Raksha Bandhan 2022: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

Women Leaders Tie Rakhi To AP CM YS Jagan On Raksha Bandhan - Sakshi

సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.

వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు.
చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం 

కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top