...అనే నేను | Newly Elected Sarpanch Candidates Takes Oath Ceremony | Sakshi
Sakshi News home page

...అనే నేను

Dec 22 2025 1:50 AM | Updated on Dec 22 2025 1:50 AM

Newly Elected Sarpanch Candidates Takes Oath Ceremony

నేడు సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం 

 కొలువుదీరనున్న పాలక మండళ్లు 

పంచాయతీలకు ‘కొత్త’ కళ  

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని 525 మంది సర్పంచులు .. అనూ నేను అంటూ ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.  పంచాయతీ ప్రత్యేక అధికారులు/ కార్యదర్శులు గ్రామ ప్రథమ పౌరుడితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

ఎన్నికైన అభ్యర్థులు తమ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 526 పంచాయతీలు సహా 4,668 వార్డులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నవంబర్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. మొదటి విడతలో భాగంగా ఈనెల 11న 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు, రెండో విడతలో భాగంగా 14న 178 పంచాయతీలు, 1,540 వార్డులకు, మూడో విడతలో భాగంగా 17న 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 

కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ  సజావుగా పూర్తయింది. గెలుపొందిన అభ్యర్థుల పేర్లను కూడా అదే రోజు ప్రకటించారు. రెండేళ్లుగా ప్రత్యేక పాలనలో మగ్గిన ఆయా పంచాయతీలు ఇక నుంచి నూతన పాలకవర్గం సభ్యులతో కళకళ లాడనున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement