‘రక్షాబంధన్‌’ కోసం 5కిలోలు పెరిగా: అక్షయ్‌

Akshay Kumar Gains Weight For Aanand L Rais Raksha Bandhan - Sakshi

పాత్ర కోసం అక్షయ్‌కుమార్‌ ఎలాంటి రిస్క్‌ అయినా చేస్తారు. ఎలాంటి మేకోవర్‌కి అయినా రెడీ అయిపోతారు. తాజాగా అక్షయ్‌ ‘రక్షాబంధన్‌’ సినిమా కోసం బరువు పెరుగుతున్నారు. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో భూమీ ఫడ్నేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం 5 కేజీల బరువు పెరిగారు అక్షయ్‌. బరువు పెరగడం గురించి అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘పాత్ర కోసం బరువు తగ్గడం లేదా పెరిగే ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తాను.

‘రక్షాబంధన్‌’ కోసం సహజమైన పద్ధతిలోనే 5కిలోలు పెరిగాను. ఈ బరువు పెరిగే ప్రాసెస్‌లో మా అమ్మ చేతి హల్వా తినే అదృష్టం కూడా నాకు కలిగింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... అక్షయ్‌కుమార్‌ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సూర్యవంశీ’ విడుదల కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కోసం అప్పట్లో 5 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top