రక్షా బంధన్‌.. పోషణ బంధం | Special poshan abhiyaan scheme on Raksha Bandhan | Sakshi
Sakshi News home page

Raksha Bandhan రక్షా బంధన్‌.. పోషణ బంధం

Aug 7 2025 10:19 AM | Updated on Aug 7 2025 11:12 AM

Special poshan abhiyaan scheme on Raksha Bandhan

ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అంటూ పోషణ బంధం రాఖీ.. వ్యసనాలకు లోనుకాకు, మత్తువదులూ అంటూ సోదరబంధం రాఖీలతో కొత్త రాఖీలకు శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ. 

పోషకాహారం, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో సరికొత్త మార్గంలో రాఖీ వేడుకలకు సన్నద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ అభియాన్‌ (poshan abhiyaan) పథకంలో భాగంగా చిన్నారులకు పోషణ బంధం రాఖీల పంపిణీ.. ప్రభుత్వ కళాశాలల్లోని యువతకు మిషన్‌ పరివర్తన నషాముక్త్‌భారత్‌ అభియాన్‌ పథకంలో భాగంగా సోదరబంధం రాఖీలు పంపిణీ చేసి రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించనుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌ వీటికి సోదరబంధం, పోషణ బంధం రాఖీలుగా నామకరణం చేసి ఈ ఏడాది ప్రతీ అంగన్‌వాడీ బడిలోనూ, కళాశాలల్లోనూ రాఖీ వేడుకలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement