గోదావరి వరదల నివారణకు సింగరేణి ఓబీ మట్టితో కరకట్ట నిర్మించాలి. గోదావరి పుష్కరాల దృష్ట్యా రూ.150 కోట్ల డీపీఆర్‌కు నిధులు మంజూరు చేయాలి.
నగరంలో ఖాళీగా ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులు భర్తీ చేసి, జనాభా ప్రాతిపదికన సిబ్బందిని పెంచాలి.
వృద్ధులు, అనారోగ్యంతో పనిచేయలేని అవు ట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించాలి.
ప్రత్యేక పారిశుధ్య వాహనాల నిర్వహణకు ఆపరేటర్లను నియమించాలన్నారు.
సింగరేణి, ఎన్‌టీపీసీల సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులను అభివృద్ధికి వినియోగించేలా బల్దియా ఖాతాలో జమచేయాలి.
సింగరేణి నుంచి రివైజ్డ్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేయడంతోపాటు, సంస్థలు కలిగి ఉన్న ఖాళీ భూములకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయాలి.
సాగునీటి ప్రాజెక్టులకు నిధుల వరద మిడ్‌మానేరు ఎడమ కాలువకు మళ్లీ కదలిక రోళ్లవాగుకు అటవీ అనుమతులు ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్ బాబు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అడ్డుగా నిలు స్తున్న భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్య పరిష్కరించేందుకు ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివిధ అంశాలపై శనివా రం హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదన పు కలెక్టర్లతో సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను అ త్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడ మ కాలువ మిగులు పనులను వెంటనే పునఃప్రారంభించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ పనులను వేగవంతం చే యాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 10వేల ఎ కరాలకు సాగునీరు అందించడంతో పాటు కాకతీ య ప్రధాన కాలువలో డీ–83 నుంచి డీ–94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించా లన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రెండు ప్రత్యామ్నాయాల ను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ నె లాఖరులోగా డీపీఆర్ సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని రో ళ్లవాగు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచడం ద్వారా స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుందని అన్నారు.
ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల
నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అటవీ భూముల బదలాయింపు వివిధాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. నూతన రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్పై వాటిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమైన నివాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు.
రామగుండం అభివృద్ధికి నిధుల్విండి
కోల్‌సిటీ: రామగుండం నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, సమస్యలు పరిష్కరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి మేయర్ కీలక సమస్యలను మేయర్.. మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన అంశాలు


