కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం! | Kids Trafficking Centered in Kaikaluru | Sakshi
Sakshi News home page

కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం!

Mar 12 2026 6:56 PM | Updated on Mar 12 2026 7:06 PM

Kids Trafficking Centered in Kaikaluru

ఏలూరు: జిల్లాలోని కైకలూరు కేంద్రంగా పసిబిడ్డలను విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. పసిబిడ్డలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు అకేటి మోక్షిత అదృశ్యమయ్యాడు.  గత 13 రోజుల నుంచి మోక్షిత్‌ ఆచూకీ కనిపించడం లేదు. 

ఇంటిముందు ఆడుకుంటున్న మోక్షిత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 

దీనిపై జనసేన నేత ఏఎన్‌ బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను విక్రయిస్తున్నడని ఏఎన్‌ బాబుపై ఆరోపణులు వస్తున్నాయి. దాంతో ఏఎన్‌ బాబు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏఎన్‌ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు. అయితే ఏఎన్‌ బాబు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement