పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు పేషెంట్లతో రద్దీగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తు న్న చిరుజల్లులతో వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అస్వస్థతకు గురవుతున్న జిల్లావాసులు ఆస్పత్రుల బాటపడుతున్నారు. ప్రధానంగా విషజ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడుతున్నవారు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. వీరిరాకతో ముఖ్యంగా జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఓపీ భాగా పెరుగుతోంది.
వేగంగా వైద్యసేవలు
జిల్లాలో 17 ప్రాథమిక, 6 అర్బన్ పీహెచ్‌సీలు, 3 క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి రో జూ 900 మంది నుంచి 1,100 మంది పేషెంట్లు వస్తున్నారు. అందులో జ్వరంతో 300 మంది వరకు బాధపడుతున్న వారు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అవుట్ పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదవుతుండగా.. ఇన్‌పేషెంట్ల సంఖ్య తక్కువగా నమోదవుతోందని పేర్కొంటున్నారు. మరోవైపు.. గ్రామాల్లో ఇంటింటా జ్వరసర్వే కొనసాగుతోంది.
పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ


