breaking news
Peddapalli District News
-
చర్యలు తీసుకోవాలి
ఓవర్‌లోడ్, స్పీడ్‌గా వెళ్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలి. రెవెన్యూ, పోలీసులు, ఎంవీఐ, ట్రాఫిక్ పోలీస్‌లు నిత్యం పర్యవేక్షించాలి. – కోండి సతీశ్, బీసీ జేఏసీ నేత, పెద్దపల్లి నిబంధనలు పాటించాలి నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవు. ఓవర్ లోడ్, అతివేగం వద్దు. లారీలు, టిప్పర్ తదితర వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లవద్దు. ప్రమాదాల నియంత్రణకు నిత్యం తనిఖీలు చేస్తున్నాం. – అనిల్, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి -
నేడు న్యాయ విజ్ఞాన సదస్సు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఇండియా మి షన్ హైస్కూల్లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యే ఈ సదస్సులో చట్టాలపై అవగాహణ కల్పిస్తారని వివరించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీజేపీ శ్రేణుల సంబురాలు పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు శుక్రవారం సంబురాలు ఘనంగా నిర్వహించారు. బిహార్‌లో ఆ పార్టీ ఘన విజ యం సాధించడంపై టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు కందుల శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, చందు సునీల్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, ఎల్లేంకి రాజన్న, లంక శంకర్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకు ఆపద
సాక్షి పెద్దపల్లి: రక్తహీనతతో బాధపడే మహిళలు జిల్లాలో అత్యధికంగా ఉండగా.. గర్భిణులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పోషకాహార లోపం ఇందుకు కారణమని వైద్యులు వివరిస్తున్నారు. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 18 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లలో తరచూ నిర్వహించే వివిధ పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం.. పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 6,328 మంది గర్భిణులకు డాక్టర్లు, సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. అందులో 1,551 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందులో 60 మందికి పైగా అతితీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారు. రక్తహీనతకు కారణాలిలు.. పల్లెవాసులకు పౌషకాహారంపై అవగాహన లేక రక్తహీనత బారిన పడుతున్నారు. ఆహారంలో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, సీ, బీ–12 తదితరాలు లోపిస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువతులు అధికంగా జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం, ఆకుకూరలు, పండ్లు తినకపోవడం, డైటింగ్ చేయడం, త్వరగా గర్భం దాల్చడం, ప్రసవం తర్వాత బిడ్డకు బిడ్డకు మధ్య గ్యాప్ లేకపోవడం, డెలివరీ తర్వాత ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వేసుకోకపోవడం, ఆహారం తీసుకోకపోవడం తదితర సమస్యలతో మహిళల్లో రక్తహీనత తలెత్తుతోందని అంటున్నారు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ తక్కువగా వుంటే పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, ప్రసవ సమయంలో రక్తస్రావం అధికం కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. హెచ్‌బీ శాతం ఎంత ఉండాలి? హెచ్‌బీ(హిమోగ్లోబిన్) సాధారణంగా ఒక్కొక్కరికి సగటున 13 నుంచి 15 శాతం ఉంటే పూర్తిఆరోగ్యంగా ఉన్నట్లు. గర్భిణుల్లో 12 శాతం కచ్చితంగా ఉండాలి. లేదంటే వారు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. తొమ్మిది కన్నా తక్కువ ఉంటే వైద్యుల సూచన మేరకు ఐరన్ మాత్రలు, ఇంజక్షన్లు వాడాలి. ఆరు కన్నా తక్కువ ఉంటే తప్పకుండా రక్తం ఎక్కించుకోవాలి. ఈ ఆహారం తీసుకుంటే మేలు నిత్యం బీట్రూట్, ఆపిల్, వేరుశెగ, నల్లనువ్వుల ఉండలు, బెల్లం, బచ్చలికూర, చిక్కుడుగింజలు, బఠానీలు, ఎండుద్రాక్ష ఆహారంగా తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. బూడిదగుమ్మడికాయ, గుడ్లు తీసుకున్నా హెచ్‌బీ శాతం పెరుగుతుంది. గుడ్డులో ఐరన్, పాస్ఫరస్, జింక్ అధికమెత్తంలో ఉంటా యి. ఐరన్‌తో అలసట, బలహీనత దూరమవుతాయి. జింక్‌తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతీ వంద మందిలో 24 మందికి రక్తహీనత – వాణిశ్రీ, డీఎంహెచ్‌వో -
అద్దెకు సెల్లార్!
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని కొందరు షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్లను వ్యాపారాలకు అద్దెకిస్తున్నా రు. అందులో నిలపాల్సిన వాహనాలు రోడ్లపై పా ర్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావ రిఖని తదితర ప్రాంతాల్లో ఈ దుస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధం జిల్లా కేంద్రంతోపాటు రామగుండం నగరం, ప్రధా న పట్టణాల్లో ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సముదాయాల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్లు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు అద్దె కు ఇస్తున్నారు. వాస్తవానికి షాపింగ్ కోసం వచ్చినవారు వాహనాలను పార్క్ చేసేందుకు సెల్లార్లను వినియోగించాలి. అధికారులు ఏం చేస్తున్నారు? సెల్లార్లో వ్యాపారాలు, ఆస్పత్రుల నిర్వహణ ప్రమాదకరమని తెలిసినా మామూలుగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పోలీసు అధికారులు ఫొటోలు తీసి జరిమానా విధిస్తున్నారే తప్ప నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు. జిల్లాలోని గోదావరిఖనిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్లో ప్రైవేట్ ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్యాధికారులు తనిఖీ చేయగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్‌ను సెల్లార్ నుంచి వేరేచోటుకు మార్చాలని అధికారులు ఆదేశించారు.నోటీసులు జారీచేశాం -
అతివేగం.. రహదారులు ఛిద్రం
పెద్దపల్లి: ఓవర్‌లోడ్, అతివేగం రహదారులను ఛిద్రం చేస్తున్నాయి. టిప్పర్లు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో ప్రారంభమయ్యే రాజీవ్ రహదారి గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద ముగుస్తుంది. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా విస్తరించిన అనేక మెయిన్రోడ్లపై వాహనాల రాకపోకలు మితమీరుతున్నాయి. 30 టన్నుల సామర్థ్యానికి బదులు కొన్నింట్లో 60 టన్నులూ తరలిస్తున్నారు. కవర్లు కప్పకుండానే.. ఇసుక, బూడిద, మట్టి, ధాన్యం రవాణా చేసే వాహనాలపై కవర్లు కప్పడంలేదు. దుమ్ము, ధూళిపడి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికళ్ల సమస్యతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. డస్ట్‌తో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. నిబంధనలు గాలికి రోడ్డు, రవాణా శాఖ నిబంధనల ప్రకారం.. బూడి ద టిప్పర్లు 18 టన్నుల నుంచి 22 టన్నుల బరువు వరకే లోడ్ చేయాలి. కానీ 30 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్‌చేసి రవాణా చేస్తున్నారు. గ్రానైట్, ధాన్యం తరలించే లారీల్లోనూ ఓవర్‌లోడ్ ఉంటోంది. అయినా, సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యహరించడం శోచనీయం. ఆటోలు, ట్రాలీలు.. బస్సుల్లోనూ.. ఆటోలు, కార్లు, బస్సుల్లోనూ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది నుంచి 20 మందిని తరలిస్తున్నారు. ఆ టోట్రాలీలు ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై నా ముగ్గురు నుంచి నలుగురు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ సామర్థ్యానికి మించి ప్ర యాణికులనుతరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
ర్యాగింగ్‌కు పాల్పడితే కటకటాలే
కోల్‌సిటీ(రామగుండం): ర్యాగింగ్‌కు పాల్పడితే కఠి న చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషన ర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. గోదావరిఖ నిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్(సిమ్స్)లో శుక్రవారం యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైంలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, దేవున్ని ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లే డో కానీ.. వైద్యులను సంప్రదిస్తే ప్రాణం పోస్తార న్నారు. ఇలాంటి గౌరవ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. సీ నియర్లు అంతకుముందు జూనియర్లనే విషయాన్ని మర్చిపోవద్దని హితువు పలికారు. ర్యాగింగ్‌కి పా ల్పడితే కేసులు నమోదు చేసి, జైలుశిక్ష విధించడంతోపాటు కాలేజీ నుంచి తొలగిస్తారని వెల్లడించా రు. క్యాంపస్‌లో సీసీ కెమెరాలతో నిఘా ఉందని, ని త్యం పోలీస్ పెట్రోలింగ్, ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సీపీ తెలిపారు. డ్రగ్స్. గంజాయి వినియోగంతో కలిగే సమస్యలు, చట్టపరమైన శిక్షలపై సీపీ అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నియంత్రణపైనా వివరించారు. సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని, ఏ సమస్య ఎదురైనా డయల్ 100 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సిమ్స్ ప్రిన్సిపాల్ నరేందర్, అడిషనల్ డీఎంఈ హిమబింద్‌సింగ్, గోదావరిఖని, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు రమేశ్, నాగేంద్రగౌడ్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎన్జీవో ప్రతినిధురాలు సునీత, ఎస్సైలు అనూష, లావణ్య, ప్రొఫెసర్లు, మెడికోలు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ అగ్రస్థానం
జ్యోతినగర్(రామగుండం): విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎన్టీపీసీ మనదేశంలోనే అగ్రస్థానంలో ఉందని, దక్షిణాదిలో రామగుండం–తెలంగాణ ఎన్టీపీసీ మొ దటి స్థానంలో నిలిచిందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డై రెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు స్థానిక పరిపాలన భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈడీ పతాకం ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మాట్లాడా రు. 48ఏళ్ల ఉత్సాహం, ఆవిష్కరణ, దేశ నిర్మాణంలో పోటీతత్వం రామగుండం గొప్పతనంలో మరో అద్భుతమన్నారు. పీటీఎస్‌లో 2.4 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్, 1.8 మెగావాట్ల రూప్‌టాప్ సోలార్ ప్లాంటు నిర్మిస్తున్నామని తెలిపారు. 100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. కార్పొనేట్ యాష్ బ్రిక్స్ ప్లాంట్‌లో రోజూ 2 లక్షల ఇటుకలు తయారు చేసే లా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతల కు బహుమతులు అందించారు. జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులూ పర్యవేక్షించాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులకు కనీస వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన బోధన, శుచి, రుచికరమైన మధ్యాహ్నభోజనం అందిస్తున్నామని, తల్లిదండ్రులు పర్యవేక్షించి వారి భవిష్యత్ తీర్చిదిద్దాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్లో శుక్రవా రం నిర్వహించిన పేరేంట్, టీచర్ మీటింగ్‌లో మా ట్లాడారు. గైర్హాజరు విద్యార్థులను గుర్తించి క్రమం తప్పకుండా స్కూల్‌కు వచ్చేలా ప్రోత్సహించాలన్నా రు. పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా బోధించేలా పద్ధతుల్లో మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చిన్నారులు కలెక్టర్‌కు పూలు అందించి ఆహ్వానం పలికారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా సంఘాల బలోపేతం చేయాలి పెద్దపల్లి: స్వశక్తి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సెర్ప్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బ్యాంక్ లింకేజీ లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. సీ్త్రనిధి రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు ఏపీఎం, డీపీఎంల కృషి ఎంతోఉందని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి నరేందర్, అదనపు డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ తీర్పు రాజకీయాలకు దిశానిర్దేశం
ధర్మారం(ధర్మపురి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశమని మంత్రి అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం నిర్వహించిన విజయోత్సవంలో మంత్రి మా ట్లాడారు. నవీన్‌యాదవ్ గెలుపు బలహీనవర్గాలదే అన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తమ అభ్యర్థి గె లుపు కోసం తప్పుడు సర్వేలతో గెలుస్తున్నామని సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లాపుడ్య రూప్లా నాయక్, లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చై ర్మన్ సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరె డ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, నాయకులు సోగాల తిరుపతి, బొల్లి స్వామి, కొత్త నర్సింహులు, కాడే సూర్యనారాయణ, లావణ్య, అజయ్‌పాల్‌రెడ్డి, గంగారెడ్డి, జనార్దన్, సుమన్, బాబా పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వానికే పట్టం పెద్దపల్లిరూరల్: రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభు త్వం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్‌యాదవ్ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక జెండా కూడలిలో విజయోత్సవాలు జరుపుకున్నారు. రాబోయే స్థాని క ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చూపుతుందని అ న్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నే తలు ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇక ఆ పార్టీ భవిష్యత్‌లో కనిపించదని అన్నారు. -
‘తియ్యని’ మార్పు
● జీవనశైలిని మార్చిన డయాబెటిస్ ● సిరిధాన్యాలపై జనం మక్కువ ● కూరగాయలు, పండ్లకు పెరిగిన గిరాకీ ● నేడు వరల్డ్ డయాబెటిస్ డే ● మారిన జీవనశైలితో ముప్పు ప్రస్తుతం ఒత్తిడి పెరగడం, ఆహార నియమాలు పాటించకపోవడంతో యుక్తవయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. నాలుగు పదుల వయసులోనే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. సైలెంట్ కిల్లర్‌గా పేరుఉన్న షుగర్‌కు చెక్ పెట్టేందుకు అత్యధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. దుష్ఫలితాలపైనా పనిచేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 7 లక్షల మంది వరకు షుగర్ బాధితులు ఉన్నట్లు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 24,204 మంది ఉన్నారని డీఎంహెచ్‌వో వాణిశ్రీ తెలిపారు. ఎన్సీడీ 2023–24లో చేపట్టిన సర్వే లో కరీంనగర్ జిల్లా జనాభా 10.5 లక్షలు ఉంటే.. ఇందులో 2.10 లక్షల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరికొందరు బాధితులు ఉన్నారు. ● వ్యాధికి కారణాలు.. మధుమేహం రావడానికి ప్రధానంగా ఇన్ఫెక్షన్లని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫెక్షన్తో అది దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచి వ్యాధి సోకుతుంది. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాలతోపాటు జంక్‌ఫుడ్, వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం, స్థూలకాయం, మానసిక ఒత్తిడితోనూ మధుమేహం బారినపడతారు. ● పెరుగుతున్న అవగాహన.. షుగర్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఆహారంలో సిరిధాన్యాలు, రాగులు, జొన్నలు, గోధుమలు, కూరగాయలు, పండ్లు చేర్చుకుంటున్నారు. మధుమేహం నియంత్రణకు జొన్నరొట్టెలు బాగా పనిచేస్తాయని తెలియడంతో చాలా మంది వీటిని తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఉసిరికాయలు, నేరేడు, జామపండ్లకూ గిరాకీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని అంబలి, రాగి జావ, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి పూరీలు, ఫ్రూట్ జ్యూస్ విక్రయ షాపులు రద్దీగా మారాయి. తరచుగా మూత్ర విసర్జన, దాహం వేయడం, ఆకలి, బరువు తగ్గడం, నీరసం, పిల్లలు రాత్రివేళల్లో పక్కతడపడం వంటివి షుగర్ లక్షణాలు. షుగర్ బారినపడిన పిల్లలైతే జీవితాంతం ఇన్సులిన్ వాడాలి. పెద్దల్లో తరచూ దాహం వేసినట్లు ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, చూపు మసకబారడం, అలసట, కొందరిలో శృంగార కోరికలు తగ్గడం, కాళ్లలో స్పర్శ లోపించడం, తిమ్మిర్లు రావడం, అతిఆకలి, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆయాసం, వాంతులు, విరోచనాలు, మర్మాయవాల వద్ద ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మధుమేహ బాధితులు అశాసీ్త్రయ పద్ధతి ద్వారా షుగర్‌ను నియంత్రించుకునే ప్రయోగాలు చేయవద్దు. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. వైద్యుని సలహా లేకుండా నెలల తరబడి మందులు వాడొద్దు. రక్తపోటు, షుగర్, కొలస్ట్రాల్, కళ్లు, గుండె, కిడ్నీ పరీక్షలు ఏటా చేయించుకోవాలి. కరీంనగర్ జిల్లాలో రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో షుగర్ బరినపడేవారు సుమారు లక్ష మంది ఉన్నారు. షుగర్తోపాటుగా 100 మందిలో 30 మందికి అధిక రక్తపోటు (హైబీపీ) ఉంది. డయాబెటిస్తో కిడ్నీలు దెబ్బ తింటాయి. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. వైద్యుల సహాలతో క్రమం తప్పకుండా మందులు వాడాలి. – వెంకటరమణ, వైద్యాధికారి, కరీంనగర్ కోల్‌సిటీ/కరీంనగర్: గతంలో జొన్న, రాగిసంకటి పేదోడి ఆహారం. కొర్రలు, ఊదలు, అరికెలు వంటి సిరిధాన్యాలు పేదోళ్ల ఇళ్లలోనే వండేవారు. కాయకష్టం చేసేవారికి ఇదే బలవర్ధకమైన ఆహారం. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇవన్నీ ఇప్పుడు ధనికుల ఇళ్లల్లోనే ఉంటున్నాయి. షుగర్(మధుమేహం) కాలాన్ని తిరగేస్తోంది. మనుషులనూ మార్చుతోంది. షుగర్‌తో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా గత ఆహార నియమాలకు ప్రాధాన్యం పెరిగుతోంది. ఈనెల 14న వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. -
పట్టాలపై పట్టు సడలకుండా..
రామగుండం: రైల్వేపట్టాలపై శీతాకాలంలో కురిసే మంచు, వానాకాలంలో నిలిచే వర్షపునీరు గూడ్స్ రైళ్లు ముందుకు సాగకుండా అవాంతరాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువుతో కూడుకున్న వ్యాగన్లు కావడంతో మంచు, వర్షపునీరు పట్టాలపై నిలిచి చక్రాలు పట్టుసడలి పోతాయని, తద్వారా వేగం తగ్గుతుందని, ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఇదేపరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు లోకోమోటివ్ కంటైనర్(రైలింజన్ వెనకాల ఉండే వ్యాగన్)లో ఇసుక నింపిఉంచుతారు. సమస్య ఎదురైన చోట లోకో పైలెట్ స్విచ్ ఆన్‌చేస్తే కంప్రెస్డ్ ఎయిర్ పైపు ద్వారా పట్టాలపై ఇసుక నేరుగా పడి రైలు వేగంగా ముందుకు కదిలేలా సాయపడుతుంది. రైలు హాల్టింగ్ తర్వాత ఆరంభదశలో కంప్రెస్డ్ విధానంతో ఇసుకను పట్టాలపై చల్లించాక రైలింజన్‌ను ముందుకు కదిలిస్తే చక్రాలకు పట్టు దొరికి వేగం పుంజుకుంటుంది. రైల్వేస్టేషన్లలో ఇసుక నిల్వలు.. ప్రధాన రైల్వేస్టేషన్లలోని ఇరువైపులా లోకోమోటివ్ నిలిచే ప్రదేశానికి సమీపంలో రెండు సీజన్లలోనూ ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారు. లోకోమోటివ్‌లో ఇసుక నిల్వలు తరిగిపోతే.. లోకో పైలెట్ గుర్తించి ముందస్తుగా క్య్రూకంట్రోలర్ కార్యాలయానికి సమాచారం అందిస్తారు. గూడ్స్.. రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే చిన్నసంచుల్లో నిల్వచేసిన ఇసుకను సాండ్బాయ్ సాయంతో లోకోమోటివ్ కంటైనర్‌లో నింపుతారు. లోకో పైలెట్ విధుల్లో చేరేసమయంలోనే కంటైనర్‌లో ఇసుక నిల్వలను తనిఖీ చేయాల్సి ఉంటంది. ప్రస్తుతం బల్హార్షా– కాజీపేట మధ్య ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇసుక నిల్వలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ÌZMø-Ððl*-sìæÐŒæ MýS…Osñæ-¯]l-ÆŠ‡ÌZ˘ CçÜ$MýS °ÌSÓË$ గూడ్స్రైళ్లు ముందుకు వెళ్లేలా ట్రాక్‌పైకి.. ప్రధాన రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఇసుక సంచులు -
సాంకేతికతతో ‘సన్నాల’ గుర్తింపు
మంథనిరూరల్: సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం సన్నరకమేనా అని గుర్తించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఈక్రమంలోనే గ్రెయిన్ క్యాలీఫర్ అనే సరికొత్త సాంకేతిక పరికరం వినియోగిస్తోంది. జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచింది. జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 334 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 266 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 40 నుంచి 50 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంతో.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా 33రకాల సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకంతోపాటు దొడ్డురకాలను సైతం కొనుగోలు చేస్తోంది. వీటిలో సన్నరకాలను గుర్తించేందుకు గ్రెయిన్ క్యాలీఫర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ పరికరం వినియోగిస్తున్నారు. పొడవు, వెడల్పులతో గుర్తింపు... రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో పిడికెడు ప్యాడీ పాస్కల్లో పోసి తిప్పితే ధాన్యంపై పొట్టు ఊడి బియ్యపు గింజలుగా మారుతాయి. ఇందులో ఒక బియ్యపు గింజను తీసుకుని గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంలో వేస్తే ఆ గింజ వెడల్పు, పొడవును చూపిస్తుంది. పొడవు, వెడల్పు ఆధారంగా సన్నరకం గుర్తిస్తారు. రూ.500బోనస్ చెల్లింపులో.. ప్రభుత్వం సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రెయిన్ క్యాలీఫర్ పరికరంతో రైతు ఎదు టే సన్నరకమా? దొడ్డు రకమా? అని గుర్తిస్తారు. తద్వారా బోనస్చెల్లింపు పారదర్శకంగా జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నికేంద్రాల్లో ఉన్నాయి సన్నరకం ధాన్యం గుర్తించేందుకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ క్యాలీఫర్ పరికరాలను అందుబాటులో ఉంచాం. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఈ పరికరంతో తనిఖీ చేసి సన్నరకమా? కాదా? అని గుర్తిస్తాం. రైతులకు ఇబ్బందులు రాకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేసేలా అన్నిచర్యలు చేపట్టాం. – శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్ కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ క్యాలీఫర్ పరికరం 33 రకాల సన్నరకం ధాన్యం కొనుగోలుకు నిర్ణయం -
భీమన్నగుడిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్న ఆలయ ప్రధాన ద్వారం గేటు ఎదుట టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పడమర దిశలోని మహాద్వారం వద్ద గల శివుడి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొడుతున్నారు. శానిటేషన్ ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు సూచిస్తున్నా భక్తులు వినిపించుకోవడం లేదు. అదే సమయంలో భీమన్న ఆలయంలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. రాజన్న ఆలయ పరిసరాల్లోని కొందరు వ్యాపారులు భీమన్న ఆలయ ప్రాంతం, పార్వతీపురం, భీమేశ్వరాలయం వీధి పరిసరాల్లోని రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ నుంచి ప్రత్యేక వాహనం రాజన్న ప్రధానాలయంలో పనులు చేపట్టేందుకు పంజాబ్ నుంచి ప్రత్యేక వాహనాన్ని తెప్పిస్తున్నట్లు తెలిసింది. ఆ వాహనం ఆలయంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ధర్మగుండం పక్కనే ఉన్న భవనం, ఉత్తర గోపురం పక్కనున్న ప్రహరీలను అధికారులు తొలగించారు. రెండు రోజుల క్రితం బయలుదేరిన ఈ వాహనం శుక్రవారం నాటికి వేములవాడకు చేరుకుంటున్నట్లు తెలిసింది. ఈ వాహనం రాకతో పనులు స్పీడందుకోనున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, రెవెన్యూ, ఆర్అండ్బీ, పోలీసు, మున్సిపల్‌శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. ఆలయంలో చేపట్టే పనుల విషయంలో తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు జోక్యం చేసుకుని పనులకు ఆటంకం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న గుడి చుట్టూ మొక్కులు రోడ్లపైకి చేరిన వ్యాపారాలు -
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ● కొండగట్టులో ఆర్జిత సేవా రుసుం పెంచడంపై ఆగ్రహం కరీంనగర్: కొండగట్టులో సౌకర్యాలు కల్పించకుండానే ఆర్జిత సేవా రుసుం భారీగా పెంచడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతుంటే.. ఆర్జిత సేవా రుసుం పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ గురువారం దేవాదాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పెంచిన ఆర్జిత సేవా రుసుం తగ్గించాలని, భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–1 డిపో ద్వారా పుణ్యక్షేత్రలైన ఏడుపాయల, స్వర్ణగిరి, బంగారు శివలింగం, యాదగిరి గుట్టకు ప్ర త్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 16న ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలి పారు. ఈ బస్సు 16న ఉదయం 3.30గంటలకు కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి దర్శనాల అనంతరం అదేరోజు రాత్రి కరీంనగర్ చే రుకుంటుందని అన్నారు. పెద్దలకు రూ.1,150, పిల్లలకు రూ.880 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 16న ప్రతిభా పరీక్షవిద్యానగర్(కరీంనగర్): పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారి కి ఉన్నత విద్యావకాశాలతో పాటు మంచి భవి ష్యత్ అందించడానికి ఈనెల 16న ప్రతిభా పరీ క్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. గురువారం ప్రతిభా పరీక్షలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జ్యోతినగర్‌లోని ఎస్ఆర్ జూని యర్ కాలేజీలో బాలికలకు, ముకరంపురలోని ఎస్ఆర్ కాలేజీలో బాలురకు ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇంటర్లో ఉచిత ప్రవేశంతో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్. ప్రోత్సాహక స్కాలర్షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఎస్ఆర్ కాలేజీ లేదా 9154854706, 9642117366 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మల్లాపూర్: ఉన్న ఊరిలో ఉపాధి లేక కట్టుకున్న భార్యాపిల్లలు, కన్న తల్లిదండ్రులను వదిలి ఏడారి దేశానికి వలస వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. 36రోజులకు మృతదేహాం గురువారం స్వదేశానికి చేరుకుంది. మల్లాపూర్ మండలంలోని వాల్గొండతండాకు చెందిన లకావత్ రమేశ్ (45) కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. గతనెల 8న విధులు నిర్వర్తించి రూమ్‌కు చేరుకుని నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చి మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు స్థానికులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు ఎంబసీ అధికారులతో మాట్లాడారు. 36 రోజుల అనంతరం రమేశ్ మృతదేహం స్వదేశానికి చేరింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రమేశ్‌కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు. మృతదేహం కోసం 22 రోజులుగా ఎదురుచూపుపెగడపల్లి: విదేశాలకు వె ళ్లిన ఇంటిపెద్ద బాగా సంపాదిస్తాడనుకున్న ఆ కు టుంబానికి చుక్కెదురైంది. ఇంటికి వచ్చేందుకు విమా నం టికెట్ బుక్ చేసుకున్న ఆయన.. తెల్లారితే తమ క ళ్లముందు ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు పిడుగులాంటి వార్త తెల్సింది. గుండెపోటుతో మరణించాడని తెలియడంతో శోకసంద్రంలో మునిగింది. మృతదేహం రాకకోసం 22రోజులుగా నిరీక్షిస్తోంది. పెగడపల్లి మండలకేంద్రానికి లింగంపల్లి రమేశ్ (55)ఇరాక్‌లో 22 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
క్రీడలతో నూతన ఉత్సాహం
మణుగూరుటౌన్: నిత్యం విధుల్లో తలమునకలయ్యే సింగరేణి కార్మికులు.. క్రీడలు, యోగా వైపు దృష్టి సారిస్తే ఆరోగ్యానికి శ్రేయస్కరమేగాక నూతన ఉత్సాహం లభిస్తుందని మణుగూరు ఏరియా ఇన్చార్జి జీఎం ఎం.రమేశ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి హాకీ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన బహుమతులు అందజేసి మాట్లాడారు. ఉద్యోగ క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో విజయపతాక ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో ఆర్జీ–3, భూపాలపల్లి జట్లు విజేతగా నిలవగా, ఆర్జీ–1, ఆర్జీ–2 జట్లు రన్నరప్‌గా నిలిచాయి. -
ప్రకృతి సంపదను దోచేస్తున్నారు
వేములవాడ అర్బన్: పాలకులు అభివృద్ధి పేరిట ప్రకృతి సంపదను దోచేస్తూ.. విధ్వంసం సృష్టిస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. వేములవాడ నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం(ఆర్వీకే)లో గురువారం నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ సభకు హాజరై మాట్లాడారు. భారత విప్లవోద్యమం అందించిన వీరనారీమణుల్లో రంగవల్లి ఒక్కరని, ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 1999 నవంబరు 11న పాలకులు ఎన్కౌంటర్ పేరిట ఆమెను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆశయసాధనకు వేములవాడలో రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అనే అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల మాట్లాడుతూ హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే) తరహాలో వేములవాడలోని రంగవల్లి విజ్ఞాన కేంద్రం(ఆర్వీకే) బుద్ధి జీవులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. సామాజిక మార్పు నిరంతరమని, ఆ దిశగా మనం సాగిపోవాలన్నారు. ‘ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత’పై కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ అసమానతలు, దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయన్నారు. రంగవల్లి, ఇటీవల అమరుడైన లచ్చన్నగౌడ్కు జనశక్తి నాయకులు అమర్, ఆర్వీకే ప్రతినిధులు నివాళులు అర్పించారు. పోకల సాయికుమార్, రాజేశ్వరి, చెన్నమనేని పురుషోత్తమరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నరాల దేవేందర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు రాయమల్లు, ప్రజా సంఘాల వేదిక నాయకులు వంగల సంతోష్, బీడీ కార్మిక సంఘం నాయకురాలు అనసూయ, లక్ష్మి, వెంకటలక్ష్మి, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు చకినాల అనిల్‌కుమార్, డేగల రమ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్, రాకేశ్, దళిత లిబరేషన్ నాయకులు మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన కళాకారుల ఆటాపాట అరుణోదయ కళాకారుల ఆట, పాటలు అరించాయి. నందికమాన్ నుంచి డప్పు వాయిద్యాలు, నృత్యాలు, ఎర్రజెండాలతో ర్యాలీ సాగింది. కళాకారులు పాటలు ఉర్రూతలూగించాయి. ఇంటలీజెన్సీ పోలీసుల నిఘాలో ఆర్వీకే ప్రథమ వార్షికోత్సవం జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క వేములవాడలో ఆర్వీకే ప్రథమ వార్షికోత్సవం హాజరైన జనశక్తి అమర్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం
షుగర్ బాధితులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. మందులు అందిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులు వాడాలి. – వాణిశ్రీ, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి అధిక బరువు, జంక్‌ఫుడ్, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం తదితర అలవాట్లు షుగర్ బారినపడేందుకు ప్రధాన కారణం. షుగర్ బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి. – నాగరాజు రవికంటి, జనరల్ ఫిజీషియన్, కరీంనగర్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. కుటుంబంలో ఒకరు దీనిబారినపడితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కరీంనగర్ -
కుమారుడి పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ..
పెద్దపల్లి: తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్తూ మన్య భానువిజయానంద్(55) దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూంనగర్‌కు చెందిన భానువిజయానంద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏవోగా పనిచేస్తున్నారు. అతడి కుమారుడి వివాహం ఈనెల 23న జరగాల్సి ఉంది. బంధుమిత్రులకు పెండ్లి ఆహ్వానపత్రికలు పంచేందుకు బుధవారం రాత్రి తపెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్దకు చేరుకోగానే.. ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికుడు రాజీవ్ రహదారి దాటుతూ బైక్‌కు అడ్డుగా వచ్చాడు. అతడిని తప్పించబోయిన భానువిజయానంద్ వాహనం పైనుంచి పడి తీవ్రగాయాలపాలయ్యా రు. స్థానికు 108 అంబులెన్స్ ద్వారా తొలుత సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల్లోనే వివాహం జరిగే ఇంట్లో విషాదం నెలకొనడంతో కాలనీవాసులు, బంధుమిత్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, విషాదంలోనూ భానువిజయానంద్ కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పద్మనగర్ బైపాస్ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంటలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న గడ్డం ఈశ్వరయ్య(34) పెయింటింగ్ కాంట్రాక్టు చేస్తుంటాడు. రోజూ పెయింటింగ్ పనిపై నగరానికి వస్తుంటాడు. ఈక్రమంలో గురువారం ఈశ్వరయ్య మిత్రుడు చిరంజీవితో పాటు బైక్‌పై వెనుక కూర్చొని చింతకుంట నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా పద్మనగర్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే వెనుకనుండి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈశ్వరయ్య లారీ టైర్ కిందపడి మృతిచెందగా చిరంజీవికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈశ్వరయ్య భార్య గడ్డం అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. పెద్దబొంకూరులో రెండిళ్లలో చోరీ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో తాళం వేసిన ఇళ్లలో గురువారం తెల్లవారు జామున దొంగలు చొరబడ్డారు. గ్రామంలోని వేముల రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోకి దూరిన దొంగలు.. బీరువాలు పగులగొట్టి అర్ధతులం బంగారం, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లార ని బాధితుడు రమేశ్ తెలిపారు. మరోవ్యక్తి ఇంట్లోకూడా దొంగలు చొరబడ్డారని ద్వారా తెలిసింది. కా గా, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ఎవరూ లేనిసమయంలో దొంగతనాలకు పాల్ప డు తున్నారు. గ్రామస్తులు సీసీ కెమెరాలు బిగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
వార్డు ఆఫీసర్లకు ట్యాబ్‌లు
● క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి ● రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ కోల్‌సిటీ(రామగుండం): క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో వార్డు ఆఫీసర్లు కీలక పాత్ర నిర్వహించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. గురువారం బల్ది యా కార్యాలయంలో వార్డు ఆఫీసర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మా ట్లాడుతూ, నగరవాసులకు మెరుగైన సేవలు అందించడానికి, సాంకేతిక సహకారం కోసం ట్యాబ్‌లు అందజేశామన్నారు. జియోట్యాగింగ్ చేయడం, సర్వేల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, యాప్‌లో సమస్యల పరిశీలన, పరిష్కా రం వంటి బహుళ సేవలకు ఈ ట్యాబ్‌లు ఉపయోగపడతా యని తెలిపారు. ప్రజలు కూడా తమ సమస్యలను వార్డు అధికారులకు స్వయంగా లేదా ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈసందర్భంగా నల్లా కనెక్షన్ వివరాలు ఫొటోలు, డాక్యుమెంట్లు అమృతమ్ యాప్‌లో నమోదు చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనకు పోరాటం
పెద్దపల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేదిలేదని బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష అన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పో రాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ తరహాలో రిజ ర్వేషన్ల సాధనకు ఉద్యమిస్తామన్నారు. నాయకులు ఎన్.శంకర్, కొండి సతీశ్, చిలారపు పర్వతాలు, ఆకుల వివేక్ పటేల్, ఎస్.స్వప్న, ఎస్.కొమరయ్య, ఎన్.రాజేందర్, కె.నవీన్‌యాదవ్, డి.రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ దీక్షకు మద్దతు ప్రకటించారు. నేడు రామగుండం ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలు జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు 48వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్థానిక పరిపాలనా భవనంలో ఉదయం 8.55 గంటలకు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, సీఐఎస్ఎఫ్ అధికారులతో కలిసి జెండా వందనం చేసి వేడుకలను ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాలు చేపడతారు. -
నత్తే నయం
శుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల సాకారం చే యాలన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే, పనులు ప్రారంభించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. తొలివిడుతలో ప్రతీనియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలకు మోడల్ ఇళ్లు మంజూరు చేసింది. తొలివిడతలో 13 మండలాల్లో ఒక్కోగ్రామాన్ని ఎంపిక చేసి 1,935 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. ఎంపికై న ప్రతీ లబ్ధిదారు ఇంటి నిర్మాణం ప్రారంభించా ల్సి ఉండగా, ఇప్పటివరకు 1,016 మంది ముగ్గు కూడా పోయలేదు. 257 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వివిధ దశల్లోని 3,000 మంది ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.57కోట్లు జమచేసింది. కారణాలు అనేకం ప్రభుత్వం రూ.5లక్షలు ఒక్కో ఇంటికి దశలవారీగా మంజూరు చేస్తోంది. నిర్మాణ ఖర్చు పెరగకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. అలాగే నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించేలా జిల్లాస్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్లతో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. క్షేత్రస్థా యిలో కమిటీలు నామమాత్రం కావడంతో వ్యాపారులు, మేసీ్త్రలు అడిగినంత చెల్లించాల్సి వస్తోంది. ఫతితంగా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధిహామీ అనుసంధానం చేసినా.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూలీల కొ రత లేకుండా లబ్ధిదారుని కుటుంబం పనిచేసుకుని కూలి పొందడంతోపాటు నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా అనుసంధానం చేశారు. ఉపాధిహామీ పథకంలో జాబుకార్డు ఉన్న లబ్ధిదారుకు బేస్మెంట్స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ స్థాయి వరకు 50 రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. 90 రోజుల పనిదినాలు చేసిన లబ్ధిదారులకు కూలి కింద సొమ్ము చెల్లించనున్నారు. జిల్లాలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మహిళా సంఘాల ద్వారా 1,100 మంది లబ్ధిదారులకు తోడ్పాటు అందించినా.. చాలామంది ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆన్లైన్ చేయడంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం నెలకొనడం కూడా ఇళ్ల నిర్మాణ ప్రగతికి అడ్డంకిగా మారుతోందని అంటున్నారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి ఇలా.. -
విద్యార్థుల ప్రతిభకు వేదిక ఫ్రెషర్స్ డే
రామగిరి(మంథని): ఫ్రెషర్స్ డే విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహానికి వేదికగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ప న్నూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మంథని జే ఎన్టీయూ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఫ్రెషర్స్ డేకు సీపీ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. కాలేజీకి ఏటా వచ్చే ఒ క్కో విద్యార్థి బండిల్ ఆఫ్ ట్యాలెంట్‌తో ఉంటాడ న్నారు. ప్రారంభంలో సవాళ్లుగా అనిపించినా క్రమశిక్షణ, విలువలు, సృజానత్మకత, ఆవిష్కరణలతో ముందుకు సాగితేనే మంచి భవిష్యత్‌కు పునాది పడుతుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలని సూచించారు. శ్రద్ధతో చదివితే సునాయాసంగా లక్ష్యం చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ కామాక్షి ప్రసాద్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీసీ రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, పరిపాలనాధికారి సుమన్‌రెడ్డి, మంథని సీఐ రాజు, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుని ఆదాయం రూ.16 లక్షలు
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు. శ్రీవల్లి సేవాసంస్థ సభ్యులు తదితరులు లెక్కించగా.. రూ.16,07,218 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. ఇందులో రూ.68,400 తైబజార్, రూ.2,55,065 సేవా టికెట్లు, రూ.6,01,000 వేలం, రూ.6,82,753 హుండీ ద్వారా ఆదాయం సమకూరిందని ఈవో వివరించారు. మూడు గ్రా ముల బంగారం, 365గ్రాముల వెండిని భక్తులు కట్న, కానుకల రూపంలో సమర్పించారని ఆయన పేర్కొన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
సజావుగా భూ సేకరణ
● పెండింగ్ పరిహారం చెల్లించాలి ● వేగంగా నేషనల్ హైవే నిర్మాణం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు రామగిరి(మంథని): భూ సేకరణ ప్రక్రియ సజావు గా సాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సింగరేణి పెండింగ్ భూసేకరణ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో గురువ రం ఆయన సమీక్షించారు. బుధవారంపేట, రాజాపూర్, ఆదివారంపేట గ్రామాల్లో సింగరేణి సంస్థకు అవసరమైన భూసేకరణ వివరాలపై నివేదికను తనకు అందించారని కలెక్టర్ అన్నారు. ఎస్డీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, సింగరేణి అధికారులు సమ న్వయంతో పనిచేస్తూ భూసేకరణ సజావుగా సాగే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారికి సంబంధించి నిర్వాసితులకు పెండింగ్ పరిహారం చెల్లింపులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. హైవే పనుల్లో వేగం పెంచా లని అన్నారు. మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి సురేశ్, సింగరేణి రామగుండం–3 జనరల్ మేనేజర్ సుధాకర్‌రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శైలజారాణి, సింగరేణి, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఐలయ్య, శ్యామల, ఉమేశ్, మౌనిక, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
17న కలెక్టరేట్ ఎదుట నిరసన
పెద్దపల్లి: విద్యుదాఘాతంతో మృత్యువాతపడుతు న్న గొర్రెలు, మేకలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో ఈనెల 17న కలెక్టరేట్ ఎదుట చేపట్టే నిరసనను విజయవంతం చేయాలని గొర్రెకాపరుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతియాదవ్, ఉపాధ్యక్షుడు చిలారాపు పర్వతాలు కో రారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గొర్రెలు, మేకలు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందుకు అరకొరగా పరిహారం చెల్లి స్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కాపరి చనిపోతే రూ.25 లక్షలు, గొర్రెకు రూ.20వేలు, పొట్టేలుకు రూ.30వేల పరిహారం చెల్లించాలని, తక్షణ సాయంగా రూ.5లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు సలేంద్ర రాములు యాదవ్, వేల్పుల నాగరాజు, మేకల న ర్సయ్య, దారం రాజుయాదవ్, బత్తుల లింగంయాదవ్, దాడి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
రేపు యూనిటీ మార్చ్
పెద్దపల్లి: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న యూనిటీ మార్చ్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. జిల్లావ్యాప్తంగా చేపట్టే యూనిటీ మార్చ్‌ను అందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ నుంచి ప్రభు త్వ జూనియర్ కళాశాల వరకు మార్చ్ కొనసాగుతుందని, యువత భారీగా తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా యువజన శాఖ అధికారులు సురేశ్, వెంకట్ రాంబాబు, ప్రిన్సిపాల్స్ రవీందర్‌రెడ్డి, నీతారెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్, ఎన్సీసీ అధికారి ధ్రువకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై న స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులను పీఈటీ బైకని కొమురయ్య తదితరులు గురువారం అభినందించారు. జిల్లా తరఫున అండర్– 17 బాలికలులో తుమ్మల మనోజ్ఞ, ట్రిబుల్జంప్లో ప్రథమ, లాంగ్‌జంప్‌లో ద్వితీయ, అండర్ –17లో సంపతి రక్షిత హ్యామార్త్రో ప్రథమ, డిస్కస్‌త్రోలో ద్వితీయ, అండర్ –17 ట్రిబుల్ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు కొమురయ్య వివరించారు. ఫుట్‌బాల్ పోటీల్లో బత్రి ఆశ్రిత, ఎన్.సంధ్య రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీలు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. నాణ్యతతోనే భవిష్యత్ గోదావరిఖని: నాణ్యతతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్ వీ సూర్యనారాయణ అన్నారు. జీడీకే–5 ఓసీపీలో గురువారం జెండా ఎగురవేసి బొగ్గు నా ణ్యత వారోత్సవాలు ప్రారంభించారు. పోటీ మార్కెట్లో బొగ్గు నాణ్యతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని ఆయన సూచించారు. వినియోగదారులను కాపాడుకునేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆర్జీవన్ జీఎం లలిత్‌కుమార్, క్వాలిటీ జీఎం ముజుందార్, సేఫ్టీ రీజియన్ జీఎం మధుసూదన్, ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్, సీఎంవో ఏఐ ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ప్రాజెక్టు అధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీ–2లోని సీహెచ్‌పీ, ఓసీపీ క్వారీని సూర్యనారాయణ పరిశీలించారు. జీఎం వెంకటయ్య, ఎస్వోటూ జీఎం రాముడు, సేఫ్టీ ఆఫీసర్ సంతోష్‌కుమార్, ఏరియా ఇంజినీర్ సుజన్మెహార్, ప్రాజెక్టు అధికారి ఉదయ్‌హరిజన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాధ్యతలు స్వీకరణ కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఆర్ఎంవోగా డాక్టర్ కృపాబాయి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు సివిల్ సర్జన్ హోదాగా పదోన్నతి కల్పించడంతోపాటు గోదావరిఖని ఆర్ఎంవోగా ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఔట్‌సోర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యసిబ్బంది ఆర్‌ఎంవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మేరీ సుశీల, సువర్ణ, గ్రేస్, నవీన్, అశోక్, రాధిక, జ్యోతి పాల్గొన్నారు. పత్తి ధర రూ.6,718 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,718గా ధర నమోదైంది. కనిష్టంగా రూ.5,352గా, సగటు రూ.6,444గా ఉందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా 1,323 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. -
ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు
● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గోదావరిఖని: ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ అభివృద్ధిని ఆపేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ స్పష్టం చేశారు. జనగామ గ్రామంలో రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఠాకూర్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామాభివృద్ధి దిశగా రోడ్డు విస్తరణ త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపారు. గింజ కూడా కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. మొక్కజొన్నలు, పత్తి, వరి, మిర్చి, పొద్దుతిరుగుడు.. ఇలా ఏ పంట సాగు చేసినా ప్రభుత్వం రైతులకు మద్దతు చెల్లిస్తుందని అన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా సింగిల్‌విండో, ఐకేపీ ద్వారా ప్రభుత్వమే ధా న్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నితప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. -
లైబ్రరీ.. పాఠకుల వర్రీ
పెద్దపల్లిరూరల్: పాఠకులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన విజ్ఞానం అందించే గ్రంథాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లా గ్రంథాలయంతోపాటు వివిధ మండల కేంద్రాల్లోని లైబ్రరీలకు సొంతభవనాలు లేవు. ఆధునికీకరించి డిజిటలైజేషన్ చేయలేదు. అధికారులు, సిబ్బంది కొరతతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈనెల 14(శుక్రవారం) నుంచి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 20 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేసింది. రూ.6కోట్లతో జిల్లా గ్రంథాలయ భవనం జిల్లా కేంద్రంలో దూరదర్శన్ కేంద్ర భవనం(ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్)లో ఏర్పాటుచేసిన జిల్లా గ్రంథాలయానికి అదేస్థలంలో రూ.6కోట్ల అంచనాతో కొత్త భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బహుళ అంతస్తుల్లో నిర్మించే ఈ భవనంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి, మంథని గ్రంథాలయాలను తొలివిడతలో డిజిటల్ చేసేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. పాఠకులకు తప్పని ఇబ్బందులు.. అందుబాటులోకి వస్తున్న ఆధునికతకు అనుగుణంగా లైబ్రరీలను ఆధునికీకరించి డిజిటలైజేషన్ చేయక పోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభానైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆధునికీకరించాలని కోరుతున్నారు. జిల్లా గ్రంథాలయంలో పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకోసం లయన్స్‌క్లబ్ ప్రతినిధులు ఇటీవల రెండు కంప్యూటర్లను సమకూర్చినా ఇంకా వినియోగంలోకి తేవడంలేదు. ఇందుకు సిబ్బంది శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. సొంత భవనాలు లేక.. మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలకు సొంతభవనాలు నిర్మించాల్సి ఉంది. పెద్దపల్లి, జూలపల్లి, రామగుండం, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం లైబ్రరీలు రెంట్ ఫ్రీ పద్ధతిన కొనసాగుతున్నాయి. గోదావరిఖని లైబ్రరీకి సింగరేణి యాజమాన్యం నామమాత్రపు అద్దెప్రతిపాదికన భవనం సమకూర్చింది. ఓదెల, కమాన్పూర్లోని గ్రంథాలయాలు అద్దె ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వీటికి దశలవారీగా సొంతభవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కార్యదర్శికి ఆరు జిల్లాల బాధ్యతలు.. రాష్ట్రంలోని 33 జిల్లాల గ్రంథాలయాలకు కేవలం 9మంది రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు. ఇకజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సరితకు ఆరు జిల్లాల అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాతోపాటు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఆమె విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఇక అటెండర్ మొదలు జూనియర్ అసిస్టెంట్ వరకు.. ఇలా ఏ పోస్టులో కూడా రెగ్యులర్ సిబ్బంది లేరు. కాగా, జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కళాశాల, పాఠశాల స్థాయి విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.వారోత్సవాలు ఇలా.. తేదీ కార్యక్రమం 14 గ్రంథాలయ వారోత్సవాలు షురూ 15 పుస్తక ప్రదర్శన 16 గ్రంథాలయం జ్ఞానాల నిలయంపై వ్యాసరచన పోటీలు(8, 9, టెన్త్ విద్యార్థులకు) 17 విద్యార్థి జీవితంలో గ్రంథాలయ ప్రాధాన్యం(కాలేజీ విద్యార్థులకు)పై ఉపన్యాసం 18 చదువు, జ్ఞానం, సాక్షరత అంశాలపై పాటల పోటీలు 19 రంగోలి, మెహందీ పోటీలు (మహిళలు, విద్యార్థినులకు) 20 వారోత్సవాల ముగింపు వేడుకలు డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం జిల్లా గ్రంథాలయానికి సొంతభవనంతోపాటు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో పనులు త్వరలోనే చేపడతాం. పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సిబ్బంది కొరత తీర్చుతాం. – అన్నయ్యగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు -
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు మద్దతు ధరకు విక్రయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. వెన్నంపల్లి, మీర్జంపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం డబ్బులను 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సీఈవోలు కోలేటి శ్రీనివాస్, విజేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ ప్రజాప్రతినిధులు సతీశ్, సదానందం, రమేశ్, మల్లయ్య, రైతులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం జూలపల్లి(పెద్దపల్లి): రైతుల సంక్షేమమే ప్రజాప్రభు త్వ లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. వివిధ గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు, ప్రతినిధులు వేణుగోపాలరావు, కంది మల్లారెడ్డి, స్రవంతి, అంజయ్య, సంతోష్, మల్ల య్య, లోక జలపతిరెడ్డి, బొజ్జ శ్రీనివాస్, తొంటి మధుకర్, రవీందర్‌రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు. -
నిత్యం యోగా సాధన చేయాలి
గోదావరిఖని: నిత్యం యోగా సాధన చేస్తూ ఆరో గ్యంగా ఉండాలని ఆర్జీ–2 జీఎం వెంకటయ్య సూ చించారు. తన కార్యాలయంలో బుధవారం ప్రాచీ న యోగా దినచర్య అంశంపై అవగాహన కల్పించారు. యోగా గురువు షణ్ముఖశివచంద్ర, ఎస్వో టూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అరవిందరావు, సేవా అధ్యక్షురాలు వనజ పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రామగిరి: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆర్జీ–3, ఏపీఏ జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరావు అన్నారు. సెంటినరీకాలనీలో జరిగిన కార్య క్రమంలో వారు మాట్లాడారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రాంచంద్రారెడ్డి, శ్రీనివా స్రావు, ఏరియా ఇంజినీర్లు శేఖరబాబు, యాదయ్య, ఎస్వోటూ జీఎంలు రాంమోహన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పారదర్శకంగా సదరం శిబిరాలు పెద్దపల్లి: ప్రతీనెల సదరం, యూడీఐడీ శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామీణ అదనపు అధికారి రవీందర్ తెలిపారు. రామగుండం, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ప్రక్రి య చేపట్టామన్నారు. 21 కేటగిరీల దివ్యాంగుల కోసం నిర్దేశిత తేదీల్లో సదరం, యూడీఐడీ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ఈనెల 12వ తేదీతోపా టు 24న శారీరక వైకల్యం కలిగిన వారికి, 17న మా నసిక, 28న చెవిటి, 29న దృష్టిలోపం కలిగిన ది వ్యాంగుల వైకల్యం నిర్ధారణకు శిబిరాలు నిర్వహి స్తామన్నారు. కొత్తవారు మీ సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. -
రికార్డులు.. అవార్డులు
జ్యోతినగర్(రామగుండం): భారతావనికి వెలుగులు పంచుతున్న రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్ట్ శుక్రవారంతో 48వ వసంతంలోకి అడుగిడుతోంది. రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లో 2,600, తెలంగాణ స్టేజీ–1లో 1,600, ఫ్లోటింగ్ సోలార్ యూనిట్లో 100, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టులో 10.. ఇలా మొత్తంగా 4,310 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఐఎస్వో–14001 సర్టిఫికెట్ పొంది ‘సూపర్ థర్మల్ పవర్ స్టేషన్’గా రూపాంతరం చెందింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 14 నవంబర్ 1978న రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌కు పునాది రాయి వేశారు. పర్యావరణ పరిరక్షణకు.. విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఎన్టీపీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. 2019–20లో జిల్లాలో 90,000కుపైగా మొక్కలు నాటించింది. 53 రకాల మొక్కలతో మియావాకి విధానం ద్వారా నాలుగు స్టేజీల్లో 30,262 మొక్క లు నాటించి జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. బూడిద వినియోగంలోనూ.. విద్యుత్ తయారీ సందర్భంగా విడుదలయ్యే వ్యర్థ బూడిదను ఎన్టీపీసీ సెనోస్పియర్ సేకరణ, విక్రయాలు చేయడం ప్రారంభించింది. ఇటీవల నిర్మించిన సిమెంట్ ఫ్రీ ఫ్లై యాష్ బేస్డ్ జియోపాలిమర్ రోడ్డును అతితక్కువ కర్బన ఉద్గారం, తక్కువ నీటి వినియోగంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టు బూడిద వినియోగం వైపు కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. నీటి సంరక్షణలోనూ అగ్రగామి.. ప్రవహించే నీటిని రీసైకిల్ చేయడంతోపాటు యాష్ హ్యాండ్లింగ్ కోసం వినియోగించే నీటిని రీసైకిల్ చేస్తూ హార్టికల్చర్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కాగా.. రిమోట్ ఉపయోగించి వైర్లెస్ వాటర్ వినియోగ డేటా పర్యవేక్షిస్తూ మొదటి ప్లాంట్‌గా రికార్డు కెక్కింది. అంతేకాదు.. ఉ ద్యోగుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. సామాజిక సేవా బాధ్యతగా సీఎస్సార్ ని ధులతో ఎన్టీపీసీ ప్రభావిత, సమీప ప్రాంతాల అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి పాటుపడుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతోంది, సోలార్ పవర్ ఉత్పత్తిలోకి.. రామగుండం ఎన్టీపీసీ 13 డిసెంబర్ 2013న గ్రౌండ్ మౌంటెడ్ పద్ధతిన పది మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ పీవీ ప్లాంట్ ప్రారంభించింది. మనదేశంలోనే 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ (మనదేశంలోనే అతిపెద్దది)ను తన రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసి రికార్డుకెక్కింది. పర్యావరణ అనుమతి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు తొలుత స్టేజీ–1లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు నిర్మించింది. ఇందులోంచి 85 శాతం విద్యుత్‌ను తెలంగాణకు అందస్తోంది. స్టేజీ–2లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల పర్యావరణ అనుమతులు ల భించాయి. వీటికితోడు విద్యుత్ ఉత్పత్తిలో ఐదు ప్ర తిష్టాత్మక టస్కర్ జాతీయ అవార్డులు అందుకుంది. హిందీ భాషను ప్రోత్సహించడంలో 2023–24 (రా జ్భాషా వర్గం) స్వర్ణశక్తి అవార్డు లభించింది. సీఐఐ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్లాంట్ అవార్డు –2025 అందుకుని ముందుకు సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ అగ్రస్థానం సామాజిక సేవ, ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి రేపు 48వ వసంతంలోకి అడుగిడనున్న రామగుండం విద్యుత్ ప్రాజెక్ట్ -
రైతులకు జవాబుదారీగా ఉండాలి
మంథని: ధాన్యం కొనుగోళ్లలో అందరూ రైతులకు జవాబుదారీగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం శ్రీకారం చుట్టారు. పోచమ్మవాడ అంగుళూరు శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో మరిన్నిసౌకర్యాలు కల్పిస్తామన్నారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీవర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక మైండ్‌సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించినట్లు పిల్లలు మంచికలలు కని, వాటిని సాకారం చేసుకోవాలని మంత్రి సూచించారు. మంథని యువకులు తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫీడర్, ఆధునిక హెల్మెట్ ఆవిష్కరణ అభినందనీయమన్నారు. అంతకుముందు మంథని జూనియర్ కళాశాలలలో రూ.44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి ప్రారంభించారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనిల్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బేగంపేటలో కొనుగోళ్లు ప్రారంభం.. రామగిరి(మంథని): బేగంపేట గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. పలువురు అధికారులతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, నాయకులు రోడ్డ బాపన్న, వైనాల రాజు, మద్దెల రాజయ్య, సిద్దం మురళీకృష్ణ, ప్రవీణ్, ఆరెల్లి శ్రీనివాస్, దాసరి శివ, ఆరెల్లి కొంరయ్య, తోట చంద్రయ్య, అవినాష్, పద్మ, శంకర్ పాల్గొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
17శాతం తేమ ఉన్న ధాన్యం తేవాలి
పెద్దపల్లి: రైతులు ధాన్యం ఆరబెట్టి తేమ 17శాతం లోపు వస్తేనే కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. పొలం నుంచి నేరుగా ధాన్యం తీసుకు రావొద్దన్నారు. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ లేకుంటే నాలుగైదు రోజులపాటు ఆరబెట్టుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రో జంతా ఆరబెట్టి రాత్రి ప్లాస్టిక్ కవర్లు కప్పుకోవాలని, లేకపోతే, మంచుకురిసి తేమ శాతం పెరిగే అవకా శం ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరీక్షించి వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆ తర్వాత రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, 48 గంటల్లోగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలని అన్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
సంబంధం లేకుంటే ఎందుకు నిర్మిస్తున్నారు?
గోదావరిఖని: రామగుండం నగరంలో మైసమ్మ గుడుల కూల్చివేతతో సంబంధం లేకుంటే వాటిని ఎందుకు నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. 46 మైసమ్మ, వేల్పులమ్మ దేవాలయాలను కూల్చినోళ్లు మూల్యం చెల్లించక తప్పదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఊరూరా మైసమ్మను కొలిచే సంస్కృతి ఉందని, గుడుల కూల్చవేతతో ప్ర జల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. దీని పై మాట్లాడితే కేసులు పెట్టడం, ఎదురు తిరిగితే దా డులు చేయడం పరిపాటిగా మారిపోయిందని ధ్వ జమెత్తారు. ఆలయాలను కూల్చి వారంరోజులైనా బాధ్యులపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూల్చిన గుడుల స్థానంలో కొత్తవి నిర్మించాలని, లేనిపక్షంలో బల్దియా, ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ఆముల నారాయణ, గోపు ఐలయ్యయాదవ్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, మేడి సదానందం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ -
కూలి కూడా రావడం లేదు
వ్యాపారులకు అమ్మితే.. పత్తి ఏరిన కూలీలకు కూలి చెల్లించే ధర కూడా రావడంలేదు. మా ఊరు నుంచి ఆటోట్రాలీలో పత్తి తీసుకొని వచ్చిన. మద్దతు ధర లేదు. ఇంటికి తీసుకెళ్లలేక ఎంతోకొంతకు అమ్ముకోవాల్సి వచ్చింది. క్వింటాల్‌కు 4,500 ధర పెట్టిండ్రు. – సీహెచ్ రాజేందర్, రైతు, హరిపురం, ముత్తారంఏజెంట్లే ధర నిర్ణయిస్తున్నరు నాణ్యత చూడకుండానే ఏజెంట్లు ధర నిర్ణయిస్తున్నరు. నా పత్తి క్వింటాల్‌కు రూ.5,937 ధర పెట్టిండ్రు. ఈ నామ్ పద్ధతి అంటే ఇదేనా? ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంటే.. దళారీలు ధర పలుకకుండ చేస్తున్నరు. అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నరు. ఎలక్ట్రానిక్ కాంటాల్లో సెట్టింగ్ చేసి మోసగిస్తున్నరు. – చిలుకల సతీశ్, రైతు, చందపల్లె -
దాహం తీరేదెలా?
గోదావరిఖని: వర్షకాలంలో మురుగునీరు.. వేసవి లో కలుషిత నీరు.. ఇలా రెండు సీజన్లలో సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభించడమే లేదు. ఈ నీరుతాగుతూ అనేకమంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కార్మిక కు టుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించేందుకు సింగ రేణి యాజమాన్యం రూ.25కోట్లు మంజూరు చేసింది. గతేడాది మార్చిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమా ర్క పనులు ప్రారంభించారు. వాస్తవానికి గత ఆగ స్టులోనే ప్లాంట్ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇప్పటివరకు 80శాతం పనులే పూర్తయ్యాయి. సాంకేతిక పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. ఇబ్బందుల్లో సుమారు 70 వేల మంది.. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్పీ ఏరియాల్లో విస్తరించి ఉంది. ఆయా ప్రాంతాల్లో కార్మికులు సుమారు 50 వేల మంది, కార్మికేతరులు దాదాపు 20వేల మంది వరకు ఉంటారు. వీరికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.25కోట్లతో ర్యాపిడ్గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించేందుకు సింగరేణి నిర్ణయించింది. గతేడాది జూన్‌లో పనులు ప్రారంభించారు. నిర్దేశిత గడువు ఈఏడాది ఆగస్టు. ఆలోగా పనులు పూర్తి కా ల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ మరోమూడు నెలల గడువు కోరారు. దీంతో ఈనెలాఖరు వరకు పనులు పూర్తిచేసి యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం ప్లాంట్ క్లారిఫ్లాస్క్లేటర్, ఫిల్టర్‌హౌస్, కెమికల్ హౌస్, క్లోరినేషన్ హౌస్, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 20శాతం పను లు పూర్తిచేయాల్సి ఉంది. ఇందులోని గ్రీన్ వాటర్ చాంబర్, పైపులైన్ డైవర్షన్, కాంపౌండ్‌వాల్ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. నిత్యం 35 ఎంఎల్డీ నీటి సరఫరా.. నగర శివారులోని గోదావరినది నుంచి రోజూ 35ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటిని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల్లోని కార్మిక, కార్మికేతర కుటుంబాలకు పంపింగ్‌తో పైపులైన్ల ద్వారా అందిస్తోంది. మూడేళ్లకిందట వరకు తాగునీటి సరఫరా బాగానే ఉన్నా.. కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణంతో తిప్పలు మొదలయ్యా యి. బ్యాక్‌వాటర్‌తో ఏడాది పొడవునా నదిలో నీటి నిల్వలు పేరుకుపోవడం, నగరంలోంచి వెలువడే డ్రైనేజీ, ఆర్ఎఫ్సీఎల్ నుంచి విడుదలయ్యే రసాయనాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీనిని తాగిన కార్మిక కుటుంబాలు డయే రియా బారిన పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికీ గోదావరి నుంచే మిషన్ భగీరధ ద్వారా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లు ఏర్పాటు చేసి నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. ఇదే పద్ధతిన సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే డిమాండ్ పెరిగింది. ఈమేరకు అప్పటి సీఎండీ శ్రీధర్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశా రు. ఆర్జీ–1 ఏరియా జీడీకే –1, 3గని ఫ్యాన్‌హౌస్ సమీపంలో 35 ఎంఎల్డీ సామర్థ్యంగల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ పనులు చేపట్టారు. కార్మిక కుటుంబాలకు కలుషిత నీరే దిక్కు పూర్తికాని ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ రూ.25 కోట్లతో ఏడాది క్రితం పనులు గడువు ముగిసినా ఇంకా అసంపూర్తిగానే నిర్మాణం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగింపుగడువులోగా పూర్తిచేస్తాం ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తాం. వాస్తవానికి గత ఆగస్టులోనే పనులు పూర్తికావాల్సి ఉంది. వర్షాలతో పనుల్లో ఆటంకం ఏర్పడింది. ఈనెలాఖరు వరకు ప్లాంట్‌ను ప్రారంభించి కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. – లలిత్‌కుమార్, ఆర్జీ–1 జీఎం -
‘ప్రైవేట్’దే పెత్తనం
పెద్దపల్లి: ‘నిర్దేశిత ప్రమాణాల కన్నా తేమశాతం అధికంగా ఉంది.. నిబంధనల ప్రకారం నాణ్యంగా లేదు.. ఇలాగైతే మద్దతు ధరతో కొనుగోలు చేస్తే నష్టపోతాం.. తక్కుత ధరకు ఇస్తే ఎలాగోలా సర్దుకుపోతాం’ అంటూ ప్రైవేట్ వ్యాపారులు పత్తి రైతులను గందరగోళంలో పడేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉన్నా.. అధికారులు ఉన్నా.. పెత్తనం మాత్రం ప్రైవేట్ వ్యాపారులదే. పత్తి విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్తే.. ధర విషయంలో వ్యాపారులు చెప్పిందే వినాలి. లేదంటే నాణ్యంగా లేదంటూ వారు కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి రంగు మారింది. తేమశాతం కూడా 12కు మించి నమోదవుతోంది. ఇలాంటి పత్తిని ఎంత తక్కువ ధరకైనా విక్రయించక తప్పని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. చేసేదిలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన వస్తోంది. నిరక్షరాస్యులైన అన్నదాతల అమాయకత్వం పత్తి వ్యాపారులకు లాభసాటిగా మారింది. కనిపించని తనిఖీలు తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ కాంటాలను తరచూ తనిఖీ చేయాలి. కానీ, తనిఖీలు చేయకపోవడంతో కొందరు వ్యాపారులు తూకంలో మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. బాధ్యులు ఎవరు? పత్తి మార్కెట్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే పత్తిని నిల్వ చేసేక్రమంలో అనూహ్య ఘటనలు జరుగుతాయని, నీటినిల్వలు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్నదాతలు అధికారులను కోరుతున్నారు. వ్యాపారులు చెప్పిందే ధర లేదంటే కొనుగోళ్లు బంద్ నామమాత్రంగా సీసీఐ కొనుగోళ్లు నష్టపోతున్న పత్తి రైతులు -
వారోత్సవాలను విజయవంతం చేయాలి
పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 13 నుంచి నిర్వహించే వయోవృద్ధుల వారోత్సవాలను వియవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణు కోరారు. కలెక్టరేట్లో బుధవారం వారోత్సవాల ప్రచార పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వారోత్సవాల సందర్భంగా ఈనెల 13న వృద్ధాశ్రమంలో ఆట, పాటలు, వినోద కార్యక్రమా లు, 14న ఉచిత ఆరోగ్య శిబిరాలు, 15న సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ లు, 17న జిల్లాస్థాయి వృద్ధుల చట్టాలపై ఆరో గ్య, చురుకై న వృద్ధాప్యంపై అవగాహన, 18న సర్పంచ్, ప్రతినిధులతో అవగాహన, 19న రా ష్ట్ర, జిల్లాస్థాయిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో అధికారులు కవిత, రాజ య్య, బాలస్వర్ణలత, స్వామి, జీవన్, రాజు, రాజేశం, సత్తయ్య, సుందరి పాల్గొన్నారు. పనితీరుకు పురస్కారం పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆ స్పత్రి అధికారులు, సిబ్బంది సేవల ఆధారంగా స్టార్ పెర్ఫార్మర్ అవార్డు ప్రదానం చేస్తున్న ట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనల మే రకు సిబ్బందిలో పారదర్శకత పెంచేందుకు ప్ర తీనెల పనితీరు ఆధారంగా ఒకరికి స్టార్ పెర్ఫార్మర్ అవార్డు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈసారి మౌనిక అనే స్టాఫ్‌నర్స్‌కు అవార్డు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు సభ్యత్వాలు మంథని: మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో 32 మంది మత్స్య కార్మికులకు నూతన సభ్యత్వాలు, గుర్తింపు కార్డులను జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, జిల్లా అధికారి నరేశ్‌నాయుడు అందజేశారు. స్థానిక బోయిన్‌పేట్ లక్ష్మీదేవర ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. మత్స్యకార రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో తొలిసారి సభ్యత్వాలు అందేలా కృషి చేసిన డైరెక్టర్, మంథని అధ్యక్షుడు పోతరవేని క్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మాజీ అధ్యక్షుడు పోతరవేని లక్ష్మీరాజం, డైరెక్టర్లు కుంట బద్రి, సిలివేరి భూమన్న బయ్యా రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు హుండీ ఆదాయం లెక్కింపు పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కట్న, కానుకల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. దేవాలయ ఆవరణలో గ్రామపెద్దలు, ఆలయ ధర్మకర్తలు, అధికారుల సమక్షంలో హుండీ ఆదాయం లెక్కింపు చేపడతామన్నారు. గ్రామస్తులు కూడా హాజరు కావాలని ఆయన కోరారు. నేడు పత్తి మార్కెట్ బంద్ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గురువారం పత్తి క్రయ, విక్రయాలు నిలిపివేస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప కుమారుడు అకాల మరణం పొందిన కారణంగా సంతాప సూచకంగా అడ్తీ, ఖరీదుదారులు కొనుగోళ్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతులు మార్కెట్‌కు పత్తి తేవద్దని ఆయన సూచించారు. గడువు పొడిగింపు పెద్దపల్లి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 27వ తేదీ వరకు పొడిగించామని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీలో 30, డయాలసిస్‌లో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇంటర్ బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. వారు సరిపడాలేకుంటే ఎంపీసీ వారికి అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమగ్రాభివృద్ధి లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ద్యోగుల శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధి లక్ష్యమని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ టీటీఎస్‌లో మంగళవారం ఒత్తిడి నిర్వహణ, సానుకూల ఆలోచనలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జీవితంలోని అన్నిఅంశాలలో సమతుల్యతను కా పాడుకోవాలన్నారు. అనంతరం బ్రహ్మకుమారీస్ విశ్వని సూచించారు. విద్యాలయ అధ్యాపకులు బీకే ఉమారాణి, రజని, శోభ.. అంతర్గత శాంతిని సాధించడం, భావోద్వేగ సమతుల్యత ను కాపాడుకోవడం, వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించడంపై వివరించారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేడు మంత్రి పర్యటన మంథని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవా రం జిల్లాలో పర్యటించనున్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారు. 17 పాఠశాలల్లో రూ.3.43 కోట్లతో టేపట్టిన అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేస్తా రు. మంథని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో రూ.44 లక్షలు వెచ్చించి నిర్మించిన సింథటిక్ షటిల్ కోర్టును మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభిస్తారు. పోచమ్మవాడలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అడవి సోమనపల్లిలో 40 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేయిస్తారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు. వారసత్వ హక్కును కొనసాగించాలి పెద్దపల్లి: మున్సిపల్ కార్మికులకు వారసత్వహక్కును కొనసాగాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో మున్సిపల్ యూని యన్ సమావేశం మహంకాళి సురేశ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఆయన మా ట్లా డుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వారసత్వహక్కును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు సావనపల్లి వెంకటస్వామి, బొంకూరి సాగర్, మద్దెల రాజయ్య, బొంకురి శంకర్, చింతల మరియా, ఆరేపల్లి ప్రమీల, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములపై విచారణ పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులో ఆక్రమణకు గురైన ఆలయ భూములపై లోకాయుక్త ప్రతినిధి నరసింహతోపాటు దేవాదా య, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజ య్య మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేశ్ పటేల్ వారిని కలిశారు. అన్యాక్రాంతమైన దేవాలయాల భూము లను పరిరక్షించాలని ఆయన విన్నవించారు. ఈయన ఫిర్యాదుపైనే అధికారులు మోకాపై భూములు పరిశీలించారు. వారివెంట ఆర్ఐ సత్యనారాయణ, ఈవో శంకరయ్య, రాజ్‌కుమార్, సర్వేయర్లు తదితరులు ఉన్నారు. రేపు ధర్మారంలో సదస్సు ధర్మారం(ధర్మపురి): లీడ్ ఇండియా ఫౌండేష న్, విశ్వగురు భారత్ –2047 ఆధ్వర్యంలో ట్రె యినింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ కోసం ఈనెల 13 న స్థానిక సెర్ప్ కార్యాలయంలో అవగాహన స దస్సు నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా శి క్షణ సమనవ్యయకర్త తాడూరి శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారికి హైదరాబాద్‌లో మూ డు రోజుల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణలో ఎంపికై న వారికి ఉచిత వసతితోపాటు భోజనం, గౌర వవేతనం చెల్లిస్తారన్నారు. నైపుణ్యం ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఆసక్తి గలవారు అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆయన కోరారు. -
ధాన్యం దోపిడీ..!
‘పులి మీద పుట్రలా’ తయారైంది అన్నదాత దుస్థితి. విత్తన దశ నుంచి పంట విక్రయించే వరకు అడుగడుగునా ఆటంకాలే. ఆరుగాలం కష్టపడిన కర్శకునికి కోతల పేరుతో పీల్చి పిప్పిచేస్తుండగా పర్యవేక్షణ నామమాత్రంగా మిగలడం విడ్డూరం. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడిగాపుల కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. రోజుల తరబడి కేంద్రాల్లో నిరీక్షించడం దారుణ పరిణామం. అసలే యాసంగి పనులు ఊపందుకోనుండగా సకాలంలో కొనుగోళ్లు చేయాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూసేవారే కరవయ్యారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుంటే పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిందిపోయి సాకులు వెతకడం అధికారుల వంతవుతోంది. కరీంనగర్ జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతుండగా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నత్తను మరిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మార్కెటింగ్ విభాగాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఒక్కో బస్తా తూకం 40.650 కిలోలు వేయాల్సి ఉండగా 43, 44 కిలోలు వేస్తున్నారు. ఇదేంటంటే నాణ్యతలేవని కొత్త రాగం పాడుతున్నారని రైతులు వాపోతున్నారు. అసలే రోజుల తరబడి ఎండిన ధాన్యంలో రాళ్లు ఉంటాయా..నన్నది అధికారులకే తెలియాలి మరి. ఇక మిల్లుల్లో నేరుగా విక్రయించే రైతులకు తరుగు, తేమ పేరుతో బస్తాకు 3–5కిలోలు కోత విధిస్తున్నారు. కోత తర్వాతే మిగిలిన ధాన్యం మొత్తాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కుప్పల్లా ధాన్యం పేరుకుపోతుండగా టార్పాలిన్లు పావు వంతు కూడా అందలేదు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తరచూ వర్షం పడుతుండగా ధాన్యం కొట్టుకుపోతుంది. పైపెచ్చు రూపు మారుతుండటంతో అన్నదాతలు అపసోపాలు పడుతున్నారు. చిరిగిన టార్పాలిన్లు ఎందుకు కొరగాకపోగా ఇళ్లలోని కవర్లను వినియోగిస్తున్నారు. ఇంకా ప్రారంభం కాలె.. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్ల తీరును పరికిస్తే పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పేలవం. 408 కేంద్రాలకు కేవలం 223 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా పెద్దపల్లి జిల్లాలో 333 కేంద్రాలకు 86 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరగడం ఆందోళనకర పరిణామం. సగానికి పైగా కేంద్రాలు ప్రారంభించకపోవడం అన్నదాతలకు పడిగాపులే. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెచ్చు కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఎటు చూసినా ధాన్యం రాశులే.. గత వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రస్తుత కొనుగోళ్లకు భారీ వ్యత్యాసముంది. కొనుగోళ్లలో వేగం పెరిగినా తరుగు దోపిడీ ఆగడం లేదు. లారీల సమ స్య, గన్నీ సంచుల కొరత, ధాన్యం పట్టే యంత్రాలు సరిపడా లేకపోవడం, మిల్లుల్లో స్థలం కొరత క్ర మంలో ఎటూ చూసినా ధాన్యం రాశులే దర్శనమి స్తున్నాయి. ఒక్కో రైతు పక్షం రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. అధికార యంత్రాంగం తమకున్న సామర్థ్యం క్రమంలో లారీలు సమకూర్చుతుండగా, ధాన్యం నిల్వ చేసేందుకు స్థల సమస్య ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నిబంధనల ప్రకారం ధాన్యం నాణ్యంగా ఉన్నా ఏదో సాకుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో కొనుగోళ్లు ఇలా.. కొనుగోలు కేంద్రాలు : 333కొనుగోలు చేస్తున్నవి : 86సేకరించిన ధాన్యం : 7,890.069 మెట్రిక్ టన్నులుమొత్తం రైతులు : 1,140 మొత్తం ధాన్యం విలువ : రూ.18.85కోట్లుమిల్లర్లకు చేరిన ధాన్యం విలువ : రూ.12.59కోట్లురైతులకు చెల్లించిన నగదు : రూ.9.40కోట్లుచెల్లించాల్సిన నగదు : రూ.9.45కోట్లు -
వైద్యవిద్యకు ఊపిరి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండంలోని సింగరేణి ప్రభుత్వ వైద్య కళాశాలకు పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సులు మంజూరు కావవడంతో వైద్యబోధన వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసినట్లయ్యింది. సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్– ప్రభుత్వ) కళాశాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 పీజీ సీట్లు కేటాయించడం ఇందుకు కారణమైంది. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో కాలేజీకి మంచి రేటింగ్ వచ్చింది. దేశంలోని విద్యార్థులు సిమ్స్‌ను ఎంచుకోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. సిమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు? డాక్టర్ నరేందర్ : నాలుగేళ్ల క్రితం గోదావరిఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంతం, కాలేజీ బిల్డింగ్తోపాటు హాస్టళ్లు, ఫ్యాకల్టీ క్వార్టర్స్, క్యాంటీన్ తదితర నిర్మాణాల కోసం సింగరేణి నిధులు కేరాయించింది. నిధులు ఇచ్చినందున ‘సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్)’గా కాలేజీకి నామకరణం చేశారు. 2022– 23వ విద్యాసంవత్సరం నుంచే సొంత భవనంలోనే తొలి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించాం. సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది? డాక్టర్ నరేందర్ : కొత్త మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల కేటాయింపు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఏంసీసీ)ద్వారా జరుగుతుంది. జాతీయస్థాయిలో 50 శాతం ఆల్ ఇండియా కోటా, రాష్ట్ర కోటా 50 శాతం కింద కేటాయిస్తారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వంటి రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. పీజీ కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేశారా? డాక్టర్ నరేందర్ : మరో 16 పీజీ సీట్లు మంజూరు చేయించుకోవడానికి చర్యలు చేపడతాం.బోధనకు సౌకర్యాలు ఏమిటి? డాక్టర్ నరేందర్ : పీజీ స్టూడెంట్స్ కోసం బోధన సిబ్బంది, ల్యాబ్, క్లినికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీంతోనే ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. పీజీ కోర్సులతో ప్రయోజనాలు ఏమిటి? డాక్టర్ నరేందర్ : పీజీ కోర్సులన్నీ అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత వైద్య విద్యా అవకాశాలు లభిస్తాయి. పీజీ సీట్లు ఎన్ని? అందులోని విభాగాలు ఏమిటి? డాక్టర్ నరేందర్ : 2025–26 విద్యా సంవత్సరంలో సిమ్స్‌కు 16 పీజీ కోర్సులు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందులో ఎండీ (ఎమర్జెన్సీ మెడిసిన్), ఎంఎస్(గైనకాలజీ), ఎంఎస్ (ఆర్థోపెడిక్), ఎండీ(బయోకెమిస్ట్రీ) విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బోధన తరగతులు ప్రారంభం అవుతాయి.పీజీ విద్యార్థులతో వైద్యసేవలు మెరుగవుతాయా? డాక్టర్ నరేందర్ : పీజీ స్టూడెంట్లు రెసిడెంట్ డాక్టర్లుగా 24 గంటలపాటు పేషెంట్లకు సేవలు అందిస్తారు. అత్యవసర విభాగం నుంచి శస్త్రచికిత్సల వరకు నిపుణుల సహకారం లభిస్తుంది. పరిశోధన, ప్రాజెక్టులు వైద్యరంగం అభివృద్ధికి దోహదం చేస్తాయి. సిమ్స్‌లో బోధన తీరు ఎలా ఉంది? మెడికోల భద్రతకు తీసుకుంటున్న చర్యలేమిటి? డాక్టర్ నరేందర్ : సిమ్స్‌లో బోధన అద్భుతం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వెబ్ సైట్లలో సిమ్స్‌కు 4.6 రేటింగ్ రావడం గర్వకారణం. మెడికోల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు తావులేదు. పోలీసుల నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుంది.ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? డాక్టర్ నరేందర్ : కాలేజీకి మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 2022–23, 2013–24, 2024–25, 2025–26 విద్యాసంవత్సరాల్లో చేరిన విద్యార్థులతో కలిపి ప్రస్తుతం 600 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లు ఉన్నారు. సీట్ల కేటాయింపులో 85 శాతం లోకల్(తెలంగాణ రాష్ట్రం), 15 శాతం ఆలిండియా కేటగిరీ ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ఏడు సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేశారు. -
రంగంలోకి పోలీస్ జాగిలాలు
గోదావరిఖనిలో పోలీసుల తనిఖీలు పెద్దపల్లి రైల్వేస్టేషన్లో..గోదావరిఖని: ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్లు, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి, గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం తనిఖీలు విస్తృతం చేశారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్స్, జాగిలాలతో సోదాలు చేశారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ప్రధాన చౌరస్తా, ల క్ష్మీనగర్, ఓల్డ్అశోక్ థియేటర్ ఏరియాతోపాటు న గరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బలగాలు అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనుమానితులను ప్రశ్నించి వదిలేశాయి. ఎస్సైలు రమేశ్, భూమేశ్, అనూషతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో.. పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర రద్దీ ప్రదేశాల్లో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. బాంబు పేలుళ్లను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా తనిఖీలు చేశామని డీసీపీ, ఏసీపీలు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోదాలు.. రామగుండం: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ భద్రతా బలగాలు స్థానిక రైల్వేస్టేషన్లో ముమ్మర సోదాలు చేశాయి. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశాయి. అనుమానితులను ప్రశ్నించి వదిలేశాయి. కార్యక్రమాల్లో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎస్సై క్రాంతి కుమార్, ఏఎస్సైలు రామకృష్ణ, నాగరాజు, జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
మారనున్న సుల్తానాబాద్ రూపురేఖలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ రూపురేఖలు మారుతున్నా యి. మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్ గా ఆవిర్భవించినా మొన్నటిదాకా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇటీవల రూ.15కోట్లు ప్రభు త్వం మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప ట్టాలెక్కాయి. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించగా పట్టణం సరికొత్తకళ సంతరించుకుంది. తాజా గా కాల్వశ్రీరాంపూర్ చౌరస్తా నుంచి రిక్రియేషన్ క్ల బ్ వరకు ఇరుకై న రోడ్డు విస్తరణకు సమీపంలోని వాణిజ్య, వాపార సంస్థల షట్టర్లు తొలగిస్తున్నారు. ఆ వెనకాలే నిర్మించిన కొత్త దుకాణాలను నష్టపోయిన వ్యాపారులకు ఉచితంగా కేటాయించారు. అందుబాటులోకి నీరుకుల్ల మానేరు వంతెన కరీంనగర్, వరంగల్, హన్మకొండ తదితర దూర ప్రాంతాలు, జమ్మికుంట ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మధ్య రాకపోకలు సాగించేందుకు నీరుకుల్ల మానేరుపై వంతెన అందుబాటులోకి వచ్చింది. దీనిద్వా రా ఆయా ప్రాంతాలకు దూరభారం తగ్గుతుంది. విలీన గ్రామాలపై దృష్టి సుగ్ల్లాంపల్లి, పూసాల, శాసీ్త్రనగర్ను సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల విలీనం చేశారు. ఆ గ్రా మాల్లో ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. విలీన గ్రామాల అభివృద్ధికి రూ.4 కోట్లతోపాటు అంతర్గత రహదారులకు రూ.6 కోట్లు, డ్రైనేజీలకు రూ.3 కోట్లు, కల్వర్లకు రూ.కోటి, జంక్షన్ల కోసం మరో రూ.కోటి మంజూరయ్యాయి. -
ప్రతిభను వెలికి తీయాలి
● అదనపు కలెక్టర్ వేణు ● ఘనంగా యువజనోత్సవాలు పెద్దపల్లి: యువత తమ ప్రతిభను వెలికి తీయాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్హాల్లో మంగళవారం జాతీయ యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత అన్నిరంగాల్లో రాణించాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రో త్సహిస్తుందన్నారు. అనంతరం పలు రంగాల్లో ప్ర తిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చే శారు. జిల్లా యువజన, క్రీడల అధికారి సురేశ్, ఉ పాధి కల్పనాధికారి రాజశేఖర్, ఇంటర్ విద్య నోడ ల్ ఆఫీసర్ కల్పన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, దుర్గాప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆటల్లోనూ రాణించాలి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ వేణు కోరారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ మహాత్మాజ్యోతిబా పూలే గురుకులంలో అండర్– 14,– 19 జిల్లాస్థాయి క్రీడా పో టీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రతినిధులు మణిదీప్తి, శ్రీనివా స్, సురేశ్‌కుమార్, సంధ్యారాణి పాల్గొన్నారు. -
ఢిల్లీ ఉగ్రదాడిపై బీజేపీ నిరసన
పెద్దపల్లిరూరల్: ఢిల్లీలో ఉగ్రదాడులపై బీజేపీ శ్రేణు లు నేతలు పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో కమాన్ వద్ద మంగళవారం రాస్తారోకో చేశారు. ఉగ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. నాయకులు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, శంక ర్, తిరుపతి, శ్రీనివాస్, రాజగోపాల్, మహంతకృష్ణ, శ్రీకాంత్, సురేందర్, సతీశ్, రాజేంద్రప్రసాద్, ఉ ప్పు కిరణ్, పూరెళ్ల రాజేశం, ఉమేశ్, సబ్బు మల్ల య్య, శివయ్య, రాజు, మహేశ్, మఽధుకరణ్, అంజి, వంశీకుమార్, వినయ్, రమేశ్, అనుదీప్ ఉన్నారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం పెద్దపల్లి: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ అంబేడ్కర్ వి గ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉగ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. కామని రాజేంద్రప్రసాద్, కూకట్ల నాగరాజు, తిరుపతి యాదవ్, లంక శంకర్, శ్రీనివాస్‌గౌడ్, సదయ్యగౌడ్, అన్వేష్, నాగులమల్యాల తిరుపతి, పవన్, సతీశ్, పల్లె తిరుపతి, సంపత్, కుమార్, వెంకటేశ్, సంతోష్‌రెడ్డి, మ హేశ్ పటేల్, శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు. జ్యోతినగర్(రామగుండం): మేడపల్లి సెంటర్లో బీ జేపీ నియోజకవర్గ ఇన్చార్జి కె.సంధ్యారాణి, ధర్మపురి, సతీశ్‌కుమార్, చిరంజీవి, అంజి పాల్గొన్నారు. -
శిక్షణతో యువతకు ఉపాధి
పెద్దపల్లి: గ్రామీణ నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలో గ్రామీణ స్వ యం ఉపాధి శిక్షణ సంస్థ(రీసెట్ ) శిబిరాన్ని మంగళవారం అయన ప్రారంభించి మాట్లాడారు. టైలరింగ్, మగ్గం వర్క్‌లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి, రీసెట్ డైరెక్టర్ రాకేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే పేదరికం అంతం విద్యతోనే పేదరికం అంతమవుతుందని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు. గత విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా మైనార్టీ అధికారి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచాలి ప్రతీ విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచేందుకు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా అమలుపై కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, టీఆర్ఐఈఎస్ హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లా డారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల 100 శాతం హాజరు నమోదు చేయాలని అన్నారు. జేఈఈ, నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఫిజిక్స్‌వాలా యాప్ అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. చివరిగింజ వరకూ కొనుగోలుకు చర్యలు ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మంగళవారం వరకు 1,140 మంది రైతుల నుంచి రూ.18 కోట్ల 85 లక్షల విలువైన 7,890 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేిశామాని, 7,461 మెట్రిక్ టన్నులను రైస్ మిల్లులకు తరలించి, 470 మంది రైతులకు 3,073 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.7 కోట్ల 34 లక్షలు చెల్లించామని కలెక్టర్ వివరించారు. -
కౌన్సెలింగ్ కత్తి
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మెడపై గైర్హాజర్ కత్తి వేలాడుతోంది. గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా డ్యూటీకి డుమ్మా కొడతామంటే కుదరదు. నె లలో కనీసం 16 మస్టర్లు డ్యూటీ చేయాల్సిందే. లేనిపక్షంలో అధికారుల కౌన్సెలింగ్ ఎదుర్కోవాల్సిందే. విచారణ ఎదుర్కోవాల్సిందే.. ఏడాదిలో కనీసం 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా సింగరేణి నిబంధనలు రూ పొందించింది. కానీ, కార్మికుల గైర్హాజర్ పెరగడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. సంస్థలో ప్రతీనెల 25శాతం కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారని, ఇందులో అధికంగా యువకార్మికులే ఉంటున్నారని గుర్తించింది. గైర్హాజర్ నివారణకు నెలలో కనీసం 16 మస్టర్ల కన్నా తక్కువ మస్టర్లు ఉంటే గనులపైనే కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈపక్రియ ఈనెలలోనే ప్రారంభమైంది. ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ గైర్హాజర్ కార్మికులకు నాలుగు రోజుల క్రితమే కౌన్సెలింగ్ ప్రారంభమైంది. భూగర్భగనుల్లో నెలకు 16 కన్నా తక్కువ, ఉపరితంలో 20 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే గనిపై చేపట్టే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందే. భూగర్భగనుల్లో మూడునెలల పాటు ఇదేవిధంగా హాజరు ఉంటే గని మేనేజర్ స్థాయి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపిస్తారు. గైర్హాజరవుతూ కౌన్సెలింగ్‌కు హాజరు కుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. మూడున్నర నెలల్లో ఇంటికే.. ఏడాదిలో కనీసం 150 డ్యూటీలు చేయాలని, అంతకన్నా తక్కువ ఉన్న కార్మికుల జాబితాను గనుల నోటీసు బోర్డుపై అంటించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవసరమైతే హెచ్చరిక, సస్పెన్షన్, నాన్క్యూమిలేటివ్ ఇంక్రిమెంట్ రికవరీ, క్యూమిలేటివ్ ఇంక్రిమెంట్(జీవితకాలం) తక్కువ, గ్రేడ్ తగ్గించడం, తర్వాత డిస్మిస్ చేయడం.. ఇలా క్రమశిక్షణ చర్యల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తిచేయాలని కార్పొరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. క్లరికల్ సిబ్బందిపై భారం నెలవారీ కౌన్సెలింగ్‌తో పేషీట్ రైటర్, పీవోఏ, ఎంకై ్వరీ క్లర్క్, వెల్ఫేర్ ఆఫీసర్, జీఎం ఆఫీస్ నుంచి విచారణ ఆఫీసర్ రావాలి. గతంలో ఆరు నెలలకోసారి కౌన్సెలింగ్ నిర్వహించగా, ప్రస్తుతం నెలకోసారి చేపట్టడం అందరికీ తలకు మించిన భారంగా మారుతుందని అంటున్నారు.గైర్హాజర్ లెక్కింపు ఇలా.. -
వీటీడీఏని నడిపేదెవరు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ తగ్గుతోంది. వేములవాడ దేవస్థానాన్ని యాదగిరి గుట్ట తరహాలో అభివృద్ధి చేసేందుకు 2016లో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి గతంలో తగినంత సిబ్బందిని కూడా కేటాయించింది. ఇటీవల వీటీడీఏ పర్యవేక్షణలో ఆలయ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే కాలక్రమంలో ఈ బోర్డులో సిబ్బంది కరువవుతూ, వీటీడీఏ పరిధిలో జరిగే పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కరువవుతోందన్న విమర్శలున్నాయి. వీటీడీఏలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎస్పీ, కలెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నా.. సిబ్బందిని భర్తీ చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దాదాపు రూ.160కోట్లకు పైగా అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ అమలు, రోడ్ల విస్తరణ పనులు పూర్తి కావాలంటే.. బోర్డుకు సీఈవో–వైఎస్ చైర్మన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భక్తులు కోరుతున్నారు. 2016లో.. ఆలయ అభివృద్ధికి దిక్సూచి, దిశానిర్దేశం చేసేది వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ). దీన్ని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం 2016లో వేములవాడ మండలంలోని నారాయణపేట గ్రామంతోపాటు తిప్పాపూర్, సంకేపల్లి, నాంపల్లి, చంద్రగిరి, మరుపాక, శాత్రాజ్పల్లి గ్రామాలను వీటీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటీడీఏ కోసం రూ.100 కోట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. వీటీడీఏకి సిబ్బందిని కూడా కేటాయించారు. కీలక పోస్టులన్నీ ఇన్చార్జులే.. వీటీడీఏకి ప్రారంభంలో రిటైర్డ్ ఐఐఎస్ పురోషోత్తంరెడ్డి సీఈవో–వైఎస్ చైర్మన్‌గా వ్యవహరించారు. గ తంలో భూసేకరణ, నిధులు, రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ తదితర పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగేవి. అనంతరం ఆయన ఆ పద వి నుంచి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో పదవిని సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు ఇన్చార్జిగా అదనపు బాధ్యతగా అప్పగించారు. మొన్నటివరకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఈ బాధ్యతల ను నిర్వర్తించారు. ఆయన హయాంలో కీలకమైన రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనుల్లో రాజీలేకుండా వ్య వహరించారు. అయితే ఆకస్మికంగా ఆయన బదిలీ అవడంతో ఇపుడు ఈ పోస్టు ఖాళీగా ఉంది. సెక్రటరీగా ఆర్డీవో భుజంగరావు వ్యవహరించారు. అడిషనల్ కలెక్టర్ పదోన్నతి రావడంతో ఆయన సెక్రటరీ పోస్టు వీడారు. ఆయన సెక్రటరీ బాధ్యతలను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) అన్సారీకి అప్పగించారు. ఇపుడు కీలకమైన పోస్టులను ఇన్చార్జులకు అప్పగించడం వల్ల ఆలయ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ.160కోట్ల విలువైన పనులను పర్యవేక్షించేందుకు సమర్థులైన పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి కావాలని కోరుతున్నారు.ఆలయ పరిసరాల్లో జరుగుతున్న విస్తరణ పనులుత్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ ఇంకా రాలేదు. ప్రస్తు తం అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. అసలే పూర్తిస్థాయి కలెక్టర్ లేక అదనపు బాధ్యతలు చూస్తున్న గరిమాకు గుడి అభివృద్ధి పనులను దాదాపు 2 నెలలపాటు చూసే తీరిక దొరికే అవకాశాలు చాలా తక్కువవుతాయి. దాదాపు రూ.168కోట్ల మేరకు జరుగుతున్న పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకునే ఉన్నతాధికారి అవసరం ఎంతైనా ఉందని, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. వీటీడీఏ సిబ్బంది విషయం ఇటీవల ప్రస్తావనకు వచ్చిందని, త్వరలోనే సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని వివరణ ఇచ్చారు.పనులు నిధులు గుడి కాంప్లెక్స్ విస్తరణ రూ.76కోట్లు అన్నదాన సత్రం రూ.32కోట్లు మూలవాగు వంతెన రోడ్డు వెడల్పు రూ.45కోట్లు బద్దిపోచమ్మ గుడి ఆధునికీకరణ రూ.10కోట్లు బీటీ రోడ్ల నిర్మాణం రూ.10కోట్లు మొత్తం రూ.168కోట్లు (దాదాపు)కీలక పోస్టులు ఖాళీగా.. వీటీడీఏ సీఈవో–వైఎస్ చైర్మన్ (ఐఏఎస్ ర్యాంకు అధికారి): 01 సెక్రటరీ(ఆర్డీవో ర్యాంకు అధికారి): 01 చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్: 01 సీనియర్ అకౌంట్స్:01, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్:01 సూపరింటెండెంట్:01, డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 ప్రైవేట్ సెక్రటరీ: 01, అటెండర్: 04 డ్రైవర్: 01 -
కనులపండువగా నృసింహుని రథోత్సవం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం సోమవారం కన్నులపండువగా నిర్వ హించారు. ఈనెల 2న స్వామి వారి బ్రహ్మోత్సవా లు ప్రారంభమయ్యాయి. చివరిరోజు ఉదయం 5.45గంటలకు రథోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వైద్యబృందం సేవలందించారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కమార్, రూరల్ ఎస్సై మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరమణారావు సతీమణి పావని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామస్తులు, భక్తులకు తప్పని అవస్థలు.. రథోత్సవం సందర్భంగా పోలీసుల తీరును గ్రామస్తులు, భక్తులు ఆక్షేపించారు. పోలీసుల ఆంక్షలతో అనేక ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు ఆరోపించారు. సుదూర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకునేందుకు అపసోపాలు పడాల్సివచ్చింది. ఆదివారమే అధిక సంఖ్యల తరలివచ్చిన భక్తజనం.. స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అంతంత మాత్రంగానే ఉన్నా పోలీసు అధికారులు ఆంక్షలు విధించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. గుట్టపై పూజలు.. గుట్టపై వెలసిన మూలవిరాట్టుకు పూజలు చేసేందుకు భక్తులు మెట్లమార్గంలో తరలివెళ్లారు. మంగళవారం స్వామివారికి నిత్యార్చన, చక్రస్నానం(చక్రతీర్థం), పంచామృత మహాకుంభాభిషేకం నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. -
సర్క్యులర్ ఎత్తివేయాలి
కార్మికుల ఆత్మగౌవరం దెబ్బతినేలా సర్క్యులర్ జారీచేయడం సరికాదు. ఈ విషయంలో గని లెవల్లో అధికారులకు అవగాహన లేకుండాపోయింది. ఏడా దిలో 220 మస్టర్లు ఉన్న కార్మికులను కూడా ఈనెలలో మస్టర్లు తక్కువ ఉన్నాయని కౌన్సెలింగ్‌కు పిలిచారు. దీంతో వారి మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. – మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్ కార్మికుల సంఖ్య తగ్గించేందుకే.. కార్మికులను ఇంటికి పంపించేందుకే గైర్హాజర్ విధానం ప్రవేశపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలి. ఏదో ఒకనెలలో కనీస మస్టర్లు నిండకపోయినా కౌన్సెలింగ్ ఇవ్వడం సరికాదు. యువ కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయి. పాత పద్ధతి కొనసాగించాలి. – తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ వ్యతిరేకిస్తున్నాం యాజమాన్యం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన గైర్హాజర్ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తున్నాం. ప్రతీనెల కౌన్సెలింగ్ పేరిట కార్మికులను ఇబ్బంది పెట్టే విధానం సరికాదు. ఈనెల 10న జరిగిన స్ట్రక్చర్సమావేశంలో ఈవిషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. కార్మికుల పోరులో ఈఅంశం కూడా ఉంది. – కొరివి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ -
చెత్త బయట పడేయొద్దు
కోల్‌సిటీ(రామగుండం): నిషేధిత ప్లాస్టిక్ విని యోగించినా, అపరిశుభ్ర వాతావరణంలో ప దార్థాలు తయారు చేసి విక్రయించినా, చెత్త బ యట పడవేసినా జరిమానా విధించాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరు ణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం పారిశుధ్య సిబ్బందితో పరిసరాల పరిశుభ్రతపై సమీక్షించారు. తడిచెత్తను కంపో స్ట్ యార్డ్‌కు తరలించాలన్నారు. ప్రభుత్వ వి ద్యాసంస్థ, వసతి గృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్రా వు, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జవా న్లు, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు. క్రీడలపై ఆసక్తి పెంచాలిపెద్దపల్లి: విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచేలా పీఈటీలు కృషి చేయాలని డీవైఎస్వో సురేశ్ సూచించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం ఎస్జీఎఫ్ –14 బాలబాలికల ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రపంచస్థాయి ఆర్చరీ పోటీల్లో గోల్డ్మె డల్ సాధించిన చికితను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎంపీడీవో దివ్యదర్శనరావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆసంపల్లి ల క్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు కవిత, పెటా జిల్లా కార్యదర్శి రమేశ్, మండల కార్యదర్శి ప్రణయ్ ఉన్నారు. కెపాసిటర్లు బిగించుకోవాలి పెద్దపల్లిరూరల్: సాగుకు అవసరమైన విద్యుత్ వినియోగించే రైతులు వచ్చే యాసంగి సీజన్ లో లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు మీటర్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలని డీ ఈటీ బాలయ్య సూచించారు. మూలసాలలో సోమవారం ట్రాన్స్ఫార్మర్కు అమర్చిన కెపాసిటర్‌ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ సమస్యలు ఏర్పడితే రైతులు నేరుగా పరిష్కరించవద్దని, టోల్‌ఫ్రీ నంబరు 1912కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తామని తెలిపారు. డీఈ తిరుపతి, ప్రతినిధులు సంపత్, రాజ్‌కుమార్, రజనీకాంత్, సంపత్, మహేందర్ పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.6,762 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,762 ధర నమోదైంది. కనిష్ట ధర రూ.5,051గా, సగటు ధర రూ.6,411గా ఉందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. 1,648 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో సోమవారం జాతీయ స్థాయి మెకానికల్ ఐవో టీ వర్క్‌షాప్ నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌ను ప్రిన్సిపాల్ విష్ణువర్ధ న్ ప్రారంభించారు. తృతీయ సంవత్సరం మె కానికల్ విద్యార్థులు వైజాగ్‌కు చెందిన టెకిబో ట్ సంస్థ సాయంతో ఈ కార్యక్రమం చేపట్టా రు. తొలిరోజు డిస్టెన్స్ మానిటరింగ్, హోం ఆ టోమేషన్, రిలేకంట్రోల్ యూజింగ్ డాష్ బో ర్డు, రిఫ్రిజిరేషన్ సిస్టం, స్మార్ట్ ఫ్యాన్ కంట్రోల్ థ్రూ టెంపరేచర్ మానిటరింగ్ ప్రాజెక్టుల థియరీల గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయకుమార్, కన్వీనర్ శివరామకృష్ణ, ఫ్యాకల్టీ సలహాదారులు స్వప్న, మధు, టెకిబోట్ సీఈవో వెంకట్‌రెడ్డి, ట్రెయినర్లు జ్యోష్ని, చరణ్, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్ ఫిరోజ్, ధన్‌రాజ్, మేఘన, గోవర్ధన్, త్రిష పాల్గొన్నారు. కుందనపల్లివాసుల ధర్నా గోదావరిఖని: బూడిత తరలిస్తూ ఇబ్బందుల కు గురిచేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్య తీసుకో వా లని కుందనపల్లి గ్రామస్తులు సోమవారం స్థా నిక ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సింగరేణిలో పనిచేస్తూ బినామీ కాంట్రాక్టు పొంది పదేళ్లుగా బూడిద చెరువు నుంచి బూడిద తరలిస్తున్నారని ఆరోపించారు. సంగె న శేఖర్, జక్కుల నారాయణ, మేకల స్వామి, బుర్ర వెంకటస్వామి, శ్రీనివాస్, రవి ఉన్నారు. -
వణికిస్తున్న చలి
ఖనిలో చలిమంటులు కాగుతూ..12.9 డిగ్రీల సెల్సియకు పడిపోయిన ఉష్ణోగ్రతలు కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మూడు రోజులుగా చలి గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున పొగమంచు కమ్మేసి రహదారులు కనిపించడంలేదు. సోమవారం జిల్లాలోని జూలపల్లిలో 12.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో ఉదయం పొలాలకు వెళ్లే రైతులు, పంట పనుల్లో నిమగ్నమయ్యే కూలీలు దుప్పట్లు, స్వెట్టర్లు, తలపాగాలు ధరించి చలిని తట్టుకుంటున్నారు. విద్యార్థులు వణుకుతూ బస్సులు, ఆటోల్లో స్కూళ్లకు చేరుతున్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం బయటకు వెళ్లొద్దు పెద్దపల్లి: వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా వేకువజామున, రాత్రివేళల్లో బయట తిరిగ వద్దు. దుప్పట్లు, చెద్దర్లు, స్వెటర్లు ధరించాలి అంటున్నారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ వినయ్. ఎలాంటి దుస్తులు ధరించాలి? డాక్టర్ : చలికాలంలో ప్రతీఒక్కరు ఉన్ని దుస్తులు ధరించాలి. బయటకు వెళ్తే మాస్క్ తప్పకుండా ధరించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డాక్టర్ : సి – విటమిన్ అధికంగా ఉండే నిమ్మ, దానిమ్మ, తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ఆస్తమా, గుండెజబ్బులు ఉన్నవారు ఏం చేయాలి? డాక్టర్ : రాత్రివేళ, వేకువజామున బయటకు వెళ్లొద్దు. తప్పనిసరిగా ఇన్హేలర్ వెంట ఉంచుకోవాలి. ఎలాంటి నీరు తాగాలి? డాక్టర్ : ప్యూరిఫైడ్ వాటర్‌తోపాటు వేడిచేసి కాచి చల్లార్చిన నీరు తాగాలి. వృద్ధులు, పిల్లలపై చలి ఎలాంటి ప్రభావం చూపుతుది?డాక్టర్ : పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. నివారణ కోసం ముందుగానే పిల్లలకు టీకా వేయించాలి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను తప్పకుండా సంప్రదించాలి. -
ఓపికగా విని.. పరిష్కార మార్గం చూపి..
పెద్దపల్లి: దరఖాస్తుదారుల సమస్యలు ఓపిగ్గా వి న్న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. వాటికి సత్వరమే పరి ష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వనజతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్‌కు చెందిన ఎండీ షజానా బేగం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ధర్మారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కె.మల్లయ్య.. సర్వే నంబర్ 723లోని 1.39 ఎకరాలను భూభారతిలో నమోదు చేయాలని, పెద్దపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మదన వెంకటరమణమ్మ.. తన భర్త మరణించి మూడేళ్లవుతోందని, ఇ ప్పటివరకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని, ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన శంకరయ్య.. తన కుమారులు పోషించడం లేదని, తనను ఆదుకోవాలని ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన శ్రీహర్ష.. వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.శ్మశానవాటికను అభివృద్ధి చేయాలి పెద్దపల్లిలోని సుభాష్‌నగర్, రంగంపల్లి, విష్ణుపూర్కాలనీ, ఆదర్శనగర్ ప్రాంతవాసులు కలెక్టర్‌ను కలిసి.. మామిడికుంట కట్ట వద్ద సర్వే నంబర్లోని స్థలాన్ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. నాణ్యమైన ధాన్యం తీసుకు రావాలి కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకెళ్తే వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, ఆయిల్‌పామ్ సాగు తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సహకార సంఘా లు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా రు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, జెడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, సహకార అధికారి శ్రీమాల, ఉద్యాన అధికారి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
మట్టి నుంచి మ్యాట్‌పైకి..
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025ర్యాగింగ్ వద్దు.. స్నేహం ముద్దుకరీంనగర్టౌన్: కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలతో డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో అడుగు పెట్టిన జూనియర్ విద్యార్థులకు సీనియర్లు పరిచయం అవుతారు. తొలి పరిచయానికి పర్యాయపదంగా నిలవాల్సిన ర్యాగ్ అన్న పదం వికృత క్రీడకు చిహ్నమవుతోంది. ఆ పేరు చెబితేనే జూని యర్ల వెన్నులో వణుకుపుడుతోంది. ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం పతాకస్థాయికి చేరుకుంటోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో శనివారం రాత్రి సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చర్చనీయాంశమయ్యాయి. స్నేహమా.. జాగ్రత్త సుమా మంచి స్నేహం ప్రాణంతో సమానం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరికీ స్నేహం అవసరం. కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు స్నేహితుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. కళాశాల క్యాంటీన్లు, హాస్టళ్లకు పాకిన ఈ భూతానికి ఏటా ఎంతో మంది విద్యార్థులు బలవుతుండగా విద్యాశాఖ, పోలీసు విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ‘సుప్రీం’ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ కమిటీ వేసిన సిఫార్సులను 2007లో ఆమోదించింది. దీని ప్రకారం ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు అందితే వెంటనే విద్యా సంస్థలు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణుడిని నియమించాలి. విద్యార్థులు మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా కళాశాల యజమాన్యాలే చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్ నిరోధించడంలో యజమాన్యాలు విఫలమైతే వారినే బాధ్యులను చేయాలి. ‘యూజీసీ’ మార్గదర్శకాలు ర్యాగింగ్ సంఘటనల్లో దోషులుగా తేలిన వారికి రూ.2.5 లక్షల జరిమానాల విధించాలి. తీవ్రతను బట్టి వారిని కళాశాల ప్రవేశంపై జీవితకాల నిషేధం విధించాలి. కళాశాలలో చేరే సమయంలో వేధింపులకు పాల్పడబోమని విద్యార్థి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. వేధింపులను అరికట్టడంలో విఫలమైన కళాశాల గుర్తింపును రద్దు చేయాలి. ర్యాగింగ్ నిబంధనలను తెలుపుతూ ప్రతి కళాశాల పరిసరాల్లో పోస్టర్లు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి. సర్కారు ఏం చెబుతోందంటే.. ర్యాగింగ్ నిరోధకానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్యశాఖ 1800– 5522 ట్రోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఈ హెల్ప్‌లైన్ పని చేస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను 1090 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలపవచ్చు. ర్యాగింగ్ జరిగే కళాశాలల వద్ద నిఘా పెంచాలి. వైద్య నిపుణుల సూచనలు ర్యాగింగ్ తప్పనే విషయాన్ని సీనియర్లకు తెలిపేందుకు కాలేజీల్లో నైతిక విలువల కమిటీ లేదా మానవ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్ చేసే వారిపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జూనియర్లకు అవగాహన కల్పించాలి. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చేస్తే మిగతా వారికి కనువిప్పు కలుగుతుంది. కళాశాల యజమాన్యాలు నిజాలను దాచకుండా వెలుగులోకి తేవాలి. జూనియర్లు స్వేచ్ఛగా మసలేలా చర్యలు తీసుకోవాలి.మహిళా.. మౌనమేలా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలుడిగ్రీ 66పీజీ 35ఇంజినీరింగ్ 16ఎంబీఏ 8ఎంసీఏ 1ఫార్మసీ 2పాలిటెక్నిక్ 5 మ్యాట్‌పైనే ఖోఖో పోటీలు క్రీడాకారులకు గాయాలు కాకుండా సౌకర్యం -
బోసిపోతున్న బోటింగ్
మట్టి పరిమళం దేహదారుఢ్యానికి ఎంతోదోహదం చేస్తుందని నిపుణుల అభిప్రాయం.. అందుకే చిన్నపిల్లల్ని మట్టిలోనూ ఆడుకునేందుకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు వైద్యులు.. మట్టిలో ఆటలు ఆడితే దెబ్బలు తగులుతాయని, గాయాలవుతాయని, ఇవి శరీర పటుత్వానికీ దోహదం చేస్తాయంటున్నారు.. అందుకే మట్టితో మమేకమైన వ్యవసాయదారులు, కూలీలు, మట్టిమనుషుల దేహాలు పటిష్టంగా ఉంటాయి.. ఇట్లాంటి మట్టి మైదానంలో ఖోఖో ఆడే క్రీడాకారుల శరీరం దృఢంగా మారుతుంది.. ఆటగాళ్లు మెరికల్లా తయారవుతారు.. దురదృష్టవశాత్తు ఖోఖో కూడా మట్టి మైదానం నుంచి మ్యాట్ మైదానంపైకి చేరింది.. ఆటగాళ్లు గాయాలపాలవకుండా మ్యాట్ బాగానే పనిచేస్తున్నా.. శారీరక పటిష్టం కోల్పోతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నాటి కృష్ణమూర్తి ఇంటర్వ్యూ.. – పెద్దపల్లి తామరఆకులు పర్యాటకానికి ప్రతిబంధకంగా మారాయి. తామర మొక్కలు చెరువంతా విస్తరించి బోట్లను ముందుకు కదలనివ్వడంలేదు. పెద్దపల్లి మున్సిపల్, పర్యాటక శాఖ సంయుక్తంగా ఒకటి స్పీడ్, మరోటి సాధారణ బోట్, ఇంకో రెండు సైకిల్పెడల్ బోట్లు కొనుగోలు చేశాయి. వాటిని ఇటీవల జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్(ఎల్లమ్మ చెరువు)లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ శని, ఆదివారాలు, రోజూ ఉదయం, సాయంత్రం స్థానికులు, పొరుగు జిల్లావాసులు బోటింగ్ చేయడం ప్రారంభించారు. తద్వారా టూరిజం శాఖకు ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ, చెరువులో తామర మొక్కలు ఏపుగా పెరగడంతో పర్యాటక శాఖ సిబ్బంది బోట్లను నిలిపివేశారు. దీంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బోటింగ్ సౌకర్యం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఇక్కడ ఎప్పుడు నిర్వహించారు? కృష్ణమూర్తి : సుమారు 21 ఏళ్లక్రితం.. 2004లో ఖోఖో పోటీలను పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే నిర్వహించాం. ప్రస్తుతం ఖోఖోకు పూర్వవైభవం వచ్చింది. మహిళలు, పురుషులు మరోసారి ఇక్కడే పోటీపడడం విశేషం. క్రీడా సంఘం ఈసారి పెద్దపల్లి జట్టుతోపాటు పోలీస్ జట్టుకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించడం శుభపరిణామం. కామన్వెల్త్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందా? కృష్ణమూర్తి : ఖోఖో అసోసియేషన్‌తోపాటు జిల్లా సంఘాలు కేకేఎఫ్ఐతో కలిసి కామన్వెల్త్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరాం. 2030లో కామన్వెల్త్ పోటీలు ఈసారి ఢిల్లీలో జరుగుతాయి. ఆ ఏడాది మార్చిలో జరిగే పోటీల్లో మన ఖోఖో క్రీడాకారులకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. ఖోఖో జట్లను ఎన్ని విభాగాలుగా విభజిస్తారు? కృష్ణమూర్తి : సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ జట్లుగా విభజిస్తాం. వీరికి తెలంగాణ స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జాతీయ జట్టులో పాల్గొనే క్రీడాకారులకు ట్రక్ సూట్లు, షూ అందిస్తాం. రవాణా చార్జీలు చెల్లిస్తాం. భోజన సౌకర్యం కల్పిస్తాం.జాతీయస్థాయి పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారు? కృష్ణమూర్తి : వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు కాజీపేట రైల్వేగ్రౌండ్‌లో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 40 మహిళా జట్లు, మరో 40 పురుషుల జట్లు హాజరవుతాయి. రైల్వే, ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఆల్ ఇండియా పోలీస్ బెటాలియన్స్‌తోపాటు వివిధ విభాగాల్లోని ఉద్యోగులు సైతం పోటీల్లో పాల్గొంటారు. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందా? కృష్ణమూర్తి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ క్రీడాకారులు మొదలుకొని అంతర్జిల్లా ఆటగాళ్లకూ రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేస్తేనే సార్థకత చేకూరుతుంది. ఖోఖో అకాడమీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? కృష్ణమూర్తి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ జిల్లాకు ఒక ఖోఖో కోచ్‌ను నియమించాలంటే తప్పనిసరిగా అకాడమీ ఏర్పాటు చేయాలి. ప్రతినెలా వారికి ఇన్సెంటివ్ చెల్లించాలి. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాలి. -
కమిషనరేట్‌లో షీటీం ప్రతిస్పందనలు, నమోదుచేసిన కేసులు, అవగాహన సదస్సులు
ఏడాది 2023 2024 2025 అవగాహన కార్యక్రమాలు 691 719 517 హాట్‌స్పాట్ విజిట్ 2,694 2,624 2,256 రెడ్‌హ్యాండెడ్ కేసులు 17 13 251 ఈవ్టీజర్ల రెడ్‌హ్యాండెడ్ అరెస్ట్ 40 31 279 స్వీకరించిన పిటిషన్లు 104 96 354 ఎఫ్ఐఆర్లు 11 16 37 ఈ పెటీ కేసులు 18 04 32 వేధిస్తే కఠిన చర్యలు మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా మౌనంగా ఉండవద్దు. పోలీసులకు వెంటనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తాం. వాటిపై సత్వరమే స్పందిస్తున్నాం. ఈఏడాది ఇప్పటివరకు 37మందిపై కేసులు నమోదు చేశాం. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్కమినర్, రామగుండం -
వేతన వెతలు
పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్న రెండో ఏఎన్ఎంలకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. సుమారు 18ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా కష్టాలు తీరడంలేదు. రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. పండుగలు, ఇంటి కిరాయి, పిల్లల ఫీజు చెల్లించేందుకు అప్పు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ప్రతీనెల ఐదోతేదీలోగా వేతనాలు చెల్లించేదని, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. మొదటి ఏఎన్ఎంలతో సమానంగా పనులు చేయిస్తున్నా.. ఒకటో తేదీన వారికి చెల్లించినట్లు తమకు ఎందుకు చెల్లించడం లేదని రెండో ఏఎన్ఎంలు ప్రశ్నిస్తున్నారు. వారి దీనస్థితి గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారితోపాటు కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు. రెండో ఏఎన్ఎంలే అధికం.. జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక మంది రెండో ఏఎన్ఎంలే ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విషజ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల సర్వేతోపాటు ఎన్సీడీ, టీబీ, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాలు వీరే చేపడతారు. వారంలో రెండురోజులు గర్భిణుల రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు వీరి నే తృత్వంలోనే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. గ ర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించడం, బాలింతల సంరక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలోనూ పాలుపంచుకుంటున్నారు. రెండో ఏఎన్ఎంలకు అందని జీతాలు ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు హక్కుల సాధనకు పోరుబాట 17 నుంచి నిరవధిక సమ్మెకు సన్నద్ధం ఇప్పటికే సమ్మె నోటీసు అందించిన వైనం -
12న కేంద్రమంత్రి బండి రాక
గోదావరిఖని: రామగుండం నగరంలో దారిమైసమ్మ దే వాలయాలు కూల్చివేసిన నే పథ్యంలో ఈనెల 12న కేంద్ర మంత్రి బండి సంజయ్ గోదావరిఖనికి రానున్నట్లు బీజేపీ నాయకుడు కోమళ్ల మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, పలువురు నాయకులు ఖనికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. చైనా బృందంలో మనోడు పాలకుర్తి(రామగుండం): వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ వ్యవస్థపై అవగాహన కోసం మనదేశ సాఫ్ట్వేర్ నిపుణులు చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సంతోష్‌గౌడ్‌కు చోటు దక్కింది. సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత సేవలు, అంత ర్జాతీయ ఆర్థిక వ్యూహాలు తదితర అంశాలపై బృందం అవగాహన పెంచుకుంటుంది. మనదేశం తరఫున 15మంది బృందం శనివారం చైనాకు బయలుదేరి వెళ్లింది. ఇందులో సంతోష్‌గౌడ్ కూడా ఉన్నారు. ఆయనను పలువు ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు. కోతుల పట్టివేత పెద్దపల్లి: సుల్తానాబాద్‌లోని వివిధ ప్రాంతా లల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కో తులను ఆదివారం పట్టుకుని బోనులో బంధించారు. కోతులు ఇటీవల దాడి చేసి పలువురు పట్టణ ప్రజలు గాయాలపాలయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ సూచన మేరకు కోతులు పట్టే బృందాలను ఇక్కడకు రప్పించారు. వారు ఆదివారం వివిధ ప్రాంతాల్లో కోతులను పట్టి బోనులో బంధించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పెద్దపల్లి: గోదావరిఖనిలో 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా మైసమ్మ ఆలయాలను ధ్వంసం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోదని ఆయన ఆరోపించారు. కూల్చివేసిన ప్రాంతాల్లో ఆలయాలు మళ్లీ నిర్మించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. 15న సత్యనారాయణ వ్రతం ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ చీకట్ల మొండ య్య తెలిపారు. ఈ మేరకు సామూహిక సత్యనారాయణ వ్రతం ప్రచార పోస్టర్‌ను ఆదివా రం స్థానిక ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 100 మందికిపైగా దంపతులు సామూహిక సత్యనారాయణ వత్రంలో పాల్గొంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఈవో సదయ్య, ఆలయ డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నేడు యోగా దినచర్య గోదావరిఖని: సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకోసం సోమవారం ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్జీ–1 అధికార ప్రతినిధి రవీందర్‌రెడ్డి తెలిపారు. యోగా సాధన ద్వారా కలిగే ఫలితాలు, ప్రయోజనాల గురించి హైదరాబాద్‌కు చెందిన యోగా గురువు షణ్ముక శివచంద్ర వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్మికులు, వారి కుటుంబాలు పాల్గొనాలని ఆయన కోరారు. -
‘ఖని’లో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తాం
గోదావరిఖని: మూడు జిల్లాలకు కేంద్రంగా ఉన్న గోదావరిఖనిలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఆదివారం ఆయన గోదావరిఖని ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా నిర్మించే క్వార్టర్ల ప్రాంతం, మెయిన్ చౌరస్తాలో చేపట్టే షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించారు. జీడీకే–5 ఓసీపీని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంప్‌యార్డుపై మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, భూపాలపల్లి ప్రాంతాల కార్మి క కుటుంబాలకు ఉపయోగపడేలా మల్లీఫ్లెక్స్ నిర్మి స్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. వర్షాలతో ఆశించిన దానికన్నా ఆలస్యమైందని తెలిపారు. షాపింగ్ పనుల్లో వేగం పెంచేలా కాంట్రాక్టర్‌కు సూచించామని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రతీఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.● సింగరేణి సీఎండీ బలరాం -
దేశభక్తికి శాశ్వత చిహ్నం వందేమాతరం
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: వందేమాతరం గీతం దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కమిషరేట్‌లో శుక్రవారం సామూహిక గేయాలాపన చేశారు. భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలం, జాతీయ గుర్తింపు భావన, వలసపాలనపై ప్రతిఘటన పెరుగుతున్న దశలో వందేమాతరం మాతృభూమిని బలంగా తాకిందని ఆయన గుర్తుచేశారు. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఆయన అన్నారు. కార్యక్రమములో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు వామనమూర్తి, మల్లేశం, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీ అగ్రగామి జ్యోతినగర్(రామగుండం): దేశ అవసరాల్లో 24 శాతం విద్యుత్ ఉత్ప త్తి చేస్తూ ఎన్టీపీసీ అ గ్రస్థానంలో నిలుస్తోంద ని ఆ సంస్థ తెలంగాణ – రామగుండం ప్రాజెక్టు ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద న్ కుమార్ సామంత అ న్నారు. సంస్థ ఆవిర్భా వం సందర్భంగా పర్మినెంట్ టౌన్షిప్లో శుక్రవారం సామూహికంగా మొ క్కలు నాటారు. అనంతరం ఎన్టీపీసీలోని కాకతీయ ఆడిటోరియంలో ఆవిర్భా వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ సామంత మా ట్లాడుతూ, మనదేశాన్ని శక్తిమంతం చేయడంలో ఎన్టీపీసీ 50 ఏళ్లుగా అద్భుతమైన ప్రయాణం సాగిస్తోందన్నారు. అనంతరం రైజింగ్ డే కేక్ కట్ చేశారు. బెలూన్ విడుదల చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నోయిడా ఎన్టీపీసీ నుంచి సీఎండీ గురుదీప్‌సింగ్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో తిలకించారు. వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎన్టీపీసీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు స్థానిక పర్మినెంట్టౌన్షిప్లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ప్రతినిధులు దుర్గం నర్సయ్య, పోచయ్య, లాలయ్య, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేడు తాగునీటి సరఫరా బంద్ పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అంతర్గాం మండలంలోని 4 ఆవాసాల్లో ఈనెల 8న తాగునీటి సరఫరా నిలిపివేస్తామని మిషన్ భగీరథ ఈఈ గ్రిడ్ పూర్ణచందర్ తెలిపారు. అంతర్గాంలోని ముర్మూరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సంపు పైప్‌లైన్ నిర్వహణ పనులు చేపట్టామని, దీంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అంతర్గాం మండలంలో కొంత భాగానికి శనివారం తాగునీటి సరఫరా నిలిచిపోతుందని ఆయన వివరించారు. ప్రజలు తమతో సహకరించాలని ఆయన కోరారు. -
రోడ్లపైనే ధాన్యం
పెద్దపల్లిరూరల్: మద్దతు ధరతోనే విక్రయించాలనే ఆరాటంతో రైతులు మెయిన్‌రోడ్లపైనే వడ్లు ఆరబోస్తున్నారు. నిత్యం రాకపోకలు సా గించే రోడ్లపై ధాన్యం కుప్పలను గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతు న్నారు. రెండురోజుల క్రితం కనగర్తి శివారు లో ఓ వ్యాన్ ధాన్యం కుప్పపైకి దూసుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరక్కపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రోడ్లపై ధా న్యం ఆరబోస్తే ఎర్రజెండాలు, రేడియం స్టిక్క ర్లు ఉంచాలని పలువురు సూచిస్తున్నారు. పోటాపోటీగా క్రీడా పోటీలు సుల్తానాబాద్‌రూరల్: భూపతిపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయంలో ఉ మ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్ –2025తో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నా రు. శుక్రవారం అండర్–17లో వాలీబాల్, క బడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. శనివా రం చెస్, రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీని వాస్ తెలిపారు. ఏటీపీ సురేశ్‌కుమార్, డీడ బ్ల్యూ సంధ్యరాణి, ఉపాధ్యాయులు ఉన్నారు. 10న అప్రెంటిషిప్ మేళా రామగుండం: స్థానిక ఐటీఐలో ఈనెల 10న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రి న్సిపాల్ సురేందర్, ట్రైనింగ్ ఆఫీసర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆసక్తిగల వారు www.apprenticeshipindia.gov.in వె బ్‌సైట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, హా ర్డ్కాపీలు, ఎస్సెస్సీ మెమో, ఐటీఐ ఉత్తీర్ణత స ర్టిఫికెట్, టీసీ, ఆధార్‌కార్డు తదితర ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలని కోరారు. -
సంబురంగా స్నాతకోత్సవం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటన శుక్రవారం బీజీబిజీగా సాగింది. ఉదయం 10 గంటలకే నగరానికి చేరుకున్న ఆయన శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాని కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ప మేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, వీసీ ఉమేశ్‌కుమార్ స్వాగతం పలికారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మందికి పీహెచ్డీ పట్టాలు, 2018 నుంచి 2023 వరకు డిగ్రీ, పీజీ విద్యలో ప్రతిభ కనబరి చిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడు తూ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళ్తుందన్నారు. శాతవా హన విశ్వవిద్యాలయానికి న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దిశగా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీ సుకోవాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ జేబీ రావు మాట్లాడుతూ.. అనతికాలంలోనే వర్సిటీ సాధించిన పురోగతిని కొనియాడారు. వర్సిటీకి పరిశోధనలు, ఇతర అంశాల్లో కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు. అంతకుముందు వీసీ ఉమేశ్‌కుమార్ వర్సి టీ సాధించిన పురోగతిని, విజయాలను వివరించారు. స్టాళ్ల పరిశీలన ఎస్‌యూలో కార్యక్రమం తర్వాత గవర్నర్ ప్ర త్యేక కాన్వాయ్ ద్వారా కలెక్టరేట్‌కు చేరుకున్నా రు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆడిటోరియంలో కలెక్టర్ పమేలా స త్పతి జిల్లా సమగ్ర స్వరూపం, విశేషాలను ప వర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని లెక్కలతో సహా అందించారు. అనంతరం కలెక్టరేట్లో వివిధశాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. చాలా అద్భుతంగా ఉన్నాయని కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. వందేమాతర గీతా పాలనలో పాల్గొన్నారు. బాలభవన్ విద్యార్థుల శాసీ్త్రయ నృత్యం, అంధ విద్యార్థుల పాటలను తిలకించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖా ముఖి నిర్వహించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను టీబీ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న మేధావులు, విద్యావంతులు జ్ఞానాన్ని సమాజానికి పంచాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సన్మానించా రు. సన్మానం పొందినవారిలో డాక్టర్ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమేల భాస్కర్, గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవీచంద్ర, దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గండ్ర లక్ష్మణరావు, సినీనటుడు కేతిరెడ్డి మల్లారెడ్డి, నటుడు, దర్శకుడు ఆర్.ఎస్. నంద సైంటిస్ట్ వెంకటేశ్వరరావు, ఎన్జీవో గంప వెంకట్, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, యాదగిరి శేఖర్‌రావు, సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ, రెడ్‌క్రాస్ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, వైస్ చైర్మన్ చిదుర సురేశ్, సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణరెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్ పెద్ది విద్యాసాగర్, ఎంజేఎఫ్ చైర్మన్ కొండ వేణుమూర్తి, ఐపీఎంసీసీ హనుమండ్ల రాజిరెడ్డి, ఎల్టీ కోఆర్డినేటర్ ఏనుగుర్తి రమేశ్, రీజియన్ చైర్పర్సన్ వడుకపురం జగదీశ్వర చారి ఉన్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భారీ బందోబస్తు గవర్నర్ జిల్లా పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వర్సిటీతోపాటు గవర్నర్ కాన్వాయ్ ప్రయాణించిన పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గవర్నర్ సాయంత్రం హైదరాబాద్ వెళ్లేంత వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీపీ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
జీజీహెచ్‌లో సేవలు భేష్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు భేషుగ్గా అందిస్తున్నారని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. అక్టోబర్‌లో 240 ప్రసవాలు చేయడం అభినందనీయన్నారు. సూపరింటెండెంట్ దయాళ్సింగ్తోపాటు సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, సిమ్స్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవో రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు కృషి పెద్దపల్లి: ఏఐ ల్యాబ్ ద్వారా కనీస విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఏఎక్స్ఎల్ పాఠశాలల పురోగతిపై అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. అదనంగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాల ని, ప్రతీ విద్యార్థి రోజూ కనీసం అర్ధగంట సమయం గడిపేలా చూడాలన్నారు. కోర్టు కేసులపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, కోర్టు కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్య వస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ జిల్లా అధికారి పేరిట లాగిన్‌తో సోమవారం నుంచి కోర్టు కేసులు ట్రాక్ చేసే వ్యవస్థ పని చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వందేమాతరం ఆలాపన వందేమాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కలెక్టరేట్లో సామూహిక వందేమాతరం గీతాలాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతోపాటు అదనపు కలెక్టర్ వేణు, కలెక్టరేట్ పాలనాధికారి శ్రీనివాస్, సీ సెక్షన్ పర్యవేక్షకుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పెర్కపల్లిలో 25 గొర్రెలు మృత్యువాత
ధర్మారం(ధర్మపురి): పెర్కపల్లి గ్రామంలో 25 గొర్రెలు మరణించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కాపరులు గ్రామ శివారులో రైతులు కోసిన వరి పొలంలోకి గురువారం మేతకు తీసుకెళ్లారు. వరి మొదళ్ల తినడంతో అప్పటికే వేసిన పురుగుమందు విషయంగా మారి పలు గొర్రెలు అస్వస్థకు గురయ్యాయి. అదేరోజురాత్రి రెండు గొర్రెలు చనిపోగా శుక్రవారం మరికొన్ని తీవ్రఅస్వస్థకు గురయ్యాయి. మంత్రి లక్ష్మణ్‌కుమార్ సూచనలతో కలెక్టర్ స్పందించి.. గొర్రెలకు వైద్యం అందించాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్‌భాస్కర్‌ను ఆదేశించారు. స్థానిక పశువైద్య సిబ్బందిని వెంటనే ఘటనా స్థలికి చేరుకుని చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందిన గొర్రెలకు ప్రాణాపాయం తప్పింది. అప్పటికే ఈరు మల్లయ్యకు చెందిన 8, మెట్టె తిరుపతికి చెందిన 6, అచ్చె రాజయ్యకు చెందిన 6, అచ్చె చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు.. మొత్తంగా మృత్యువాత పడ్డాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, సోషల్ మీడియా ప్రతినిధి బుట్టిసాగర్ బాధితులకు అండగా నిలిచారు. కాపరులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు. -
మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు
జగిత్యాలక్రైం: సరదా కోసం మైనర్లు వాహనాలు నడిపి పలువురి మృతికి కారణమవుతూ.. వారు కూడా మృత్యుఒడికి వెళ్తున్నారు. మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుశాఖ జిల్లావ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నా, అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడుగురు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ మృత్యువాత పడగా, 11 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న మైనర్ డ్రైవింగ్ మైనర్లు తెలిసి తెలియక ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు, అధునాతన పెద్ద వాహనాలు నడుపుతుండటంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారులో మేడిపల్లికి చెందిన బాలుడు ద్విచక్ర వాహనం నడిపి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ధర్మపురి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ ద్విచక్ర వాహనంతో మహిళను ఢీకొనగా కాలు విరిగింది. ఇలా రోజుకో మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసుల కఠిన చర్యలు జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులు, వాహనం నడిపిన మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988 సెక్షన్ 199 (ఏ) ప్రకారం వాహనం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు పాల్పడితే మైనర్ తండ్రిని దోషిగా పరిగణిస్తారు. అలాగే మూడేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.25 వేల జరిమానా విధిస్తారు. కఠిన నిబంధనలు ఉన్నా మైనర్ డ్రైవింగ్‌లు, ప్రమాదాలు ఆగడం లేదు.కఠిన చర్యలు తీసుకుంటున్నాం మైనర్ డ్రైవింగ్‌పై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరిగితే వాహన యజమానితో పాటు, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది తెలిసితెలియక వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులకు తీరని బాధగా మిగిలిపోతోంది. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
ఎగ్లాస్పూర్ కారోబార్ హఠాన్మరణం
రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ కారోబార్ తూడూరి శ్రీనివాస్‌గౌడ్ శుక్ర వారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గ్రామపంచాతీయ కార్యాలయంల్లో విధుల్లో ఉండగా మధ్యాహ్నం 12గంటలకు గుండెనొప్పి వచ్చింది. దీంతో ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య అంజలి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎగ్లాస్పూర్ కారోబార్‌గా సుమారు ఇరవైఏళ్లపాటు ఆయన సేవలు అందించారు. ఎంపీడీవో సుమలత, ఎంపీవో వేణుమాధవ్, సూపరిండెంటెండ్ కరుణాకర్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
రాయ‘బేరాలు’
● రూ.కోట్లు పలుకుతున్న గుడ్‌విల్ జాక్‌పాట్ ● అదృష్టవంతులకు ఎర ● చక్రం తిప్పుతున్న లిక్కర్ వ్యాపారులు ముస్తాబాద్(సిరిసిల్ల): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ, లక్కీడ్రా ప్రక్రియ అక్టోబర్‌లో ముగిసింది. లక్కీ డ్రాలో కొత్తవారికే ఎక్కువ మద్యం దుకాణాలు రావడంతో, ఇప్పటికే ఈరంగంలో ఉన్న వ్యాపారులు నిరాశకు గురయ్యారు. పదుల సంఖ్యలో దరఖాస్తులు వేస్తే సరైన దుకాణాలు రాలేదని పేర్కొన్నారు. దీంతో డిమాండ్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలు పెట్టారు. గుడ్‌విల్ రూ.కోటి వరకు ఇచ్చి వైన్స్‌ను తీసుకోవాలన్న ఆలోచన వారిలో వచ్చింది. ఇప్పటికే వైన్స్ నడపడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడంతో నో ఫ్రాఫిట్, నో లాస్ విధానంతో మద్యం దుకాణాలు నడిపేందుకు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా, 99 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్‌కు నామమాత్రంగా రెండు దుకాణాలే రావడంతో, మరింత పెట్టుబడి పెట్టి వైన్స్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం దుకాణాలకు కోడింగ్ ద్వారా ఎంపిక చేసేవారు. పదేళ్లలో దరఖాస్తులు, లాటరీ పద్ధతిన దుకాణాలను కేటాయిస్తున్నారు. ప్రభుత్వానికి పోటీగా ఆదాయం లక్కీడ్రాలో దుకాణాలు వచ్చిన అదృష్టవంతులు జాక్‌పాట్ కొడుతున్నారు. గుడ్‌విల్ కింద రూ.60 లక్షల నుంచి రూ.కోటి ఇరవై లక్షల వరకు దుకాణాలకు చెల్లించడమే దీనికి కారణం. అలాగే కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారితోపాటు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమూహంగా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్న వారే అధిక సంఖ్యలో లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నట్లు భావిస్తున్నారు. పది నుంచి ఇరవై దుకాణాలు ఇలా ఇతరుల చేతిలోకి మారినట్లు తెలుస్తోంది. వారు గుడ్‌విల్‌గా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి గత మూడు పర్యాయాలు దుకాణాలకు దరఖాస్తులు చేసి, మూడు పర్యాయాలు లక్కీడ్రాలో విజేతగా నిలిచాడు. సదరు వ్యక్తి ఒక్కసారి కూడా వైన్స్ నిర్వహించలేదు. ఇతరులకే గుడ్‌విల్ కింద అప్పగించాడు. -
ప్రజా జీవన స్థితిగతులపై సర్వే
పెద్దపల్లి/కోల్‌సిటీ(రామగుండం): ప్రజాజీవ న స్థితిగతులపై జాతీయ గణాంకశాఖ సర్వే చేస్తోందని గణాంక శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీని ఆయన శుక్రవారం కలెక్టరేట్లో కలుసుకున్నారు. సర్వే వివరాలతో కూడిన పోస్టర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పట్టణాలతోపాటు రామగుండం నగరంలో ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే చేశామన్నారు. తొలుత రామగుండం నగరంలో సర్వే ప్రారంభించామని ఆయన తెలిపారు. కుటుంబ యజమాని, ససభ్యులు, విద్యార్హతలు, వృత్తివిద్య కోర్సులు, స్వయం ఉపాధి తదితర అంశాలు నమోదు చేస్తామని ఆయన వివరించారు. రేపటి నుంచి ప్రత్యేక రైళ్లు రామగుండం: చర్లపల్లి నుంచి దానాపూర్ మధ్య ఈనెల 9వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలు.. చర్లపల్లి–దానాపూర్(07049– 9, 16వ తేదీల్లో), దానాపూర్–చర్లపల్లి(07050 – 10, 17వ తేదీల్లో), సంభల్పూర్–బెంగళూరు కంటోన్మెంట్(08335– ఈనెల 20వ తేదీన), బెంగళూరు కంటోన్మెంట్–సంభల్పూర్(08336– ఈనెల 24వ తేదీన), కటక్–బెంగళూరు కంటోన్మెంట్(08445– ఈనెల 21వ తేదీన), బెంగళూరు కంటోన్మెంట్–కటక్(08446– ఈనెల 25వ తేదీన) రామగుండం మీదుగా నడిపిస్తారు. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగపూర్, ఇటార్సీ, జబల్పూర్, కట్నీ, మైహర్, సత్నా, ప్రయాగ్‌రాజ్ చౌకీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఎరా స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని ఓ గ్రామంలో చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారులు శుక్రవారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారి జితేందర్ ఆదేశాల మేరకు పోలీస్, చైల్డ్ కేర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేశారు. ఒక బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. మరోబాలికకు అప్పటికే వివాహం జరగ్గా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతోపాటు వారిని సలెండర్ చేయాలని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సూపర్వైజర్ రమాదేవి తెలిపారు. సదర్మాట్ ప్రాజెక్టులో పడి యువకుడు మృతి ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ శివారులో గల సదర్మాట్ ప్రాజెక్టులో పడి పల్లికొండ సిద్దార్థ (18) మృతిచెందాడు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన సిద్దార్థ గురువారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు సదర్మాట్ ప్రాజెక్టువద్దకు వచ్చాడు. గేట్ నంబర్ 52 వద్ద చేపలు పడుతుండగా ప్రమాదశాత్తు ప్రాజెక్టులో పడి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాజాపూర్‌ను స్వాధీనం చేసుకోండి
● అలాగైతేనే సింగరేణి ఓసీపీకి మా భూములు ఇస్తాం ● అధికారులకు గ్రామస్తుల విన్నపం ● పోలీస్ పహారా మధ్య అధికారుల ఇళ్ల పరిశీలన రామగిరి(మంథని): తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని రాజాపూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఓసీపీ–2 విస్తరణలో భాగంగా రాజాపూర్ పరిహారం కోసమే సుమారు 53 ఇళ్లు అక్రమంగా నిర్మించారనే సమాచారంతో సింగరేణి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య శుక్రవారం గ్రామంలో ఇళ్లపరిశీలన చేపట్టారు. అనంతరం జేసీబీలు మోహరించారు. మంథని, సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎస్సై శ్రీనివాస్, పోలీసు సిబ్బందితో గ్రామాన్ని దిగ్బంధించారు. పోలీస్ పహారా గురించి తెలుసుకున్న గ్రామస్తులు.. అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్లకు అనుమతులు ఉన్నాయని, సింగరేణి అధికారులు అక్రమ కట్టడాలు అని ఎలా నిర్ధారించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, మిగిలిన అరకోర భూమిలో నివాసం ఉండలేమన్నారు. అలాగైతేనే తమ ఊరుకు రావాలని, నిర్వాసిత గ్రామంగా ప్రకటించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంంలో తహసీల్దార్ సుమన్, సింగరేణి ఎస్టేట్ అధికారి ఐలయ్య, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, మండల పంచాయతీ అధికారి భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చుకల సవ్వడి.. కానరాదాయె..
ఒకప్పుడు గ్రామాల్లో పిచ్చుకల కిలకిల రాగాలు పల్లెవాసులను నిద్రలేపేవి. ఇంట్లో కుటుంబసభ్యుల్లా మనతోపాటే కలియతిరిగేవి. మారుతున్న సాంకేతికత పక్షుల మనుగడపై ప్రభావం చూపుతోందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అవి అంతరించిపోతే... ఫొటోలు, లేదా అప్పుడప్పుడు ఎక్కడోఓచోట కనిపిస్తే.. పిచ్చుకలు ఇలా ఉంటాయని మనపిల్లలకు పరిచయడం చేసే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పక్షిప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో విద్యుత్ తీగలపై పక్షుల సమూహం ‘సాక్షి’ కెమెరాకు ఇలా అందంగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
గృహిణి ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని: స్థానిక సింగరేణి మెడికల్ కాలేజీ ఎదుటగల తుమ్మ పొదల్లో గృహిణి సల్ల స్వప్న(38) శుక్రవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. పోతనకాలనీలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ కార్మికుడి భార్య స్వప్న.. ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోయింది. ఈమేరకు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. కాసేపటికే ఆత్మహత్యా యత్నం విషయం వెలుగుచూసింది. తుమ్మపొదల్లో మంటల్లో కాలిపోతున్న మహిళ విషయాన్ని కొందరు మెడికోలు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 90శాతం కాలిన గాయాలతో పడిఉన్న మహిళను సీఐతోపాటు పోలీసు సిబ్బంది ఆటోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు లీటర్ల పెట్రోల్‌ను బాధితురాలు ఒంటిపై పోసుకుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. కాగా, తనకు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగో ఉండడం లేదని సూసైడ్ నోట్సారి, ఒంటిపై ఉన్న బంగారం ఇంట్లో పెట్టి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
రేడియాలజీ కీలకం
వ్యాధి నిర్ధారణలో కోల్‌సిటీ(రామగుండం): గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్, కేన్సర్, కడుపునొప్పి, మెదడులో కణితి.. ఇలా వ్యాధి ఏదైనా నిర్ధారించేది రేడియాలజిస్టులే. గర్భంలోని శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల వరకూ వారిదే కీలకపాత్ర. పాతకాలపు ఎక్స్‌రే నుంచి నేటిడిజిటల్ ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్.. ఇలా అనేక ఇమేజింగ్ పరికరాలు వైద్యరంగంలో పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సూక్ష్మదశలోని వ్యాధులను కూడా గుర్తించగలుగుతున్నారు. గుండె, మెదడు, కిడ్నీల పనితీరు తెలుసు కోవడం, రక్తప్రసరణ జరిగే రక్తనాళాల్లో పూడికలను గుర్తించడం అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో వందలాది మంది రేడియాలజిస్టులు సేవలు అందిస్తున్నారు. నేడు ప్రపంచ రేడియోగ్రాఫీ డే సందర్భంగా కథనం.. నేపథ్యమిది... జర్మన్ శాస్త్రవేత్త విలియం కనార్డ్ రాంటిజన్ 1895లో ఎక్స్కిరణాలు కొనుగొన్నాడు. ఇది వైద్య ప్రపంచానికి వెలుగురేఖగా మారింది. నూతన ఆవిష్కరణలు, రేడియాలజిస్టుల పాత్రపై చర్చించుకోవడంతోపాటు, ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏటా నవంబర్ 8న ప్రపంచ రేడియోగ్రఫీ డేగా నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్‌ను ‘రేడియోగ్రాఫర్లు: కనిపించని వాటిని చూసేవారు..’ అని ప్రకటించారు. సూక్ష్మదశలో వ్యాధుల గుర్తింపు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైబ్రీడ్ ఇమేజింగ్ ఏకీకరణతో రేడియాలజీ పురోగతి సాధించింది. వ్యాధి నిర్ధారణ, చికిత్స సామర్థ్యాలు పెంచుతోంది. ● ఏఐ అప్లికేషన్లు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఊపిరితిత్తుల నోడ్యూల్ డిటెక్షన్, వర్క్ ఫ్లో క్రమబద్ధీకరించడం కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, గుండెరక్తనాళాలతోపాటు అనేక కీలక వ్యాధులను గుర్తిస్తున్నారు. సింగరేణిలోనే ఆధునిక స్కానర్లు.. ● సింగరేణి సంస్థ అత్యాధునిక 128 స్లైస్ సామ ర్థ్యం కలిగిన రెండు సీటీ స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేయనుందని సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఒకటి రామగుండం, మరోటి కొత్తగూడెంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తారు. ఇవి మల్టీ డిటెక్టర్లు. శరీరంలోని అంతర్గత నిర్మాణాన్ని త్రీడీ రూపంలో ఒకేసారి 128 చిత్రాలను చూపించే నైపుణ్యం కలిగి ఉంటుందని నిపుణులు వివరించారు. నైతిక ప్రమాణాలకు ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్.. ● జాతీయ అనుబంధ, ఆరోగ్య వృత్తుల కమిషన్ (ఎన్‌సీఏహెచ్‌పీ)ను ఇటీవల కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతీరాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం, కోర్సుల ప్రమాణాలు, సిలబస్, నైపుణ్య ప్రమాణాలు నిర్ణయించడం, వృత్తి నైపుణ్యం, నైతిక విలువలు కాపాడటానికి ఇది దోహపడుతోంది. దీని ద్వారా రేడియోగ్రాఫర్లకు గుర్తింపుతోపాటు నైతిక ప్రమాణాలు, వృత్తి భద్రత లభిస్తుందని వారు వెల్లడిస్తున్నారు. తద్వారా వ్యాధి నియంత్రణకు చికి త్స సులభతరం అవుతుందని చెబుతున్నారు. ఏఐ రాకతో విప్లవాత్మక మార్పులు నేడు ప్రపంచ రేడియోగ్రఫీ డే 30 ఏళ్లుగా సేవలు భద్రతా ప్రమాణాలతో 30 ఏళ్లుగా రేడియాలజీలో సేవలు అందిస్తున్నా. ప్రస్తుతం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్నా. కరీంనగర్ జిల్లాలోనే తొలి సీటీస్నానింగ్ సెంటర్ టెక్నీషియన్‌గా పేరుతెచ్చుకున్నా. హైదరాబాద్ అపోలో హాస్పటల్లో కేన్సర్ నిర్ధారణ కోసం ఉపయోగపడే పెట్సీటీస్కాన్ ఏర్పాటు చేయగా, ఇండియాలోనే తొలిసారి దీనిపై పనిచేసిన రేడియాలజిస్ట్‌గా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. రేడియేషన్‌పై ప్రజలకు అవగావహన కల్పిస్తూనే, భద్రతా ప్రమాణాలతో సేవలందిస్తున్నాం. – సుంకరి యాదవరెడ్డి, ఉపాధ్యక్షుడు, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ -
రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలి
పెద్దపల్లి: క్రీడా పోటీల్లో రాణించి రాష్ట్రానికి మంచిపేరు తీసురావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం తెలంగాణ సీనియర్ రాష్ట్ర ఖోఖో పోటీలు క లెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు ప్రత్యేక ప్రా ధాన్యం ఇస్తున్నాయన్నారు. జిల్లా క్రీడాకారులనూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.చి అండగా నిలుస్తున్నామని అన్నారు. ప్రతీఒక్కరు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. గెలుపోవటము లను సమానంగా తీసుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందని వివరించారు. పోటీల్లో 13 పురుషుల, 12 మహిళా జట్లు పాల్గొన్నాయి. ఆ ర్డీవో గంగయ్య, టీఎన్జీవో అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్, ప్రతినిధులు కృష్ణమూర్తి, మహేందర్‌రావు, ముస్త్యా ల రవీందర్, కిష్టయ్య, లక్ష్మణ్, సురేందర్, లక్ష్మ య్య, కుమారస్వామి, గెల్లు మధుకర్ పాల్గొన్నారు. -
రోడ్‌సేఫ్టీ కోసం స్థల పరిశీలన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం పెద్దపల్లిలో రాజీవ్రోడ్డుపై ప్రమాదాలను నియంత్రించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలు, మలుపు తిరగడం కోసం పడుతున్న పాట్లను దృష్టిలో ఉంచుకుని ఏమేర విస్తరించాలి, అందుకు ఏ ప్రాంత స్థలాన్ని వినియోగించాలనే విషయమై మున్సిపల్, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. గత నెల 30న కలెక్టరేట్లో జరిగిన రోడ్‌సేఫ్టీ సమావేశంలో చర్చించిన అంశాల మేరకు గురువారం పట్టణ ప్రధాన కూడళ్లను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, గోదావరిఖని డీఎం నాగభూషణం, ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బస్టాండ్, ప్రగతినగర్ ప్రాంతాల్లో బస్సులు ఫ్రీలెఫ్ట్ వెళ్లేలా, కారు, బైక్‌లు ప్రమాదాల బారిన పడకుండా రోడ్డు వెడల్పునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామనినేఈ సతీశ్ తెలిపారు. అధికారులు నరేశ్, వినయ్, కిరణ్, జగదీశ్ తదితరులున్నారు. -
15న స్పెషల్ లోక్ అదాలత్
పెద్దపల్లి: సుల్తానాబాద్ కోర్టులో ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ తెలిపారు. గురువారం బార్ అసోసియేషన్ న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. మూడేళ్లలోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, ప్రమాదాలు, చెక్ బౌన్స్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఏజీపీ ఆంజనేయులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలి సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గెలుపోటములను విద్యార్థులు సమానంగా తీసుకోవాలని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అంజలి అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్‌లోని జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్–2025 నిర్వహించారు. పోటీలను గురువారం సీఐ, ఆర్సీవోలు ప్రారంభించారు. అండర్–17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఎస్సై–2 అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏటీపీ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి పెద్దపల్లి: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలని డీసీవో శ్రీమాల అన్నారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని సుగ్లాంపల్లిలో పీఎసీఎస్ ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మాయిశ్చర్ వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిణీ చేయాలన్నారు. అధికా రులు వెంకటేశ్వర్లు, బూరుగు సంతోష్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు గాజుల రాజమల్లు, దుగ్యాల సంతోష్‌రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఎన్టీపీసీలో రైజింగ్ డే వేడుకలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ 51వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు పర్మినెంట్ టౌన్షిప్లో మాస్ ట్రి ప్లాంటేషన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత చేతుల మీదుగా 8.15 గంటలకు కాకతీయ ఆడిటోరియంలో పతాకావిష్కరణ, ఎన్టీపీసీ గీత్ ఆలాపన, కేక్ కటింగ్, విజిలెన్స్ వారోత్సవాల విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్‌సింగ్ ఉపన్యాసం ప్రత్యక్షప్రసారం కార్యక్రమాలు ఉంటాయని అధికారవర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మార్కెట్‌యార్డుతో పాటు సీసీఐ కేంద్రాలు, జిన్నింగ్‌మిల్లుల్లో శుక్రవారం పత్తి కొనుగోళ్లు యథావిధిగా సాగుతాయని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సీసీఐ అమల్లోకి తెచ్చిన కఠిన నిబంధనలను కొంత మేర సడలించాలని కోరుతూ జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ కొనుగోళ్లకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కేంద్ర మంత్రి, సీసీఐ అధికారులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతామని అసోసియేషన్ నాయకులకు హామీ ఇవ్వడంతో కొనుగోళ్లకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. రైతులు తమ పత్తి దిగుబడులను తెచ్చి యార్డులో విక్రయించుకోవచ్చని తెలిపారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
పెద్దపల్లి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు జరుగనున్నాయి. గురువారం రాత్రి 10 మహిళ, 10 పురుషుల జట్లు రిపోర్ట్ చేసినట్లు పెటా జిల్లా అధ్యక్షుడు వేల్పుల సురేందర్ తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు క్రీడలు కొనసాగుతాయి. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, డీసీపీ కరుణాకర్, డీవైఎస్వో సురేశ్ హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఉమ్మడి జిల్లాల మధ్య నిర్వహించనుండగా ఈసారి రెండు జట్లకు తెలంగాణ ఖోఖో సంఘం అవకాశం కల్పించింది. పెద్దపల్లి సీనియర్స్ పురుషులు, మహిళల జట్లు బరిలో దిగనున్నాయి. జిల్లా జట్టుకు ఎంపికై న మహిళ, పురుషుల జట్లకు ఇండియన్ మిషన్ స్కూల్లో శిక్షణను గురువారంతో ముగించారు. దాదాపు 500 మందికి ఏర్పాట్లు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పెద్దపల్లి ఆతిథ్యం ఇస్తుండగా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ మహబూబ్‌నగర్, ఖమ్మం తో పాటు నూతనంగా పెద్దపల్లి జట్లు, తెలంగాణ పోలీస్ శాఖ టీంకు అవకాశమిచ్చారు. 12 పురుష, 11 మహిళ జట్లు పోటీ పడనున్నాయి. 46 మంది కోచ్‌లు, మేనేజర్లు, 50 మంది టెక్నీషియన్స్, 300 మంది పురుషులు, మహిళలకు ఏర్పాట్లు చేశారు. 7 నుంచి 9 వరకు నిర్వహణ -
ఇయ్యాల్నే పట్టాల పండుగ!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్‌కు రానున్నారు. శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు జిల్లా యంత్రాంగం, వర్సిటీ సిబ్బంది ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి గవర్నర్ శుక్రవారం ఉదయం 8.15 గంటలకు బయల్దేరి 10.50 గంటలకు శాతవాహన వర్సిటీకి చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పలువురికి పీహెచ్‌డీలు ప్రదానంచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ హస్తకళలు, ఫిలిగ్రీ కళారూపాలు, పలు స్టాళ్లను పరిశీలిస్తారు. కలెక్టర్‌తో సమావేశమవుతారు. జిల్లా ప్రగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. అనంతరం జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు ప్రముఖులతో గవర్నర్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు. ఏర్పాట్లు పూర్తి.. గవర్నర్ పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గురువారం శాతవాహన యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏసీపీలు వెంకటరమణ, విజయ్‌కుమార్, పలువురు సీఐలు, ఎస్సైలతో కలిసి పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు, బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాంటీ సాబాటేజ్ చెకింగ్స్ నిర్వహిస్తున్నామన్నారు. కీలక ప్రాంతాలలో శాశ్వత భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. భద్రతా వలయాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రోప్ పార్టీలు ఏర్పాటు చేశామని వివరించారు. మీడియా వెళ్లిపోవాలి: వీసీ ఉమేశ్.. అంతకుముందు వీసీ ఉమేశ్‌కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి స్నాతకోత్సవం, గవర్నర్ పర్యటన వివరాలు వెల్లడించారు. కవరేజీ, మీడియా పాసుల విషయంలో వర్సిటీ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం గందరగోళానికి దారితీసింది. ‘మీడియాను వెళ్లిపోండి’ అంటూ వీసీ ఉమేశ్ అనడంతో పలువురు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. వీసీ ఉమేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పర్యటనను అడ్డుకునేందుకు.. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు బీసీ సంఘాల నేతలు గవర్నర్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ధర్నా చేసేందుకు రెడీఅయ్యారు. కాగా.. నిరసన వ్యక్తం చేయానుకునేవారిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
వివాదంగా మారిన కూల్చివేతలు
గోదావరిఖని(రామగుండం): దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మలను తొలగించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు కూల్చివేత కొనసాగింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో నిరసన తెలిపారు. చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద దారిమైసమ్మకు పూజలు చేశారు. దారిమైసమ్మ విగ్రహాలు, ఆలయాలు కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆలయాలను కూల్చివేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్‌హరి డిమాండ్ చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూజలు నిర్వహించిన ఐక్యవేదిక నాయకులు హిందూ వేదిక ఆధ్వర్యంలో కూల్చివేసిన దారిమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అయోద్య రవీందర్, సంతోష్‌రెడ్డి, రామ్మూర్తిగౌడ్, నాగులమల్యాల సత్యం, అంజన్న, అడిగొప్పుల రాజు, మునగాల సంపత్, కోమల మహేశ్, కొండపర్తి సంజీవ్‌కుమార్, ముసుకుల భాస్కర్‌రెడ్డి, సుల్వ లక్ష్మీనరసయ్య, ఐత పవన్, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీశ్, రాకేశ్, విశ్వాస్, మడికొండ శ్రీనివాస్, పిడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, దారిమైసమ్మ ఆలయాల కూల్చివేతపై శుక్రవారం పోచమ్మమైదాన్‌లో హిందూ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ భేటీ కానుంది. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. చాలా ఫిర్యాదులు వచ్చాయి రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయం ప్రకారం ముందుకు సాగాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈనిర్ణయం తీసుకున్నాం. ఈమేరకు దారిమైసమ్మ గుడులు కొన్ని తొలగించాం. వీటిపై చాలా ఫిర్యాదులు రావవడంతో నెలరోజుల కిందట రోడ్డు సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ముందుకెళ్లాం. – జె.అరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్, రామగుండం దారిపొడవునా 46 మైసమ్మ ఆలయాల తొలగింపు నిరసన తెలిపిన బీజేపీ నాయకులు -
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
పెద్దపల్లి: ఎస్సీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విధులు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ సంక్షేమశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. మెనూ పాటించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్షించారు. జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి చర్యలు చేపట్టామని, ఎవరైనా వైద్యులు అందుబాటులో ఉంటే తనదృష్టికి తీసుకు రావాలని నేరుగా నియమించడం జరుగుతుందన్నారు. 15 రోజుల్లో ప్రారంభించాలి మానసిక దివ్యాంగుల పాఠశాలను 15 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ పట్టణంలో మానసిక దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం పనులు, కేంద్రీయ డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన బోధన అందించాలి పిల్లలకు మెరుగైన విద్యా బోధన అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో 22 పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యుత్తమంగా పనిచేస్తున్న 22 స్కూళ్లను ఎంపిక చేసి అభినందిస్తున్నామన్నారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్లో బాల్య వివాహాల నిరోధన పోస్టర్ ఆవిష్కరించారు. పనుల్లో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని ఇళ్ల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 4 మండలాల పరిధిలో ఆశించిన స్థాయిలో ఇళ్ల పురోగతి లేదన్నారు. 45 రోజుల్లో పనులు ప్రారంభించికుంటే ఇల్లు రద్దు చేయాలని సూచించారు. 7న సామూహిక గీతాలాపన వందేమాతర గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 7న ఉదయం 9.45 గంటలకు కలెక్టరేట్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కమాన్‌పూర్(మంథని): విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తిగా అవగహన కలిగి ఉండాలి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సైబర్ నేరాలపై కమాన్‌పూర్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఇష్టమైన ఉన్నత పదవిలో ఉండాలన్నారు. తాను కూడా సర్కారు బడుల్లో ఉన్నత చదువులు చదివి ఈ స్థాయిలో ఉన్నానని వివరించారు. విద్యార్థులు, మహిళల రక్షణకు షీటీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థినులను ఏవరైనా వేధిస్తే షీటీంకు సమాచారం ఇవ్వాలని, ప్రతి ఒక్కరు ఫోన్లో షీటీం ఫోన్‌నంబర్లు సేవ్ చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, సైబర్ క్రైం ఏసీపీ డీవీ.రెడ్డి, గోదావరిఖని టూటౌన్ సీఐ నక్క ప్రసాద్, సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, కమాన్‌పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పాల్గొన్నారు. సీపీ అంబర్ కిషోర్ ఝా -
మహిళల రక్షణే షీటీం లక్ష్యం
గోదావరిఖని: మహిళల రక్షణ కోసం షీటీంలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని, మౌనంగా ఉండకుండా బాధితులు ఫిర్యాదు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కోరారు. మహిళలు, యువతులు తమ సమస్యల గురించి పోలీసులను నిర్భయంగా సంప్రదించవచ్చన్నారు. కమిషనరేట్‌లో రెండు షీటీంలు ఉన్నాయని, ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, ఆత్మహత్య లు, డ్రగ్స్, బాల్యవివాహాలు, వరకట్నం, నూతన మహిళా చట్టాలు, డయల్ 100 నంబరు, టీసేఫ్ యాప్, మహిళా భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై షీటీం బృందాలు అవగాహన కల్పిస్తున్నాయని ఆయన వివ రించారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీటీంలు సమన్వయంతో నిఘా ఏర్పాటు చేశాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీం63039 23700, పెద్దపల్లి జోన్ షీటీం 87126 59386, మంచిర్యాల జోన్ షీటీం 87126 59386 నంబర్లకు కాల్చేసి సమాచారం ఇవ్వాలని, లేదా డయల్ 100 నంబరుకు కాల్చేసినా పోలీసులు తక్షణ సాయం అందిస్తారని సీపీ వివరించారు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
పట్టవా?
ప్రాణాలుపోతున్నాఓవర్లోడ్తో యథేచ్ఛగా వెళ్తున్న బూడిద, కంకర, కలప లోడ్ లారీలు, టిప్పర్లు తరచూ ఘోరరోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు, వాహనదారుల జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. మొన్న కర్నూలు, నిన్న చేవెళ్లలో పదుల సంఖ్యలో ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. టిప్పర్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్గా ఉన్నా ఓవర్‌లోడ్‌తోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఈ ప్రమాదాలు నిదర్శనంగా నిలుస్తున్నాయంటున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అధ్వానమైన రోడ్లూ కారణమే అవుతున్నాయి. ఇలాంటి కారణాలు ఏవైనా సామాన్యులు బలవుతున్నారు. అయినా వాహనదారులు, ప్రజల్లో మార్పు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికప్రాంతం కావడంతో బూడిద, కంకర, ఇసుక లోడ్‌తో నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగగిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనడానికి ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్, బస్సులో ప్రయాణికుల రద్దీ -
కొలనూర్‌లో పెద్దమ్మ బోనాలు
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామంలో బుధవారం రాత్రి పెద్దమ్మతల్లి జోగుబోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల సందర్భంగా మహిళలు తలపై బోనాలు పెట్టుకుని ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో తొ మ్మిదో తరగతి చదువుతున్న కె.స్నిగ్దిత జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఈనెల 11 నుంచి 15వ తేదీవరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీలకు హాజరవుతుంది. ఆమెను ప్రిన్సిపాల్ సీహెచ్ గిరిజ, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎస్.సృజన, కోచ్ సతీశ్ తదితరులు బుధవారం అభినందించారు. కోఆర్డినేషన్ కమిటీలో చోటు మంథని: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీలో పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకు డు, ప్రముఖ న్యాయవాది శశిభూషణ్ కాచేకు మరోసారి అవకాశం కల్పించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నజరాజన్ అనుమతితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్.. 13 మంది సభ్యులతో నియామక ఉత్తర్వులు జారీచేశారు. అందులో శశిభూషణ్ కాచేకు చోటు కల్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు తదితరులకు కాచే కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి రూ.కోటి పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ మైదానంలో నిత్యం వాకింగ్, వ్యాయామం చేసేవారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. ఇందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె లక్ష్మయ్య, ప్రతినిధులు రాజమల్లు, కృష్ణారెడ్డి, కొమ్ము సుధాకర్, వెంకటరెడ్డి, కొమురయ్య, అతీఫ్, వెంకటేశం, రాజమౌళి, దశరథం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రక్తనమూనాలు సేకరణ పెద్దపల్లిరూరల్: విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో రక్తసప్తహ్ దివస్ నిర్వహించారు. పలువురి నుంచి రక్త నమునాలు సేకరించినట్లు వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి సత్యం, రాజ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దిలీప్, బొమ్మకంటి రవి, సతీశ్, సాయికుమార్, మణి, చింటు, అంజి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అధికారుల బదిలీ గోదావరిఖని: సింగరేణిలో అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 18 మంది మైనింగ్ అధికారులు ఉన్నారు. వీరిలో ఓసీపీ–1 అధికారి రాజశేఖర్‌ను ఓసీపీ–2కు బదిలీ చేశారు. ఓసీపీ–1కు ఇంకా ఎవరినీ నియమించలేదు. అలాగే నలుగురు ఐటీ అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. అరుణాచలానికి ఆర్టీసీ బస్సులు గోదావరిఖనిటౌన్: గోదావరిఖణి నుంచి అరుణాచలం – రామేశ్వరం మధ్య ఈనెల 11న రెండు బస్సులు నడిపిస్తామని గోదావరిఖని డీపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశంబు, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబ ఆలయాల దర్శనం అనంతరం ఈనెల 18న బస్సులు గోదావరిఖని చేరుకుంటాయన్నారు. పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,000 చార్జీ నిర్ణయించామన్నారు. 56789, 89898 నంబర్లు గల ఈ సర్వీసులను www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆయన కోరారు. వివరా లకు 73828 47596, 70135 04982 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
పట్టాలొచ్చినా.. పైసలివ్వరా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వారంతా పట్టాలు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్లు. కూలీనాలీ చేసుకుని బతికే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీటు సాధించారు. రాత్రీ పగలు చదివి మరో చోట బీఈడీలో సీటు పొందారు. తీరా సీటు వచ్చినా చేరలేని దయనీయ స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోయేసరికి ఇప్పుడు వీరికొచ్చిన బీఈడీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి. మరో వారం రోజుల్లో సొంతంగా ఫీజు చెల్లించి టీసీలు తీసుకుని, కొత్త కళాశాలల్లో అప్పగిస్తేనే సీట్లు దక్కుతాయి. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వీరి ఆర్థిక నేపథ్యం అంతంతే. ఒక్కో విద్యార్థి కనీసం రూ.50వేల చొప్పున చెల్లించాలని కళాశాలనుంచి ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 200 కోట్ల బకాయిలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం (సుప్మా) ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది విద్యార్థులు ఆయా కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.200కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, త్వరగా విడుదల చేయాలని కళాశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యార్థులకు ఎంటీఎఫ్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి గత 18 నెలలుగా రకరకాల మార్గాల ద్వారా ఆవేదనను, ఆర్థిక పరిస్థితిని తెలియజేసినా ఎలాంటి స్పందన లేని కారణంగా డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ పిలుపుమేరకు నిరవధిక బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు డిగ్రీ, పీజి కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్ చేస్తున్నాం. మా అవసరాన్ని, ఆవేదనను ప్రభుత్వం దృష్టి సారించి మాకు, మా విద్యార్ధులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి. – ఎం వెంకటేశ్వర్ రావు, సుప్మా అధ్యక్షులుపెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కళాశాలలు బంద్ పాటిస్తున్నా.. ప్రభుత్వ మౌనం సరికాదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘ఎమ్మెల్యేగా వ్యవహరిస్తే సహించేదిలేదు’
పాలకుర్తి(రామగుండం): ప్రజలు గెలిపించిన మ క్కాన్‌సింగ్ రాజ్ఠాకూర్ని ఎమ్మెల్యేగా స్వాగతిస్తు న్నామని, కానీ ఆయన సతీమణి మనాలీ ఠాకూర్ తానే ఎమ్మెల్యేను అనే రీతిలో వ్యవహరిస్తూ, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేదిలేద ని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈసాల తక్కళ్లపల్లిలో బుధవారం బీఆర్ఎస్ మండల అధి కారి ప్రతినిధి ముల్కల కొమురయ్య తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మనాలీ ఠా కూర్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం, ఇందిర మ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం, ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోయడంలాంటి అధికారిక కార్యక్ర మాలను ప్రారంభించడం ఏమిటని నిలదీశారు. ఈ విషయంలో అధికారులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతరెండేళ్లలో పాలకుర్తి మండలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ గొప్పలు చెప్పడం తప్ప అన్నీ ఉత్తవే నని విమర్శించారు. ఈసాలతక్కళ్లపల్లి శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేశామని ఎమ్మెల్యే ప్రకటించారని, నెలదాటి నా ఒక్కపనిని కూడా ప్రారంభిచలేదని ఎద్దేవా చేశా రు. బండి శ్రీనివాస్‌గౌడ్, శ్రావణ్, రాజయ్య, కొము రయ్య, శ్యాంసుందర్, రాయలింగు, కొమరయ్య, సుదర్శనం, అశోక్, రాజపోశం, హుస్సేన్ ఉన్నారు. పాలకుర్తి బీఆర్ఎస్ నాయకులు మక్కాన్‌సింగ్ సతీమణి తీరుపై నిరసన -
సబ్సిడీ గ్యాస్ పక్కదారి
రామగిరి(మంథని): జిల్లాలో గృహావసరాలకు వినియోగించాల్సిన రాయితీ వంటగ్యాస్ సిలిండర్లు బ్లా క్మార్కెట్కు తరలిపోతున్నాయి. ఏజెన్సీల నిర్వా హకులు కొందరు వ్యాపారులతో కుమ్మకై అక్రమాల కు పాల్పడుతున్నారు. దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలువస్తున్నాయి. హోటళ్లు. వాహనాలకు.. జిల్లాలోని టీస్టాళ్లు, హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, దు కాణ యజమానులతోపాటు వాహనాల్లోనూ సబ్సి డీ గ్యాస్ వినియోగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ కనెక్షన్లు దాదాపు 50 వేల వరకు ఉన్నాయి. ప్రతీనెల జిల్లా లోని ఏజెన్సీల ద్వారా 70 వేల రీఫిల్లింగ్ సిలిండర్లు వినియోగదారులకు అందుతున్నాయి. వాణిజ్యావసరాలకు సబ్సిడీ.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని హోట ళ్లు, ఇతర వ్యాపారాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారని సమాచారం. వీరికి వారానికి రెండు లేదా మూడు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. వాహనాలకూ వినియోగం.. కార్లు, ఇతర వాహనాల్లో పెట్రోల్‌కు బదులు గ్యాస్ సిలిండర్లు వినయోగిస్తున్నారు. నిబంధనల ప్రకా రం.. అనుమతి పొందిన కిట్లను వాహనాలకు అ మర్చుకోవాలి. కొందరు అనుమతి లేకుండానే కిట్లు అమర్చుకుని సబ్సిడీ గ్యాస్‌ను యథేచ్ఛగా ఫిల్లింగ్ చేసి వినియోగిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు.. సామాన్య వినియోగదారుల పేరిట గ్యాస్‌బుక్ చేసుకుని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు వి క్రయిస్తున్నారు. అంతేకాదు.. చిన్నగ్యాస్ స్టవ్‌లలో రీఫిల్లింగ్ చేస్తున్నారు. రీఫిల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ధర వసూలు చేస్తున్నారు. ధరల్లో వ్యత్యాసంతోనే.. గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం రాయితీపై వినియోగదారులకు రూ.877.50కే అందిస్తోంది. ఇంటివద్ద డెలవరీ చేస్తే సిబ్బంది అదనంగా కొంత నగదు తీసుకుంటారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,780 ఉంది. కేవలం ఐదు కేజీల వ్యత్యాసానికి అదనంగా రూ.900 నుంచి రూ.1,000 అధికంగా వెచ్చించాల్సి రావడంతో గృహావసరాలకు కేటాయించే రాయితీ గ్యాస్‌ను వాణిజ్యావసరాలకు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. తనిఖీలు నామమాత్రం.. సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షించాలి. కానీ, వారు తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారు. దీంతో రాయితీ గ్యాస్ పక్కదారి పడుతోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించే వాహనాల్లోనూ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు సింగిల్ సిలిండర్ 1,41,839 డబుల్ సిలిండర్ 80,789 దీపం 33,411 పీఎంయూవై 25,885 సీఎస్సార్ 16,518 వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు యథేచ్ఛగా వినియోగిస్తున్న వ్యాపారులు -
లక్ష్య సాధనలో సింగరేణి వెనుకంజ
గోదావరిఖని: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈక్రమంలో గత అక్టోబర్ చివరినాటికి 37.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి క్ష్యంగా నిర్దేశించగా 32.63 మిలియన్ టన్నులు సాధించి 87 శాతం నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడం సంస్థకు భారంగా మారే అవకాశం ఉంది. ఉత్పత్తిపై భారీవర్షాల ప్రభావం భారీవర్షాలతో ఓసీపీల్లో ఉత్పత్తిపై ప్రతికూల ప్ర భావం చూపింది. సంస్థ ఉత్పత్తిలో 80 శాతానికిపై గా ఓసీపీల ద్వారానే వస్తోంది. ఈక్రమంలో భారీవర్షాలు ఉత్పత్తిని దెబ్బతీశాయి. సంస్థవ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 103 శాతం బొగ్గు ఉత్పత్తి సా ధించి ఆర్జీ–2 ఏరియా అగ్రగామిగా నిలిచింది. అ త్యల్పంగా అడ్రియాల ప్రాజెక్టు ఏరియా కేవలం 12 శాతం మాత్రమే ఉత్పత్తి తీసి చివరిస్థానంలో నిలి చింది. కొత్తగూడెం 98శాతం, మణుగూరు 96 శాతం నిలిచి లక్ష్య సాధనలో పోటీపడుతున్నాయి. దూకుడుగా ముందుకు.. వర్షాకాలం పూర్తికావడంతో ఈనెల నుంచి బొగ్గు ఉ త్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనుంది. నవంబర్ నుంచి మార్చి వరకు ఐదునెలల పాటు ఓసీపీ ల్లో ఉత్పత్తి సాధనలో దూకుడు పెంచనుంది. ఈమేరకు అన్నిఏరియాల ఓసీపీల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందంజలో ఉండాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం అన్ని ఏరియాల జీఎంలను ఆదేశాలు జారీచేశారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం : 72 మిలియన్ టన్నులు అక్టోబర్ చివరినాటికి లక్ష్యం : 37.60 మిలియన్ టన్నులు నిర్దేశిత గడువు వరకు సాధించిన ఉత్పత్తి : 32.63 మిలియన్ టన్నులు నమోదు చేసిన శాతం : 87 87శాతానికే పరిమితమైన బొగ్గు ఉత్పత్తి ఏరియా టార్గెట్ సాధించింది శాతం ఆర్జీ–1 25.01 22.75 91 ఆర్జీ–2 44.24 45.44 103 ఆర్జీ–3 35.20 28.85 82 ఏపీఏ 7.45 0.92 12 -
సింగరేణి అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణిలోని పలు విభాగాలకు చెందిన 57 అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పర్సనల్, ఈఅండ్ఎం, ఫైనాన్స్ విభాగాల్లోని అధికారులు ఇందులో ఉన్నారు. పర్సనల్ విభాగంలో 15మంది, 11 మంది ఫైనాన్స్, 31 ఈఅండ్ఎం అధికారులు బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఇంటి వద్దే ర్యాపిడ్ టెస్ట్ పెద్దపల్లి: జ్వరపీడితు ఇళ్లకు వెళ్లి పురుష ఆరో గ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు ర్యాపిడ్ టె స్టులు చేయాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. తన కార్యాలయంలో మంగళవా రం వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. అ నుమానితులకు మలేరియా, డెంగీ ర్యాపిడ్ టె స్టులు చేయాలని, ల్యాబ్ టెక్నీషియన్లు ఆరో గ్య కేంద్రాల్లో సేకరించినకు రక్తనమూనాలను టీ హబ్‌కు పంపించాలని ఆదేశించారు. పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, సిబ్బందితో ప్రత్యేకంగా సమీక్షించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, ఉమామహేశ్వర్, సు ధాకర్‌రెడ్డి, సంయుక్త తదితరులు పాల్గొన్నారు. జాగృతిని విస్తరిస్తాం పెద్దపల్లి: తెలంగాణ జాగృతిని మరింత విస్తరిస్తామని జాగృతి జిల్లా అధ్యక్షుడు కోదాటి శ్రీనివాస్‌రావు అన్నారు. జిల్లాకు తొలిసారి వచ్చిన శ్రీనివాస్‌రావును స్థానిక నాయకులు మంగళవారం సన్మానించారు. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు తామన్నారు. డిసెంబర్లో జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్రంలో పర్యటి స్తారని తెలిపారు. సుల్తానాబాద్‌లో జాగృతి క న్వీనర్ ఐలయ్య ఆయనను సన్మానించారు. జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లం భూమేశ్, నాయకులు సలేంద్ర కొమురయ్య, గూడపు కిరణ్ తదితరులు ఉన్నారు. పైరవీలకే పరిమితం యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమస్యలను గాలికి వదిలేసి పైరవీలకే పరిమితమైందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ విమర్శించారు. స్థానిక ప్రెస్ భవన్లో మంగళశారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ తొలిఏడాదిలో 33 శాతం, రెండో ఏడా దిలో 34 శాతం రెగ్యులర్ కార్మికులకు లాభా లా వాటా, తొలిదశలో రూ.5వేలు, రెండోదశ లో రూ.5,500 బోనస్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పించిందని గుర్తుచేశారు. శంకర్‌నాయ క్, ధర్మపురి, అక్రమ్, వడ్డేపల్లి దాస్, దశరథంగౌడ్, కృష్ణ, వికాస్‌యాదవ్, సదానందం, అశో క్, శ్రీను, రాములు, లక్ష్మ య్య, సురేశ్, మధు, రాజ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు. రప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ సుల్తానాబాద్‌రూరల్: ప్రతీవిద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ రమణారావు సూ చించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులు, ల్యాబ్‌లు పరిశీలించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. విద్యాబోధనలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ గోల్డి బాల్బీర్కౌర్, అధ్యాపకులు ఉన్నారు. నిర్దేశిత ఫీజు వసూలు చేయాలి పెద్దపల్లి: ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే వసూ లు చేయాలని బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికృష్ణ యాదవ్ కో రారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చే శారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలు కామన్ ఫీజులు వసూలు చేయొద్దన్నారు. నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
మంథని: పెండింగ్ స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా నాయకులు నినాదాలు చేయడం ఆపలేదు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్‌లోని రూ.8,025 కో ట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు సాయితేజ, లక్ష్మణ్, శశి, కల్యాణ్, తిరుపతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ -
ఉచితంగా ఇవ్వాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం వండే నిర్వాహకులకు గ్యాస్ కనెక్షన్‌తోపాటు పొయ్యి, రెగ్యులేటర్, పైపు కూడా ఉచితంగా అందించాలి. రీఫిల్లింగ్ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలి. సరుకుల బిల్లులే చెల్లించ లేని స్థితిలో ఉన్న భోజన నిర్వాహుకులపై అదనపు భారం మోపవద్దు. – పూసాల రమేశ్, జిల్లా అధ్యక్షుడు, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్25 వరకు కనెక్షన్లు కట్టెల పొయ్యిపై వంటలు తయారు చేసే పాఠశాలల జాబితా సిద్ధం చేయాలని సూచించాం. ఆయా స్కూళ్లకు ఈనెల 25వ తేదీవరకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అందుకు అవసరమైన కార్యాచరణను సమన్వయంతో అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు
ఓదెల(పెద్దపల్లి): రైల్వే ప్రయాణికులకు ఆధునికసౌకర్యాలు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) గోపాలకృష్ణన్ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను డీఆర్ఎం మంగళవారం సందర్శించారు. నిత్యం రద్దీగా ఉండే ఓదెల రైల్వేస్టేషన్లో అన్నిసౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బీజేపీ నాయకులు తాటికొండ వెంకటేశ్వర్లు, కృష్ణమాచారి, తీర్థాల కుమారస్వామి, అల్లెంకి శేషుమూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, ఓదెలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని బీజేపీ నాయకులు డీఆర్ఎం గోపాలకృష్ణన్‌కు విన్నవించారు. ఈమేరకు డీఆర్ఎంకు ఓదెల మల్లికార్జునస్వామి చిత్రపటం బహూకరించారు. ఓదెల రైల్వేస్టేషన్ స్థాయి పెంపు ఓదెల రైల్వేస్టేషన్ హాల్ట్‌స్టేషన్ స్థాయి నుంచి ఎన్ఎస్జీ– 4వ స్టేషన్స్థాయిగా పెరిగిందని సికింద్రా బాద్ రైల్వేశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనెజర్ భాస్కర్‌రెడ్డి పిన్‌రెడ్డి మంగళశారం ఉత్తర్వులు జారీచేశారు. ఓదెల మల్లికార్జునస్వామి భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ -
నేడు నృసింహుని కల్యాణం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి లోని శ్రీలక్ష్మీ నరసింహస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జిల్లావాసుల ఆరాధ్యదైవమైన శ్రీలక్ష్మీనర్సింహస్వా మి బ్రహ్మోత్సవాలను ఏటా కార్తీకమాసంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. క ల్యాణ తంతు నిర్వహణకు ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, గ్రామపెద్దలు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. 10న రథోత్సవం ఈనెల 10న స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఉత్సవాలకు భక్తులు వచ్చే వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ స్థలాలను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చలువపందిర్లు వేయించడంతోపాటు తాగునీటి వసతి కల్పించామని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు. రెండు రాష్ట్రాల భక్తుల రాక ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు -
రైతుల పాట్లు
రూ.ఆరు కోట్లు..మంథని: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను రూ.6 కోట్లకుపైగా వెచ్చించి 2012లో ఆధునికీకరించారు. రూ.4.56 కోట్లతో 600 మెట్రిక్ టన్నుల గోదాం, కవర్‌షెడ్, అంతర్గతరోడ్లు, సిమెంట్యార్డు, రైతు విశ్రాంతి భవనం, 60 వేల లీటర్ల సామర్థ్యంగల వా టర్ ట్యాంక్, విద్యుదీకరణ పనులు ఇందులో ని ర్మించారు. 2016లో అదనంగా రూ.30 లక్షలు వె చ్చించి డ్రైనేజీ, కాంపౌండ్‌వాల్, రైతు విగ్రహం, క మాన్.. ఇలా వివిధ సౌకర్యాలు కల్పించారు. ఇక్క డి వరకు బాగానే ఉన్నా.. వర్షపు నీరు యార్డు నుంచి బయట వెళ్లే డ్రైనేజీ సరిగా నిర్మించలేదు. దీంతో ఏటా అకాల వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా యార్డులో పెద్దఎత్తున నీరు నిలిచి టన్నుల కొద్దీ ధాన్యం తడిసిపోతోంది. క్వింటాళ్ల కొద్దీవడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోతూ ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని నీళ్లపాలు చేస్తోంది. ప్రణాళిక లోపంతో చేపట్టిన పనులే ఇందుకు కారణమనే విమర్శలు ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. కాలువలు అధ్వానం.. మార్కెట్ యార్డులో నిలిచిన వర్షపునీరు కాలువల ద్వారా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కవర్ షెడ్డుకు రెండువైపులా ఉన్నవి చిన్నకాలువలు కావడం, అందులోనూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, వరద సామర్థ్యం అధికంగా ఉండడంతో వర్షపునీరు యార్డులోనే నిలిచిపోతోంది. యార్డు ఆరంభం నుంచి ముందు, వెనకాల మురుగునీటి కాలువలు కూడా చిన్నవిగా ఉన్నాయి. దీంతో వరద యార్డులోనే రోజులతరబడి నిలిచి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు కొట్టుకుపోయిన ధాన్యం.. మార్కెట్లో రైతులు నిల్వచేసిన ధాన్యం పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు తడిసింది. వర్షపునీటిలో మరికొంత కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంకా ప్రారంభం కాకపోవడంతో సుమారు 1,500 క్వింటాళ్ల వడ్లు తడిసి ముద్దయ్యాయి. గత 30న రాత్రి భారీవర్షం కురవడంతో ధాన్యం రాశుల చుట్టూ వరద వచ్చి చేరింది. మంగళవారం మధ్యాహ్నం కూడా మోస్తరు వర్షం కురిసి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏటా, ప్రతీ సీజన్లోనూ ఇదే దుస్థితి ఎదురవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్‌గా ఉందనుకుంటే.. నిండా ముంచుతోంది రూ.6కోట్లతో ఆధునికీకరించినా అన్నదాతకు కన్నీరే కొనుగోలు కేంద్రంలో ఏటా ధాన్యం కొట్టుకుపోవుడే మంథని వ్యవసాయ మార్కెట్‌యార్డు దుస్థితి -
సర్కార్ బడికి గ్యాస్ కనెక్షన్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం వండేందుకు వంటగ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్న భోజన వర్క ర్లు కట్టెలపొయ్యిపై వంటలు తయారు చేస్తూ ఇ బ్బందులు పడడాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 521 ప్రభుత్వ పాఠశాలలు ఉండ గా.. అందులో 50 స్కూళ్లకు ఇప్పటికే వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడి పేరిట గ్యాస్ కనెక్షన్ ప్రధానోపాధ్యాయుడి పేరిట పాఠశాలకు వంటగ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వమే డిపాజిట్ నిధులు సమకూర్చుతుంది. వంట తయారుచేసేందుకు అవసరమైన పొయ్యి, పైపు, రెగ్యులేటర్‌తోపాటు రీఫిల్లింగ్ ఖర్చును మధ్యాహ్న భోజన వర్కర్లు భరించాల్సి ఉంటుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. అ యితే, భోజన నిర్వాహకులపై ఆర్థికభారం పడకుండా మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ రీఫిల్లింగ్ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. ఇకనుంచి గ్యాస్ స్టౌలపైనే మధ్యాహ్న భోజనం తయారీ 25 వతేదీ వరకు కనెక్షన్లు మంజూరు ‘మహాలక్ష్మి’ వర్తింపుపై అధికారుల ఆలోచన సిలిండర్ రీఫిల్లింగ్‌పై అస్పష్టత -
ఆర్ఎంవోగా కృపాబాయి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో)గా కృపాబా యిని నియమిస్తూ వైద్య, ఆ రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కా ర్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్, మెటర్నల్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృపాబాయికి డిప్యూటీ సివిల్ సర్జన్ హోదా నుంచి సి విల్ సర్జన్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆర్ఎంవోగా ని యమించారు. మనజిల్లాలో కృపాబాయి డిప్యూటీ డీఎంహెచ్వోగానూ పనిచేశారు. లాంగ్‌స్టాండింగ్ బదిలీల్లో భాగంగా ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లాకు బదిలీపై వెళ్లారు. దుర్వినియోగం చేస్తే చర్యలు ఓదెల(పెద్దపల్లి): ఉపాధి పనులు, నిధులు దుర్విని యోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని అంబుడ్స్‌మన్ శరత్‌కుమార్ హెచ్చరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. శరత్‌కుమా ర్ మాట్లాడుతూ, మొత్తం 22 గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులకు రూ.4,97,87,230 ఖర్చుచేశారన్నారు. ఇందులో రూ.22,587 నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. వాటి రికవరికి ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో తిరుపతి, పీఆర్ ఏఈఈ సచిన్, ఏపీడీ సత్యనారాయణ, విజిలెన్స్ ఆఫీసర్ కొమురయ్య, ఎస్ఆర్పీ మౌనిక ఉన్నారు. హోటళ్లల్లో తనిఖీలు కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని హోటళ్లు, టి ఫిన్ సెంటర్లను శానిటేషన్ అధికారులు మంగళవా రం తనిఖీ చేశారు. అపరిశుభ్రత, నాణ్యతలోపాల పై ఆరోపణలు వచ్చిన హోటళ్లను తనిఖీ చేసినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, గోపు సంపత్ తెలిపారు. మార్కండేయకాలనీలోని ఓ హోటల్ ని ర్వాహకునికి జరిమానా విధించినట్లు తెలిపారు. వార్డు ఆఫీసర్ సాయి, సహాయ పర్యవేక్షకులు శ్రీనివాస్, సంపత్, అశోక్, శ్రావణ్ పాల్గొన్నారు. ప్రైవేట్‌లోనూ ఉపాధి అవకాశాలు పెద్దపల్లి: ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి అవకాశాల ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి క ల్పనాధికారి రాజశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం మెడ్‌ప్లస్ కంపెనీ నిర్వహించిన జాబ్‌మేళా కు నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. క్వింటాల్ పత్తి రూ.6,858 పెద్దపల్లిరూరల్: వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,858 ధర పలికింది. కనిష్టంగా రూ.5,571గా నిర్ణయించారు. -
సీసీఐ నిబంధనలు కఠినం
పెద్దపల్లిరూరల్: పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల మేరకు కొనుగోళ్లు చేయ డం కష్టమని జిన్నింగ్ మిల్లర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం మేరకు జి ల్లాలోనూ మిల్లులు, సీసీఐ సెంటర్లు, ప్రైవేట్‌గా ప త్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని అసోసియేషన్ నాయకుడు ముడుసు సాంబిరెడ్డి తెలిపారు. జిన్నింగుమిల్లులో సౌకర్యాల కల్పన ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 విధానం చేయడం సరికాదన్నారు. ఎకరాకి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం ఏమిటన్నారు. ఈ విషయాల్లో వెసులుబాటు కల్పించాలని అధికారులకు విన్నవించారు. జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తిసాగు జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సా గు తీరును బట్టి 5,78,580 క్వింటాళ్ల దిగుబడి వ స్తుందని అధికారుల అంచనా. గత సీజన్ కన్నా ఈ సారి పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ.589 పెరిగిందని సంతోషపడ్డ రైతులకు.. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు పత్తికి నష్టం చేయడం వేదనకు గురిచే సింది. దీంతో దిగుబడి తగ్గడమో, నాణ్యత లోపించడమో చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెటింగ్ అధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడురోజులు పత్తి తేవొద్దు.. పెద్దపల్లి: రైతులు మూడురోజుల పాటు మార్కె ట్‌కు, జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకు రావొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించా రు. డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శులు, పోలీసు, రవాణా, అగ్నిమాపక, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో కలెక్టరేట్లో ఆయన పత్తి కొనుగోళ్లపై మంగళవారం చర్చించారు. పత్తి కొనుగోళ్లను మూడురోజులపాటు నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు విన్నవించారని, దీంతోనే పత్తి తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమయ్యే తేదీలను అధికారులు త్వరలోనే ప్రకటిస్తారని ఆయన వివరించారు. పత్తి కొనుగోలు చేయబోం తేల్చిచెప్పిన జిన్నింగ్ మిల్లర్లు మూడురోజులు కొనుగోళ్ల నిలిపివేత -
రైతు ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన రైతు ఇమ్మడి సదానందం అప్పు ల బాధ తట్టుకోలేక సోమవారం పురుగులమందు తాగాడు. వెంటనే స్థానికులు 108లో హుజూరా బాద్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. తండ్రీకూతుళ్లు.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌కు చెందిన మిట్టపల్లి అఖిల అనే వివాహితను అత్తింటివారు వేధింపులకు గురి చేస్తుండగా, ఈ విషయంలో పోలీసులు తమకు సరైన న్యాయం చేయలేదని ఆరోపిస్తూ.. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్లు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల వివరాలు.. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన అఖిలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన కృష్ణకాంత్‌తో 11 నెలల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఆరునెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఐదునెలలుగా అదనపు కట్నం కోసం అఖిలను అత్తింటి వారు వేధించసాగారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని నాలుగునెలల క్రితం ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో అఖిల గత నెల 30న పురుగులమందు తాగింది. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలోనే తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అఖిల తండ్రి మిట్టపల్లి ఆంజనేయులు గత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆంజనేయులు ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి వచ్చాడు. ఈ విషయంపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. అఖిల ఫిర్యాదు మేరకు భర్త కృష్ణకాంత్, అత్త, మామ, ఆడబిడ్డలపై అదనపు కట్నం కేసు నమోదు చేశామన్నారు. కేసు విషయంలో అత్తింటివారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని అఖిల, ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. -
రీల్స్ చేస్తూ గోదావరిలో యువకుడి గల్లంతు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమీప గోదావరి నదిలో ‘గోదావరి – గంగ స్నానం’ పేరిట మంథని మంట అనే యూట్యూబ్‌లో రీల్స్చేసే ఓ యువకుడు.. రోజూ మాదిరిగానే సోమవారం స్నానం కోసం గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మంథని పాతబస్టాండ్ వెనకాల నివాసం ఉండే రావికంటి చంద్రశేఖర్ కుమారుడు సాయికృష్ట (30) బీటెక్ పూర్తిచేశాడు. ‘మంథని మంట’ పేరిట స్థానిక అంశాలపై రీల్స్ చేస్తూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాడు. ఈక్రమంలో ‘గోదావరి– గంగస్నానం’ పేరిట రీల్స్ తీసి పిల్లలు, స్థానికులను ఉత్సాహ పరచడంతోపాటు ఈ ప్రాంత ప్రత్యేకతనూ పరిచయం చేశారు. ఇందుకోసం సాయికృష్ణ నిత్యం గోదావరి నదికి వెళ్లి స్నానం చేయడమే కాకుండా రీల్స్ తీస్తున్నారు. సోమవారం కూడా గోదావరిలోకి వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, మున్సిపల్, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మంథని ఎస్ఐ–2 సాగర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమారస్వామి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, గతఈతగాళ్లు రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతన్నారు. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉండడంతో కార్తీకమాసంలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు లోతైన ప్రదేశానికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, గజఈతగాళ్ల ను అందుబాటులో ఉంచామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కాగా, బాఽధిత కుటుంబంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు గోదావరి తీరాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. -
వరి విత్తనం సిద్ధం
● కొత్త వంగడాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు ● వానాకాలంలో సాగు చేసిన రైతులు కరీంనగర్‌రూరల్: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసేందుకు అవసరమైన విత్తనం సిద్ధమవుతోంది. ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలుతో రైతులకు ఆర్థికంగా భారమవుతుండటంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫౌండేషన్ విత్తనం తయారీ చేస్తున్నారు. గత వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 20 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఒక్కో గ్రామంలో ఎంపిక చేసిన ఇద్దరు రైతులకు సాగు చేసేందుకు నాణ్యమైన వరి విత్తనాలు అందజేశారు. ఒక్కో విత్తన బస్తాతో ఎకరం చొప్పున మొత్తం 40 ఎకరాల్లో సాగు చేశారు. దొడ్డు రకం విత్తనాలు పంపిణీ వరిలో జేజీఎల్ 24423 దొడ్డురకం విత్తనాలను కరీంనగర్ పరిశోధన స్థానం నుంచి రైతులకు పంపిణీ చేశారు. కొన్ని వరి విత్తన పంటలు ప్రస్తుతం కోత దశలో ఉండగా మరికొన్ని గ్రామాల్లో కోతలు పూర్తి చేశారు. వారం రోజుల క్రితం కొత్తపల్లి మండలంలో శాస్త్రవేత్తలు పంటపొలాలను సందర్శించారు. తాము సరఫరా చేసిన విత్తనాలతో పండించిన పంట నుంచి గింజలను తీసుకుని రైతులు తిరిగి విత్తనంగా వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. పొలంలో కల్తీ కర్రలు, బెరుకులను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకుని కొన్ని సీజన్ల వరకు విత్తనంగా వాడుకునే అవకాశముంది. గ్రామంలోని ఇతర రైతులకు ఈ విత్తనాలను విక్రయించవచ్చు. రైతులు పండించిన విత్తనాలను 3నుంచి 4 వారాల పాటు నిల్వ చేసిన అనంతరం విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులకు ఎకరానికి రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు ఖర్ఛవుతోంది. ఈ విత్తనమైతే సగం ఖర్చు మాత్రమే అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన వర్సిటీ వీసీ రాజిరెడ్డి కాల్వశ్రీరాంపూర్: శాసీ్త్రయ పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ దండ రాజిరెడ్డి సూచించారు. వాణిజ్య పంటలతోపాటు పండ్ల తోటలు, కూరగాయలు, సిరి ధాన్యాలు, పప్పు దినుసుల సాగుపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం రైతువేదికలో ఆయన సోమవారం రైతులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కొయ్యకాళ్లు, వ్యర్థాలు కాల్చడం ద్వారా కాలుష్యం పెరుగుతుందన్నారు. వ్యర్థాలను వర్మీకంపోస్టుగా తయారు చేసేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. కృషి విజ్ఞానకేంద్రం రామగిరి ఖిల్లా ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాతస్రవేత్త సతీశ్‌చంద్ర, ఉద్యానవన రిజిస్ట్రార్ భగవాన్, వర్సిటీ డైరెక్టర్ సురేశ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భర్త హఠాన్మరణం.. భార్య బలవన్మరణం
వీర్నపల్లి(సిరిసిల్ల): నలభై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన దేవోల్ల హన్మంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఒక పక్క అప్పులు, మరో పక్క భర్త మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురైన భార్య సుమలత(30) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన చిన్న కుమార్తె వచ్చేసరికి తలుపులు మూసి ఉండడంతో కిటికీలోంచి చూడగా తల్లి ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు తెలుపడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఇందు, లాస్య ఉన్నారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నలభై రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. అనాథలైన చిన్నారులు -
జింకను వేటాడిన వ్యక్తి అరెస్ట్
కొడిమ్యాల: వన్యప్రాణిని వేటాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడిమ్యాల రేంజ్ అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల ఆశయ్య కొద్దిరోజుల క్రితం జింకను వేటాడి చంపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు జింకను వేటాడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారి గులాం మొహినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముషీరుద్దీన్, బీట్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, సిబ్బంది ఉన్నారు. -
చెరువులో పడి వృద్ధుడి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఆవుల పెద్దరాజయ్య(72) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. సోమవారం బహిర్భూమికి వెళ్లిన పెద్దరాజయ్య.. చెరువులోకి దిగగా కాలుజారి నీటమునిగి మృతిచెందాడు. మృతుడు కుమారుడు ఆవుల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పొత్కపల్లి ఎస్సై వివరించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ..ఇల్లందకుంట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ గోపాల్‌పూర్‌కు చెందిన నిమ్మల శివశంకర్ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కూతురు సాయి సుప్రజ (25)ను, ఇల్లందకుంటకు చెందిన గోడిశాల విక్రమ్ (28)తో ఫిబ్రవరిలో జరిగింది. వివాహ సమయంలో అన్ని కట్న కానుకలు అందించారు. కొన్నినెలలుగా అదనపు కట్నం తీసుకురావాలని సుప్రజను భర్త విక్రమ్, అత్త పుష్ప వేధింపులకు పాల్పడుతున్నారని బంధువులు ఆరోపించారు. ఈనెల 2న బాత్రూంలో సుప్రజ జారిపడిందని బంధువులకు విక్రమ్ సమాచారం అందించాడు. చికిత్స కోసం జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలింగా ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. సుప్రజ మృతిపై అనుమానం ఉందని, తమ కుమార్తె మృతికి కారణమైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పేర్కొన్నారు. ● దుబాయిలో గుండెపోటుతో రుద్రంగి వాసి మృతి రుద్రంగి(వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన వ్యక్తి గుండె ఎడారి దేశంలోనే ఆగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెల్లి సతీశ్‌గౌడ్(38) ఉన్న ఊరిలో ఉపాధి లేక రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కుటుంబ సభ్యులను చూసుకునేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కంపెనీలో సెలవు తీసుకొని తెల్లారితే ఫ్లైట్ ఎక్కి ఇంటికి వస్తాడనుకున్న సమయంలో మృత్యు ఒడికి చేరాడు. ఈనెల 1న గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని మంగళవారం రుద్రంగి తీసుకురానున్నారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడని సంతోషంతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు సతీశ్ మరణవార్త కడు దుఃఖాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లిదండ్రులు పెద్దన్న, నర్సవ్వ, భార్య లావణ్య, కూతురు హాసిని, కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
మహిళ బలవన్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): మతిస్థిమితం లేని మహిళ చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ పడి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఉయ్యాల రాజశేఖర్ తన తల్లి, కుటుంబంతో కలిసి చింతకుంటలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు, అయితే తండ్రి 11 ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి ఉయ్యాల అరుణ(53) మానసికంగా ఇబ్బంది పడుతూ రాత్రి వేళల్లో లేచి తిరుగుతుండటాన్ని గమనించి వారు ఇంటికి తీసుకొచ్చేవారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో లేకపోవడాన్ని గమనించి చుట్టు పక్కల ఆరా తీయగా చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలింది. ఆరోగ్యం క్షీణించి మతిస్థిమితం లేక జీవితంపై విరక్తి చెంది కెనాల్లో పడి తల్లి అరుణ ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు రాజశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కడుపునొప్పి భరించలేక యువకుడు..ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన పిట్టల మహేశ్(23) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన మహేశ్ మడకలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక జీవితంపై విరక్తిచెంది ఆదివారం రాత్రి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువికరించారు. మృతుడి తండ్రి పిట్టల వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డుకు తాకిన స్టాండ్రాడ్.. స్కూటీకి మంటలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని తెలంగాణతల్లి చౌరస్తా వద్ద సోమవారం ఓ స్కూటీకి మంటలు అంటుకుంటున్నాయి. దుబ్బాక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వస్తూ కొత్త బస్టాండ్ వైపు మళ్లారు. ఆ క్రమంలో వారి స్కూటీ స్టాండ్ రాడ్ బయటకు ఉండడంతో రోడ్డును తాకి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో స్కూటీకి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు హెచ్చరించడంతో బైక్‌పై ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలి కిందకు దూకారు. స్కూటీపై నీల్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. తృటిలో ప్రాణపాయం తప్పిందని స్కూటీపై వున్న వారు పేర్కొన్నారు. -
సీపీఐ శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలి
కరీంనగర్‌టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 26న నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వందేళ్లలో దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ప్రజల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతీ ఊరు, వాడవాడలో పార్టీ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు, సభలు, సెమినార్లు నిర్వహించి పార్టీ చరిత్రను నేటి తరానికి చేరవేయాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ శతజయంతి ఉత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతాల రూపంలో నిర్వహించి ప్రజలకు సీపీఐ ప్రజాపక్ష ధోరణిని తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా.. నాయకులు పొనగంటి కేదారి, అందె స్వామి, మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎఫ్సీఎల్లో వందశాతం యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో పూర్తిసామర్థ్యంతో యూరియా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన రామగుండం ఎరువుల కర్మాగారం.. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆరు రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. గత ఆగస్టు 14న అమ్మోనియా కన్వర్టర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. మరమ్మత్తుల అనంతరం సెప్టెంబర్ 28న పునరుద్ధరించారు. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా. హెచ్‌టీఆర్‌లో అమ్మోనియా కన్వర్టర్ మరమ్మతుల అనంతరం ప్లాంట్ పూర్తిసామర్థ్యంతో నెలరోజులుగా అంతరాయం లేకుండా యూరియా ఉత్పత్తి చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌లో 1,03,614.030 మెట్రిక్ టన్నుల నీం కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సీఎల్ జీఎం(ప్రాజెక్ట్), యూనిట్ హెడ్ రాజీవ్ ఖుల్బే సోమవారం తెలిపారు. తెలంగాణకు 45,561.780 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 22,720.230 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 18,943.470 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 16,388.550 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని అన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తికి సహకరించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు. -
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
జూలపల్లి(పెద్దపల్లి): కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. తెలుకుంట, పెద్దాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారా వు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మద్దతు ధరతోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. సన్నవడ్లకు బోనస్ ఇప్పించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట, ఎలిగేడు సింగిల్‌విండో చైర్మన్లు వేణుగోపాలరావు, విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు తొంటి మధుకర్, సుదగోని నర్సయ్య, లింగయ్యగౌడ్, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 48 గంటల్లో ధాన్యం డబ్బులు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తాలు, తేమ పేరిట ధాన్యంలో కోత పెడుతూ రైతులను దోచుకునే ప్రభుత్వం తమది కాదని, కోతల్లేకుండా తూకం వేసి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కార్‌దని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్, కూనారంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాంభించారు. 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అంక సదయ్య, సింగిల్‌విండో చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
జాగ్రత్తలు తీసుకోవాలి
న్యుమోనియా వ్యాధి రాకుండా అప్పుడే పుట్టిన ప్రతీబిడ్డకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయించాలి. వ్యాధి నియంత్రణకు పిల్లలు, పెద్దవారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవడం చాలామంచిది. వ్యాధిగ్రస్తులు కోలుకోవడానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా చలికాలంలో చాలాజాగ్రత్తలు తీసుకోవడం మంచిది.– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో -
బస్సు డిపో పనులు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: పంచాయతీ సమితి కార్యాలయంగా సుమారు 51ఏళ్ల క్రితం పురుడుపోసుకుని అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రారంభించిన భవనం కనుమరుగవుతోంది. అర్ధశతాబ్దపు ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లు నీడ, ఆహ్లాద వాతావరణం అందించేవి. వీటిని ప్రస్తుతం నరికివేస్తున్నారు. దీంతో స్థానికులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మండే ఎండల్లో చల్లని నీడకోసం ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లకిందకు వందలాది మంది చేరి సేదతీరేవారు. సెలవుదినాల్లో హాస్టల్ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సైతం ఇక్కడే విశ్రాంతి తీసుకుని కబుర్లు చెప్పుకునే వారు. ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పెరి గిన రావి, టేకు, వేప, కానుగ, సుబాబుల్, సపోట, అల్లనేరేడు, కొబ్బరి, నిమ్మ, చింత, అశోక తదితర 150రకాల చెట్లను తొలగించడం సోమవారం ప్రా రంభించారు. చెట్ల నరికివేతతో కొద్దిరోజుల్లో ఏళ్లనాటి భవనాలు కాలగర్భంలో కలిసి పోనున్నాయి. వాటిస్థానంలో బస్సు డిపో ఏర్పాటు కానుంది. కాలగర్భంలో అర్ధశతాబ్దపు చెట్లు కనుమరుగుకానున్న భవనాలు -
ఆడపిల్లను పుట్టనిద్దాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ‘ఆడపిల్లలను పుట్ట నిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం’ అని జి ల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. స్థానిక ప్రగతినగర్ చౌరస్తా వద్ద మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో సో మవారం విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమన్నారు, బాల్య వివాహా ల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సాధికారిత ప్రతినిధి సుచరిత, సమ త, స్వప్న, కనకరాజు, శ్యామల పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ యశ్రీ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సోమశేఖర్ సోమవారం తెలిపారు. ఎస్జీఎఫ్– 14 విభాగంలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైందని, మంగళవారం నుంచి వికారాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. జయశ్రీని హెచ్ఎం గా యత్రీదేవీ, ఉపాధ్యాయులు అభినందించారు. డీఎల్పీవోగా దేవకీదేవి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డివిజనల్ పంచాయ తీ అధికారి(డీఎల్పీవో) దేవకీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటివరకు పనిచేసిన వేణుగోపాల్‌రావు ఉద్యోగ విరమణ చే శారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసిన దేవకీదేవికే డీఎల్పీవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నియామకం పెద్దపల్లి: జిల్లాలో ఏర్పాట య్యే రైతు విజ్ఞాన కేంద్రం నో డల్ అధికారిగా డాక్టర్ ఓదెల సంపత్‌రెడ్డిని నియమించా రు. ఈమేరకు సోమవారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. తె లంగాణలోని వ్యవసాయ వ ర్సిటీ ఆధ్వర్యంలో తొలివిడతలో 15 జిల్లాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చే స్తారు. అందులో పెద్దపల్లి జిల్లా కూడాఉంది. రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలి పెద్దపల్లి: జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడా, యువజన సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్ సూచించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, రూము నంబరు 225, కలెక్టరేట్, పెద్దపల్లిలో సాయంత్రం 5గంటల్లోగా అందజేయాలన్నారు. వివరాలకు 99890 90097 నంబరులో సంప్రదించాలని సూచించారు. నేడు పవర్ కట్ ప్రాంతాలుపెద్దపల్లిరూరల్: సుభాష్‌నగర్ ప్రాంతంలో రో డ్డు, డ్రైనేజీ పనులు చేపట్టినందున మంగళవా రం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సు భాష్నగర్, కమాన్బస్టాప్, ఇండేన్ గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాలో విద్యుత్ ఉండదని, కస్టమర్లు సహకరించాలని కోరారు. క్వింటాల్ పత్తి రూ.6,844 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,844 ధర పలికింది. రూ.5,701 కనిష్ట, సగటు రూ.6,621 ధర నిర్ణయించినట్లు మార్కె ట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. లైవ్ సర్టిఫికెట్లు అందించాలి గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిజి టల్ లైవ్ సర్టిఫికెట్లను సకాలంలో అందజేసి పింఛన్ నిలిచిపోకుండా చూసుకోవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్ కోరారు. ఆర్జీ–1 జీ ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంపీఎ ఫ్ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించా రు. సీఎంపీఎప్ కమిషనర్ పచౌరి, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్‌తో కలిసి మాట్లాడారు. రిటై ర్డ్ ఉద్యోగులు ఏటా సమర్పించే లైవ్ సర్టిఫికెట్ ను ఈసారి మరింత సులభతరం చేసేందుకు రెండు రోజులపాటు శిబిరం నిర్వహిస్తారని, మంగళవారం కూడా కొనసాగుతుందన్నారు. -
ప్రజావాణికి సమస్యలు ఏకరువు
పెద్దపల్లి: అర్జీల రూపంలో అందే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన కల్లుగీతకార్మికుడు గుండ రమేశ్.. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడడంతో శాశ్వత వైకల్యం కలిగిందని, పరిహారం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖకు అదనపు కలెక్టర్ వేణు సూచన చేశారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బి.రవికుమార్.. తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అధికారులకు దరఖాస్తు చేయగా.. వారధి సొసైటీకి రాశారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటకు చెందిన ఒంటరి మహిళ ఎం.సమ్మక్క.. ఆర్థికసాయం కోసం అర్జీ సమర్పించగా.. డీఆర్డీవోకు బదిలీ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన డి.శంకరయ్య.. హనుమాన్ ఆలయం వద్ద రెండు బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖను వేణు ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు ఆదేశాలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ -
‘భోజన’ నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంపై తన కార్యాలయంలో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈనెల 25వ తేదీ వరకు కట్టెలపొయ్యిపై వంటలు తయారు చేయకుండా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని, గ్యాస్‌స్టవ్ పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 23వేల కొత్త రేషన్‌కార్డులు జారీచేశామని, అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్ అందించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం.. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 10శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి, అర్హత గలవిద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. పాఠాలు అర్థమవుతున్నాయా? పెద్దపల్లిరూరల్: ‘కంప్యూటర్ పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయా.. కంప్యూటర్‌పై అవగాహన ఉందా.. ఎలా నేర్చుకుంటున్నారు? అని కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులను ప్రశ్నించారు. రంగాపూర్ ప్రాథమిక పాఠశాలలోని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ల్యాబ్‌లో శిక్షణ పొందుతున్న ‘సి’ గ్రేడ్ విద్యార్థులను సోమవారం ఆయన కలుసుకున్నా రు. వారితో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు శివమణి, సాయివరుణ్తేజ, శ్రేయాన్స్.. కంప్యూటర్ ఆధారిత పాఠాలను స్క్రీన్‌పై చూపుతూ కలెక్టర్‌కు వివరించారు. ప్రైమరీలో 32మంది విద్యార్థులు ఉన్నారని, వారికి పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తున్నామని టీచర్ స్నేహ వివరించారు. ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బిల్లు ఇప్పించండి
ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించాలని రెండు నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. ఈఈ వద్ద పెండింగ్‌లో ఉందని స్థానిక అధికారులు దాటవేస్తున్నరు. అర్హత లేని వారికి బిల్లు మంజూరైంది. నాకు ఇప్పించాలె. – మాదాసు మమత, గర్రెపల్లి, సుల్తానాబాద్ అన్నం పెడ్తలేరు మాకు ఎవుసం భూమి ఉంది. ఙకొడుకులు అన్నం పెడ్తలేరు. ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ అయ్యింది. మూడు లక్షల రూపాయల ఖర్చయ్యింది. ఖర్చులకు డబ్బుల్లేవు. అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. – తీర్థాల కొమురయ్య, దేవక్క. ఖమ్మంపల్లిఇల్లు ఇప్పించండి కూలీకై కిలి పనిజేసుకుంటేనే పూటగడిచే కుటుంబం మాది. దీనికితోడు మా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నడు. ఆస్తుల్లేవు. భూముల్లేవు. పేద కుటుంబం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి గూడు సౌకర్యం కల్పించాలె. – హసీనాబేగం, సాగర్‌రోడ్డు, పెద్దపల్లి -
నెలాఖరు వరకు సిటీ పోలీస్‌యాక్ట్
గోదావరిఖని: బహిరంగ ప్రదేశా ల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని, అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్‌పై కఠిన చర్య లు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఈమేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచి ర్యాల, పెద్దపల్లి జోన్లలో ఈ ఆంక్షలు ఈనెలాఖరు వరకు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల కోసం ముందుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక పెద్దపల్లి: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఐఎంఏ భవన్లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నడిపెల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మేరుగు సతీశ్, కోశాధికారిగా జి.మాధవాచారి ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మందల శ్రీకాంత్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా బోగె చంద్రశేఖర్, సయ్యద్ ఫయాజుద్దీన్, ఉపాధ్యక్షుడిలుగా శేషాద్రి, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా తోటరాజు, కిన్నెర శ్రీనివాస్, కార్యదర్శులుగా బడుగు నగేశ్, కె.శ్రవణ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి ఆట సదయ్య మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నేడు గోదావరి హారతి మంథని: పట్టణ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం గోదావరిహారతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. హారతి వేదిక స్థలాన్ని ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణతోపాటు పలువురు ఆదివారం పరిశీలించారు. నదీ దీపారాధనతో శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని, రుగ్వేదంలో నదులకు హారతులు ఇచ్చే సంస్కృతి ఉండేదని వారు అన్నారు. పునర్ వైభవం కోసమే గోదావరిహారతిని 2012 నుంచి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి గోదావరి మాత ఆశీస్సులు పొందాలని వారు కోరారు. రాజమౌళి, శ్రీనివాసగుప్త, సబ్బ సత్యనారాయణ, నాంపల్లి రమేశ్, నారమల్ల కృష్ణ, కుమ్మరి మల్లిక్, తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన పంటలను ఇలా కాపాడుకోండి
● వ్యవసాయాధికారి అలివేణి పెద్దపల్లిరూరల్: మోంథా తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపింది. వివిధ పంటలకు కొంత నష్టం కూడా జరిగింది. కొన్నిచోట్ల నీట మునిగాయి. మరికొన్నిచోట్ల నేలవాలాయి. వర్షం, ఈదురుగాలులతో నేలవాలిన వరి, నీటమునిగిన పత్తిని కాపాడుకునేందుకు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయాధికారి అలివేణి రైతులకు సూచించారు. ఏవో సూచనలు ఇవే.. వరిలో పాటించాల్సిన జాగ్రత్తలు.. వరిపొలం మడిలో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించాలి. కంికి వర్షపు నీటిలో తడవకుండా చూడాలి. నేలవాలిన వరిపైరును పైకి లేపి కట్టలుగా కట్టాలి. ఇలా చేస్తే గింజ రంగు మారదు. తెగుళ్లు సోకకుండా ఒక పంపునకు 30 గ్రాముల సాఫ్ లేదా స్ప్రింట్ కలిపి పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పు ద్రావణాన్ని కలిపి చల్లాలి. ధాన్యం తడిస్తే ఆరబెట్టాలి. పత్తి రైతులకు.. పత్తి పూత, పిందెదశలో ఉంటే చేనులో వర్షపునీరు లేకుండా చూడాలి. మొక్కపై పత్తి బాగా ఆరిన తర్వాత తీయాలి. తడి పత్తిని ఏరవద్దు. తడిపత్తిని ఆరబెడితే బూజు పట్టిరంగు మారే అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా పాలిథిన్ కవర్‌పై ఆరబెట్టాలి. కాయలు దెబ్బతినకుండా, నాణ్యతగా ఉండేందుకు ప్రొపికొనజోల్ 200 మి.లీ. మందును ఎకరాకి పిచికారీ చేయాలి. పత్తి ఆకులపై మచ్చలు కనిపిస్తే బోరాక్స్ 150గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీల క్ష్మీనరసింహస్వా మి బ్రహ్మోత్సవా లు ఆదివారం అ ధ్యయనోత్సవా లతో ప్రారంభమయ్యాయి. సో మవారం సేవాకాలం, ప్రబంధ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు. ఈనెల 4న ఉదయం మూలస్వామి వారికి పంచామృత నవకలశాభిషేకం, అమ్మవారికి, స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, పెళ్లికొడుకు, పెళ్లి కూతురును తయారు చేసే కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. బుధవారం ఉదయం స్వామివారి కల్యాణంతోపాటు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వాహిస్తామని ఆలయ ఈవోపాటు అర్చకుడు శ్రీకాంతచార్యులు తెలిపారు. వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి పెద్దపల్లిరూరల్: స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఆదివారం నిర్వహించారు. వేదపండితుడు శ్రీనివాస్ మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు జరిగాయి. ట్రస్టు వ్యవస్థాపకుడు కట్ట రాజానందంతోపాటు నాయకులు సత్యనారాయణ, రమేశ్, మోహనాచారి, వెంకటేశ్వర్లు, కోటన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకా లు, పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థాని క మోడల్ స్కూల్ విద్యార్థి ని ఎన్.తేజస్విని రాష్ట్రస్థా యి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ కొమురయ్య తెలిపారు. గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్జీఎఫ్– 14 విభా గంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తేజ స్వీని ప్రతిభ కనబర్చిందన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఆమెను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీలు కొము రయ్య, మేకల సంజీవరావు అభినందించారు. పెద్దపల్లివాసికి రాష్ట్రకార్యవర్గంలో చోటు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రానికి చెందిన ఎన్పీడీసీఎ ల్ ఏఈ వెంకటనారాయణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో పనిచేస్తున్న వెంకటనారాయణ.. వరుసగా నా లుగోసారి ఈ పదవికి ఎన్నికకావడంపై పలువురు అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెంకటనారాయణ తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సుభాష్న గర్‌లో రహదారి, మురుగునీటి కాలువల పనులు చేపట్టిన కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుభాష్‌నగర్, కమాన్బస్టాప్, ఇండేన్‌గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వివరించారు. విద్యుత్ వినియోగదారులు తమతో సహకరించాలని ఆయన కోరారు. కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు తేమ పేరిట కొర్రీలు పెట్టకుండా తక్షణమే తూకం వేసేలా అధికారులు చర్యలు తీ సుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు భారీవర్షాలతో దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. మిగిలిన పంటను కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయం
పెద్దపల్లిరూరల్: ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయమన్నారు. తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, దాడి సంతోష్, రాజగోపాల్, శ్రీనివాస్, తిరుపతి, రాజం మహంత కృష్ణ, సతీశ్, శ్రీధర్, ఉమేశ్, కుమార్, సబ్బు మల్లయ్య, రాజు, మహేశ్, రాజేంద్రప్రసాద్, ఉప్పు కిరణ్, శ్రీకాంత్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం పెద్దపల్లి: హామీల అమలులో రాష్ట్టప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్థానిక పూసాల రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఎం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తారనే సమాచారంతో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రవణ్ కుమార్, వేణుగోపాల్, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కొమ్ము తిరుపతి, వేగోళం శ్రీనివాస్, మిట్టేపల్లి ప్రవీణ్ కుమార్, నాగేశ్వర్, అన్వేష్, గుంటి కుమార్, మహేశ్, రామకృష్ణ, రమేశ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. -
యువ కార్మికులతోనే యూనియన్ల మనుగడ
● సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్ దత్త గోదావరిఖని: యువకార్మికుల చైతన్యంతోనే కార్మి క సంఘాల మనుగడ సాధ్యమని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్‌దత్త అన్నారు. స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ఆదివారం యువ కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించారు. కార్మిక సంఘాల్లో యువల భాగస్వామ్యం పెరిగితేనే హక్కులను కాపాడుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఇందుకోసం కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా, రాజకీయ, ప్రభుత్వాలు తీసుకునే కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యలను నిర్లక్ష్యం చేయడంతోనే పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజు, నాయకులు గోపాల్, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఎస్కే గౌస్, సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, దాసరి సురేశ్, వంగల శివరాంరెడ్డి పాల్గొన్నారు. -
ఓటరు ప్రత్యేక సవరణకు సిద్ధం
పెద్దపల్లి: దొంగ ఓట్ల నియంత్రణ కోసం జిల్లాలో ఓటరు ప్రత్యేక సవరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను కేటగిరీల వారీగా తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం సుమారు 23 ఏళ్ల తర్వాత ఈఏడాది ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈమేరకు 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. దీనిని బీఎల్వోలకు పోలింగ్ కేంద్రాల వారీగా అందిస్తుంది. అప్పటిజాబితాలోని ఓటరుగా నమోదైన వారి వివరాలను 2025 జూలై నాటి ఓటరు జాబితాతో సరిపోల్చుతారు. -
ఊపిరికి భరోసా
కోల్‌సిటీ(రామగుండం): అత్యవసర వైద్య సేవలకు ఊపిరి పోసేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చేపట్టిన క్రిటికల్ కేర్ సెంట ర్ త్వరలోనే అందుబాటుకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ పనులు తుదిశకు చేరాయి. సెంటర్ అందుబాటులోకి వస్తే.. మనజిల్లావాసులతోపాటు పొరుగు జిల్లా ప్రజలకు కూడా అత్యవసర వైద్యసేవలు చేరువలోనే అత్యంత వేగంగా అందుతాయి. అత్యాధునిక హంగులు.. జీ ప్లస్– 2తో అత్యాధునిక హంగులతో భవనం నిర్మిస్తున్నారు. భవనం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పనులకు భూమిపూజ చేశారు. 50 పడకల సామర్థ్యం.. 50 పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తున్నారు. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. డీఎంఈకి సూపరింటెండెంట్ లేఖ.. కాంట్రాక్టర్ బిల్డింగ్‌ను అప్పగించేలా, వైద్య పరికరాలు తెప్పించేలా టీఎస్ఎంఐడీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 రకాల ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చాలంటూ ఈనెల ఒకటో తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్ ఓ లేఖ కూడా రాశారు. కలెక్టర్ పర్యవేక్షణలో పనులు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక పర్యవేక్షణతో క్రిటికల్ కేర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం తరచూ అధికారులతోఆయన సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు సత్వర సేవలు అంది ప్రాణనష్టం తగ్గుతుందని చెబుతున్నారు. ఈమేరకు పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు కలెక్టర్ సూచనలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్.. ఆధునిక పరికరాలతో కూడిన క్రిటికల్ కేర్ సెంటర్‌ను వేగంగా ఆధునికీకరిస్తున్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఊపిరితిత్తులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతుంది. ఆస్పత్రి సామర్థ్యానికి కొత్త శక్తి.. సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్ –ప్రభుత్వ)కు అనుబంధ గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి(బోధనాస్పత్రి) రాష్ట్రంలో అత్యధిక మంది పేషెంట్లకు సేవలు అందించే వాటిలో ఒకటి. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే ఆస్పత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పేషెంట్ల ప్రాణరక్షణలో ఇది అత్యంత కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇప్పటికే కొత్త సదుపాయం కోసం సన్నద్ధమవుతున్నారు. తుదిదశకు పనులు ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యింది. విద్యుత్, ఆక్సిజన్ కనెక్షన్లు, అంతర్గత ఫర్నిషింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసి సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. డీఎంఈకి లేఖ రాశాం జీజీహెచ్‌లో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనం పనులు చివరిదశలో ఉన్నాయి. వైద్య పరికరాల కోసం డీఎంఈకి లేఖ రాశాం. దీనిద్వారా ఎమర్జెన్సీ సేవలు మరింత బలోపేతం అవుతాయి. ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ 15 రోజుల్లో పనులు పూర్తి క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణం మరో 15రోజుల్లో పూర్తికానున్నాయి. కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించాక.. మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పనులను తరచూ పర్యవేక్షిస్తున్నాం. – విక్రమాదిత్య, ఏఈ, టీఎస్ఎంఐడీసీ -
పోలీస్‌స్టేషన్ తనిఖీ
రామగుండం: అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులు పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి ఎక్కువగా నమోదవుతున్న కేసుల గురించి ఆరా తీశారు. పరిసరాలు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దచెరువుకు బుంగ ముత్తారం(మంథని): పారుపల్లి పెద్దచెరువు తూ ము వద్ద బుంగ ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూముకు సమీపంలో బుంగ ఏర్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుంగపెద్దగా మారితే కట్ట తెగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అధికారులు తక్షణమే మరమ్మతు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
సుల్తానాబాద్ అభివృద్ధికి రూ.15కోట్లు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్ట ణ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేయించా మని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పదేళ్ల బీ ఆర్ఎస్ పాలనలో పట్టణ అ భివృద్ధి వెనుకబడిపోయిందని, పట్టణ ప్రజల రుణం తీర్చుకునేందుకు పక్కా కార్యాచరణతో నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. అంతర్గత రోడ్లు, జంక్షన్లు, డ్రైనేజీలు, కల్వర్టు లు, విలీన గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుధర్మారం(ధర్మపురి): నందిమేడారం జూనియ ర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు నందిమేడారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి తెలిపారు. గ్రామ శివారులోని సర్వే నంబరు 865లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తు పెద్దపల్లి ఆర్డీవో ఉత్తర్వులు జారీచేశారన్నారు. నందిమేడారం అడ్వకేట్స్ అసోసియేషన్ విన్నపం మేర కు ప్రతిపాదనలు పంపించిన ప్రధాన న్యాయమూర్తి సునీత.. నందిమేడారం సివిల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సరిత, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు బార్ అసోసియేషన్ తరఫున లింగారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.40వేల పరిహారం చెల్లించాలి పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: భారీవర్షాలతో పంట లు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీని శనివారం కలెక్టరేట్లో ఆయన కలుసుకుని ఒక వినతిప త్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్టంపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, బెజ్జంకి దిలీప్ కుమార్, మహేందర్ యాదవ్, రాజన్న, వెంకటస్వామి, ప్రదీప్ కుమార్, కందుల శ్రీనివాస్, కొల్లూరి కుమార్, సంపత్ దేవేందర్ పటేల్, మహంతా కృష్ణ, వెంకటేశ్, వెంకటకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి మహాహారతి పోస్టర్ ఆవిష్కరణ రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమీప గోదావరి నదీతీరంలో ఈనెల 6న చేపట్టే గోదావరి మహాహారతి కార్యక్రమ ప్రచార వాల్‌పోస్టర్‌ను వేడుకల నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో శనివా రం ఆవిష్కరించారు. కార్తీకమాసంలో నదుల్లో దీపాలు వదిలితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మహిళలు శతవసంతాలు సౌభాగ్యవంతులుగా ఉంటారని వెంకటరమణ తెలిపారు. నాయ కులు కంద లోకనాథం, మాడ ప్రభాకర్‌రెడ్డి, ఒల్లెపు మల్లేశం, మల్లారెడ్డి, అంజిబాబు, రాజేందర్, మల్లిక్, హరీశ్, రాజు తదితరులు ఉన్నారు. ‘ఎల్లంపల్లి’కి ఇన్‌ఫ్లో రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోందని నీటిపారుదలశాఖ అధికారు లు శనివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. 13 గేట్లు ఎత్తి 1.35 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు. -
అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి శనివారం పాఠశాలల్లో చేపట్టిన ప్రగతి పనులపై శ్రీహర్ష సమీక్షించారు. జిల్లాకు కేటాయించినా.. వినియోగించకపోవడంతో రూ.4.5 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉపయోగించని బ్యాంకు ఖాతాల వివరాలపై తనకు నివేదిక అందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పకడ్డందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 60 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, ఇందులో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని తెలిపారు. కాగా, జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన గుర్రాల సింధుజ, పెర్క సాయి సింధు, మినీష ఓడనాలాను కలెక్టర్ అభినందించారు. డీఈవో మాధవి, అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు. 4న అవగాహన సదస్సు.. భారత వాయుసేనలో చేరేందుకు ఆసక్తికలిగిన యువతకు అవగాహన కల్పించేందుకు ఈనెల 4న బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వాయుసేనలో ఉద్యోగావకాశాలు, పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియపై వాయుసేన అధికారులు అవగాహన కల్పిస్తారని, ఆసక్తిగలవారు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 99497 25997, 83330 44460 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
15న ప్రత్యేక లోక్ అదాలత్
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: రాజీకి అర్హమైన కేసుల ప రిష్కారం కోసం ఈనెల 15న ప్రత్యేక లోక్ అథాలత్ నిర్వహిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచా ల సునీత తెలి పారు. ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి జిల్లా కోర్టులో శనివారం సమీక్షించారు. ఇంటి గొడవలు, భూతగాదాలు, ప్రమాదాలు, భార్యాభర్తల వివాదా లు, చెక్‌బౌన్స్ వంటి కేసులను లోక్ అదాలత్‌లో ప రిష్కరించుకునేవీలుందన్నారు. ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందిస్తారని తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష ప డే క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని నందిమేడారం, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టుల్లో నిర్వహించే ప్రత్యేక లోక్ అథాలత్లను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు. -
ఎవరినీ ఉపేక్షించేదిలేదు
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదు. ఈవిషయంలో కఠిన చర్య లు తీసుకుంటాం. ఇటీ వల లారీ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. టెస్ట్ 240 పాయింట్లు రావడంతో కోర్టులో హాజరు పర్చాం. ఎక్కువగా ద్విచక్రవాహనదారులు డ్రంక్‌డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడుతున్నారు. ఈ ఏడాది రెండోసారి డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో దొరికి జైలుకు వెళ్లివచ్చిన వారిసంఖ్య 25కు చేరింది. – శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం -
సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ప్రతీసారి హామీలే తప్ప నిధులు విడుదలలో ప్రభు త్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు మరోసారి విద్యాసంస్థల నిరవధిక బంద్‌కు నిర్ణయం తీసుకున్నాయి. నాలుగేళ్లుగా బకాయిలే.. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల నిర్వహణ భారంగా మారింది. ప్రధానంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులు నిర్వహించే గ్రామీణ ప్రాంత కళాశాలల స్థితి ఆగమ్యగోచరంగా మారింది. కళాశాల భవనాల అద్దెలు మొదలు సిబ్బంది జీత భత్యాలు ఇవ్వలేక చేతులెత్తేశాయి. చాలా వరకు కళాశాలల్లో లెక్చరర్లకు జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. హామీలు.. నీటిమీద రాతలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి రెండేళ్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రజాప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చే స్తామని చెప్పిన పెద్దలు మాట నిలుపుకోవడంలో విఫలమయ్యారు. గతేడాది పరీక్షలు వాయిదా వేస్తామన్న తీర్మానానికి తలొగ్గి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల దసరాకు ముందు రూ.300కోట్లు, దీపావళి సమయానికి మరో రూ.300 కోట్లు విడుదల చేస్తామన్న అధికారులు అమలులో విఫలమయ్యారు. ఈ ఏడాది ప్రవేశాల సమయంలో కాస్త నెమ్మదించిన యాజమాన్యాలు మరోసారి ఫీజు పోరుకు సిద్ధమయ్యాయి. టోకెన్లు విడుదలైన మొత్తం రూ.1200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని కళాశాలల యాజమాన్య సంఘం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్ కొరడా కళాశాలల యాజమాన్యాలపై మరో పిడుగు పడింది. అన్ని కళాశాలలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం బకాయిలు విడుదల చేశాక తనిఖీలకు సహకరిస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. తమహక్కుగా ఉన్న బకాయిలను అడిగితే విజిలెన్స్ తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దమన నీతిని యాజమాన్యాల సంఘం ఎండగడుతోంది. శాతవాహన వీసీకి సమ్మె నోటీస్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల బంద్ నిర్ణయాన్ని వైస్‌చాన్స్‌లర్‌కు చేరవేయాలని సుప్మా కార్యవర్గం నిర్ణయించింది. శనివారం మధ్యాహ్నం వర్సిటీ రిజిస్ట్రార్‌ను కలిసిన యాజమాన్య సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సుప్మా ప్రతినిధులు శ్రీపాద నరేశ్‌తో కూడిన బృందం లేఖ ద్వారా సమ్మె నోటీస్ అందజేశారు. బకాయిలు పూర్తిగా విడుదల చేస్తే తప్ప బంద్ విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 1,3,5 సెమిస్టర్ పరీక్ష ఫీజుల గడువు కూడా పూర్తయింది. త్వరలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్ణయం విద్యార్థుల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. -
టెక్ హఫీజ్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాలి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. – గోదావరిఖని– వివరాలు 8లోu -
మద్యం మత్తులో డ్రైవింగ్
గోదావరిఖని: మద్యం మత్తుతో వాహనాలు నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని ఓ పోలీసు అఽధికా రి ఇటీవల వాఖ్యానించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి కూడా హెచ్చరించారు. మత్తెక్కితే కిక్కు దించుతామంటూ రామగుండం పోలీస్ కమిషరేట్‌లోని పోలీసులు చె బుతున్నారు. ఈమేరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. 35 శాతం ప్రమాదాలకు మద్యమే కారణం.. రామగుండం కమిషరేట్ పరిధిలో ప్రతీరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్తోనేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఇలాంటివారిలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఒక సారి దొరికితే కేసు నమోదు చేస్తున్నారు. అయినా మార్పురావడం లేదు. మళ్లీ అదేపద్ధతిన రెండోసారి చిక్కి జైలుపాలవుతున్నారు. వీరిసంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే మద్యం తాగి వాహనాలు నడుపుతూ 25 మంది పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. అయినా చాలామందిలో అస్సలు మార్పురావడం లేదు. పెరుగుతున్న ప్రమాదాలు.. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేయడం ద్వారా వాహనం అదుపులోకి రాక ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగంతో జరిగిన ప్రమాదాల్లో మృతులు, గాయపడివారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పోలీసు శాఖ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను సీరియస్‌గా తీసుకుంది. తనిఖీలు ముమ్మరం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సివిల్, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రివేళడ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు పెంచుతున్నారు. బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేసిన వెంటనే ఆన్లైన్లో కేసు నమోదు చేస్తున్నారు. తర్వాత కోర్టులో హాజరు పర్చుతున్నారు. ఒకసారి పోలీసులకు పట్టుబడితే.. రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. రెండోసారి దొరికితే మూడు రోజుల జైలు, మూడోసారి పట్టుబడితే నాలు గురోజు జైలు శిక్ష విధించి కరీంనగర్ జైలుకు తర లిస్తున్నారు. ఇలా ఎక్కువసార్లు పట్టుబడిన వారిలో టూవీలర్, ఆటో, లారీ, కారు, ట్రాక్టర్ డ్రైవర్లు అధికంగా ఉంటున్నారు. కేసుల వివరాలు ఏడాది కేసులు చార్జిషీట్ జైలు ఫైన్, జైలు జరిమానా(రూ.లలో) 2023 1,759 1,734 13 7 9,92,432 2024 2,553 2,518 20 12 34,25,105 2025 2,775 2,579 25 0 43,36,473 మొత్తం 7,087 6,831 58 19 87,53,010 -
శిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి: జిల్లాలో శిశు మరణాల కట్టడికి చర్యలు చే పట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ సూచించారు. శిశు మరణాలపై నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలపై తన కార్యాలయంలో శుక్రవా రం సమీక్షించారు. ఎన్సీడీ సర్వేపై చర్చించారు. డి సెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు జిల్లా లో 26 శిశు మరణాలు సంభవించాయని, ఇందులో బరువు తక్కువ, నెలలు నిండక ముందే పుట్టిన తదితర కేటగిరీల మరణాల కేసులు ఎంపికచేసి కారణాలపై సమీక్షించాలన్నారు. ఎన్సీడీ సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనివారిపై చర్య తీసుకుంటామని అన్నారు. ప్రోగ్రాం అధికారులు కిరణ్ కు మార్, రాజమౌళి డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాము లు, వైద్యులు రవీందర్, మీరజ్ ఫాతిమా ఉన్నారు. -
ఫలించిన ఏడేళ్ల పోరాటం
గోదావరిఖని: సింగరేణిలోని ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ ఏడేళ్ల పోరాటం ఫ లించింది. అనారోగ్య కారణాలతో అండర్‌గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయితే ఉపరితలంలో సేమ్ డిజిగ్నేషన్‌తో ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. సంస్థ వ్యాప్తంగా 2018 నుంచి 2025వ సంవతసరం వరకు అండర్‌గ్రౌండ్‌లో అన్ఫిట్అయి సర్ఫేస్‌లో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వారికి తాజా ఒప్పందం వర్తించనుంది. ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్‌లో ఓవర్‌మెన్, సర్థార్లు, షార్ట్ఫైరర్లు, టెక్నీషియన్ వి భాగంలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిక్ కార్మికులు ఈ ఒప్పందంలోకి వ స్తా రు. సుమారు 74 మందికి దీనిద్వారా ప్రయోజనం చేకూరుతుందని యాజమాన్యంతోపాటు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చెబుతున్నాయి. మెడికల్ టెస్ట్ నిర్వహించి సేమ్‌జాబ్ లోకి తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దరఖాస్తుల ఆహ్వానం.. సింగరేణి సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్, మెకానికల్, చార్జ్హ్యాండ్, ఫోర్మెన్ఇన్చార్జి, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్లు మె డికల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈమేరకు అన్నిఏరియాలకు ఉత్తర్వు జారీచేసింది. ఈనెలాఖరులోగా దరఖాస్తులు తమకు పంపించాలని సూచించింది. వీరితోపాటు ఈపీ ఆపరేటర్లు కూడా దరఖాస్తు చేయాల్సి ఉందని చెబుతోంది. -
368 ఎకరాల్లోనే వరికి నష్టం
జిల్లాలో ఇటీవల కురిసిన వానకు పంటలకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ప్రాథమిక సర్వేలో తేలింది. ఇప్పటివరకు 264 మంది రైతులకు చెందిన 368 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. నేలవాలిన వరిపైరును కట్టలుగా కట్టాలని ఏఈవోలు రైతులకు సూచిస్తున్నారు. అలా చేస్తే దిగుబడి కూడా బాగానే వస్తుంది. – శ్రీనివాస్, డీఏవో ఐదురోజులు వరికోతలు వద్దు జిల్లాలో మరోఐదు రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతులు.. వచ్చే ఐదురోజుల పాటు వరి కోతలు చేపట్టవద్దు. ఇప్పటికే కోసి ధాన్యం రాశులు పోసిన రైతులు.. వడ్లు తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తేమశాతం 17కు మించకుండా చూసుకోవాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
అయ్యప్పస్వామి శోభాయాత్ర
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పాండవులగుట్టపై చేపట్టిన అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్వామివారి విగ్రహాలతో శుక్రవారం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించా రు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి వీరారెడ్డి, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఇమ్మడి జ్యోతి, రాఘవులు, అశోక్ పాల్గొన్నారు. 4న జాబ్‌మేళా పెద్దపల్లి: నిరుద్యోగు కోసం ఈనెల 4న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. మెడ్‌ప్లస్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. 40 ఫార్మసిస్ట్, 50 ఫార్మసిస్ట్ ఏఐడీ, 100 జూనియ ర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్, 20 సీఎస్ఏ, 1 డెలీవరీ బాయ్, 1 సెక్యూరిటీగార్డు, 1 హౌస్ మెయిడ్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయన్నా రు. ఆసక్తి, అర్హత గలవారు ఉదయం 11 గంట ల సర్టిఫికెట్ జిరాక్స్‌లతో కలెక్టరేట్లోని రూమ్ నంబరు 225లో సంప్రదించాలని ఆయన సూచించారు. వివరాలకు 93923 10323, 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ఫోన్‌కాల్స్‌కు స్పందించాలి పెద్దపల్లి: జిల్లాలోని 108 వాహనానికి వ చ్చే అత్యవసర ఫోన్ కాల్స్‌కు వెంటనే స్పందించాలని అంబులెన్స్ జిల్లా ప్రో గ్రామింగ్ మేనేజర్ జనార్దన్ సూచించా రు. సుల్తానాబాద్‌లోని కార్యాలయంతోపాటు 108 అంబులెన్స్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యపరికరాలు, వాహనం పనితీరుపై ఆరా తీ శారు. ప్రత్యేక శ్రద్ధతో పేషంట్లను ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఎమర్జెన్సీ మెడిక ల్ టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలెట్ కా రంగుల సంపత్ కుమార్ పాల్గొన్నారు. బిల్లులు చెల్లించకుంటే సమ్మె పెద్దపల్లి: మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వారంరోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించ కుంటే సమ్మెలో చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేశ్ హెచ్చరించా రు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం డీఈవో మాధవికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 7నెలల నుంచి పూర్తిస్థాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నా యకులు బండారి వసంత, మేకల యశోద, పా ఠకుల కళావతి, పిడుగు గట్టయ్య, పద్మ, లంక విజయ, రావిశెట్టి సరూప, ధరణి, సుమలత, లక్ష్మణ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇందిర సేవలు మరువలేనివిపెద్దపల్లిరూరల్: భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పా ర్టీ నాయకులు అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆ మె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు సురేశ్‌గౌడ్, ఈర్ల స్వ రూప, సంపత్, శ్రీకాంత్, అమ్రేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, ఫణీంద్ర, రాజయ్య, సంతోష్, సమ్మ య్య, నదీం, హకీం, ఫిరోజ్‌ఖాన్ ఉన్నారు. అన్నదాతలను ఆదుకోవాలి సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): తుపానుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డి మాండ్ చేశారు. రేగడిమద్దికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున బాధి త రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. నా యకులు అర్జున్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, మహేందర్, ప్రదీప్‌కుమా ర్, కందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయిస్తే చర్యలు తప్పవని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామి హెచ్చరించారు. బల్ది యా కార్యాలయంలో టోకు వ్యాపారులతో శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరంలో సింగిల్‌యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయాల నియంత్రణకు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంపై వ్యాపారులకు తొలుత అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంతో అనేక అనర్థాలు జరుగుతాయన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నగరానికి రవాణా అవుతున్న నిషేధిత ప్లాస్టిక్ సా మగ్రి గురించిన సమాచారం తకు అందజేసి సహకరించాలని ఆయన కోరారు. కాగా, తమకు మూడు రోజులు గడువు ఇవ్వాలని టోకు వ్యాపారులు విన్నవించగా.. ఆ తర్వాత నిషేధిత ప్లాస్టిక్ సామగ్రి విక్రయించబోమని హామీపత్రం రాసి ఇచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా టీఎంసీ మౌనిక, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, సీనియర్ అసిస్టెంట్లు కల్రామ్, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వేదనే మిగిలింది!
పెద్దపల్లిరూరల్: జిల్లాలో రెండ్రోజుల పాటు కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలతో రైతు ల కంటిమీద కునుకు లుఎండాపోయింది. చేతికి అందేదశలో పంట చేజారి పోతుందేమోనని ఆందో ళన వ్యక్తమవుతోంది. అకస్మాత్తుగా కురిసిన వానలకు పంట, పొలాలు నీటమునిగాయి. పైరు నేలవాలడం కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు తదితర మండలాలతోపాటు మంథని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో వరి నేలవాలగా.. పత్తి చేలు నీటమునిగాయి. దిగుబడిపై ప్రభావం.. జిల్లాలో వరి 2,11,780 ఎకరాల్లో సాగు కాగా, పత్తి 48,215 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 501 ఎ కరాలు, ఉద్యావన పంటలు 9వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అఽధికార వర్గాల ద్వారా తెలిసింది. పంట లు చేతికి అందే సమయంలో.. మంగళవారం రా త్రి, బుధవారం వానలు దంచికొట్టడంతో రైతులు దిగాలు పడ్డారు. నెలరోజుల క్రితం కూడా వరుసగా నాలుగు రోజులపాటు వర్షాలు కురిశాయి. దీంతో తెగుళ్లు సోకితే నివారణ చర్యలు చేపట్టామని, ఇప్పు డు దిగుబడి చేతికి అందేదశలో మరోసారి వరుణు డు ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చడంతో ఏంచేయా లో పాలుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గి .. పెట్టుబడి కూడా వస్తుందో.. రాదోననే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సర్వే మోంథా తుపానుతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఏయే ప్రాంతాల్లో ఎంతమేర పంటలకు నష్టం జరిగిందనే విషయమై వివరాలను సేకరించేందుకు మండల వ్యవసాయాధికారులు, విస్తీర్ణాధికారులు ఊరూరా పర్యటిస్తూ సర్వే చేస్తు న్నారు. పూర్తివివరాలు ఇంకా రాలేదని, శనివారం వరకు సమగ్ర సమాచారం సేకరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. కట్టలుగా కడితే మేలు..బలమైన ఈదురుగాలులు, వర్షం ధాటికి నేలవాలిన వరి పైరును పైకి నిటారుగా నిల్చొబెట్టి.. కట్టలుగా కట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పొలంలో నీరు నిల్వఉండి నేలవాలితే గింజలు తడిసి రంగుమారి, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వీలైనంత మేరకు కట్టలుగా కట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. వరి 2,11,780 పత్తి 48,215 మొక్కజొన్న 501 ఉద్యానవన 9,000 జిల్లాలో సాగు వివరాలు(ఎకరాల్లో) -
దేశ సమగ్రతను కాపాడాలి
పెద్దపల్లి: దేశ సమగ్రతను కాపాడాలని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం సర్ధార్ వల్లభాయ్ చి త్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. క లెక్టర్ మాట్లాడుతూ, దేశప్రజలు భారతీయులనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. అనంతరం పోలీస్ శా ఖ చేపట్టిన 2కే రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, ఏవో శ్రీనివాస్, వైద్యాధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల పాటు వరి కోతలు వద్దు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వ చ్చే 5రోజులపాటు రైతులు వరికోతలు చేపట్టవద్దని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇదివరకే వరి కోసిన రై తులు వడ్లపై టార్పాలిన్ కవర్లు కప్పుకొని సంరక్షించుకోవాలని, తడిసిన వడ్లు వివరాలను వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): భూభారతి దరఖా స్తు లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహీసీల్దార్ కార్యాలయాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. 134 ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు వచ్చాయని, అందులో 110 ఇళ్ల నిర్మా ణం ప్రారంభమైందని, మిగతావా పనులు ప్రాంభించి వేగవంతంగా పూపూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్ జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి ఓదెల(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వే గవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో, తహసీత్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీని కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. డిప్యూటి కలెక్టర్ వనజ, ఎంపీడీవో తిరుపతి, తహసీల్దార్ ధీరజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తిచేయాలి పెద్దపల్లి: తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయా లని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. తాగునీటి సరఫరాపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సమైక్యతకు పాటుపడాలి గోదావరిఖని: దేశ సమగ్రతకోసం కోసం అందరూ పాటుపడాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నగరంలో చేపట్టిన రన్‌ఫర్ యూనిటీలో ఆయ న మాట్లాడారు. ప్రజల్లో జాతీయ ఐక్యత, సా మరస్యం, దేశభక్తి, సమైక్యతాభావంపై అవగాహన కల్పించడమే రన్ లక్ష్యమన్నారు. సర్ధార్‌వల్లభాయ్ పటేల్ సేవలు ప్రతీ ఒక్కరికి ప్రేర ణ అని అన్నారు. రజాకార్లను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా సర్ధార్ వల్లభాయ్‌పటేల్ సేవలు అందించారని సినీ నటుడు సా గర్ అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రమేశ్, శ్రీనివాస్, ప్రతాప్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్‌కుమార్, రాజేశ్వర్‌రావు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వా మనమూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఎకో హ్యాకథాన్ కార్యక్ర మం శుక్రవారం ముగిసింది. నేషనల్ గ్రీన్క్రాప్ హ్యాకథాన్ పోటీలకు 22 టీంలతోపాటు మంథని జేఎన్టీయూ, పెద్దపల్లి ట్రినిటి కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 8 బృందాలు ఫైనల్ పో టీలకు ఎంపికయ్యాయి. జడ్జిలుగా శ్రీధర్‌రెడ్డి, సా హు ఛత్రపతి వ్యవహరించారు. ప్రథమ విజేతగా మహవర్ధన్, ద్వితీయ విజేతగా రాజ్‌కుమార్, తృతీ య విజేతగా ట్రినిటి కళాశాల శివానీ టీమ్ ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతికి రూ.5వేలు, ద్వితీ య బహుమతికి రూ.3 వేలు, తృతీయ బహుమతికి రూ.వెయ్యి, హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, కో ఆర్డినేటర్లు సదానందం, శివకృష్ణ, కావ్య, రాజేశ్, మహిపాల్, సాయిదీక్షిత్, నరహరి, వంశీకృష్ణ పాల్గొన్నారు. -
తమిళనాడు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
మంథని: కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చే నెల 5న తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు మంథని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. వచ్చే నెల 3న సాయంత్రం మంథని నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 4న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 5న సాయంత్రం అరుణాచలం నుంచి బయలు దేరి 6న శ్రీఅలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత కరీంనగర్ మీదుగా మంథని చేరుకుంటుందన్నారు. ఫుల్ టికెట్ రూ.5,040, ఆఫ్ టికెట్ రూ. 3,790 ఉంటుందన్నారు. టికెట్ బుకింగ్ కోసం 99592 25923, 99486 71514 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలిఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని డీపీవో వీరబుచ్చయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని శానగొండలో ఇందిరమ్మఇళ్ల నిర్మాణాలతో పాటు కమిటీ సభ్యులు, కార్యదర్శులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు నవంబర్ చివరివరకు వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు. ఎంపీడీవో తిరుపతి, ఎంపీవో షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘంతో చర్చలు విఫలంఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా విధులు బహిష్కరించారు. గురువారం ఆర్ఎఫ్సీఎల్ సర్కిల్ నుంచి ప్లాంట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి మధ్య చర్చలు నిర్వహించారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు వెనుతిరిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరించారు. కాగా, సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులు నిరసన తెలిపినా యాజమాన్యం స్పందించకపోవడంతో సుమారు 300 మంది కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాన్ని నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలిపెద్దపల్లి: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని గురువారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పత్తి, కూరగాయలసాగు, మొక్కజొన్న, వరి తడిసి ముద్దయిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ బోయిరి రాజమల్లు, విండో చైర్మన్ సందీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికో స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి
కోల్‌సిటీ(రామగుండం): వైద్య విద్యలో తొలి అడుగు వేస్తున్న ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీలో గురువారం ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్ కోసం నిర్వహించిన వైట్ కోట్ వేడుకతోపాటు క్యాడావరిక్ ఒత్ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. రాబోయే నాలుగైదేళ్లు మెడికోల జీవితంలో చాలా కీలకం కాబోతుందని, చాలా సార్లు నిరుత్సాహపడే పరిస్థితులు రావచ్చని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. సిమ్స్ కాలేజీలో మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. రెండున్నరేళ్లుగా స్టూడెంట్స్ పడిన కృషి ఫలితంతోనే, నేడు వైట్ కోట్ వేడుకలో పాల్గొంటున్నారని కొనియాడారు. మొదటి గురువు ‘శరీరదాత’కు గౌరవం అనాటమీ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్యాడావరిక్ ఒత్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీకి శరీరదానం చేసిన దాతకు గౌరవం తె లు పుతూ, దాత శరీరాన్ని మొదటి గురువుగా భావిస్తామని, మానవ శరీర ని ర్మాణం నేర్చుకునే సమయంలో గౌరవభావంతో వ్యవహరించాలని మె డికో స్టూడెంట్స్‌తో కలెక్టర్, ప్రిన్సిపాల్ వాగ్దానం చేయించారు. హెడ్వోడీలు, ప్రొఫెసర్లు లావణ్య, ప్రదీప్‌చంద్ర, భానులక్ష్మి, ఫరీద్, అనూష, రాజు, శిరీష, రవివర్మ, హర్షిణి, ఓబులేశ్, కల్పన, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫస్టియర్ మెడికోలు -
వరికి నష్టం.. పత్తి కష్టం
సాక్షి పెద్దపల్లి: జిల్లా రైతులను మోంథా తుపాను నిండా ముంచేసింది. రెండురోజులుగా కురిసిన వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈదురుగాలుల ప్రభావానికి వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. పొట్టకొచ్చిన వరి నేలరాలడం, తేమతో పత్తికాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. మొక్కజొన్నలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దయింది. తుపాన్ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా, ప్రాణనష్టం ఎక్కడా సంభవించలేదు. జిల్లాలో ఈసీజన్లో రైతులు 2.12లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా అధికారులు పంటనష్టంపై సర్వే నిర్వహించి మేజర్ డ్యామేజీ జరగలేదని చెబుతున్నారు. కేవలం సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్‌లో 196మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వణికించిన తుపాను మోంథా తుపాన్ ఎఫెక్ట్‌తో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం తెరిపినివ్వడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. గరువారం సైతం వర్షం దంచికొడితే పూర్తిగా నష్టపోయేవారమని అన్నదాతలు వాపోతున్నారు. కలిసిరాని కాలం ఈ ఏడాది అన్నదాతలకు కాలం కలిసిరాలేదు. ముందస్తు వానలు పడుతాయన్న వాతావరణ సూచనలతో సీజన్ మొదట సాగు చేసినవారికి వానలు కురవక నష్టపోయారు. పత్తి విత్తనాలు రెండోసారి నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా సాగు చేశాక అకాలవర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కురిసిన వర్షాలతో జిల్లాలో 1,015 మంది రైతులకు చెందిన 1,752 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అ ధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి సమర్పించారు. తాజాగా మోంథా తు పానుతో కోతకొచ్చిన వరి నేలవాలగా, పూతకొ చ్చిన పత్తి తడిసి రంగు మారడంతో ఈసారి సాగు కలిసిరాలేందంటూ రైతన్నలు వాపోతున్నారు. ప్రతిపాదనలకే పరిమితమైన పరిహారం అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందకపోగా, ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్నట్లు తెలుస్తోంది. వరుస దెబ్బలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.ముత్తారం: ఓడెడ్ మానేరు వద్ద బ్రిడ్జి పిల్లర్ల వరకు చేరిన వరద ఉధృతి రేగడిమద్దికుంట కేంద్రంలో ధాన్యం ఆరబోస్తున్న రైతులు జిల్లాలో చెరువులు ఇలా.. ప్రభుత్వం ఆదుకోవాలి మార్కెట్లోయార్డులో నిల్వ చేసిన ధాన్యం కొట్టుకుపోయి భారీగా నష్టం జరిగింది. రెండురోజుల క్రితం యార్డులో ధాన్యం పోసినం. పలువురు రైతులకు చెందిన సుమారు వెయ్యి క్వింటాళ్లు తడిసినయి. ప్రభుత్వం ఆదుకోవాలి. – నరేశ్, రైతు, ఖానాపూర్, మంథని ఎకరం పూర్తిగా పోయింది నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. ఇటీవల వర్షాలతోనే పంట బాగా దెబ్బతింది. మళ్లీ తుపాన్‌తో ఎకరం పూర్తిగా నేలవాలింది. కోతకు వచ్చిన పంట నీటిలోనే తేలుతాంది. మిగిలిన పంట కూడా చేతికచ్చే దాక నమ్మకం లేదు. – ఎస్కే బాబు, కౌలు రైతు, మల్లెపల్లి, మంథనిమూడెకరాలు మునిగింది మూడెకరాల్లో వరి సాగుచేస్తే తుపాను ముంచింది. వరదకు పొలమంతా నేలవాలింది. కిందపడిన వరిగింజలు మొలకెత్తాయి. దాదాపు రూ.2లక్షల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్ర నరేశ్, రైతు, గూడెం, ఓదెల వివరాలు సేకరిస్తున్నాం తుపాన్ కారణంగా రైతులకు ఏ మేర పంట నష్టం జరిగిందనే వివరాలను ప్రాథమికంగా సేకరిస్తున్నాం. పంటలకు పెద్దగా నష్టం కలగకపోవచ్చనే అంచనాకు వచ్చాం. పంట దిగుబడులను కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులను సూచిస్తున్నాం. – శ్రీనాథ్, ఏడీఏ, పెద్దపల్లి మత్తడి పోస్తున్నవి 45975–100 శాతం 47950–75 శాతం 6725–50 శాతం 16మొత్తం చెరువులు 1,021 -
తుపాను.. పరేషాన్
సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఇప్పటికే కొ ద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలు రై తులకు శాపంగా మారగా.. తాజాగా తుపాను పీడకలలా వారిని వెంటాడుతోంది. తుపాన్ నేపథ్యంలో ఈదురుగాలుల ధాటికి కోతకు వచ్చిన వరిపైరు నేలవాలుతోంది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి పోసిన వడ్లు తడిసిపోయాయి. పత్తి నేలరాలి నల్లబారుతోంది. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమ కళ్లెదుటే నీళ్లపాలవుతుంటే నిస్సాహాయ స్థితిలో ఉండిపోవడం తప్ప అన్నదాత ఏమీచేయలేక కన్నీటిపర్యంతమవుతున్నాడు. స్తంభించిన జనజీవనం.. భారీవర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్(ఓసీపీ) ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 12గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో గొర్రె లు, పశువులకాపరులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచనలు జారీచేశారు. ఆగిన పంట కోతలు వర్షాలతో పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తికాయలు దెబ్బతింటుండటంతోపాటు ఇప్పటికే ఏరిన పత్తికి తేమ సమస్యగా మారింది. కూలీలను పెట్టి సేకరించిన పత్తిని ఇంటి కి తీసుకొచ్చినా .. మార్కెట్‌కు తీసుకువెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు తుపాను ప్రభావంతో వరి పైరు వాలింది. దీంతో రైతులు కోతలు వా యిదా వేస్తున్నారు. పంట కోస్తే వడ్లను ఎలా ఆరబెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెంపిన మక్కకంకులు చేలలోనే ఉండిపోయి వానలతో త డిసి ముద్దవుతున్నాయి. కంకులను ఎండబెట్టుకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పుతున్నారు. రేపో, మాపో వరి కోతలు చేద్దామనుకున్న రైతులు చేతికి అందివచ్చిన పంట వర్షాలకు నేలకొరుగుతుంటే చూసి లబోదిబోమంటున్నారు. దూది రైతుకు దుఃఖం మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలికి జనం వణికిపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సేకరణ దశకు వచ్చిన పత్తి వర్షాలకు తడిసి చేలలోనే రాలిపోతోంది. పైగా తడిసి పత్తి రంగు మారుతోంది. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలుజిల్లా కేంద్రంలో జలమయమైన కాలనీదంచికొడుతున్న వానవర్షంలో వాహనదారుల ఇబ్బందులుఓదెల98.5 సుల్తానాబాద్76.8 కాల్వశ్రీరాంపూర్68.3 పెద్దపల్లి55.0 ఎలిగేడు63.5 ధర్మారం36.0 సుగ్లాంపల్లి33.5 మంథని62.3 భోజన్నపేట32.0 ఎక్లాస్పూర్27.0కమాన్‌పూర్44.5 రామగిరి49.0ముత్తారం62.0జూలపల్లి41.0 రామగుండం10.0 -
పింఛన్ సర్టిఫికెట్లకు వేళాయె!
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ నిలిచిపోకుండా సీఎంపీఎఫ్ అధికారులు దృష్టి సారించారు. ఆయా ఏరియాలకే అధికారులు వెళ్లి లైవ్సర్టిఫికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వచ్చేనెల 2 నుంచి 28వ తేదీ వరకు రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌లో శిబిరాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా యాప్ కూడా.. సకాలంలో పింఛన్ పొందేందుకు మొబైల్‌ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఉమాంగ్ (UMANG) యాప్‌తోపాటు ఆధార్ ఫేస్ ఆర్డీ డౌన్లోడ్ చేసుకోలి. ఉమాంగ్యాప్లోని సర్వీస్ ఆప్షన్‌కు వెళ్లి పింఛ న్ హెడ్డింగ్‌లో లైవ్సర్టిఫికెట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవా లి. జనరేట్ లైవ్ సర్టిఫికెట్లో జనరేట్ లైవ్ సర్టిఫికెట్ ఎంచుకొని ఫేస్ రికగ్నైజ్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. జ నరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. దీంతో 6 అంకెల ఓ టీపీ వస్తుంది. దానిని ఓటీపీ ప్లేస్‌లో నమోదు చే యాలి. ఆధార్‌లో ఉన్నప్రకారం పేరు నమోదు చే యాలి. పింఛన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ సరిగ్గా న మోదు చేయాలి. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అయి తే సర్వీస్‌అని, కార్మికుడి భార్య అయితే ఫ్యామిలీ అని సెలక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్స్థానంలో సెంట్రల్ గోవ్ట్ అటానమస్/స్టాట్యుటరీ ఆర్గనైజేషన్/బాడీ/సొసైటీని సెలక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో కోల్‌మైన్స్ ఫావిడెంట్ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. ఏజెన్సీ నేమ్‌లో కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. అకౌంట్ నంబర్ ప్లేస్‌లో మీ పింఛన్ ఏ ఖాతా నంబర్లో జమ అవుతుందో ఆ అకౌంట్ నంబర్ నమోదు చేయాలి. దీంతో లైవ్ సర్టిఫికెట్ ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతుంది. గోదావరిఖని కార్యాలయ సమాచారం సర్టిఫికెట్ రెన్యూవల్ శిబిరాలు ఏరియా నెల తేదీలు ఆర్జీ–1 నవంబర్ 3, 4 ఆర్జీ–2 నవంబర్ 6, 7 ఆర్జీ–3 నవంబర్ 10, 11 శ్రీరాంపూర్ నవంబర్ 12, 13 మందమర్రి నవంబర్ 17, 18 భూపాలపల్లి నవంబర్ 19, 20 బెల్లంపల్లి, గోలేటి నవంబర్ 24, 25 ఈశ్వరకృప వృద్ధాశ్రమం నవంబర్ 26 సీఎంపీఎఫ్ ఆఫీస్ నవంబర్ 3 – 28 మొత్తం పింఛన్‌దారులు 68,886 లైవ్సర్టిఫికెట్ ఇవ్వనివారు 3,090 ప్రస్తుతం పింఛన్‌దారులు 66,796 -
గ్యారంటీ ఇస్తేనే సీఎమ్మార్
పెద్దపల్లి: సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వ కుండా మోసం చేసే రైస్‌మిల్లర్లను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతసీజన్లో 50 శాతం ధాన్యం మరాడించి ప్రభుత్వానికి అప్పగించిన వారు జిల్లాలో 10 శాతం మందే ఉన్నారని సర్కార్ గుర్తించింది. ఈమేరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే సీఎమ్మార్ కేటాయిస్తామని సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ ప్రకటించగా.. బుధవారం వరకు జిల్లాలోని 70 మంది రైస్‌మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ బాండ్లు సమర్పించారు. నవంబర్ మొదటివారం వరకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవుతాయని, ఆలోగా బాండ్లు తెచ్చిఇవ్వాలని ఆయన సూచించారు. బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి సీఎమ్మార్ బకాయిలపై కఠినంగా వ్యవహరించేలా గతేడాది కొత్త విధానం తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఈ ఏడాది వానకాలంలో బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వీటిని జిల్లాలో 165 మంది రైస్‌మిల్లర్లకు ఇటీవల అధికారులు అందజేశారు. సీఎమ్మార్ బకాయి లు లేని రైస్ మిల్లర్లు 10శాతం, డిఫాల్ట్ మిల్లర్లు 25శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారు. 83 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలో ఇప్పటివరకు 83 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. నిర్దేశిత తేమశాతం ఉన్న ధాన్యం తూకం వేసి మిల్లులకు కేటాయిస్తున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను నవంబర్ మొదటివారంలో ప్రారంభించనున్నారు. -
రోడ్లపై పశువులు.. ఇబ్బందుల్లో ప్రజలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువులు తిష్టవేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాటిని గమనించక ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫి క్ పోలీసులు.. ఆవుల కొమ్ములకు రేడియం స్టిక్లర్లు కూడా వేయించారు. అయినా ఫలితం కనిపించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. మెయిన్ రోడ్లపై పశువులు యథేచ్ఛగా సంచరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఇటీవల కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. యజమానులు వాటిని తీసుకెళ్లేలా చూడాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈక్రమంలోనే తీసుకెళ్లకపోతే గోశాలకు తరలించి యజమానులకు రూ.10వేల జరిమానా విధించేలా మున్సిపల్ అధికారులు కార్యచరణ చేపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా? పశువులను రోడ్లపై వదిలిపెట్టరాదని అధికారులు, సిబ్బంది అనేకసార్లు యజమానులకు సూచించా రు. హెచ్చరికలు కూడా చేశారు. కొంతకాలం క్రితం కొన్నిపశువులను గోశాలకు కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా యజమానుల్లో మార్పు కనిపించడంలేదు. ప్రధాన రహదారులపై తిష్ట.. ప్రధాన మార్గాల్లోనే పశువులు తిష్టవేయడమే కా కుండా డివైడర్ల మధ్య, కాలనీల్లోని నివాసాల్లో పెంచుకుంటున్న చెట్లు, మొక్కలను పశువులు తినేస్తున్నాయి. ఈ విషయంపై అధికారులకు అనేక ఫిర్యాదులూ వస్తున్నాయి.యజమానులకు జరిమానా కోల్‌సిటీ(రామగుండం): పశువులు రోడ్లపైకి వ స్తే వాటి యజమానులకు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తామని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. పశువులు రోడ్లపై సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రోడ్లపై సంచరిస్తున్న గోవులను సంజయ్‌గాంధీనగర్‌లోని గోశాలకు ఇప్పటి వరకు 77 పశువులను తరలించగా.. యజమానులు జ రిమానా చెల్లించి 31 పశువులను తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ పశువులను గోశాల నుంచి విడిపించుకోవడానికి ఇకనుంచి రూ.10వేల చొప్పు న జరిమానాతోపాటు నిర్వహణ వ్యయం కింద రోజూ రూ.250 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు రోడ్లపై తిరుగుతున్న గో వులనే గోశాలకు తరలించగా, ఇకముందు రోడ్లు కనిపిస్తే గేదెలనూ తరలిస్తామన్నారు. -
భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ శ్రీహర్ష సమీక్షించారు. భూభారతి, సాదాబైనామా, మీ సేవా దరఖాస్తులు, ఎస్ఐఆర్ ఓటర్ జాబితా, అసైన్డ్ భూసమస్యలు తదితర అంశాలపై అధికారులకు పలుసూచనలు చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వర గా పరిష్కరించాలన్నారు. సాదాబైనామాలు పరిశీలించి అర్హత ఉన్నవాటికి పట్టాలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ, తదితర రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ డెస్క్ పని శనివారం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో రోడ్డు అభివృద్ధి పనులపై చర్చించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ సర్వే పనులు సకాలంలో పూర్తికావాలని తెలిపారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పెండింగ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రామగుండం – మారేడుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు పూర్తిచేయాలని అన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు రవీందర్ పటేల్, సునీత, రాకేశ్, యాకయ్య, జగదీశ్వర్‌రావు, రాజయ్య, సుమన్, సుధీర్, షఫీ పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు లక్ష్యం.. గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తన కార్యాలయంలో పంచాయతీ శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. నవంబర్ 3 నుంచి 11వతేదీ వరకు ప్రతీగ్రా మంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్లా స్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని, ప్రజలు బయట చెత్తవేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధా న్యం ఇవ్వాలని ఆదేశించారు. నవంబర్ 7వ తేదీవరకు కనీసం 60శాతం ఆస్తిపన్ను వసూలు చేయా లని అన్నారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పాల్గొన్నారు. -
చేతికొచ్చినా కోయలేదు
నాకున్న మూడెకరాల్లో ఈసారి వరి ఏసిన. పెట్టుబడి బాగానే వచ్చింది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు వరి పంట కోతకు వచ్చింది.. మాయదారి తుపానుతో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట కోయలేదు. పంటంతా నేలవాలింది. పెట్టుబడి నీళ్లల్లో పోసినట్లయ్యింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – బీరం నర్సయ్య, ఓదెల పత్తి నల్లబారింది నాకున్న ఎనిమిదెరాల్లో పత్తి, వరి వేసిన. వర్షాలతో పత్తి నల్లబారింది. చేతికొచ్చిన వరిపంట కోయవద్దని అధికారులు చెబుతున్నరు. కోయక పోతే గింజరాలిపోయి చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి. – సుధాకార్‌రెడ్డి, రేగడిముద్దికుంట అప్రమత్తంగా ఉండాలి మోంథా తుపాను ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంట చేలలో నీరు నిల్వఉండి మొక్కలు, వేర్లు కుళ్లిపోయే ప్రమా దం ఉంది. సాధ్యమైనంత వరకు నీటిని తొల గించాలి. వరి కోతలు, పత్తి ఏరడం వాయిదా వేసుకోవాలి. – శ్రీనివాస్, డీఏవో -
వచ్చే 48గంటలు వరికోతలు వద్దు
పెద్దపల్లి: ‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. జిల్లాలోనూ తుపాను ప్రభావం ఉంటుంది. వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు రోజులు వరికోతలు కోయవద్దు’ అని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు రైతులకు సూచించారు. మొక్కజొన్న, పత్తి పంటలను సైతం మార్కెట్‌కు తీసుకురావొద్దని అన్నారు. నవంబర్ మొదటి వారంలో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. అందుబాటులో టార్ఫాలిన్లు.. నేడు, రేపు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే ప్రారంభించిన 83 కొనుగోలు కేంద్రాల్లో 7,740 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. వర్షం కారణంగా పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లావ్యవసాయ అధికారితో పాటు ఏఈవోలను అప్రమత్తం చేశాం. హార్వెస్టర్లు వరి పంటలు కోయొద్దని సూచించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రాల్లో 150 ప్యాడీనర్లు 334 మ్యాచర్ మీటర్లు, 989 వెయిట్ మిషన్లు ఉన్నాయి. వరితో పాటు రెండుచోట్ల మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించాం. ఇబ్బందులు లేకుండా చర్యలు కేంద్రాల్లో హమాలీ సమస్య లేదు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలకు ధాన్యం తరలింపు బాధ్యతలు ఇచ్చాం. తూకం వేయకుండా మిల్లులకు తరలించి అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసుకోవచ్చు. ధాన్యంలో కోత పెడితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సన్నధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తాం. ధాన్యం కేటాయింపులో పైరవీలకు తావు లేదు. జిల్లాలో 158 బైల్డ్, రారైస్ మిల్లులున్నాయి. ప్రతి మిల్లు పదిశాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించాం. డిఫాల్ట్ మిల్లులు 25శాతం గ్యారంటీ ఇవ్వాల్సిందే. -
సీనియర్ సీఆర్పీ సేవలు వినియోగించుకోవాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాకు కేటాయించిన వరంగల్ సీనియర్ సీఆర్పీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మండల, గ్రామ సమాఖ్యలకు అందించే ప్రత్యేక శిక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ– సెర్ప్ సీఈవో ఆదేశాల మేరకు జిల్లాలో వరంగల్ మహా సమాఖ్య ఆధ్వర్యంలో 8మంది సీనియర్ సీఆర్పీలతో 13 మండలాల్లో 15 సమాఖ్యలకు, 12గ్రామ సమాఖ్యలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. డీఆర్డీవో కాళిందని, అదనపు డీఆర్డీవో బి.రవీందర్, డిపీఎం కే.రవి పాల్గొన్నారు. 100శాతం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ చేయాలి ఇందిరమ్మ ఇళ్లకు 100శాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంపై సమీక్షించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను ప్రారంభించాలన్నారు. మార్కింగ్ చేసిన ఇళ్లు బేస్మెంట్స్థాయికి చేరుకునేలా హౌసింగ్‌శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు పెట్టుబడి సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలని, ఇళ్లనిర్మాణంలో అలసత్వం వహిస్తే మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. కిసాన్ కపాస్పై అవగాహన కల్పించాలి జిల్లాలో పత్తిని మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్‌పై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి వానాకాలం పంట కొనుగోళ్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు రెండు సీసీఐ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లాలోని ఓదెల, శ్రీరాంపూర్ మండలాల్లో 596 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48గంటల్లోపు రైతు ఖాతాలో డబ్బు జమచేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన ఎంపీడీవోలు గ్రూప్– 1లో ఎంపికై జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిలో మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజరెడ్డి, అంతర్గాం ఎంపీడీవో వేముల సుమలత, కమాన్‌పూర్ ఎంపీడీవో సాదినేని ప్రియాంక ఉన్నారు. హర్షవిజిలెన్స్ వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మూడు క్వింటాళ్లు తెచ్చిన
నాకు ఉన్న ఎకరం భూమిలో పత్తి పంట సాగుచేసిన. ఈ సారి కురిసిన వానలకు చేను ఎర్రబారి పత్తి అంతంత మాత్రంగానే పండింది. మంగళవారం మూడుక్వింటాళ్ల దాక పత్తి తెస్తే తూకం వేసుడు ఆలస్యమైంది. ఈ లోగా వాన కురవడంతో తడవకుండా సంచులపై కప్పేతందుకు టార్పాలిన్లు కూడా లేవు. – వొడ్నాల ఎల్లయ్య, నాగారం మార్కెట్‌కు వచ్చిన పత్తి తూకం వేయడంలో సర్వర్ డౌన్ కావడంతో కొంత జాప్యం జరిగింది. ఈ లోపే వర్షం కురియడంతో అప్రమత్తమై అందుబాటులో ఉన్న టార్పాలిన్లు ఇచ్చాం. పత్తి తడిసిన విషయమై వ్యాపారులు, రైతులను సముదాయించి సమస్య పరిష్కరించాం. – మనోహర్, ఇన్చార్జి కార్యదర్శి మార్కెట్‌యార్డులో ధాన్యం, పత్తి దిగుబడులను మద్దతు ధరకు అమ్ముకునేందుకు వచ్చే రైతులకు అండగా ఉంటాం. ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఽఇప్పటికే రైతుల సౌకర్యం కోసం ప్లాట్‌ఫాంలు వినియోగంలోకి తేవడం, వెలుగు కోసం విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయించాం. – ఈర్ల స్వరూప, మార్కెట్ చైర్పర్సన్ -
పసిబిడ్డకు ఊపిరి పోశారు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ప్రసూతికి పెద్దపల్లిలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి హైబీపీ రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. బరువు తక్కువ ఉన్న శిశువు జన్మించడంతో వైద్యుల పర్యవేక్షణలో 22 రోజులు చికిత్స అందించి మంగళవారం డిశ్చార్జి చేశారు. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన లావణ్య గర్భిణి కాగా.. నెలవారీ పరీక్షలకు ఈనెల మొదటివారంలో జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో బీపీ పెరగడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశారు. 1.3కేజీల బరువుతో మగబిడ్డ జన్మించాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తాయి. ఆసుపత్రిలోని నవజాత శిశు యూనిట్లో సీపాప్ ద్వారా రెండు రోజులు కృత్రిమశ్వాస అందించారు. మరో రెండు రోజులు నాసల్ ప్రాంజ్ ద్వారా శ్వాస అందించారు. బాబు తనంతట తాను శ్వాస తీసుకుంటున్నట్లు గమనించి తల్లిపాలు తాగించారు. పసిబిడ్డతో వ్యవహరించాల్సిన పద్ధతులపై తల్లికి కంగారు మదర్‌కేర్ శిక్షణ ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ తెలిపారు. బాబు 1.5 కేజీల బరువు పెరగడంతో మంగళవారం డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. పసిబిడ్డకు ఊపిరిపోసిన ఎస్ఎన్ిసీయూ వైద్యులు, సిబ్బందిని సూపరింటెండ్ అభినందించారు.


