‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’ | YSRCP Leader Malladi Vishnu Takes On Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’

Mar 12 2026 3:50 PM | Updated on Mar 12 2026 5:25 PM

YSRCP Leader Malladi Vishnu Takes On Chandrababu Sarkar

తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో  స్పందన లేదు.

శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.

కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement