మానేరుపై మరో వంతెన
మంథని: మంథని నియోజకవర్గంలోని గో దావరి నదిపై ఇప్పటికే పలు వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయింయిన ప్రభుత్వం.. తాజాగా ఆరెంద వద్ద మానేరుపై రూ.203 కోట్లతో మరోవంతెన నిర్మించనుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఆరెంద నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దామెరకుంట వరకు 1.120 కిలో మీటర్ల పొడవున, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ వంతెన, 9.530 కి.మీ. పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. వంతెన అందుబాటులోకి వస్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర–ముక్తీశ్వర స్వామి దేవాలయం అంతర్ రాష్ట్ర వంతెన వరకు, అక్కడి నుంచి మహారాష్ట్రకు మార్గం సుగమం కానుందని ఆయన తెలిపారు. జిల్లావాసులు కాళేశ్వరం వెళ్లడానికి 25 కి.మీ. దూరభారం తగ్గుతుందన్నారు. కా ళేశ్వరం టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి/మంథని : భూపాలపల్లి – పెద్దపల్లి జి ల్లాల సరిహద్దుల్లోని మానేరుపై అడవిసోమన్‌పల్లి వద్ద నిర్మించిన చెక్‌డ్యాం కూలిపోవడానికి బాధ్యులైన వారిన వారిని గుర్తించి చర్య లు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరా రు. ఈమేరకు కలెక్టర్‌కు శనివారం వినతి ప త్రం అందించారు. అనంతరం వారు మాట్లా డుతూ, గత ప్రభుత్వం మానేరుపై చెక్‌డ్యాంలు నిర్మించిందన్నారు. ఇవి కూలిపోవడంపై అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పర విరుద్ధమై న ప్రకటనలు చేస్తున్నారని, ఇది ప్రజలను త ప్పుదారి పట్టించడమేనని, రాజకీయ కోణంలో ప్రజాప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటుందన్నారు. ప్రతినిధులు ప్రసాద్, వెంకన్న, సత్యం, శశి భూషణ్ కాచే, ప్రవీణ్‌కుమార్, శంకర్, కిరణ్, సమ్మయ్య పాల్గొన్నారు.
నేటినుంచి రైల్వేగేట్ మూసివేత
ఓదెల(పెద్దపల్లి): ఓదెల రైల్వేస్టేషన్ సమీపంలోని తారక రామకాలనీ లెవల్ క్రాసింగ్ రై ల్వేగేట్‌ను ఆదివారం నుంచి మూసిఉంచనున్నారు. రైళ్లవేగం మరింత పెంచేందుకు ఆధునికీకరణ చేపడతారు. వారం రోజుల పాటు మరమ్మతులు కొనసాగనున్న దృష్ట్యా రైల్వే గేట్ మూసివేసి ఉంచుతామని, ప్రయాణికులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
జిల్లాస్థాయి క్రాస్‌కంట్రీ పోటీలు
ధర్మారం(ధర్మపురి): నందిమేడారం గురుకు ల విద్యాలయంలో క్రాస్‌కంట్రీ జిల్లాస్థాయి పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము గట్టయ్య శనివారం ప్రారంభించా రు. బాల,బాలికలకు అండర్–16లో 2 కి.మీ., అండర్–18లో 6కి.మీ. అండర్– 20లో 8 కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. విభాగాల్లో క్రాస్‌కంట్రీ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను వచ్చే నెల 2న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా తరఫున పంపించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య, అంజయ్, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు.
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఈనెల 23న గోదావరిఖని నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు నడపనున్నట్టు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరిఖని లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరే ఈ బస్సు.. పెద్దపల్లి, కరీంనగర్ నుంచి కాణి పాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతా ళశంభు, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబకు వెళ్తుందన్నారు. భక్తుల కు దర్శన అవకాశం కల్పించాక ఈనెల 29న గోదావరిఖని చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు చా ర్జీ నిర్ణయించామని టికెట్లను www.tgsrtc bus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకో వాలని, వి వరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
మానేరుపై మరో వంతెన
మానేరుపై మరో వంతెన


