పకడ్బందీ ప్రణాళిక.. అప్రమత్తం
● పంచాయతీ ఎన్నికల్లో భారీగా నగదు, లిక్కర్ స్వాధీనం
గోదావరిఖని: పకడ్బందీ ప్రణాళిక, సమయస్ఫూర్తి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రామగుండం పో లీస్ కమిషనరేట్ పోలీసులు.. పంచాయతీ ఎన్నిక ల్లో అక్రమంగా తరలించే నగదు, మద్యం, విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు.
ఓటర్లను మభ్యపెట్టేందుకు..
ఓటర్లను మభ్యపెట్టేందుకు నగదు, మద్యం ప్రవాహం ఈసారి భారీగా పెరిగింది. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి కనీసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారనే ప్రచారం ఉంది. ఈక్రమంలో గ్రామాల్లో ఉద్రిక్తత కూడా పెరిగింది. అయినా.. పరిస్థితులపై సమాచారం సేకరిస్తూ అక్రమ మద్యం, ధన ప్రవాహాన్ని నిలువరింపజేశా రు. సున్నిత, అతిసున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. మొబైల్ పెట్రోలింగ్ పార్టీ లు, క్విక్ రెస్పాన్స్‌టీంలతోపాటు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు.
1,700 మందితో బందోబస్తు..
పంచాయతీ ఎన్నికలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. మంచి ఆదాయం ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు పంచిపెట్టారు. చిన్న పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ముట్టజెప్పారు. ఈక్రమంలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో రూ.13.73లక్షలు నగదు, రూ.9.84లక్షల విలువైన లిక్కర్, రూ.1.58 లక్షల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోదశలో 1,700 మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు.
స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం


