రక్షా బంధన్‌ | Akshay Kumar and Aanand L Rai team up for Rakshabandhan | Sakshi
Sakshi News home page

రక్షా బంధన్‌

Aug 4 2020 2:13 AM | Updated on Aug 4 2020 2:37 AM

Akshay Kumar and Aanand L Rai team up for Rakshabandhan - Sakshi

‘రక్షా బంధన్‌’ టైటిల్‌తో తాను హీరోగా నటించనున్న కొత్త చిత్రాన్ని రాఖీ సందర్భంగా సోమవారం ప్రకటించారు అక్షయ్‌ కుమార్‌. ‘తను వెడ్స్‌ మను, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నాచెల్లెలి సెంటిమెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది.

ఈ సినిమాను తన సోదరి అల్కాకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు అక్షయ్‌. ‘‘ఈ కథ అందరి హృదయాల్ని తాకుతుంది. కథ విన్నాక అతి తక్కువ సమయంలో నేను అంగీకరించిన చిత్రమిదే. ప్రపంచంలో ఉన్న విశిష్టమైన బంధమేదైనా ఉందంటే అది తోబుట్టువులదే’’ అని ట్వీట్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement