ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి.. | Blinkit Swiggy Achieve New Record in Sales During Raksha Bandhan | Sakshi
Sakshi News home page

నిమిషానికి 693 రాఖీలు.. ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!

Aug 20 2024 6:19 PM | Updated on Aug 20 2024 7:58 PM

Blinkit Swiggy Achieve New Record in Sales During Raksha Bandhan

అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.

రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్‌లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్‌ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్‌లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్‌లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్‌లో హామ్లీస్, చాక్లెట్‌లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement