18న వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందు | YSRCP Iftar dinner on march 18th | Sakshi
Sakshi News home page

18న వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందు

Mar 13 2026 3:00 AM | Updated on Mar 13 2026 3:00 AM

YSRCP Iftar dinner on march 18th

ఇఫ్తార్‌లో పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో నిర్వహణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తెలిపారు. అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు గురువారం ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏటా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలిచి మేలు చేశారని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement