శ్రీకాకుళం గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం | Photo Morphing Incident At Gayatri College Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం

Mar 12 2026 6:22 PM | Updated on Mar 12 2026 6:48 PM

Photo Morphing Incident At Gayatri College Srikakulam

(ప్రతీకాత్మక చిత్రం)

శ్రీకాకుళం:   గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. పలువురి విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్‌ చేసిన ఘటన వెలుగుచూసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా పలువురి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్‌కు పాల్పడ్డారు అక్కడే చదవుతున్న పలువురు విద్యార్థులు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజ్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. తమ కుమార్తెల ఫోటోలను  ఇలా మార్ఫింగ్‌ చేసి బయటకు అమ్మేశారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే ఈ ఘటనకు పాల్పడిన సదరు విద్యార్థులను టీసీలిచ్చి పంపించేశామని యాజమాన్యం అంటోంది. దీనిపై కాలేజ్ ప్రిన్సిపాల్‌ కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ ఏఐ ద్వారా నిందితులు ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఫోటోలు మార్ఫింగ్‌కు సంబంధించి విద్యార్థిని తల్లిదండ్రుల కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే మాట్రిక్ పాల్పడిన ఐదుగురు విద్యార్థులకు టిసిలు ఇచ్చి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.  వారిని గుర్తించి టీసీలిచ్చి పంపించేశాం’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement