తొలిసారి అలాంటి సినిమా చేస్తున్న అక్షయ్‌ కుమార్‌ | Akshay Kumar Begins Raksha Bandhan Movie Shooting | Sakshi
Sakshi News home page

Akshay Kumar: ఈ సినిమా తనకు అంకితం

Jun 22 2021 7:36 AM | Updated on Jun 22 2021 7:36 AM

Akshay Kumar Begins Raksha Bandhan Movie Shooting - Sakshi

అక్షయ్‌ కుమార్‌ అన్నయ్య అయ్యారు. నిజజీవితంలో ఆయనకో చెల్లెలు ఉంది. కానీ సినిమాలో..

అక్షయ్‌ కుమార్‌ అన్నయ్య అయ్యారు. నిజజీవితంలో ఆయనకో చెల్లెలు ఉంది. కానీ సినిమాలో నలుగురు చెల్లెళ్లకు అన్న అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అక్షయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షా బంధన్‌’. ఇందులో నలుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా కనిపించనున్నారాయన. ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. అక్షయ్‌ కుమార్‌ తొలిసారి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ఇది.

భూమీ పెడ్నేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌ తండ్రి పాత్రలో  నానా పటేకర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని సోమవారం ఆరంభించారు. ‘‘నా సోదరి అల్కా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆనంద్‌ రాయ్‌తో చేస్తున్న ‘రక్షా బంధన్‌’ తనకి, మా మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన బంధానికి అంకితం’’ అని లాక్‌డౌన్‌ 2.0 తర్వాత ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న సందర్భంగా అక్షయ్‌ పేర్కొన్నారు. 

చదవండి: వివాదంలో అక్షయ్‌ కుమార్‌ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement