రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శని వారం రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌ను కలి శారు. రామగుండం కాలనీలో మూతపడిన రైల్వేస్కూల్‌ను పునరుద్ధరించాలని, బద్రిపల్లి, మల్యాలపల్లి, రామగుండం రైల్వే గేట్ల స్థానంలో సబ్ వే వంతెన, పెద్దంపేట, కుందనపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, భూగర్భ వంతెన నిర్మించాలని ఆయనకు విన్నతించారు. రామగుండంలో ఫిరోజ్‌పూర్ కాంటోన్మెంట్ – హంసఫర్, నవజీవన్, గరీభ్‌రథ్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎంపీ కోరా రు. ఇందుకు రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
అథ్లెటిక్స్‌లో ‘బంగారం’
కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన నల్లవెలి ఆనంది అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికై ంది. హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన బాలికల విభాగం– 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ప్రతిభ చూపింది. ఆనంది కమాన్‌పూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ చదువుతోంది.
ప్రతిభ చూపిన అథ్లెట్స్
జ్యోతినగర్: హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లానుంచి 70 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనభర్చినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. బాలికల అండర్–18, 400, 200 మీటర్ల పరుగు పందెంలో నల్లవెల్లి ఆనంది జట్టు ప్రథమ స్థానం సాధించిందని, బాలుర అండర్–6 స్టాండింగ్ బోర్డు జంప్‌లో మోహాంశ్‌రావు తృతీయ స్థానం సా ధించారని పేర్కొన్నారు. విజేతలను పీఈటీ స త్యనారాయణ, కోచ్ సుబ్బారావు, అథ్లెటిక్స్ అ సోసియేషన్ సభ్యులు అభినందించారు.
23 నుంచి ఆదివరాహ స్వామి ఉత్సవాలు
కమాన్‌పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి జయంతిని ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ ముస్త్యాల దామోదర్, అర్చకుడు వరప్రసాదాచార్యులు, ఈవో కాంతారెడ్డి తెలిపా రు. ఉత్సవాల ప్రచార పోస్టర్‌ను దేవస్థానం ఆవరణలో శనివారం ఆవిష్కరించి మాట్లాడా రు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, డైరెక్టర్లు రాజయ్య, రాజు, మల్లేశ్, సతీశ్, శంకర్, శ్రీనివాస్, శ్యామల పాల్గొన్నారు.
కట్టడాలు తొలగించాలి
గోదావరిఖని: ఎల్‌బీనగర్‌లోని సింగరేణి స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆర్జీ –1 జీఎం పేరిట ఫిల్లర్లకు నోటీసులు అంటించింది. ఈకట్టడాలకు అనుమతి లేదని స్పష్టం చే సింది. సంస్థకు చెందిన స్థలంలో అనుమతి లే కుండా కట్టడాలను సహించబోమని పేర్కొంది. నాలుగు రోజుల్లోగా తొలగించకపోతే తా మే తొలగిస్తామని నోటీసులో పేర్కొంది. స్వ చ్ఛందంగా తొలగించపోతే బాధ్యులపైనా చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని సీపీఐ కార్పొరేటర్ మార్కపురం సూర్య ఆరోపించా రు. ఈవిషయంలో బాధితులకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో ఎ మ్మెల్యేను బద్నాం చేస్తే ఊరుకోబోమని కాంగ్రె స్ నాయకుడు ఉదయ్‌రాజ్ హెచ్చరించారు.


