దరఖాస్తుల పరిష్కారంలో అగ్రస్థానం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్‌రావును తన కార్యాలయంలో శనివారం కలెక్టర్ అభినందించారు. ప్ర జావాణి దరఖాస్తులను పరిష్కరించడంలో తహసీల్దార్ జగదీశ్వర్‌రావు విశేష కృషి చేశారని, దీంతో ఆయనను ప్రణాళిక కమిషన్ వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్‌లో ప్రశంసించారని అన్నారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ భవిష్యత్‌లోనూ ఇలాంటి పనితీరు కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
యాప్‌లో బుక్‌చేస్తేనే యూరియా
పెద్దపల్లిరూరల్: యూరియా అవసరమైన రైతులు.. యాప్‌లో బుక్‌చేస్తే కొనుగోలు సులభం అవుతుందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జెండా కూడలిలో ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటలు వేసిన ప్రతీరైతు అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారని కలెక్టర్ అన్నారు. ఇంటివద్ద బుక్ చేసుకుని ఎరువుల షాప్ నుంచి వివరాలు, ఓటీపీ చెప్పి పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏవో అలివేణి తదితరులు పాల్గొన్నారు.


