ఆ కుటుంబానిదే ఆధిపత్యం
పెద్దపల్లిరూరల్: కనగర్తి గ్రామ పంచాయతీలో యెడెల్లి శంకర్ కుటుంబానిదే ఆధిపత్యం నడుస్తోంది. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లపాటు సేవలు అందించిన ఆ కుటుంబానికి చెందిన ఎడెల్లి శ్రీదేవి ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. జనరల్ మహిళకు కేటాయించడంతో (రెండోసారి) సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఎడెల్లి శంకర్ రెండుసార్లు సర్పంచ్‌గా, ఓసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై గ్రామానికి సేవలు అందించారు. యెడెల్లి శంకర్.. ‘కనగర్తి శంకర్’గా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.


