సాక్షి పెద్దపల్లి:
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్ – సర్) గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైలైజేషన్ ప్రక్రియ జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 844 మంది బీఎల్‌వోలు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. ఇప్పటివరకు 6,30,576 ఫారాలు డిజిటలైజేషన్ చేయగా, ఇదిమొత్తం ఓటర్లలో 88.54 శాతంగా నమోదైంది.
80 వేల మందికిపైగా ఇంకా మిగిలి..
జిల్లాలో ఇంకా 80,449 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఇది మొత్తం ఓటర్లలో 11.30 శాతంగా ఉంది. దీంతో మిగిలిన ఓటర్లకు సంబంధించిన ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదేసమయంలో జిల్లాలో 5,713 మంది ఓటర్లకు డబుల్, తొలగింపు, ఓగస్ ఓట్లుగా నమోదయ్యాయి. అలాగే 4,573 ఫారాలు ఓటర్ల నుంచి సేకరించాల్సి ఉంది. మొత్తంగా సర్ ప్రక్రియ 88 శాతానికిపైగా పూర్తయినా.. ఇంకా 80వేల మందికిపైగా ఓటర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీంతో మిగిలిన ప్రక్రియను పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు రెండురోజుల గడువు మాత్రమే ఉంది. ఈమేరకు ప్రక్రియ జోరుగా సాగుతోంది.
ఈనెల 10తో ముగియనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ
జిల్లాలో 88.54శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్
మంథని నియోజకవర్గంలో 100 శాతం నమోదు
జిల్లాలో సర్ ఇలా..
బీఎల్‌వోలు 844
ఓటర్లు 7,12,157
ఫారాల పంపిణీ(శాతం) 100
బీఎల్‌వోలకు చేరినవి 6,30,478
డిజిటలైజేషన్ చేసింది 6,30,576
డిజిటలైజేషన్ శాతం 88.54
డబుల్, తొలగించినవి 5,713
వ్యత్యాసం ఉన్నవి 1,35,675


