నాగ్‌.. నా ‘చినాబు’

Akkineni Nagarjuna Sister Naga Susheela Raksha Bandhan Story - Sakshi

‘అక్కినేని నాగార్జున.. పరిచయం అక్కర్లేని స్టార్‌ హీరో.. అమ్మాయిలకు మన్మథుడు, గ్రీకు వీరుడు.. ఇండస్ట్రీకి యువసమ్రాట్‌.. ఫ్యాన్స్‌కు ముద్దుపేరు నాగ్, స్మార్ట్‌ స్టార్, టెరాస్టార్, కింగ్‌.. సోదరి నాగసుశీలకు మాత్రం ‘చినాబు’..అందరికంటే చిన్నవాడు, గారాల తమ్ముడు, అల్లరి పిల్లాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నాగార్జునను చినాబు అని పిలుస్తుంటుంది.. నాగార్జున టాలీవుడ్‌లో ఎంతటి స్టార్‌ అయినా నాగసుశీలకు మాత్రం గారాల తమ్ముడే. ఆమె ముద్దుగా చినాబు అని పిలుస్తుంది.

‘అక్కినేని నాగార్జున.. పరిచయం అక్కర్లేని స్టార్‌ హీరో.. తన అక్క నాగసుశీల ఆయన్ని ‘చినాబు’ అని పిలుస్తుందంట. అందరికంటే చిన్నవాడు గారాల తమ్ముడు, అల్లరి పిల్లాడు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను నాగ్‌ తమ్ముడిని ‘చినాబు’ అని పిలుస్తానంటూ ‘సాక్షి’కి వివరించారు. ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో మాత్రం ఆయన నంబర్‌ని ‘నాగ్‌’ అనే పేరుతోనే సేవ్‌ చేసుకున్నారంట. రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘సాక్షి’ నాగసుశీలని పలకరించగా.. హీరో నాగార్జున సుశీల మధ్య అనుబంధం, ఆయన ఏ విధంగా సుశీలని పిలుస్తారు, ప్రతి రాఖీకి ఏం చేస్తారు? అనే కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలను ఆమె మాటల్లోనే...! 

రాఖీ ద్వారా నా ప్రేమను చూపిస్తుంటా..  
ప్రతి సంవత్సరం తమ్ముడు   ‘చినాబు’ ఎక్కడున్నా సరే వెళ్లి మరీ రాఖీ కడతా.. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య జరిగే సరదా సంభాషణలు పొట్టచెక్కలయ్యేలా ఉంటాయి. నేను రాఖీ కట్టి శుభాకాంక్షలు చెబుతాను. ‘చినాబు’ కూడా ఏదో ఒక గిఫ్ట్‌తో నన్ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. నేనైతే గిఫ్ట్‌ కోసం కట్టను,   నా తమ్ముడిపై నాకున్న వల్లమాలిన అభిమానం, ప్రేమను ఆరోజు మరింతగా వ్యక్తపరుస్తా.. తమ్ముడు గిఫ్ట్‌ ఇచ్చి నా మీద అతడికి ఉన్న ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తుంటాడు. (ప్యాకెట్‌ మనీతో వాళ్లు రాఖీ కొనేవారు..)

ప్రతి సండే ఇష్టమైన మెనూ..
నా వివాహం అయ్యాక కొంతకాలం నేను యూఎస్‌ లో ఉన్నాను. ఆ సమయంలో చినాబు కూడా అక్కడ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. మా మధ్య సాన్నిహిత్యం, స్నేహం, బాండింగ్‌ అప్పుడు బాగా స్ట్రాంగ్‌ అయ్యింది. సండే వస్తుందంటే చాలు రెండు రోజుల ముందే కావాల్సిన వంటకాల మెనూ అంతా చెప్పేవాడు. నేను ఇంటికి వచ్చే సరికి ఇవన్నీ నాకోసం చేసిపెట్టాలనేవాడు. మెనూ నోట్‌ చేసుకున్నాక ఆ తయారీలో నేను నిమగ్నమయ్యేదాన్ని. సండే చినాబు ఇంటికి రాగానే ఆ మెనూ వంటకాలతో సర్‌ప్రైజ్‌ చేసేదాన్ని. వారం రోజుల పాటు వేసుకున్న దుస్తులన్నీ తెచ్చి నా ముందు పడేసేవాడు(నవ్వుతూ).. మరుసటి రోజు వెళ్లేసరికి వాటన్నింటిని ఉతికి ఇస్త్రీ చేసి రెడీ చేసి ఇచ్చేదాన్ని నా ముద్దుల తమ్ముడికి(నవ్వుతూ).. 

నాగ్‌.. నా ‘చినాబు’
మా తోబుట్టువుల్లో అందరి కంటే చిన్నవాడు, గారాల తమ్ముడు, అల్లరి పిల్లోడు నాగార్జున. చిన్నప్పటి నుంచి నాగ్‌ను ఆప్యాయంగా ‘చినాబు’ అని పిలవడం అలవాటయ్యింది. ప్రతి సంవత్సరం తమ్ముడు ఎక్కడున్నా సరే వెళ్లి మరీ రాఖీ కడతాను. వాడిపై నాకున్న అభిమానం, ప్రేమను ఈ రోజు మరింత ఎక్కువగా వ్యక్తపరుస్తా. నాతో ఎంత సరదాగా ఉంటాడో.. నా విషయంలో అంతే కేర్‌ తీసుకుంటాడు. ప్రపంచంలోనే నా తమ్ముడంతా కేరింగ్‌ పర్సన్‌ ఇంకొక్కరు ఉండరని చెప్పడానికి నేను గర్వంగా ఫీలవుతుంటా. ప్రస్తుతం ‘కరోనా’ నేపథ్యంలో మా ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాట్సాప్‌లో ప్రతిరోజూ పోస్ట్‌ చేస్తుంటాడు చినాబు. మరో జన్మలోనూ నాగ్‌కు అక్కగానే పుట్టాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా.      – నాగసుశీల, హీరో నాగార్జున సోదరి 

కేరింగ్‌ బ్రదర్‌.. 
నాగార్జున పెద్ద స్టార్‌.. బిజీ బిజీ లైఫ్‌. కానీ.. ఫ్యామిలీకి నా తమ్ముడు కేటాయించే సమయం మా అందర్నీ ఎంతో సంతోషపరుస్తుంటుంది. కాల్‌ చేసి ‘సుషీల.. సుషీలమ్మ.. అంటూ పిలుస్తూ ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌..? ఎవ్రీతింగ్‌ ఈజ్‌ ఓకేనా? ఇబ్బందేమీ లేదు కదా? ఏమున్నా ఒక్క కాల్‌ చేయ్‌..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక అక్కగా నా తమ్ముడి నుంచి ఇంతకన్నా నాకేం కావాలి? ఎంత సరదాగా ఉంటాడో.. అంతే కేర్‌ తీసుకుంటాడు నా విషయంలో.. ప్రపంచంలోనే నా తమ్ముడంత కేరింగ్‌ పర్సన్‌ ఇంకొక్కరూ ఉండరని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top