వైరలవుతోన్న రణ్‌వీర్‌ సింగ్‌ ఫోటోలు

Ranveer Singh Shares Adorable Photo With Sister Ritika on Raksha Bandhan - Sakshi

దేశ వ్యాప్తంగా ప్రజలు నిన్న సంతోషంగా రక్షా బంధన్‌ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు తమ అన్నదమ్ములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలతో పాటు ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో హీరో రణ్‌వీర్‌ సింగ్‌ షేర్‌ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

‘నా బెస్ట్‌ఫ్రెండ్‌, నా రక్షకురాలు, నా ఏంజిల్‌’ అంటూ సోదరితో కలిసి చిన్నతనంలో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రణ్‌వీర్‌ సింగ్‌. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే వేలల్లో లైక్‌లు, కామెంట్లు అందుకుంది. ఇకపోతే రక్షా బంధన్‌ సందర్భంగా హీరోయిన్‌ అలియా భట్‌.. కరణ్‌జోహర్‌ కుమారుడు యష్‌కు రాఖీ కట్టారు. ఈ ఫోటోలు కూడా అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ 83తో బిజీగా ఉండగా.. అలియాభట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
 


Just too much love.. ❤️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top