YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం  | MLC Sivarami Reddy Launches YSR YVR Canteen In Guntakallu | Sakshi
Sakshi News home page

YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం 

Aug 11 2022 9:41 AM | Updated on Aug 11 2022 12:44 PM

MLC Sivarami Reddy Launches YSR YVR Canteen In Guntakallu - Sakshi

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

గుంతకల్లుటౌన్‌(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్‌ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భవానీ, వైస్‌ చైర్‌పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ  గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్‌ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు ఎన్‌.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్‌ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి,  కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement