయంలో రాము హంతకుడనే నిందను మోపి అతన్ని జైలుపాలు చేస్తాడు రావూజీ. చెల్లెలిని వెతుక్కునే క్రమంలో రాము హైదరాబాద్‌కి వచ్చి రాధను చూస్తాడు. కానీ రాధ గుర్తు పట్టదు. దీంతో రాము ఆశ్చర్యానికి గురవుతాడు. కానీ హైదరాబాద్‌లో కనిపించిన రాధను తన చెల్లెలిగానే భావిస్తాడు, ఏదో తెలియని ఆత్మీయతతో రామును కూడా రాధ అన్నయ్యలానే భావిస్తుంటుంది. అయితే ఇద్దరు రాధలు ఉన్నారని, ఈ ఇద్దరు కవలలని, అందుకే రాముని హైదరాబాద్‌లో ఉన్న రాధ గుర్తుపట్టలేక పోయిందన్నది ట్విస్ట్. ఈ ఇద్దరు చెల్లెళ్లకు బంగారు గాజులు తొడుగుతాడు రాము. నాగేశ్వరరావు, విజయనిర్మల ముఖ్య తారాగణంగా భారతి, పద్మనాభం, గీతాంజలి కీలక పాత్రల్లో నటించిన ‘బంగారు గాజులు’ సినిమాకు సీఎస్‌రావు దర్శకత్వం వహించారు. చెల్లెలి కాపురం (1971) రాము (శోభన్‌బాబు)కు చెల్లెలు (మణిమాల) అంటే చాలా ఇష్టం. చెల్లికి పెళ్లి చేయాలని డబ్బు సంపాదించడం కోసం పట్నంలో అడుగుపెట్టిన రాముకు అతని స్నేహితుడు శ్రీరామ్ (నాగభూషణం) తారసపడతాడు. స్వతహాగా రచయిత అయిన రాము తన రచనలతో డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ రాము ఆహార్యం చూసి, అతని రచనలను అచ్చు వేసేందుకు ప్రచురణ కర్తలెవరూ ముందుకు రారు. రాము విజ్ఞప్తి మేరకు అతని స్నేహితుడైన శ్రీరామ్.. రాము రచనలను తన రచనలుగా పబ్లిష్ చేయించుకుని, కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే రాము చెల్లిని శ్రీరామ్ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత రాము చెల్లిని ఎలాంటి కష్టాలు పెట్టాడు? ఆ కష్టాల నుంచి ఆమెను రాము, అతన్ని ప్రేమించే రాధ (వాణీ శ్రీ) ఎలా కాపాడారు? శ్రీరామ్ తన తప్పు తాను తెలుసుకునేలా రాధ ఏం చేసింది? అన్నదే కథ. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. పల్నాటి పౌరుషం (1994) రెండు కుటుంబాల మధ్య జరిగే కథతో రూ΄పొందిన చిత్రం ‘పల్నాటి పౌరుషం’. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు (భీమినేని బ్రహ్మన్న), రాధిక (సీత) అన్నా చెల్లెలి పాత్రల్లో నటించారు. తనకెంతో ఇష్టమైన చెల్లిని (సీత) వేరే ఊర్లోని రాజారావ్ (చరణ్‌రాజ్)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మన్న. అయితే రాజారావ్ బామ్మర్ది సూరిబాబు (సురేశ్)కి బ్రహ్మన్న అంటే ఇష్టం ఉండదు. దీంతో కుట్రలతో ఇరు కుటుంబాల్లో కలహాలు తీసుకొస్తాడు సూరిబాబు. ఆ కలహాలకి తన భర్తే కారకుడని తెలుసుకున్న సూరిబాబు భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మృతికి బావ బ్రహ్మన్నే కారణమని భావించి, అన్నని కలవొద్దని తన భార్య సీతకు ఆంక్ష విధిస్తాడు రాజారావ్. ఆ తర్వాత బ్రహ్మన్న, సీతలకు నిజం ఎలా తెలుస్తుంది? ఈ కుటుంబాలను కలపడంలో తర్వాతి తరం పాత్ర ఎంత... అన్నదే ‘పల్నాటి పౌరుషం’ కథాంశం. తమిళ హిట్ మూవీ ‘కిళక్కు సీమయిలే’కు రీమేక్ ఇది. హిట్లర్ (1997) మాధవరావు అలియాస్ హిట్లర్ (చిరంజీవి)కు ఐదుగురు శారద (అశ్వని), అనుపమ (మోహిని), లక్ష్మి (పద్మశ్రీ), గాయత్రి (గాయత్రి), సరస్వతి (మీనాకుమారి) చెల్లెళ్లు. మాధవరావు చిన్నతనంలోనే తల్లి మరణించడం, తండ్రి జైలుపాలు కావడంతో ఐదుగురి చెల్లెళ్ల బాధ్యత అతనిపైనే పడుతుంది. చాలా కష్టపడి, వారిని పెంచి, పెద్ద చేస్తాడు మాధవరావు. తన రెండో చెల్లి మోహిని ప్రేమను మాధవరావు సరిగా అర్థం చేసుకోకపోవడం, మొదటి చెల్లి శారద కాపురంలోని ఇబ్బందులు, సవతి తల్లి ఇద్దరు కూతుళ్లను చేరదీయడం వంటి కారణాలతో మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి.. మాధవరావుకు, అతని చెల్లెళ్లకు మధ్య ఉన్న అభి్రపాయభేదాలను బాలు (మోహిని భర్త, మాధవరావు మామయ్య కొడుకు రాజేంద్రప్రసాద్) ఎలా పరిష్కరిస్తాడు? మాధవరావు, అతని చెల్లెళ్లు తిరిగి ఎలా కలుస్తారు? ఇందులో బుజ్జి (రంభ) పాత్ర ఏమిటన్నదే ‘హిట్లర్’ కథాంశం. సిద్దిఖీ దర్శకత్వంలో రూ΄పొందిన మలయాళ హిట్ ఫిల్మ్ ‘హిట్లర్’కు తెలుగు రీమేక్ ‘హిట్లర్’లో చిరంజీవి హీరోగా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. శివరామరాజు (2002) పూసపాటి శివరామరాజు (జగపతిబాబు), రామరాజు (వెంకట్), రుద్రరాజు (శివాజీ) అన్నదమ్ములు. ఈ ముగ్గురి అన్నదమ్ములకు ఏకైక చెల్లెలు స్వాతి (మోనికా). అయితే శివరామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసం శత్రువర్గం నాటకం ఆడి స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటుంది. ఈ పెళ్లి తర్వాత శివరామరాజు, రామరాజు, రుద్రరాజు తమ ఆస్తిని కోల్పోయి పేదవాళ్లు అయిపోతారు. తనవల్ల పేదరికంలో జీవిస్తున్న అన్నలను చూసి స్వాతి కుమిలిపోతుంటుంది. స్వాతిని అత్తింటి వేధింపుల నుంచి శివరామరాజు ఎలా కాపాడాడన్నదే చిత్రకథ. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వి. సముద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అర్జున్ (2004) అర్జున్ (మహేశ్‌బాబు), మీనాక్షి (కీర్తి రెడ్డి) కవలలు. మీనాక్షి, ఉదయ్ (రాజా) ప్రేమించుకుంటారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మీనాక్షికి ఉదయ్ ఓ లేఖ రాస్తాడు. ఈ లేఖను అర్జున్‌కు చూపిస్తుంది మీనాక్షి. దీంతో ఉదయ్ తల్లిదండ్రులు బాలానాయర్ (ప్రకాష్‌రాజ్), ఆండాళ్ (సరిత) అతనికి చేయాలనుకున్న అమ్మాయితో కాకుండా, మీనాక్షి తో వివాహం జరిగేలా చేస్తాడు అర్జున్. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో బాలానాయర్, ఆండాళ్లు కలిసి మీనాక్షిని చంపి, ఉదయ్‌కు మరో అమ్మాయితో వివాహం చేయాలనుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్జున్‌కు తెలుస్తుంది. అప్పుడు మీనాక్షిని రక్షించేందుకు సోదరుడిగా అర్జున్ ఏం చేశాడు? మధుర మీనాక్షి అమ్మవారి సాక్షిగా మీనాక్షిని ఎలా కాపాడుకున్నాడు– అన్నదే అర్జున్ కథ. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. ‘పుట్టింటికి రా చెల్లి’ (2004) చిన్నతనంలోనే శివన్న (అర్జున్) తల్లి కన్నుమూస్తుంది. దీంతో చెల్లెలు లక్ష్మి (మధుమిత) ఆలనాపాలన శివన్నపై పడుతుంది. సేద్యం చేస్తూ చెల్లెల్ని చదివిస్తాడు శివన్న. తన చెల్లెలు ప్రేమించిన అజయ్ (శ్రీనాథ్)తోనే ఆమె వివాహం జరిపిస్తాడు. ఈ పెళ్లి ఇష్టం లేని అజయ్ కుటుంబ సభ్యులు లక్ష్మిని నిత్యం వేధిస్తుంటారు. అంతేకాదు.. ఎలాగైనా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు ఓ పెద్ద నింద వేస్తారు. అది నమ్మిన అజయ్ గర్భవతిగా ఉన్న లక్ష్మిని పట్టించుకోడు. పుట్టింటికి రమ్మని శివన్న వచ్చి లక్ష్మిని వేడుకుంటాడు. నిందతో రాను.. నిప్పులా వస్తానని అన్నకు చెబుతుంది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మిపై పడ్డ నిందని శివన్న ఎలా చెరిగిపోయేలా చేశాడు– అనే కథాంశంతో ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా రూ΄పొందింది. అర్జున్, మీనా జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఖీ (2006) అల్లారుముద్దుగా పెరిగిన తన చెల్లి చావుకి కారణమైన ఆమె అత్తింటి వారిపై ఓ అన్నగా, తోడ పుట్టకపోయినా.. సమాజంలోని కొందరు యువతులపై దౌర్జన్యం చేసినవారిపై రాఖీ బ్రదర్‌గా రామకృష్ణ ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘రాఖీ’ సినిమా రూ΄పొందింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. రామకృష్ణ అలియాస్ రాఖీ (ఎన్టీఆర్)కి చెల్లెలు గాయత్రి (మంజూష) అంటే అమితమైన ప్రేమ. ఐదు లక్షల కట్నం ఇచ్చి రవివర్మతో గాయత్రి వివాహం జరిపిస్తారు రాఖీ, కుటుంబ సభ్యులు. అయితే తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని మూడు నెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి చంపేస్తారు అత్తింటివారు. కానీ, వారు నిర్దోషులంటూ కోర్టులో కేసు కొట్టేస్తారు. దీంతో తన చెల్లిని చంపిన అత్తింటి వారందర్నీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు రాఖీ. తన చెల్లెలి కేసుకు వ్యతిరేకంగా వాదించిన లాయర్ని, దొంగ సాక్ష్యం ఇచ్చిన డాక్టర్ని, పోలీసు అధికారులని కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఆ తర్వాత ఏ మహిళకు అన్యాయం జరిగినా అందుకు కారకులైన వారిని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. వరుస హత్యలు చేస్తున్న రాఖీని పోలీసులు పట్టుకున్నాక కోర్టు అతనికి శిక్ష విధించిందా? అన్నది ఈ చిత్ర కథాంశం. గోరింటాకు (2008) అశోక్ (రాజశేఖర్)కి చెల్లెలు లక్ష్మి (మీరా జాస్మిన్) అంటే పంచ్రపాణాలు. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో అన్నీ తానై చెల్లెల్ని పెంచి పెద్ద చేస్తాడు అశోక్. చెల్లికి పెళ్లి అయ్యేవరకు తాను కూడా చేసుకోకూడదనుకుంటాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయి ఆకాశ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆకాశ్‌ని ఆస్తి కోసం అయినవాళ్లే మోసం చేసి, జైలుకి పంపిస్తారు. ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పి, సాయం అడుగుదామని ఇంటికి వచ్చిన లక్ష్మిని.. అశోక్ భార్య నందిని (ఆర్తి అగర్వాల్) అవమానించి పంపించేస్తుంది. భర్త జైలులో ఉండటం..అన్నయ్యను కలిసే అవకాశం లేకపోవడం.. పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోని లక్ష్మి.. పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసి లక్ష్మి భౌతిక కాయం వద్ద అశోక్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. అక్కడే ్రపాణాలు విడవడం ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది. కన్నడ హిట్ ‘అన్న తంగి’కి రీమేక్‌గా వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄పొందింది. కాగా, 2008 నుంచి ఇప్పటివరకు అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇటీవల ‘భోళా శంకర్’లో చిరంజీవి, కీర్తీ సురేశ్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘పెద్దన్న’లో రజనీకాంత్, కీర్తీ సురేశ్ అన్నాచెల్లెళ్లుగా నటించిన విషయం తెలిసిందే. రాఖీ స్పెషల్ -
రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు
అమరావతి: రక్షాబంధన్(రాఖీ పర్వదినం)ను పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులు విన్నూత్న శైలిలో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమకున్న ప్రేమ, కృతజ్ఞతను చాటుకోవడానికి రక్షాబంధన్ పండుగను వేదికగా చేసుకున్నారు విద్యార్థులు. ‘రాష్ట్రానికి రక్ష జగనన్న’ అంటూ మానవ గొలుసుగా ఏర్పడి హృదయపూర్వకమైన సంజ్ఞను ప్రదర్శించారు. సీఎం జగన్‌ను మేనమామగా పిలుచుకునే విద్యార్థులు.. ఆయనపై అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విద్యాకుసుమాలు జగన్‌లో ఓ సంరక్షకుడిని చూసుకుంటున్నారు. ప్రకాశవంతమైన రేపటికోసం సీఎం జగన్‌పైనే నమ్మకం ఉంచిన విద్యార్థులు.. అందుకు బదులుగా రాష్ట్రానికి రక్ష జగనన్న అంటూ ఇలా తమ ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. సీఎం జగన్, విద్యార్ధుల మధ్య ఉన్న బంధానికి ఇదొక ప్రతీకగా చెప్పవచ్చు. -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే మెగా కోడలిగా అడుగుపెట్టబోతోన్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది చివర్లోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేదికతో పాటు పెళ్లి తేదీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించి ఉంగరాలు కూడా మార్చుకున్నారు. (ఇది చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! ) అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అన్న, వదినతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. అన్నా, చెల్లెల్ల అనుబంధం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన వరలాంటిదని అన్నారు. ఇన్‌స్టాలో లావణ్య రాస్తూ..' అన్న, వదినకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు. మీపై ప్రేమ రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంది.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సైతం లావణ్యకు హ్యాపీ రాఖీ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా! ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను! — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2023 -
రాఖీ పండుగ: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టికెట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు టీ-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్ల అమలు యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్ఆర్టీసీ 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కి.మీ. టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీ-9-60 టికెట్‌ను రూ.100కు, టీ-9-30 టికెట్‌ను రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 28, 2023 టికెట్ల నిలుపుదలపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: వినాయక చవితిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. చదవండి: అమిత్ షా ఖమ్మం పర్యటనలో మార్పులు ‘అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది’ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్‌లతో పాటు హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట!
భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ లక్షల దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని పలు ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలలోని కొన్నింటిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని అందమైన ఆలయాలైతే, మరికొన్ని అద్భుతాలకు నిలయాలు. కొన్ని దేవాలయాలు దూరప్రాంతాలలో నెలకొనివుంటాయి. వాటి దగ్గరకు చేరుకోవాలంటే ఎంతో శ్రమించాలి. అలాంటి ఒక దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రక్షా బంధన్(రాఖీ) రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని బన్షీనారాయణ లేదా వంశీనారాయణ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ దేవాలయం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువు, శివునితో పాటు గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయ తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెరుస్తారు. రక్షా బంధన్ నాడు స్థానికులు ఈ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టే సమయానికి ముందు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికొస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది కూడా చదవండి: షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది? -
ఈ సినిమాలకు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. కారణం ఇదే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్ధా'. బెబో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌తో చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అయితే 'లాల్ సింగ్ చద్ధా' విడుదలైన తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అనుకన్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా రిలీజ్ రోజైన గురువారం 11. 70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది. మొత్తంగా 'లాల్ సింగ్ చద్ధా' తొలి రెండు రోజుల్లో రూ. 18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే కనీసం రూ. 20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది. కాగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభం నుంచే 'బాయ్‌కాట్ బాలీవుడ్'లో భాగంగా 'లాల్ సింగ్ చద్ధా'పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం. 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్ధా' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయింది. అమీర్ ఖాన్ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది. #LaalSinghChaddha falls flat on Day 2... Drop at national chains... Mass pockets face steep fall... 2-day total is alarmingly low for an event film... Extremely crucial to score from Sat-Mon... Thu 11.70 cr, Fri 7.26 cr. Total: ₹ 18.96 cr. #India biz. Note: #HINDI version. pic.twitter.com/9hwygm6Jrm — taran adarsh (@taran_adarsh) August 13, 2022 అలాగే 'బాయ్‌కాట్ బాలీవుడ్' సెగ ప్రభావం ఈ సినిమాతో పాటు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రంపై కూడా పడింది. అన్నాచెళ్లెల్ల అనుబంధంగా తరకెక్కిన 'రక్షా బంధన్' చిత్రం కూడా ఆగస్టు 11నే విడుదలైంది. తొలి రోజైన గురువారం రూ. 8.20 కోట్లను సాధించిన 'రక్షా బంధన్' రెండో రోజు శుక్రవారం రూ. 6.40 కోట్లతో సరిపెట్టుకుంది. మొత్తంగా అమీర్ ఖాన్ చిత్రం కంటే తక్కువగా రూ. 14.60 కోట్ల కలెక్షన్లతో నెమ్మదిగా ముందుకుసాగుతోంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను బట్టి చూస్తే 'బాయ్‌కాట్ బాలీవుడ్' ప్రభావం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. #RakshaBandhan declines on Day 2... National chains remain extremely low... Mass belt is driving its biz... 2-day total is underwhelming... Needs to have a miraculous turnaround from Sat-Mon... Thu 8.20 cr, Fri 6.40 cr. Total: ₹ 14.60 cr. #India biz. pic.twitter.com/WaJtvW8SJY — taran adarsh (@taran_adarsh) August 13, 2022 -
ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !
నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్ డీఆర్ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్ కూడా గల్లంతైన విషయం విదితమే. అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. (చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్) వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడిన ప్రదీప్ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోదిస్తున్న ప్రదీప్ భార్య బంధువులు విలేకరిపై రాళ్లదాడి ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. రోదిస్తున్న నాగరాణి(కుడి) కుప్పకూలిన నాగరాణి తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ బి.ప్రదీప్(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్‌తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్‌డ్యామ్ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. పరిహారం, ఉద్యోగం డీఆర్ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. (చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..) -
ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు (ఫొటోలు)
-
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
మార్కెట్ లో దర్శనమిస్తోన్న వివిధ రకాల రాఖీలు
-
సమ గౌరవమే సరైన రక్ష
కుటుంబంలో ఆమె సమాన భాగస్వామి. పని ప్రదేశంలో ఆమె సమాన సహోద్యోగి. సమాజంలో ఆమె సమాన పౌరురాలు. అవకాశాలలో.. అధికారంలో.. అంతరిక్షంలో అన్నింటా ఆమెకు సమాన హక్కు ఉంది. పురుషులు గ్రహించ వలసింది ఇదే రక్షా బంధన్ సందర్భంలో. స్త్రీకి సాటి పురుషుల నుంచి ‘రక్ష’ ఇచ్చే బదులు అందరు పురుషులు స్త్రీల సమస్థానాన్ని స్వీకరిస్తే చాలు. అన్న స్థానం మంచిదే. సమ స్థానం గొప్పది. పురాణాల్లో ద్రౌపదికి కృష్ణుడు అన్నగా కనిపిస్తాడు. ద్రౌపదికి రక్షగా ఆయన నిలిచిన ఉదంతాలు అందరికీ తెలుసు. కౌరవసభలో జూదంలో ఓడిపోయిన పాండవులను మరింత అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణానికి పురిగొల్పుతాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడు అందుకు పూనుకుంటాడు. నిండు సభలో స్త్రీకి... ఒక రకంగా ఇంటి కోడలికి అవమానం జరగబోతుంది. ఆ సమయంలో ఒక అన్నగా ప్రత్యక్షమయ్యి ఆమెకు రక్షగా నిలుస్తాడు కృష్ణుడు. మగవారి గొడవలో స్త్రీలను లాగకూడదనే సంస్కారం కౌరవులకు ఉండి ఉంటే ద్రౌపదికి పరాభవం జరిగి ఉండేది కాదు. మగవారైన కౌరవుల నుంచి రక్షించడానికి మగవాడైన కృష్ణుడు ప్రత్యక్షం కావల్సిన అవసరమూ ఉండేది కాదు. అంటే? స్త్రీలను గౌరవించాలనే సంస్కారమే ప్రథమం. ఆ సంస్కారం ఉంటే స్త్రీలకు మగవారి నుంచి ఎటువంటి ఆపదా, ఇబ్బంది ఉండదు. వారికి రక్షగా నిలవాల్సిన అవసరమూ ఉండదు. చెల్లెలు బంగారు తల్లి. ఇంటి ఆడపిల్లంటే లక్ష్మి. తండ్రికి, అన్నకు, తమ్ముడికి కూడా ఆమె అంటే అంతులేని మమకారం. ఆమె పాదంలో ముల్లు దిగితే వారి కంట కన్నీరు పొంగుతుంది. ఆమె కోరింది ఇవ్వబుద్ధవుతుంది. ఆమెను ఇష్టాన్ని మన్నించాలనిపిస్తుంది. కాని ఇదంతా తమ ఇంటి ఆడపిల్ల విషయంలోనే. మరి పొరుగింటి, ఇరుగింటి, ఊళ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న స్త్రీలు అందరూ ఇలా ప్రేమగా, ఆదరంగా చూడవలసిన వారే కదా. మన ఇంటి ఆడవాళ్లని మాత్రమే ఆదరంగా చూస్తాము ఇతర ఇళ్ల ఆడవాళ్లను చులకన చేస్తాము అనే భావన ఎందుకు? అలా ఎవరైనా తమ ఇంటి ఆడవాళ్లను చులకన చేస్తే ‘మేమున్నాం’ అని ఆ ఇంటి అన్నదమ్ములు ముందుకు రావడం ఎందుకు? అసలు ఒక స్త్రీని చులకన గా లేదా ఆధిపత్య భావనతో చూడవలసిన అవసరం ఏముంది? మీరు మేము రక్షగా నిలువదగ్గవారు అని చెప్పవలసిన అవసరం ఏమి? ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ∙∙ ఆడపిల్ల చదువు విషయంలో, ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో, జీవిత భాగస్వామిని కోరుకునే విషయంలో, ఆస్తి పంపకాలలో, ఇంటికి సంబంధించిన నిర్ణయాలను వ్యక్తం చేయడంలో ఎంత అవకాశం ఇస్తున్నారో ఎవరికి వారు చూసుకోవాలి. కావలసిన బట్టలు, నగలు కొనిపెట్టడమే అనురాగం, ఆత్మీయత కాదు. వారి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి చోటు కల్పించాలి. స్వయం సమృద్ధితో జీవితాన్ని నిర్మించుకునే శక్తి, స్వేచ్ఛ పొందేందుకు అడ్డు లేకుండా ఉండాలి. మద్దతుగా నిలవాలి. అది ఇంటికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం అంటే. ఇక పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగినుల ప్రతిభను గౌరవించాలి. వారికి ‘బాస్’లుగా ఎదిగే సామర్థ్యం ఉంటే వారి దగ్గర పని చేయడం ఇతర పురుష బాస్‌ల వద్ద పని చేయడంతో సమానంగానే భావించాలి. వారు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ ఉద్యోగంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి అనుక్షణం గుర్తుంచుకోవాలి. పురుషుడు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం చేయాలనుకునే స్త్రీ ఇల్లు కూడా చూసుకోవాలి. కనుక ఆఫీసులో వారే ఎక్కువ సమానం అవుతారు కాని తక్కువ సమానం కాదు. పురుష ఉద్యోగులతో పరస్పర సహకారం అందిస్తూ ఎలా పని చేస్తారో మహిళా ఉద్యోగులతో కూడా పరస్పర సహకారం అందిస్తూ పని చేస్తే అదే ఆఫీసు వరకు నిజమైన రక్షాబంధనం. సమాజంలో అనేక దొంతరల్లో ఇవాళ స్త్రీలు వికాస పథంలో పని చేస్తున్నారు. పురుషులకు అట్టి వారిని చూసినప్పుడు ప్రధానంగా ప్రశంసాపూర్వకంగా చూడాలి. నాయకులు, ఆటగాళ్ళు, కళాకారులు, అధికారులు అనంటే పురుషుల మాత్రమే కాదని, స్త్రీలు కూడా అని గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఇవాళ స్త్రీలే ఫోర్బ్స్‌కు ఎక్కుతున్నారని గ్రహిస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఇంటి అమ్మాయికి వారిని ఆదర్శం చేయడమే సమాజానికి సంబంధించినంత వరకూ సరైన రక్షా బంధనం. పులితో పోరాడిన స్త్రీలు, బిడ్డను నడుముకు కట్టుకుని శత్రువులతో పోరాడిన స్త్రీలు మన దగ్గర కొదవ కాదు. వారు పరాక్రమవంతులు. వారే ఎవరికైనా రక్షగా నిలువగలరు. తమను తాము రక్షించుకోగలరు. వారు కోరేదల్లా తమ దారిన తాము నడవనివ్వమని. తమ ఎంపికల పట్ల ప్రజాస్వామికంగా ఉండమని. బాధ్యతల బంధాల బట్వాడాలో సమన్యాయం పాటించమని. తమను గౌరవిస్తూ తమ గౌరవం పొందే విధంగా పురుషులు ఉండాలని. తల్లీతండ్రి, భార్యా భర్త, అక్కా తమ్ముడు, స్త్రీ పురుషుడు, యువతీ యువకుడు... జీవన– సామాజిక చక్రాలలో స్త్రీలు పురుషులకు రక్షగా పురుషులు స్త్రీలకు రక్షగా సందర్భాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తించమని చెప్పేదే నిజమైన రక్షాబంధనం. ‘భారతీయులందరూ సహోదరులు’ అని ప్రతిజ్ఞ చేసినట్టుగా ‘స్త్రీ పురుషులందరూ సమాన గౌరవానికి అర్హులు’ అని ప్రతిజ్ఞ చేసుకుంటే ‘రక్షాబంధనం’ అనే ‘రక్ష’కు గుర్తుగా కాక ఆత్మీయతకు, ఆదరణకు, అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. -
Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..
ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్ మాత్రం ఇంకాస్త స్పెషల్. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది. సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్ యజమాని దీపక్ భాయ్ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి! -
Raksha Bandhan 2022: పెద్దన్న కేసీఆర్‌కు రాఖీ కట్టండి
సాక్షి, హైదరాబాద్: మహిళాభ్యున్నతి, ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప జేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్దన్నగా ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు అవసరమైన భరోసా కల్పించారని అన్నారు. అందువల్ల రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలంతా కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో గురువారం కేటీఆర్ జూమ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని వివరించారు. సుసంపన్నమైన సమాజ నిర్మాణ రూపకర్తలు స్త్రీలే అని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే మొత్తం కుటుంబం, సమాజం బావుంటుందన్న లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని కర్తవ్యంగా భావించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందని, 14 లక్షల మంది ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవారికి రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ము తున్న ప్రభుత్వం మాది. దేశంలో మరెక్కడా లేని విధంగా మహిళల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి స్త్రీ కి అండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములుగా ఉన్నాం. అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుంది. అన్ని విధాలా అండగా..: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి–షాదీ ముబా రక్ పథకంలో భాగంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తున్నాం. ఆరోగ్యలక్ష్మి కింద 5,18,215 మంది శిశువులకు, 21,58,479 మంది గర్భి ణులకు, 18,96,844 మంది పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో 4 లక్షల స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం నిరంతరం మద్దతు అందిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తల జీతాలను పెంచింది. మిషన్ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను పూర్తిగా తొలగించాం. మహిళలకు అత్యంత సురక్షి తమైన రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. చదవండి: రాష్ట్రంపై కేంద్రం నిందలను తిప్పికొడదాం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
నితిన్‌కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. గిఫ్ట్ ఇచ్చిన హీరో
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్ మంగ్లీ నితిన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న నితిన్‌కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్ ఆమెకు బ్యూటిఫుల్ గిఫ్ట్‌ను అందించారు. -
రక్షాబంధన్: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Raksha Bandhan 2022: సీఎం జగన్ రాఖీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?) -
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
అల్లరి చేసేవారే ఇలా బహిష్కరిస్తారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Mischievous People Are Boycotting Films: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలతో పలకరించాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రక్షా బంధన్'. అయితే ఈ మధ్య 'బాయ్‌కాట్ బాలీవుడ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అలియా భట్ 'డార్లింగ్స్'తో పాటు అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' చిత్రాలను బహిష్కరించాలని నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. రక్షా బంధన్ ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాయ్‌కాట్‌పై స్పందించాడు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్' ట్రెండింగ్‌లో ఉండటం తనను బాధించిందని తెలిపాడు. 'ఇలా బాయ్‌కాట్ పేరుతో అల్లరిపాలు చేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అల్లరి చేసేవాళ్లు మాత్రమే ఇలా బాయ్‌కాట్ చేస్తారు. అది పర్వాలేదు. ఇది స్వేచ్ఛాయుత భారతదేశం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందా?. అలా జరగడం లేదు కదా. ప్రజలు ఇలాంటి పనులు చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భారతదేశాన్ని గొప్పగా పెంపొందిచడంలో తోడ్పడాలి కానీ, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు' అని అక్కీ పేర్కొన్నాడు. కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక్క అన్న, నలుగురు చెళ్లెళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కింది 'రక్షా బంధన్' చిత్రం. ఇందులో భూమి పెడ్నేకర్, సాదియా ఖతీబ్, సాహెజ్మీన్ కౌర్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కూడా విడుదల కానుంది. -
మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. చదవండి: ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..! టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసులను డోర్ టు డోర్ డెలివరీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 ఈ నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. -
భక్తులకు గుడ్ న్యూస్.. అమర్నాథ్ యాత్ర ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: భక్తులకు అమర్నాథ్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈసారి భక్తులకు దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు. Amaranth Yatra to start from June 30th, 2022, with all covid protocols in place & culminate, as per the tradition, on the day of Raksha Bandhan. The Amarnath Yatra will last for 43 days this year: Office of Lt. Governor of Jammu & Kashmir — ANI (@ANI) March 27, 2022 -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. -
పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ
సాక్షి,నెన్నెల(ఆదిలాబాద్): అక్కాతమ్ముడు..అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ. అనుబంధమే పదేళ్ల తర్వాత అక్కాతమ్ముడిని మళ్లీ కలిపింది. కుటుంబానికి దగ్గర చేసింది. చనిపోయిందేమో.. అనుకున్న మహిళ శనివారం తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన టేకులపల్లి వెంకటి, మధునక్క దంపతులకు కుమారులు శ్రీనివాస్, పవన్, కూతురు రజిత ఉన్నారు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుండేవారు. ఈ ప్రాంతం నుంచి కూలీలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. అలా పనుల కోసం పదేళ్ల క్రితం వెళ్లిన రజిత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, జమ్మికుంటలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హనీగావుకు చెందిన రాజు అనే యువకుడు రజితకు పరిచయమయ్యాడు. అతడితో కలిసి ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్క డే రాజును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తల్లి దండ్రులకు తెలిస్తే కొడతారనే భయంతో ఇంతకాలం నెన్నెలకు రాలేదు. రజిత ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా చనిపోయిందేమోనని భావించారు. రెండేళ్ల క్రితం ఆమె అన్న శ్రీనివాస్ చనిపోయినా సమాచారం తెలియకపోవడంతో రాలేదు. ఇటీవల రాఖీ పండుగకు రజిత భర్త రాజుకు రాఖీ కట్టేందుకు అతడి చెల్లెళ్లు రావడం, రాఖీ కట్టడం తన తమ్ముడిని, కుటుంబాన్ని గుర్తు చేసింది. ‘‘మా ఆయనకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెళ్లను చూసి నాకు నా తమ్ముడు పవన్ గుర్తుకు వచ్చాడు. వాడికి రాఖీ కడతానని మూడు రోజుల క్రితం నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం నెన్నెలకు వచ్చాను.. నాకు ప్రస్తుతం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. పదేళ్ల తర్వాత మా అమ్మానాన్నలు, నా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది..’’ అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. మహారాష్ట్రలో జీవనంతో ఆమె కట్టు, బొట్టు మారింది. మరాఠీ, హిందీ భాషా మాట్లాడుతోంది. ఆమెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. శనివారం తమ్ముడు పవన్‌కు రాఖీ కట్టింది. అన్నను గుర్తు చేసుకుంటూ విలపించింది. చదవండి: సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా? -
మెగా సందడి
-
అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్): మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ పేర్కొన్నారు. చదవండి: Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత -
అర్బన్ నక్సల్స్తోనే హిందుత్వానికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు హిందువులు కాదంటూ అర్బన్ నక్సలైట్లు విషప్రచారం చేస్తున్నారని, వారివల్లే హిందుత్వానికి ముప్పు పొంచి ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధానకార్యదర్శి మిలింద్ పరండేజీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలు అతి ప్రాచీనమైనవని, దాదాపు రెండు వేల ఏళ్ల నుంచి విదేశీ దురాక్రమణలను ఎదుర్కొంటూ హిందువులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 185 జిల్లాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కశీ్మర్, అరుణాచల్ ప్రదేశ్, దక్షిణ బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పండుగలను స్వేచ్ఛగా జరగనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో ‘మేం ఏ మతానికి చెందని వారం కాదు’ అని చెప్పేవారి సంఖ్య కోట్లలో ఉందని, వారంతా హిందువులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు స్థానుమలై, రాఘవులు, సత్యంజీ, కేశవ్హెడ్గే, యాదిరెడ్డి, జగదీశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు. -
రక్షాబంధన్ రోజు విషాదం
రాపూరు/ఆత్మకూరు/చెన్నూరు: రక్షాబంధన్ రోజు రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరు మూలాపేటకు చెందిన మల్లేశ్వరరావు (35), రాము (22) బైక్‌పై పెంచలకోన క్షేత్రంలో మిత్రుడి పిల్లలకు తలనీలాలు సమర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాపూరు మండలం రామకూరు ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్నారు. మల్లేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. రామును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నెల్లూరు–ముంబై రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (35) ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నెల్లూరుపాలెం వద్ద బోయలచిరువెళ్లకు చెందిన కృష్ణయ్య (67) లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో అక్కాతమ్ముడు వైఎస్సార్ జిల్లా చెన్నూరు పెన్నా నది బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెరువు మల్లేష్ (45), ఆయన సోదరి ఇండ్ల వెంకట లక్షుమ్మ (47) మృతి చెందగా మేనకోడలు లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. చెరువు మల్లేష్ రాఖీ పర్వదినం సందర్భంగా కడప అల్మాస్‌పేటలో ఉంటున్న తన అక్క లక్షుమ్మ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి అక్కతోపాటు మేనకోడలిని తీసుకుని బయలుదేరాడు. చెన్నూరు పెన్నాబ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కిందపడడంతో మల్లేష్ చేయి, తలకు, లక్షుమ్మకు తలతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య కాలు తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది. వీరిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకట లక్షుమ్మ, మల్లేష్లు మృతి చెందారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో అక్క మృతి.. ఆ బాధతో తమ్ముడి కన్నుమూత అనకాపల్లి టౌన్: 75 ఏళ్లకుపైగా అనుబంధం వారిది. చివరకు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేకపోయారు. ఇద్దరూ రక్షాబంధన్ రోజునే కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్క రాజా సాగి లలితాదేవి (85) ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె తమ్ముడు ఎస్ఆర్ఎన్ఎంఆర్ రాజు (76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. లలితాదేవి తన భర్త మృతి చెందాక కుమార్తె పద్మినీరాణితో కలసి తమ్ముడు రాజు (76)తోనే 30 ఏళ్లుగా ఉంటున్నారు. అక్క మరణంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి రాజు ఇంటికి చేరుకున్నారు. తర్వాత భోజనం చేసి బంధువులతో ఫోన్లో తన అక్క మృతి విషయం మాట్లాడుతూ గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చాలాకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. -
అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య
సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్ మాట్లాడటం లేదని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గరం గరం ముచ్చట్లు 22 August 2021
-
చిన్న వయస్సులోనే పెద్ద సినిమాల్లో పాటలు పాడుతున్న అన్నాచెల్లెల్లు
-
ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
-
విషాదం: మరణించిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన తోబుట్టువులు
-
రాఖీ స్పెషల్ : సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
-
రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తీవ్ర విషాదం
సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టినవాడికి రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లకు తీరని శోకం మిగిలింది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన లక్ష్మయ్య చేతికి రాఖీ కట్టి తోడబుట్టిన బంధం విలువ తెలిపిన ఆ అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. రాఖీ పౌర్ణమినాడు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. అన్నకు రాఖీ కట్టేందుకు వారంతా నిన్ననే లక్ష్మయ్య ఇంటికి వచ్చినట్టు తెలిసింది. -
జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల, సోదరుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ట్విటర్లో పేర్కొన్నారు. నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi pic.twitter.com/EP35BVUJ7z — YS Sharmila (@realyssharmila) August 22, 2021 -
Raksha bandhan 2021: రాఖీ అంటే అపురూప బంధం
కుటుంబాల్లో అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. వీరి ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. రాఖీ అంటే రక్షణ. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే అపురూప బంధం. తన తోడబుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలు కట్టేదే ఈ రాఖీ. అలాగే సదా నీకు రక్షగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అత్యంత సంబరంగా చేసుకునే ఈ వేడుకలో అన్నా తమ్ములకు రాఖీ కట్టడంతోపాటు మరిన్ని విధాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.. -
ప్రధానికి.. బృందావన్ రాఖీ!
బీద, గొప్ప, స్థాయి భేదం లేనివే అనుబంధాలు. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లకేగాక.. అప్యాయత, అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోసేవారు, ఆపదలో ఆదుకునే ప్రతిఒక్కరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ అడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని మంత్రిదాకా అందరికీ రాఖీలు పంపుతూ సోదర సమానులపై తమకున్న ప్రేమను చాటిచెబుతుంటారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన కొంతమంది వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు పంపించారు. బృందావన్‌లోని ‘మా శారద’, రాధా తిల ఆశ్రమంలోని వయసుపైబడిన వితంతువులు ప్రధాని కోసం ప్రత్యేకంగా రంగురంగుల రాఖీలను రూపొందించారు. 251 రాఖీలను స్వయంగా తయారు చేసి, వాటిపై మోదీ ఫొటోనూ చిత్రీకరించారు. రాఖీలతోపాటు ‘ఆత్మనిర్భర్’, ‘స్టే సేఫ్’ అని మెసేజ్æ రాసిన ప్రత్యేకమైన మాస్కులు, స్వీట్లు పంపడం విశేషం. వీళ్లంతా మోదీని తమ సోదరుడిలా భావించి గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీలు పంపిస్తున్నారు. గతేడాది బృందావన్‌కు చెందిన 103 ఏళ్ల వితంతు బామ్మ మోదీకి రాఖీ కట్టగా ఈ ఏడాది ఆ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురు మహిళలతో మోదీకి రాఖీల బుట్టను పంపారు. -
నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది. అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది. చందురుని మించు అందమొలికించు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్.టి.ఆర్ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట. అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్ వల్లే హిట్. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా కైకాల సత్యనారాయణ నటించి విలన్ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది. పగ–ప్రతీకారాల దశాబ్దం 1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు. తమిళం నుంచి బాపు రీమేక్ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్’ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాన్స్ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్ అయ్యింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై... ఆ సమయంలోనే గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్ రిక్షా’ సూపర్‌హిట్ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి. 2000 సంవత్సరం తర్వాత కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్ కల్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్.టి.ఆర్కు ఆ సమయంలో అవసరమైన హిట్ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు. అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది. -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి, అమరావతి: రాఖీ పండగ సందర్భంగా ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. శనివారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ గుప్తా కల్యాణ మండపంలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గాయత్రి సంతోషిణి సీఎం జగన్‌కు రాఖీలు కట్టారు. సీఎం వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు : రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం జగన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారిత సాధించేందుకు మనందరి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక చర్యలు చేపట్టిందని తెలిపినట్లు సీఎం కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. -
రాఖీపౌర్ణమి సదారక్ష
-
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల మిఠాయి
సోదరీసోదరుల అనురాగ అనుబంధాల తియ్యటి పండుగ.. సోదరుడి నోరు తీపి చేయటానికి సోదరి ఆప్యాయతను కలబోసి తినిపించే మిఠాయిల పండుగ తనకు రక్షణగా ఉండమని సోదరుడిని భరోసా కోరే రక్షాబంధన్ పండుగ.. 1. దూద్ పాక్ కావలసినవి: చిక్కటి పాలు – 5 కప్పులు; కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; బాస్మతి బియ్యం – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; గార్నిషింగ్ కోసం: బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ ఒక చిన్న పాత్రలో టేబుల్ స్పూను పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, నెయ్యి జత చేసి పక్కన ఉంచాలి. పాలను మరిగించాక, నెయ్యి జత చేసిన బియ్యం అందులో పోసి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ, ఉడికించాలి. పంచదార, కుంకుమ పువ్వు జత చేసిన పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, సన్నని మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆరేడు నిమిషాలు ఉంచి, దింపేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచి బయటకు తీయాలి. బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పుల తరుగుతో అలంకరించి, అందించాలి. చదవండి: రొయ్యల ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసా? 2. కాజు కోప్రా షీరా కావలసినవ: జీడి పప్పుల పొడి – అర కప్పు (రవ్వలా ఉండాలి); కొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ చిన్న గ్లాసులో కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడి పప్పు పొడి, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద మూడు నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఒక పాత్రలో పావు కప్పు నీళ్లలో పంచదార వేసి కరిగించి, వేయించిన జీడి పప్పు మిశ్రమానికి జత చేసి, బాగా కలపాలి. కుంకుమ పువ్వు నీళ్లను జత చేసి మరోమారు కలపాలి. ఏలకుల పొడి జత చేసి, కలిపి, దింపేసి, చల్లారాక అందించాలి. 3. కేసర్ మలై కుల్ఫీ కావలసినవి: కుంకుమ పువ్వు – కొద్దిగా; చల్లటి పాలు – ఒక టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – నాలుగున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ ఒక గ్లాసులో కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన ఉంచాలి. చిన్న పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నటి సెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ నీళ్లు, పంచదార జత చేసి సన్నటి మంట మీద సుమారు అరగంట సేపు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి దింపేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి జత చేయాలి. తయారైన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లోకి పోసి, డీప్ ఫ్రీజర్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచాక తీసుకుని తినాలి. – వైజయంతి పురాణపండ చదవండి: బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా? -
‘రక్షాబంధన్’తో అమ్మ చేతి హల్వా తినే అదృష్టం
పాత్ర కోసం అక్షయ్‌కుమార్ ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు. ఎలాంటి మేకోవర్కి అయినా రెడీ అయిపోతారు. తాజాగా అక్షయ్ ‘రక్షాబంధన్’ సినిమా కోసం బరువు పెరుగుతున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో భూమీ ఫడ్నేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం 5 కేజీల బరువు పెరిగారు అక్షయ్. బరువు పెరగడం గురించి అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘పాత్ర కోసం బరువు తగ్గడం లేదా పెరిగే ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను. ‘రక్షాబంధన్’ కోసం సహజమైన పద్ధతిలోనే 5కిలోలు పెరిగాను. ఈ బరువు పెరిగే ప్రాసెస్‌లో మా అమ్మ చేతి హల్వా తినే అదృష్టం కూడా నాకు కలిగింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... అక్షయ్‌కుమార్ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కోసం అప్పట్లో 5 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. -
తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ అన్నయ్య అయ్యారు. నిజజీవితంలో ఆయనకో చెల్లెలు ఉంది. కానీ సినిమాలో నలుగురు చెల్లెళ్లకు అన్న అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అక్షయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షా బంధన్’. ఇందులో నలుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా కనిపించనున్నారాయన. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. అక్షయ్ కుమార్ తొలిసారి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ఇది. భూమీ పెడ్నేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ తండ్రి పాత్రలో నానా పటేకర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని సోమవారం ఆరంభించారు. ‘‘నా సోదరి అల్కా నా బెస్ట్ ఫ్రెండ్. ఆనంద్ రాయ్‌తో చేస్తున్న ‘రక్షా బంధన్’ తనకి, మా మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన బంధానికి అంకితం’’ అని లాక్డౌన్ 2.0 తర్వాత ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న సందర్భంగా అక్షయ్ పేర్కొన్నారు. చదవండి: వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం -
ఆన్లైన్ జాబులకు డబ్బు చెల్లించొద్దు..
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు అవగహన కల్పించేలా ఆన్లైన్ శిక్షణా తరుగతులను ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగానే విజయవాడలో శుక్రవారం 18వ రోజు ‘ఈ రక్షా బంధన్’ శిక్షణ తరగతులు జరిగాయి. పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబ్‌నార్‌లో వ్యక్తిగత సమాచార దోపిడి, ఉద్యోగాల మోసాలు వంటి అంశాలపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా వెబ్‌నార్‌లో పాల్గొన్న సైబర్ నిపుణులు విమల్ ఆదిత్య, నందీశ్వర్ పలు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అలాగే సోషల్ మీడియాలోనూ షేర్ చేయవద్దని సలహాఇచ్చారు. ఆన్లైన్ జాబ్ మోసగాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా డబ్బు చెల్లించవద్దని నిరుద్యోగులకు సూచించారు. అలాగే వ్యక్తిగత సమాచారం దోపిడికి గురైతే దానిని ఎలా కనుగోవచ్చు అంశపై సుదీర్ఘంగా చర్చించారు. సైబర్ స్థలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో సర్వే ఫారాలను నింపడం ద్వారా సమాచారం దోపిడి జరుగుతుందన్న అనుమానంపై సైతం సలహాలు ఇచ్చారు. అలాగే ఆన్లైన్ ఉద్యోగ మోసాలు ,పెళ్ళి సంబంధాల మోసాల నుంచి రక్షణ పొందడానికి భద్రతా చిట్కాలను సైతం సైబర నిపుణులు చర్చించారు. కాగా తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. -
కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్
-
వితంతువుకు సోనూసూద్ కానుక
ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ఏమాత్రం వెనకాడని రీల్ విలన్ సోనూసూద్. రక్షా బంధన్ సందర్భంగా ఈ రియల్ హీరో ఓ వితంతువుకు సాయం చేసి మరోసారి మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు. అస్సాంలోని జల్పైగురిలో వరదల కారణంగా ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమెకు తోడుగా నిలిచేందుకు భర్త కూడా లేరు. పిల్లలు తినడానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. దీంతో దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మహిళ ట్విటర్లో షేర్ చేశారు. (సోనూసూద్ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు) పై లోకంలో ఉండే దేవుడిని తల్చుకునే బదులు కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రియల్ హీరోను సాయం చేయమంటూ వేడుకున్నారు. ఈ వీడియో కాస్తా సోనూ దృష్టికి వచ్చింది. నో చెప్పడం ఇంటా వంటా లేని ఆయన వెంటనే ఆమెకు రాఖీ పండుగరోజు వరాన్ని ప్రసాదించారు. చెల్లెమ్మకు కొత్త ఇంటిని కానుకగా ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాఖీ పండుగకు ఇంతకు మించిన గిఫ్ట్ మరొకటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. (కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం) -
అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంత లోకాలకు!
చిన్నంబావి/వీపనగండ్ల (వనపర్తి): ‘అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక రక్షాబంధన్.. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష..’ అంటూ ఆ చెల్లెలు రాఖీ కట్టింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెతో పాటు వరుసకు సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిస్టేజీ సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన నందిని (14), వరుసకు అన్నయ్య అయిన దామోదర్ (16) తో కలిసి సోమవారం ఉదయం రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్దదగడకు బైక్‌పై వెళ్లారు. తమ బంధువు శంకరయ్య ఇంటికి వచ్చి వరుసకు ఆయన కుమారులు సోదరులు కావడంతో రాఖీ కట్టింది. సాయంత్రం తిరిగి శంకరయ్య కూతురు లక్ష్మితో కలిసి ముగ్గురూ తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మీపల్లి స్టేజీ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, తూంకుంటకు చెందిన సుధాకర్, కురుమయ్య సొంత అన్నదమ్ములు. సుధాకర్ కూతురు నందిని, కురుమయ్య ఒక్కగానొక్క కుమారుడు దామోదర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూటీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి.. దేవరకద్ర: స్కూటీని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. నారాయణపేటకి చెందిన వడ్ల నాగరాణి(21), జాజాపూర్‌కు చెందిన సిద్దప్ప సోమవారం నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌కు స్కూటీపై బయల్దేరారు. చౌదర్పల్లి సమీపంలో అంతర్రాష్ట రహదారిపై మహబూబ్‌నగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీ కొట్టింది. దీంతో నాగరాణి అక్కడికక్కడే మృతి చెందగా సిద్దప్ప తీవ్రంగా గాయపడ్డాడు. -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎమన్నారంటే.. ► రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టాం. ► ఉదయం వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యునిలీవర్, ప్రోక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇంతకుముందు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. ► అర్హత పొందిన మహిళలకు నాలుగేళ్లపాటు తోడ్పాటు అందుతుంది. ► ఈ పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్థిరమైన ఆదాయం లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ► ఇందుకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం చేపడుతున్నాం.. ► 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ► రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు. ► ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది కాబట్టి దానివల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు. ► సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు. ► ఏయే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు. ► నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు. దిశ యాప్, పోలీస్స్టేషన్లు.. ► దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ► ఇవికాక దిశ పోలీస్స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. ► 18 దిశ పోలీస్స్టేషన్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టాం. ► దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేశాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. ► రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదు. ► ఇప్పటికే వారికి 50శాతం రిజర్వేషన్లు.. అమ్మ ఒడి, వసతి దీవెన ఇస్తున్నాం. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారి పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► హోంమంత్రి పదవి కూడా మహిళకు ఇచ్చాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను పెట్టాం. ► మద్యాన్ని కూడా నియంత్రించాం. ► 4ఎస్4యూ పోర్టల్ ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఇది మరో చరిత్రాత్మక ఘట్టం. హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రజని, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
రక్షా బంధన్
‘రక్షా బంధన్’ టైటిల్‌తో తాను హీరోగా నటించనున్న కొత్త చిత్రాన్ని రాఖీ సందర్భంగా సోమవారం ప్రకటించారు అక్షయ్ కుమార్. ‘తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నాచెల్లెలి సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాను తన సోదరి అల్కాకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు అక్షయ్. ‘‘ఈ కథ అందరి హృదయాల్ని తాకుతుంది. కథ విన్నాక అతి తక్కువ సమయంలో నేను అంగీకరించిన చిత్రమిదే. ప్రపంచంలో ఉన్న విశిష్టమైన బంధమేదైనా ఉందంటే అది తోబుట్టువులదే’’ అని ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. -
పాఠకులు పంపిన రక్షా బంధన్ ఫొటోలు
-
రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్
రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బంధన్ సంబర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B — Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020 అలాగే హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు. -
అన్న కోసం పోరాటం, మంత్రి కేటీఆర్ అభయం
సాక్షి, రాజన్నసిరిసిల్ల: అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అలాంటి రక్షా బంధన్ రోజున ఓ చెల్లెలు తన సోదరుడి ప్రాణాలు కాపాడండి అంటూ . మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వేములవాడ మండలం వావిలాలకు చెందిన కిడ్నీ పేషెంట్ పోచయ్య జ్వరంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది పోచయ్యను పటించుకోకపోవడంతో అతని సోదరి విలవిల్లాడారు. (చదవండి: సిఫారసు ఉంటేనే.. కరోనా పరీక్షలు!) రాఖీ పండుగ రోజు సిరిసిల్ల ఆసుపత్రికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసిన ఆమె తన అన్న ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. డాక్టర్లు బిజీగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న వైద్యం కోసం చెల్లెలు పోరాటానికి దిగిన ఘటనను స్థానికులు చూసి చలించిపోయారు. అయితే, మంత్రి కేటీఆర్ ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణం అవుతున్న సమయంలో బాధిత మహిళను పలకరించి, కిడ్నీ పేషంట్ పోచయ్యకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్‌ను ఆదేశించారు. కేటీఆర్ అన్నయ్య అభయంతో ఆ చెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. (రాఖీ విషాదం, అన్నాచెల్లెలు మృతి) -
‘సీఎం జగన్ పాలన మహిళలకు స్వర్ణ యుగం’
సాక్షి, అమరావతి : మహిళల రక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హోశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆయన నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ-రక్షాబంధన్ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించామని, రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మహిళల రక్షనకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు సైబర్ నేరాలపై ఎలా పిర్యాదు చేయాలో కూడా అవగాహన కల్పిస్తామని అన్నారు. దిశా చట్టం ద్వారా మహిళలపై అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్నామని, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని మేకతోటి సుచరిత తెలిపారు. (‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్) రక్షా బందన్ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు మరిన్ని వరాలు ఇచ్చారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మహిళా పక్షపాత పాలన నడుస్తోందని, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మహిళల సంక్షేమానికి ఎన్నో చేశారని ప్రశంసించారు. ఆగస్ట్ 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిగా దిశా చట్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి వంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల సొంతమని, వారి రక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. దానిలో భాగంగా నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించారన్నారు. వైఎస్ జగన్ పరిపాలన మహిళలకు స్వర్ణయుగం లాంటిదని. మద్యపాన నిషేధం దిశగా చేపడుతున్న ప్రభుత్వ చర్యలు మహిళల జీవన స్థితిని మారుస్తున్నాయని తెలిపారు. (శ్రీదేవి ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్) -
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
-
రాఖీ కట్టి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
సాక్షి, వనపర్తి: రాఖీ పండుగరోజు జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామం వద్ద విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సుఢీకొట్టిన ఘటనలో అన్నాచెల్లెలు మృత్యువాత పడ్డారు. మరో చెల్లెలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు తూంకుంటకు చెందిన సుధాకర్, నందినిగా తెలిసింది. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెద్దదగడకు వెళ్లి సోదరుడికి రాఖీకట్టి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (మృత్యుపాశమైన బావి) -
‘సహనం, వాస్తవం నీ నుంచే నేర్చుకున్నాను’
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు.. తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు సోదరి ప్రియాంకతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన 40 నిమిషాల్లోనే దాదాపు 18 వేల లైక్‌లు వచ్చాయి. మరో వైపు ప్రియాంక గాంధీ కూడా రాఖీ సందర్భంగా సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. (ఉన్నాను నీకు తోడుగా) Wishing every one a happy #RakshaBandhan. आप सभी को रक्षाबंधन की शुभकामनाएँ। pic.twitter.com/EJZWPSGO2J — Rahul Gandhi (@RahulGandhi) August 3, 2020 ‘కష్ట, సుఖాల్లో నా సోదరుడితో కలిసి జీవించడం వల్ల నేను తన నుంచి నేను ప్రేమ, ఓర్పు, వాస్తవం వంటి వాటిని అవర్చుకున్నాను. నీ లాంటి సోదరుడు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను. రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. हर सुख-दुख में साथ रहते हुए मैंने अपने भाई से प्रेम, सत्य और धैर्य का साथ सीखा है। मुझे ऐसा भाई मिलने पर गर्व है। समस्त देशवासियों को पावन पर्व #रक्षाबंधन की हार्दिक शुभकामनाएं।#RakshaBandhan pic.twitter.com/KWTGpTZQYy — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 3, 2020 -
‘ఈ- రక్షాబంధన్’ ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్‌కు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్లైన్లో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, రీడింగ్ మెటీరియల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (4 నుంచి ‘సైబర్ సేఫ్’పై ఆన్లైన్ ద్వారా అవగాహన.. ) అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం మహిళా సాధికారికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించిన సీఎం జగన్.. అన్ని రంగాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. సుమారు 30 లక్షలమంది మహిళల పేరుతో ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులు పర్మిట్ రూంలను పూర్తిగా తొలగించామని, 33శాతం వైన్‌షాపులను తగ్గించామని తెలిపారు. కాగా ఈ- రక్షాబంధన్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.(అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్) -
రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం
సాక్షి, ముంబై: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.(సుశాంత్ కేసు : మరో వివాదం) హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ...బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్...ఔర్ హమేషా కర్తే రహెంగే...యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. సోషల్ మీడియా ద్వారా సుశాంత్ సోదరి శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. గుల్షన్, నా బేబీ ..రక్షా బంధన్ రోజు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు. నువ్వు శాశ్వతంగా దూరమైన రక్షా బంధన్ ఉంటుందని ఆలోచించలేదు. నువ్వు లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు అంటూ నీతూ సింగ్(రాణి దీ) పోస్ట్ చేశారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో) కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరికి వైలాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నతరుణంలో రోజుకో కీలక పరిణామం వెలుగు చూస్తోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రియాపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. Happy Rakshabandhan mera sweet sa baby... bahut pyaar karte hain hum aapko jaan... aur hamesha karte rahenge... you were, you are and you will always be our PRIDE! ❤️ @sushantsinghrajput #HappyRakshaBandhan pic.twitter.com/SKWU4MlLd9 — shweta singh kirti (@shwetasinghkirt) August 3, 2020 -
రాఖీ పండుగ.. మృత్యుపాశమైన బావి
కొణిజర్ల: అక్కా రాఖీ పండుగకు మా అమ్మ వాళ్లింటికి పోతున్నా, తొందరగా నాటు పూర్తి చేద్దాం, రాఖీ కట్టడానికి మీ ఇంటికి పోతున్నావా వదినా, కరోనా ఉంది జాగ్రత్త అంటూ అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకున్న మహిళా కూలీలు అంతలోనే వ్యవసాయ బావి రూపంలో కానరాని లోకాలకు తరలిపోయారు. వ్యవసాయ బావిలో ప్రమాద వశాత్తు ఇద్దరు మహిళా కూలీలు పడి మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్లకు చెందిన తద్దె నాగేశ్వరరావు అనే కౌలు రైతు పొలంలో నాటు వేసేందుకు 9 మంది మహిళలు వెళ్లారు, మధ్యాహ్నానికి నాటు పూర్తి చేసారు. భోజనం చేసి వేరే రైతుకు చెందిన పొలంలో నాటు వేయాలని నిర్ణయించుకుని పక్కనే ఉన్న షేక్ చిన సైదబాబు అనే రైతు వ్యవసాయ బావి వద్దకు కాళ్లు కడుక్కోవడానికి వెళ్లారు. 9 మంది కూలీలలో బండారు మల్లిక (30), తుప్పతి రమాదేవి (35), చింతల మమత, తద్దె నాగమణి, తద్దె మౌనికలు బావిలో ఉన్న మెట్లపై ఉండి కాళ్లు కడుకొంటున్నారు. ఈ క్రమంలో మెట్టు కూలడంతో ఐదుగురు ఒకేసారి బావిలో పడిపోయారు. వారు పడిపోవడం చూసిన ముఠామేస్త్రి చింతల యల్లమ్మ తన వద్ద ఉన్న చీర విసిరి మమత, నాగమణి, మల్లికలను బయటకు లాగింది. ఈ లోగా మల్లిక, రమాదేవి బావిలో మునిగి చనిపోయారు. మహిళల కేకలు విని సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరిగెత్తుకొచ్చారు. బావిలో నీరు నిండుగా ఉండటంతో మోటార్ల సాయంతో నీరు బయటకు వెళ్లదీసి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటి వరకు సంతోషంగా నాటు వేసిన తోటి మహిళలు అంతలోనే విగత జీవులుగా మారి పోవడంతో కూలీలు నిశ్చేష్టులయ్యారు. సంఘటనా స్థలంలో స్థానికుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన రమాదేవికి భర్త నరసింహారావు, కూతురు మౌనిక, కుమారుడు మధు ఉన్నారు. మల్లికకు భర్త భాస్కరరావు, ఇద్దరు చిన్నారి కూతుళ్లు జస్మిత, దివ్య ఉన్నారు. ఎస్ఐ మొగిలి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘యల్లమ్మ’ తల్లి కొణిజర్ల: తన కళ్ల ముందే ఐదుగురు తన తోటి మహిళలు బావిలో పడగా ముగ్గురిని కాపాడుకోగలిగాను.. మరో ఇద్దరు బావిలో మునిగి పోయారని ముఠా మేస్త్రి చింతల యల్లమ్మ వాపోయింది. బావిలోపడ్డ మహిళలను ధైర్యంగా తన చీరతో ముగ్గురిని బయటకు లాగిన యల్లమ్మను పలువురు దేవతగా కొనియాడారు. ఆమె మాటల్లోనే.. నాటు పూర్తి చేసుకుని కాళ్లు చేతులు కడుక్కొని అన్నం తినడానికి సిద్ధమయ్యాం.. బండారు మల్లిక, తుప్పతి రమాదేవి, చింతల మమత, తద్దె మౌనిక, తద్దె నాగమణి బావిలోకి దిగి మెట్టుమీద నిలుచుని ముఖం కడుక్కుంటున్నారు. ఒక్కసారిగా మెట్టు కూలి పోవడంతో ఐదుగురు బావిలో పడిపోయారు. వెంటనే నా చేతిలో ఉన్న కండువా విసరడంతో మౌనిక పట్టుకుని బయటకు వచ్చింది. తర్వాత నా చీర తీసి బావిలోకి విసిరాను దాని సాయంతో మమత, నాగమణిని బయటకు లాగ గలిగాను. అప్పటికే రమాదేవి, మల్లిక రెండు సార్లు పైకి తేలి మునిగి పోయారు. నాతో పాటు మరో ఇద్దరి చీరలు కలిపి బాలిలోకి విసిరినా వారు పట్టుకోలేక పోయారు. దీంతో కళ్ల ముందే బావిలో మునిగి పోయారు. మా పక్కనే ఉన్న పొలం యజమాని కుమారుడు బావిలోకి దూకి ప్రయత్నించినా నీళ్లు బాగా ఉండటంతో బయటకు తీయలేక పోయాడు. ముగ్గురిని ధైర్యంగా కాపాడిన యల్లమ్మను పలువురు ప్రశంశిస్తున్నారు.ధైర్యంగా చీరవేసి బయటకు లాగి కాపాడిన యల్లమ్మను పొలీసులు,స్థానికులు అభినందించారు. -
వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలోని వేమన మందిరం వద్ద వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ తన కుటుంబంతో కలిసి వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని ఈ సందర్భంగా లక్ష్మీ పేర్కొన్నారు. -
సీఎం జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు
-
అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.(బాలలు, మహిళల భద్రతకు ‘రక్షా’బంధన్) The joyous festival of #RakshaBandhan celebrates the eternal bond of love between siblings. To protect one another has taken on a different meaning this year, amidst a pandemic, but the festive spirit remains the same. Greetings & lots of love to all my dear sisters across AP. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2020


