బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని ఒక కారు ప్రమాదానికి గురైంది. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ట్వింకిల్ ఖన్నాతో ఆయన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.. తమ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న వారు ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమిక కథనాల ప్రకారం.. వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు మొదట ఒక ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని వాహనం అదపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ సమీపంలో వరుసుగా పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ప్రయాణిస్తున్న కారు సురక్షితంగానే ఉంది.
ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అక్షయ్ కుమార్ వెంటనే తన సిబ్బందితో పాటు కారు నుంచి దిగి ప్రమాదంలో చిక్కుకున్న ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఆటో తీవ్రంగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీలచ్చుకున్నారు.
#Exclusive: A very dangerous acc!dent has happened… reportedly involving #AkshayKumar ’s security team..!@akshaykumar Hope You Are Fit and Fine Paaji 👍❤️ pic.twitter.com/DZ12n1RiMu
— Rizwan Khan (@imrizwankhan786) January 19, 2026


