సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్‌ షర్మిల  | YS Sharmila Ties A Rakhi To YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల 

Aug 15 2019 8:12 PM | Updated on Aug 15 2019 8:19 PM

YS Sharmila Ties A Rakhi To YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాఖీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి వైఎస్‌ షర్మిల రాఖీ కట్టారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ తన సోదరికి స్వీటు తినిపించారు. ఇక, ఇవాళ రాత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లనున్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే శుభాకాంక్షలు తెలియజేశారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement